ఈ రోజుల్లో కుటుంబ బాధ్యతలను భార్యాభర్తలిద్దరూ సమానంగా పంచుకుంటున్నారు. అందుకే, ఒకరిపై ఒకరు ఆధారపడకుండా, ఇద్దరికీ ఒకేసారి ఆర్థిక రక్షణ కల్పించేలా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ జాయింట్ పాలసీలు.. అటు బీమా (New Jeevan Saathi plan), ఇటు పొదుపు కలయికతో రూపొందాయి. కట్టిన సొమ్ముకు గ్యారెంటీడ్ అడిషన్ అదనంగా లభించడం ఇందులో విశేషం. ఆ రెండు ప్లాన్స్ ఏంటి? వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐసీ జీవన్ సాథీ – సింగిల్ ప్రీమియం (Plan No. 888)
ప్రీమియం డబ్బులు నెలనెలా లేదా ఏటా కట్టే జంఝాటం లేకుండా, ఒకే ఒక్కసారి డబ్బులు చెల్లించి (Single Premium) భార్యాభర్తలిద్దరికీ లైఫ్ కవరేజ్ పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ముఖ్యమైన ఫీచర్లు (Key Features):
వయోపరిమితి: కనీసం 18 ఏళ్లు నిండిన దంపతులు ఈ పాలసీ తీసుకోవచ్చు.
కనీస హామీ (Basic Sum Assured): రూ. 3 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.
బోనస్ (Guaranteed Addition): పాలసీ కాలవ్యవధిలో ప్రతి రూ.1000 బీమా మొత్తానికి ఏటా రూ. 70 చొప్పున గ్యారెంటీగా యాడ్ అవుతుంది.
డెత్ బెనిఫిట్ ఆప్షన్లు:
ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి.
Option-1: కట్టిన ప్రీమియం మొత్తానికి 1.25 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ లభిస్తుంది.
Option-2: కట్టిన సింగిల్ ప్రీమియంపై ఏకంగా 10 రెట్ల బీమా హామీ లభిస్తుంది.
పాలసీ టర్మ్ (Policy Term): ఆప్షన్-1 ఎంచుకుంటే 10, 15, 20, 25 ఏళ్లు.. ఆప్షన్-2 ఎంచుకుంటే 10 లేదా 15 ఏళ్ల టర్మ్ అందుబాటులో ఉంటుంది.
లోన్ సదుపాయం: అత్యవసర సమయాల్లో ఈ పాలసీపై రుణం (Loan Facility) కూడా తీసుకోవచ్చు.
ఉదాహరణతో అర్థం చేసుకుందాం (Example):
35 ఏళ్ల భర్త, 32 ఏళ్ల భార్య కలిసి రూ. 10 లక్షల సమ్ అష్యూర్డ్తో, 20 ఏళ్ల టర్మ్ (Option-1) కోసం ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. వారు ఒకేసారి సుమారు రూ. 8 లక్షల సింగిల్ ప్రీమియం చెల్లించాలి.
ఒకవేళ పాలసీ మధ్యలో భర్త చనిపోతే, భార్యకు రూ. 10 లక్షలు అందుతాయి. పాలసీ అలాగే కొనసాగుతుంది.
ఆ తర్వాత భార్య కూడా చనిపోతే.. సమ్ అష్యూర్డ్ (రూ. 10 లక్షలు) + అప్పటివరకు జమ అయిన గ్యారెంటీడ్ బోనస్ కలిపి నామినీకి ఇస్తారు.
ఒకవేళ 20 ఏళ్ల పాటు ఇద్దరికీ ఏమీ కాకపోతే.. మెచ్యూరిటీ (Maturity Benefit) కింద సమ్ అష్యూర్డ్ + బోనస్ కలిపి మొత్తం రూ. 24 లక్షలు చేతికి వస్తాయి.
ఎల్ఐసీ జీవన్ సాథీ – లిమిటెడ్ ప్రీమియం (Plan No. 889)
ఒకేసారి అంత పెద్ద మొత్తం ప్రీమియం కట్టలేని వారి కోసం ఈ లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ (Limited Premium Plan) ఉపయోగపడుతుంది. అంటే పాలసీ కాలవ్యవధి కంటే తక్కువ ఏళ్లు ప్రీమియం కడితే సరిపోతుంది.
ముఖ్యమైన ఫీచర్లు (Key Features):
ప్రీమియం చెల్లింపు కాలం: మీ వీలును బట్టి 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టేలా ఎంచుకోవచ్చు.
ప్రీమియం వేవర్ బెనిఫిట్ (Premium Waiver Benefit): ప్రీమియం కట్టే కాలంలో భార్యాభర్తల్లో మొదటి వ్యక్తి (Primary Insured) చనిపోతే.. ఆ తర్వాత మిగిలిన ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేదు (ప్రీమియం మాఫీ అవుతుంది). కానీ పాలసీ మాత్రం కొనసాగుతుంది.
బోనస్: ఇందులోనూ ప్రతి వెయ్యి రూపాయలకు ఏటా రూ. 70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది.
పాలసీ టర్మ్: 10, 15, 20, 25 సంవత్సరాల ఆప్షన్లు ఉన్నాయి.
రైడర్స్ (Riders): ఇందులో అదనపు రక్షణ కోసం యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్ వంటి రైడర్లను జోడించుకోవచ్చు.
ఉదాహరణతో అర్థం చేసుకుందాం (Example):
అదే 35 ఏళ్ల భర్త, 32 ఏళ్ల భార్య కలిసి రూ. 10 లక్షల సమ్ అష్యూర్డ్ కోసం 20 ఏళ్ల టర్మ్ పాలసీ తీసుకున్నారనుకుందాం. ఇందులో ప్రీమియం చెల్లింపు కాలం 10 ఏళ్లుగా ఎంచుకుంటే.. ఏడాదికి సుమారు రూ. 1.30 లక్షల ప్రీమియం కట్టాలి.
ఒకవేళ 10 ఏళ్లలోపు భర్త మరణిస్తే.. భార్యకు డెత్ బెనిఫిట్ అందుతుంది. ఆ తర్వాత కట్టాల్సిన ప్రీమియంలు పూర్తిగా మాఫీ అవుతాయి. పాలసీ అలాగే రన్నింగ్లో ఉంటుంది.
ఒకవేళ 20 ఏళ్ల పాటు దంపతులిద్దరూ క్షేమంగా ఉంటే.. మెచ్యూరిటీ సమయంలో బేసిక్ సమ్ అష్యూర్డ్ (రూ. 10 లక్షలు) + గ్యారెంటీ బోనస్ (రూ. 18 లక్షలు) కలిపి మొత్తం రూ. 28 లక్షలు అందుతాయి.
భార్యాభర్తలిద్దరికీ వేర్వేరుగా పాలసీలు తీసుకునే ఖర్చు, శ్రమ లేకుండా ఒకే ప్రీమియం, ఒకే పాలసీతో ఇద్దరికీ లైఫ్ కవరేజ్ అందించడానికి ఎల్ఐసీ తెచ్చిన అద్భుతమైన ప్లాన్లు (New Jeevan Saathi plan) ఇవి. మీ ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా సింగిల్ ప్రీమియం లేదా లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ను ఎంచుకుని మీ కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవచ్చు.
