బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది భద్రత, సంపద, భవిష్యత్‌కు భరోసా అనే భావన. పాత కాలంలో బంగారం అంటే నగలు, బంగారు నాణేలు, బార్లు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ కాలం మారింది. ఇప్పుడు డిజిటల్ యుగంలో బంగారంలో పెట్టుబడులు పెట్టే విధానాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయడం కంటే డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం భద్రత, పారదర్శకత, తక్కువ ఖర్చులు, పన్ను ప్రయోజనాలు. ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా వినిపిస్తున్న రెండు పేర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETF), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ (Gold Mutual Funds). అయితే ఈ రెండింటి ( Gold ETFs or Gold Mutual Funds) మధ్య తేడా ఏమిటి? ఏది ఎక్కువ లాభాలు ఇస్తుంది? ఏది తక్కువ రిస్క్? పన్నుల పరంగా ఏది ప్రయోజనకరం? అనే ప్రశ్నలు చాలా మంది ఇన్వెస్టర్లను కన్ఫ్యూజన్కు గురిచేస్తున్నాయి.
అసలు తేడా స్ట్రక్చర్‌లోనే.. Difference Begins With Structure
గోల్డ్ ఈటీఎఫ్‌లు ( Gold ETFs or Gold Mutual Funds)అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడయ్యే ఫండ్స్. ఇవి నేరుగా భౌతిక బంగారం ధరలను అనుసరిస్తాయి. అంటే మార్కెట్లో బంగారం ధర ఎంత పెరిగితే లేదా తగ్గితే.. గోల్డ్ ఈటీఎఫ్ విలువ కూడా దానికి అనుగుణంగా మారుతుంది. ఈటీఎఫ్‌లు సాధారణంగా 99.5 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని హోల్డ్ చేస్తాయి. కొన్నిసార్లు గోల్డ్ డెరివేటివ్స్‌లో కూడా పెట్టుబడులు పెడతాయి. స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్‌ను ఎలా కొనుగోలు చేస్తారో.. గోల్డ్ ఈటీఎఫ్‌ను కూడా అలాగే కొనాలి. మరోవైపు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నేరుగా బంగారాన్ని కొనవు. ఇవి “ఫండ్ ఆఫ్ ఫండ్స్” విధానంలో పనిచేస్తాయి. అంటే ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డబ్బుతో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడతాయి. అంటే గోల్డ్ ఈటీఎఫ్ అనేది డైరెక్ట్ బంగారం పెట్టుబడి అయితే.. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇండైరెక్ట్ పెట్టుబడి అన్నమాట.
డీమ్యాట్ అకౌంట్ కీలక అంశం.. Demat Account Matters
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ( Gold ETFs or Gold Mutual Funds)పెట్టుబడి పెట్టాలంటే తప్పనిసరిగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతాయి. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ లేకుండా గోల్డ్ ఈటీఎఫ్ కొనలేరు. అయితే చాలా మంది చిన్న ఇన్వెస్టర్లకు డీమ్యాట్ అకౌంట్ నిర్వహణ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బ్రోకరేజ్ ఖర్చులు, ట్రేడింగ్ పరిజ్ఞానం అవసరం కావడం వల్ల కొందరు వెనుకంజ వేస్తారు. అలాంటి వారికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సులభమైన మార్గంగా మారాయి. వీటిలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. సాధారణ మ్యూచువల్ ఫండ్లా నేరుగా AMCల ద్వారా లేదా యాప్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
ఎస్ఐపీ సౌకర్యం ఎవరిది? SIP Flexibility Advantage
చిన్న మొత్తాలతో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్ఐపీ (Systematic Investment Plan) చాలా ఉపయోగకరం. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.500, రూ.1000 వంటి చిన్న మొత్తాలతో కూడా ఎస్ఐపీ ప్రారంభించవచ్చు. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా క్రమశిక్షణతో బంగారంలో పెట్టుబడులు పెట్టగలుగుతున్నాయి. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ మార్కెట్ ధరకు అనుగుణంగా యూనిట్లు కొనాలి. ఒక పూర్తి యూనిట్ ధర ఎంత ఉందో దానికి అనుగుణంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకే నెలనెలా చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మరింత అనుకూలంగా కనిపిస్తున్నాయి.
ఖర్చుల విషయంలో ఎవరు ముందున్నారు? Expense Ratio Difference
ఇన్వెస్ట్మెంట్లో ( Gold ETFs or Gold Mutual Funds)చాలామంది పట్టించుకోని విషయం “ఎక్స్పెన్స్ రేషియో”. కానీ దీర్ఘకాలంలో ఇది రాబడులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లకు సాధారణంగా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎందుకంటే ఇవి నేరుగా బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రెండు స్థాయిల్లో ఖర్చులు ఉంటాయి. ఒకటి ఫండ్ నిర్వహణ ఖర్చులు… రెండోది ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే అదనపు వ్యయాలు. అందుకే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం రిటర్న్స్‌పై కూడా కనిపిస్తుంది.
రిటర్న్స్‌లో ఎవరి పైచేయి? Who Delivers Better Returns?
గత కొన్ని సంవత్సరాల డేటాను పరిశీలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లు( Gold ETFs or Gold Mutual Funds) కొద్దిగా మెరుగైన రాబడులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు… గత ఐదేళ్లలో కొన్ని ప్రముఖ గోల్డ్ ఈటీఎఫ్‌లు 24.8 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి. అదే సమయంలో వాటికి సంబంధించిన గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు 24.4 శాతం చుట్టూ నమోదయ్యాయి. ఈ తేడా చిన్నదిగా కనిపించినప్పటికీ… దీర్ఘకాలంలో లక్షల రూపాయల పెట్టుబడులపై గణనీయమైన వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు. దీనికి ప్రధాన కారణం అదనపు ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ వంటి ఖర్చులే.
అసలు ట్విస్ట్ ట్యాక్స్లోనే.. Big Twist In Taxation Rules
ఈ రెండు ఆప్షన్ల మధ్య ( Gold ETFs or Gold Mutual Funds)అతిపెద్ద తేడా పన్నుల విషయంలోనే ఉంది. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ రెండింటికీ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) రేటు 12.5 శాతమే. కానీ లాంగ్ టర్మ్‌గా పరిగణించే కాలవ్యవధి మాత్రం వేర్వేరు. గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసిన తర్వాత 12 నెలలు దాటితే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు. ఆ తర్వాత అమ్మితే 12.5 శాతం LTCG పన్ను వర్తిస్తుంది. కానీ 12 నెలలలోపు అమ్మితే అది షార్ట్ టర్మ్ గెయిన్గా పరిగణించబడుతుంది. అప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఇక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే… ఇక్కడ లాంగ్ టర్మ్‌గా పరిగణించే గడువు 24 నెలలు. అంటే రెండేళ్లు పూర్తయ్యాకే 12.5 శాతం LTCG ప్రయోజనం లభిస్తుంది. అంతకుముందు అమ్మితే మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను పడుతుంది. ఇదే ప్రస్తుతం చాలామంది ఇన్వెస్టర్లకు పెద్ద షాక్‌గా మారుతోంది.
ఎవరికేది సరైన ఎంపిక? Which Option Suits You?
మార్కెట్‌పై అవగాహన ఉండి, డీమ్యాట్ అకౌంట్ ( Gold ETFs or Gold Mutual Funds)నిర్వహించగలిగితే గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచి ఎంపికగా చెప్పొచ్చు. తక్కువ ఖర్చులు, మెరుగైన రాబడులు, త్వరగా లాంగ్ టర్మ్ ట్యాక్స్ ప్రయోజనం ఇవి అందించే ప్రధాన లాభాలు. అయితే డీమ్యాట్ అకౌంట్ ఇబ్బందులు వద్దనుకునే వారు, ప్రతి నెలా చిన్న మొత్తాలతో SIP ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.
బంగారం పెట్టుబడిలో అవగాహనే కీలకం.. Awareness Is The Real Gold
డిజిటల్ గోల్డ్‌లో( Gold ETFs or Gold Mutual Funds) పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గమే అయినప్పటికీ… సరైన ఆప్షన్ ఎంచుకోకపోతే రాబడులు తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది “గోల్డ్ అంటే గోల్డ్‌నే” అనుకుని ఏ ఫండ్ అయినా ఎంచుకుంటారు. కానీ ఖర్చులు, పన్నులు, పెట్టుబడి విధానం, లిక్విడిటీ వంటి అంశాలు దీర్ఘకాలంలో భారీ తేడాను తీసుకురాగలవు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలం, రిస్క్ సామర్థ్యం, పన్ను పరిస్థితులను పరిశీలించడం అత్యంత అవసరం. బంగారం ధరలు పెరుగుతున్న ఈ సమయంలో సరైన డిజిటల్ గోల్డ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సంపదను క్రమంగా పెంచుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
