సమాజంలో ఆర్థిక స్థాయిని చూపించే వస్తువుల్లో లగ్జరీ కారు ఎప్పుడూ ముందుంటుంది. ఖరీదైన కారు ఇంటి ముందు ఉంటే చాలు… ఆ కుటుంబం సంపన్నమనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడుతుంది. అందుకే జీవితంలో కొంత డబ్బు చేతికి రాగానే చాలామంది ముందుగా ఆలోచించేది సొంత ఇల్లు తర్వాత ఒక లగ్జరీ కారు కొనుగోలు గురించే. అయితే నిజమైన సంపద అంటే ఖరీదైన వస్తువులు కలిగి ఉండటమా? లేక నిరంతరం ఆదాయం తీసుకొచ్చే ఆస్తులను సృష్టించుకోవడమా? (Look Rich or Become Rich?) ఇదే అంశంపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. రూ.50 లక్షలతో ఒక లగ్జరీ ఎస్యూవీ కొనుగోలు చేయడం కంటే అదే మొత్తాన్ని ఆదాయం తీసుకొచ్చే ఆస్తులపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఎక్కువ సంపద సృష్టించుకోవచ్చు. ధనవంతులుగా కనిపించడం ఒకటి అయితే, నిజంగా ధనవంతులుగా ఎదగడం పూర్తిగా వేరే అంశం.
ప్రతిష్ఠా? లేక పెట్టుబడా? Status Symbol or Smart Investment
లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం (Look Rich or Become Rich?) చాలామందికి ఒక కల. ఉద్యోగంలో పదోన్నతి వచ్చినా, వ్యాపారంలో లాభాలు వచ్చినా, విదేశాల నుంచి తిరిగొచ్చినా మొదటి పెద్ద కొనుగోలు (Look Rich or Become Rich?) చాలామందికి కారే అవుతుంది. సమాజంలో హోదాను ప్రతిబింబించే వస్తువుగా కారు మారిపోయింది. అయితే ఆర్థిక నిపుణుల దృష్టిలో కారు ఒక అవసరమైన వాహనం మాత్రమే. అది ఆదాయం తీసుకొచ్చే సాధనం కాకపోతే, దానిని పెట్టుబడిగా చూడలేమని వారు చెబుతున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసే కారు విలువ కాలక్రమేణా తగ్గుతూనే ఉంటుంది. కానీ సరైన వ్యాపార ఆస్తి మాత్రం కాలక్రమంలో ఆదాయాన్ని సృష్టిస్తూ పెట్టుబడిదారుడి సంపదను పెంచుతుంది.
విలువ తగ్గే ఆస్తి… ఆదాయం తెచ్చే ఆస్తి.. Depreciating Asset vs Income-Generating Asset
ఉదాహరణకు రూ.50 లక్షలతో ఒక లగ్జరీ కారు కొనుగోలు చేయడం కంటే అదే మొత్తంతో సుమారు 20 కమర్షియల్ ఈ-రిక్షాలను కొనుగోలు చేయడం మెరుగైన ఆర్థిక నిర్ణయం. కారు షోరూం నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే దాని మార్కెట్ విలువ తగ్గడం ప్రారంభమవుతుంది. మొదటి ఏడాదిలోనే గణనీయమైన విలువ కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనికి తోడు బీమా, ఇంధనం, సర్వీసింగ్, టైర్లు, మరమ్మతులు, వార్షిక నిర్వహణ ఖర్చులు నిరంతరం పెరుగుతుంటాయి. అంటే కారు యజమాని జేబు నుంచి ప్రతి నెలా డబ్బు బయటకు వెళ్తూనే ఉంటుంది. ఇదే సమయంలో ఆదాయం తెచ్చే వాణిజ్య ఆస్తులు మాత్రం పెట్టుబడిపై నిరంతర నగదు ప్రవాహాన్ని అందించే అవకాశం కల్పిస్తాయి. అందుకే సంపన్నులు ఎక్కువగా ఆదాయం ఇచ్చే ఆస్తులపై దృష్టి పెడతారు.
ఈ-రిక్షాల ఉదాహరణ ఎందుకు? Why E-Rickshaws?
ప్రస్తుతం పట్టణాలు, చిన్న నగరాల్లో విద్యుత్ ఆధారిత ఈ-రిక్షాల వినియోగం వేగంగా పెరుగుతోంది. తక్కువ నిర్వహణ వ్యయం, తక్కువ ఇంధన ఖర్చు, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ రంగం వ్యాపార అవకాశంగా మారుతోంది. సుమారు రూ.2.50 లక్షల వ్యయంతో ఒక్కో ఈ-రిక్షా కొనుగోలు చేయవచ్చని, రూ.50 లక్షలతో దాదాపు 20 వాహనాలు సమకూర్చే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్, బీమా, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం అదనపు వ్యయం అవసరమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ-రిక్షాల వ్యాపారమే చేయాలనేది కాదు. ఆదాయం ఇచ్చే (Look Rich or Become Rich?)ఆస్తి, ఖర్చు మాత్రమే చేసే ఆస్తి మధ్య తేడాను అర్థం చేసుకోవాలన్నదే ఆయన సందేశం.
నెలకు లక్ష రూపాయల ఆదాయం సాధ్యమేనా? Can It Generate Monthly Income?
ఒక్కో ఈ-రిక్షా రోజుకు సగటున రూ.300 నుంచి రూ.400 వరకు నికర వ్యాపార కలెక్షన్ అందించే అవకాశం ఉంది. ఈ లెక్కన 20 వాహనాల ద్వారా నెలకు రూ.1.80 లక్షల నుంచి రూ.2.40 లక్షల వరకు స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది మొత్తం లాభం (Look Rich or Become Rich?)కాదని కూడా స్పష్టం చేశారు. డ్రైవర్ల వేతనాలు, బ్యాటరీ ఛార్జింగ్, నిర్వహణ, మరమ్మతులు, బీమా, పన్నులు, వాహనాలు ఖాళీగా ఉండే రోజులు వంటి అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు నికర ఆదాయం మిగిలే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కలు ప్రాంతాన్ని బట్టి, వాహనాల వినియోగాన్ని బట్టి, నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి మారవచ్చని గుర్తుంచుకోవాలి.
ఇది పాసివ్ ఇన్కమ్ కాదు.. Not a Passive Income Model
చాలామంది (Look Rich or Become Rich?)ఇలాంటి లెక్కలు చూసి పెట్టుబడి పెడితే ఆటోమేటిక్‌గా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ-రిక్షాల వ్యాపారం నిర్వహించాలంటే డ్రైవర్ల నియామకం, వాహనాల పర్యవేక్షణ, బ్యాటరీల నిర్వహణ, రిపేర్లు, బీమా పునరుద్ధరణ, ప్రభుత్వ నిబంధనల అమలు, రోజువారీ కలెక్షన్ల పర్యవేక్షణ వంటి అనేక బాధ్యతలు ఉంటాయి. అంటే ఇది పూర్తిస్థాయి వ్యాపారం. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా డబ్బు పెట్టి మరిచిపోయే పెట్టుబడి కాదు.
రిస్క్‌ను కూడా అంచనా వేయాలి.. Business Risks Matter
ఏ వ్యాపారంలోనైనా (Look Rich or Become Rich?)లాభాలతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. ఈ-రిక్షాల విషయంలో కూడా అదే వర్తిస్తుంది. బ్యాటరీ మార్పిడి వ్యయం, అనుకోని మరమ్మతులు, డ్రైవర్ల కొరత, పోటీ పెరగడం, స్థానిక ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు, డిమాండ్ తగ్గడం వంటి అంశాలు ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల కేవలం సోషల్ మీడియాలో కనిపించే లెక్కల ఆధారంగా పెట్టుబడి పెట్టకుండా, మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి, వ్యాపార ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సంపన్నుల ఆలోచనా విధానం ఇదే.. How Wealthy People Think
ధనవంతులు (Look Rich or Become Rich?)తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని విలువ పెరిగే లేదా నిరంతర ఆదాయం తెచ్చే ఆస్తులపై పెట్టుబడి పెడతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ అద్దెలు, వ్యాపారాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, డివిడెండ్ ఇచ్చే పెట్టుబడులు, కమర్షియల్ ఆస్తులు వంటి వాటిపై దృష్టి పెడతారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం డబ్బు కోసం తాము పనిచేయడం కాకుండా, తమ డబ్బే తమ కోసం పనిచేసేలా చేయడం. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రానికి తొలి మెట్టుగా భావిస్తారు.
అవసరం ఉంటే కారు… లేకపోతే పెట్టుబడి..Need First, Luxury Next
కారు కొనడం తప్పు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం వాహనం అవసరమైతే అది సమంజసమైన నిర్ణయమే. కానీ కేవలం ఇతరులను ఆకట్టుకోవడం కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి విలువ తగ్గే ఆస్తిని కొనుగోలు చేయడం ఆర్థికంగా సరైన నిర్ణయం కాకపోవచ్చని చెబుతున్నారు. ముందుగా ఆదాయం సృష్టించే ఆస్తులను నిర్మించుకుని, తర్వాత వాటి ద్వారా వచ్చే ఆదాయంతో విలాస వస్తువులు కొనుగోలు చేస్తే ఆర్థిక ఒత్తిడి ఉండదని వారు సూచిస్తున్నారు.
నిజమైన సంపద అంటే…The Real Meaning of Wealth
సంపద అనేది బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం మాత్రమే కాదు. ప్రతి నెలా మన ఖర్చులను భరించే స్థిరమైన నగదు ప్రవాహాన్ని సృష్టించే ఆస్తులే నిజమైన సంపదకు పునాది. ఖరీదైన కారు, విలాసవంతమైన జీవితం బయటకు కనిపించే విజయాన్ని చూపించవచ్చు. కానీ ఆదాయం తెచ్చే ఆస్తులు మాత్రం జీవితాంతం ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. ఈ-రిక్షాల ఉదాహరణ వెనుక అసలు సందేశం కూడా ఇదే. రూ.50 లక్షలు కేవలం ఖర్చు అయ్యే ఆస్తిలో పెట్టాలా? లేక ఆదాయం సృష్టించే ఆస్తిలో పెట్టాలా? అనే ప్రశ్న ప్రతి పెట్టుబడిదారుడు తనను తాను వేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన ధనవంతుడు అంటే (Look Rich or Become Rich?) ఖరీదైన వస్తువులు కలిగి ఉన్న వ్యక్తి కాదు. తనకు పని చేయకుండా కూడా నిరంతర ఆదాయం వచ్చేలా ఆస్తులను నిర్మించుకున్న వ్యక్తే నిజమైన సంపన్నుడు. అందుకే ఆర్థిక నిపుణులు చెప్పే ఒక సూత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందే… “ముందు ఆదాయం సృష్టించే ఆస్తులను కొనండి… ఆ తర్వాత ఆ ఆదాయంతో విలాసాలను ఆస్వాదించండి.”
