నెలాఖరులో జీతం చేతికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఖాతా ఖాళీ అయిపోవడం, అవసరం లేని ఖర్చులతో పొదుపు చేయలేకపోవడం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుల కోసం వెతకాల్సి రావడం… ఇవన్నీ చాలామంది కుటుంబాల్లో కనిపించే సాధారణ పరిస్థితులు. దీనికి కారణం తక్కువ ఆదాయం కావడం మాత్రమే కాదు. వచ్చిన ఆదాయాన్ని ( Financial Discipline) ఎలా నిర్వహిస్తున్నామన్నదే అసలు కారణం. అందుకే ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడు ఒకే విషయం చెబుతుంటారు… ‘బడ్జెట్ అనేది కేవలం ఖర్చుల పట్టిక కాదు… అది కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకం’ అని. చాలామంది కొత్త సంవత్సరం ప్రారంభంలోనో, జీతం పెరిగిన తర్వాతనో, అప్పులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనో బడ్జెట్ ప్రణాళిక రూపొందిస్తారు. అయితే కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత మళ్లీ పాత అలవాట్లకే పరిమితమవుతారు. దీంతో బడ్జెట్ కాగితాలకే పరిమితమైపోతుంది. కానీ సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, చిన్నచిన్న అలవాట్ల మార్పుతో బడ్జెట్‌ను విజయవంతంగా అమలు చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
బడ్జెట్ అంటే ఖర్చులు తగ్గించడం కాదు.. Budgeting Is Not About Sacrifice
బడ్జెట్ అంటే చాలామందికి( Financial Discipline) ముందుగా గుర్తుకొచ్చేది ‘ఖర్చులు తగ్గించడం’. నిజానికి అది సరైన నిర్వచనం కాదు. బడ్జెట్ అంటే మనకు ఇష్టమైన వాటిని పూర్తిగా వదులుకోవడం కాదు. అవసరం లేని ఖర్చులను నియంత్రిస్తూ, అవసరమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వడం. నేటి అవసరాలు తీర్చుకుంటూనే, రేపటి లక్ష్యాలకు కూడా డబ్బు కేటాయించడం. ఒక సర్వే ప్రకారం బడ్జెట్‌ను క్రమం తప్పకుండా పాటించే వ్యక్తులు తమ ఆర్థిక పరిస్థితిపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారని, భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. అనుకోని ఖర్చులు వచ్చినా వారు సులభంగా ఎదుర్కొనే స్థితిలో ఉంటారు.
వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలి.. Keep It Realistic
బడ్జెట్ రూపొందించే సమయంలో ( Financial Discipline) చాలామంది చేసే ప్రధాన పొరపాటు… ఒకేసారి భారీ మార్పులు చేయాలని ప్రయత్నించడం. ఉదాహరణకు నెలకు రూ.15 వేల నిత్యావసర ఖర్చులు చేస్తున్న కుటుంబం ఒక్కసారిగా వాటిని రూ.5 వేలకే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే అది ఆచరణ సాధ్యం కాదు. దానికి బదులుగా ఖర్చును రూ.15 వేల నుంచి రూ.13,500కు తగ్గించాలని ప్రయత్నిస్తే ఆ లక్ష్యం చేరుకోవడం సులభమవుతుంది. చిన్న మార్పులే దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలు ఇస్తాయి. అందుకే బడ్జెట్ ఎప్పుడూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అమలు చేయలేని ప్రణాళిక కంటే, నెమ్మదిగా అయినా పాటించగలిగే ప్రణాళికే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఒకేసారి అన్ని లక్ష్యాలు వద్దు.. Prioritise Your Goals
సొంత ఇల్లు కొనాలి… కొత్త కారు తీసుకోవాలి… పిల్లల ఉన్నత చదువులకు డబ్బు దాచాలి… విదేశీ విహారయాత్ర చేయాలి… పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడపాలి… ప్రతి కుటుంబానికీ ఎన్నో ఆర్థిక లక్ష్యాలు ( Financial Discipline) ఉంటాయి. కానీ వాటన్నింటినీ ఒకేసారి సాధించాలని ప్రయత్నిస్తే బడ్జెట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముందుగా ఏ లక్ష్యం అత్యవసరమో నిర్ణయించాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఒక్కో లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలి. ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగితే ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ప్రతి రూపాయికీ ఒక బాధ్యత ఉండాలి.. Give Every Rupee a Purpose
జీతం ఖాతాలో ( Financial Discipline) జమ అయిన వెంటనే ఆ డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో ముందే నిర్ణయించుకోవాలి. అద్దె, కరెంట్, నీటి బిల్లులు, పిల్లల చదువులు, కిరాణా, రవాణా, పొదుపు, పెట్టుబడులు… ఇలా ప్రతి రూపాయికీ ఒక బాధ్యత కేటాయించాలి. నెలాఖరుకు చేతిలో మిగిలే డబ్బు ఆధారంగా పొదుపు చేయడం కంటే, జీతం వచ్చిన రోజే ముందుగా పొదుపు కోసం నిర్దిష్ట మొత్తాన్ని పక్కన పెట్టడం ఉత్తమ పద్ధతి. మిగిలిన డబ్బుతోనే నెలవారీ ఖర్చులను నిర్వహిస్తే బడ్జెట్‌పై నియంత్రణ సులభంగా ఉంటుంది.
ముందు పొదుపు… తర్వాత ఖర్చు.. Save First, Spend Later
చాలామంది ఖర్చులు( Financial Discipline) పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. కానీ వాస్తవానికి నెలాఖరులో మిగిలేది చాలా తక్కువే. అందుకే ఆర్థిక నిపుణులు ‘సేవ్ ఫస్ట్ – స్పెండ్ నెక్స్ట్’ అనే సూత్రాన్ని సూచిస్తున్నారు. జీతం వచ్చిన వెంటనే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని ప్రత్యేక పొదుపు ఖాతాకు లేదా పెట్టుబడి ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత మిగిలిన మొత్తంతోనే నెలవారీ ఖర్చులు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి పొదుపు అలవాటుగా మారుతుంది.
ఆటోమేటిక్ చెల్లింపులు అలవాటు చేసుకోండి.. Automate Your Finances
విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లులు… ఇవి ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుములు పడటమే కాకుండా క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రతికూల ( Financial Discipline) ప్రభావం పడుతుంది. ఈ సమస్యను నివారించేందుకు ఆటో-పే లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సదుపాయాలను ఉపయోగించడం మంచిది. జీతం వచ్చిన వెంటనే పొదుపు ఖాతాకు నిర్దిష్ట మొత్తం వెళ్లేలా ఏర్పాటు చేసుకుంటే ఆ డబ్బు ఇతర అవసరం లేని ఖర్చులకు వెళ్లే అవకాశం ఉండదు.
వార్షిక ఖర్చులను కూడా మర్చిపోవద్దు.. Plan for Annual Expenses
నెలవారీ బిల్లులు ( Financial Discipline) అందరికీ గుర్తుంటాయి. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఖర్చులను చాలామంది బడ్జెట్లో చేర్చరు. బీమా ప్రీమియం, పిల్లల స్కూల్ ఫీజులు, ఆదాయపు పన్ను, పండుగల ఖర్చులు, పుట్టినరోజు వేడుకలు, ఓటీటీ వార్షిక చందాలు, వాహన బీమా… ఇవన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడు నెల బడ్జెట్ మొత్తం తారుమారవుతుంది. అందుకే ఏడాదిలో వచ్చే అన్ని ప్రధాన ఖర్చులను ముందుగానే అంచనా వేసి, వాటికి నెలనెలా కొంత మొత్తం కేటాయించడం ఉత్తమ మార్గం.
అనాలోచిత కొనుగోళ్లే పెద్ద శత్రువు.. Avoid Impulse Spending
షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లు, భారీ డిస్కౌంట్ ఆఫర్లు… ఇవన్నీ చాలాసార్లు మన అవసరాలను కాకుండా మన భావోద్వేగాలను లక్ష్యంగా( Financial Discipline) చేసుకుంటాయి. అవసరం లేకపోయినా ‘ఈరోజే ఆఫర్’, ‘లిమిటెడ్ స్టాక్’, ‘70 శాతం తగ్గింపు’ వంటి ప్రకటనలు చూసి వస్తువులు కొనేస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం అనాలోచిత కొనుగోళ్లు చేసే వారిలో సగానికి పైగా తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోందని వెల్లడైంది. దాదాపు సగం మంది తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
‘వేచి ఉండే నియమం’ ఉపయోగపడుతుంది.. Follow the Waiting Rule
ఏదైనా వస్తువు కొనాలనిపించిన( Financial Discipline) వెంటనే కొనకుండా కనీసం రెండు లేదా మూడు రోజులు వేచి చూడాలి. ఆ సమయంలో నిజంగా ఆ వస్తువు అవసరమా? లేక కేవలం ఆకర్షణ వల్లే కొనాలనిపించిందా? అన్నది స్పష్టమవుతుంది. ఈ అలవాటు వల్ల అనవసర కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతాయి. అదే సమయంలో బడ్జెట్లో చిన్న మొత్తాన్ని ‘అనుకోని ఖర్చులు’ అనే విభాగంగా కేటాయిస్తే, అప్పుడప్పుడు వచ్చే చిన్న కోరికలను కూడా సులభంగా తీర్చుకోవచ్చు.
బడ్జెట్‌ను తరచూ సమీక్షించండి.. Review Your Budget Regularly
బడ్జెట్ తయారు చేయడం ( Financial Discipline) ఒక్కటే సరిపోదు. అది సక్రమంగా అమలవుతోందా లేదా అనేది ప్రతి నెలా పరిశీలించాలి. ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి? ఏ విభాగంలో తగ్గించవచ్చు? ఎక్కడ పొదుపు పెంచాలి? అనే అంశాలను సమీక్షించాలి. కుటుంబ సభ్యులతో కలిసి బడ్జెట్‌పై చర్చించడం కూడా మంచి అలవాటు. భార్యాభర్తలు కలిసి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే అపార్థాలు తగ్గడమే కాకుండా లక్ష్యాలను చేరుకోవడం కూడా సులభమవుతుంది.
బడ్జెట్ మార్పులకు సిద్ధంగా ఉండాలి.. Stay Flexible
బడ్జెట్ ( Financial Discipline) అనేది ఒకసారి రూపొందిస్తే జీవితాంతం అలాగే ఉండేది కాదు. ఆదాయం పెరగడం, ఉద్యోగం మారడం, కుటుంబంలో కొత్త సభ్యులు రావడం, వైద్య అవసరాలు పెరగడం వంటి పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను కూడా సవరించుకోవాలి. ప్రతి నెలాఖరులో అంచనా ఖర్చులను, వాస్తవ ఖర్చులతో పోల్చి అవసరమైన మార్పులు చేయడం వల్ల బడ్జెట్ మరింత సమర్థంగా పనిచేస్తుంది.
నేటి క్రమశిక్షణే రేపటి భద్రత.. Discipline Today, Security Tomorrow
సొంత ఇల్లు, పిల్లల ఉన్నత విద్య, అప్పులేని జీవితం, పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్వేచ్ఛ… ఇవన్నీ ఒక్కరోజులో సాధ్యమయ్యే ( Financial Discipline) లక్ష్యాలు కావు. వాటి వెనుక చిన్నచిన్న ఆర్థిక నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడిన బడ్జెట్, నిరంతర పొదుపు ఉంటాయి. బడ్జెట్ అనేది మన స్వేచ్ఛను పరిమితం చేసే సాధనం కాదు. అది మన డబ్బుకు సరైన దిశ చూపించే మార్గదర్శి. ప్రతి రూపాయిని లక్ష్యంతో ఖర్చు చేస్తూ, అనవసర వ్యయాలను నియంత్రిస్తూ, భవిష్యత్తు అవసరాలకు ముందుగానే సిద్ధమైతే ఆర్థికంగా బలమైన జీవితాన్ని నిర్మించుకోవడం కష్టమేమీ కాదు. నేటి చిన్న ప్రణాళికలే రేపటి పెద్ద విజయాలకు పునాదిగా నిలుస్తాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
