బాధ్యతగల తల్లిదండ్రులుగా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి అవసరాల (girl child savings plan )కోసం వారు చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచే పొదుపు ప్రారంభించడం చాలా మంచి నిర్ణయం. అయితే, ప్రస్తుత కాలంలో విద్యా ఖర్చులు ఏటా 10-12% మేర పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడేలా మన పెట్టుబడి వ్యూహం ఉండాలి. కేవలం సాంప్రదాయ సురక్షిత పథకాలపైనే కాకుండా, కొద్దిగా మార్కెట్ ఆధారిత పథకాలను కూడా జోడించడం ద్వారా గరిష్ట రాబడిని సాధించవచ్చు.
కుటుంబానికి టర్మ్ ఇన్సూరెన్స్ ధీమా
ఏదైనా ఒక పెద్ద ఆర్థిక లక్ష్యం కోసం పెట్టుబడులు ప్రారంభించే ముందు, సంపాదించే వ్యక్తి పేరిట తగినంత లైఫ్ ఇన్సూరెన్స్ ఉండటం ప్రాథమిక సూత్రం. ఇందుకోసం మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుండి 12 రెట్లు ఉండేలా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. దీని ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో (girl child savings plan )మీకు ఏదైనా అవాంతరం ఎదురైనా, మీ కుమార్తె చదువు ఆగిపోకుండా ఈ పాలసీ ద్వారా వచ్చే క్లెయిమ్ మొత్తం రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎస్బీఐ లాంటి ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్‌లు తీసుకోవడం ఉత్తమం. ఇందులో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతోపాటు పాలసీ పేయింగ్ టర్మ్స్ అనుకూలంగా ఉంటాయి.
పీపీఎఫ్ vs సుకన్య సమృద్ధి: ఏది బెటర్?
మీరు అనుకుంటున్న పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి (SSY) పథకాలు రెండూ కేంద్ర ప్రభుత్వ మద్దతు గల అత్యంత సురక్షితమైన ఆప్షన్లు. వీటిలో పెట్టిన పెట్టుబడికి, వచ్చే వడ్డీకి ఈఈఈ (EEE) కేటగిరీ కింద పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.
సుకన్య సమృద్ధి (SSY): కేవలం ఆడపిల్లల కోసమే ప్రవేశపెట్టిన ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు ఎక్కువగా (సుమారు 8.2%) ఉంది. కాబట్టి పీపీఎఫ్ కంటే సుకన్య సమృద్ధిని ఎంచుకోవడం చాలా లాభదాయకం.
మీ రూ. 20,000 పెట్టుబడిని ఇలా విభజించండి (12 ఏళ్ల ప్లాన్)
పెరుగుతున్న చదువుల ఖర్చులను అందుకోవడానికి కేవలం వడ్డీ ఆధారిత పథకాలే సరిపోవు. అందుకే మీ రూ.20,000 పొదుపు మొత్తాన్ని ఇలా రెండు భాగాలుగా విభజించి మదుపు చేయండి:
భాగం 1 (సురక్షిత నిధి): నెలకు రూ. 8,000 చొప్పున సుకన్య సమృద్ధి యోజన (SSY) లో జమ చేయండి. ఇది మీ పెట్టుబడికి పూర్తి భద్రతను, స్థిరమైన వడ్డీని ఇస్తుంది.
భాగం 2 (గరిష్ట రాబడి నిధి): మిగిలిన రూ. 12,000 మొత్తాన్ని ప్రతి నెలా ఎస్ఐపీ (SIP) రూపంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
12 ఏళ్ల తర్వాత ఎంత లభిస్తుంది?
మీరు ఈ విధంగా 12 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. ఈక్విటీల ద్వారా వచ్చే వృద్ధి, సుకన్య సమృద్ధి ద్వారా వచ్చే స్థిర వడ్డీ రెండూ కలిసి సగటున 11% వార్షిక రాబడి (CAGR) అంచనాతో, మీ కుమార్తె చేతికి సుమారుగా రూ. 54,51,164 (~54.51 లక్షలు) అందే అవకాశం ఉంది. ఇది ఆమె కాలేజీ లేదా ఉన్నత చదువుల ఖర్చులకు చక్కగా సరిపోతుంది.
పిల్లల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక ప్లాన్స్
మీ పిల్లల భవిష్యత్తును మరింత సురక్షితం చేయడానికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) కొన్ని ప్రత్యేక సేవింగ్స్, ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తోంది:
ఎస్బీఐ పెహ్లా కదమ్ & పెహ్లీ ఉడాన్ (Savings Accounts): ఇవి మైనర్ పిల్లల పేరిట తెరిచే ప్రత్యేక పొదుపు ఖాతాలు. పిల్లల్లో చిన్నతనం నుంచే పొదుపు అలవాట్లను పెంచడానికి, ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగంపై ప్రాథమిక అవగాహన (girl child savings plan ) కల్పించడానికి ఇవి తోడ్పడతాయి.
SBI లైఫ్ – స్మార్ట్ స్కాలర్ (Smart Scholar): ఇదొక చైల్డ్ యులిప్ (ULIP) ప్లాన్. ఇది మార్కెట్ లింక్డ్ రాబడిని ఇవ్వడంతో పాటు తండ్రికి ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఒకవేళ పాలసీ కాలవ్యవధిలో తండ్రి మరణిస్తే, భవిష్యత్తు ప్రీమియంలన్నింటినీ కంపెనీయే రద్దు చేసి (వేవ్ ఆఫ్), గడువు ముగిసిన తర్వాత పిల్లల చదువు కోసం నిర్ణీత మొత్తాన్ని అందజేస్తుంది.
SBI లైఫ్ – స్మార్ట్ చాంప్ (Smart Champ): ఇది మార్కెట్ రిస్క్ లేని సాంప్రదాయ గ్యారెంటీడ్ ప్లాన్. పిల్లవాడికి 18, 19, 20 ,21 ఏళ్లు నిండినప్పుడు (ఉన్నత చదువుల వయస్సులో) నాలుగు సమాన వార్షిక వాయిదాలలో స్కాలర్షిప్ రూపంలో నిధులను అందిస్తుంది.
సామాన్యుడి సక్సెస్ ఫార్ములా
సాధారణ మధ్యతరగతి కుటుంబాలు పాటించాల్సిన ఉత్తమ వ్యూహం ఏంటంటే.. మార్కెట్ రిస్క్ లేని సుకన్య సమృద్ధి లాంటి పథకాలతో పెట్టుబడికి ‘భద్రత’ను ఇస్తూనే, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ ద్వారా ‘అధిక రాబడి’ని (girl child savings plan )సొంతం చేసుకోవడం. ఈ రెండింటి కలయికతో పాటు ఎస్బీఐ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా పరిశీలించి, మీ కుమార్తె బంగారు భవిష్యత్తుకు ఇప్పుడే బలమైన పునాది వేయండి!
– స్రవంతి అతికం
ఇన్సూరెన్స్ అడ్వైజర్
9440012834
