హైదరాబాద్ః ఈ రోజుల్లో సంపాదన ఎంత ముఖ్యమో.. ఆ సంపాదనను సరైన చోట పెట్టుబడి పెట్టి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం అంతే ముఖ్యం. ముఖ్యంగా మనం లేకపోయినా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, అలాగే మనం బతికున్నంత కాలం చేతికి నిరంతరం ఆదాయం వస్తూనే ఉండాలి అనుకునేవారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లైఫ్ ఒక అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ఎస్బీఐ లైఫ్ – స్మార్ట్ లైఫ్‌టైమ్ సేవర్ (SBI Life – Smart Lifetime Saver). ఇది ఒక గ్యారెంటీడ్ బెనిఫిట్స్ ప్లాన్. అంటే మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, పాలసీ తీసుకునేటప్పుడే మీకు ఎంత లాభం వస్తుందో లిఖితపూర్వకంగా రాసి ఇస్తారు. ఈ పాలసీ ప్రత్యేకతలు, ఒక సామాన్యుడి ఉదాహరణతో సహా ఇక్కడ క్షుణ్నంగా తెలుసుకుందాం.
లిమిటెడ్ ప్రీమియం.. జీవితాంతం ఆదాయం..
Limited premium.. Lifetime income..
మీరు జీవితాంతం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. 7వ సంవత్సరం నుంచే మీకు ఏటా ‘పేఅవుట్’ (ఆదాయం) రావడం ప్రారంభమవుతుంది. ఇది మీకు 100 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నిరంతరాయంగా అందుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ మీ కుటుంబానికి ఉండే బీమా రక్షణ (SBI Life – Smart Lifetime Saver) భారీగా పెరుగుతూ పోతుంది.100వ సంవత్సరంలో పాలసీ ముగిసే సమయానికి ఊహించని స్థాయిలో భారీ మొత్తంలో ఒకేసారి మెచ్యూరిటీ సొమ్ము చేతికి అందుతుంది.
ఉదాహరణతో అర్థం చేసుకుందాం..
ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుటుంబ భవిష్యత్తు కోసం, రిటైర్మెంట్ లైఫ్ కోసం ఈ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం.
1. ప్రీమియం చెల్లింపు దశ (మొదటి 15 ఏళ్లు):
సదరు వ్యక్తి మొదటి ఏడాది ₹1,04,500 (పన్నులతో కలిపి) ప్రీమియం చెల్లిస్తాడు. ఆ తర్వాత 2వ సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు ప్రతి ఏటా ₹1,02,500 చొప్పున కడతాడు. అంటే నెలకు దాదాపు ₹8,500 చొప్పున పొదుపు చేస్తున్నాడన్నమాట. ఈ 15 ఏళ్ల పాటు అతనికి కనీసం ₹15,00,000 (SBI Life – Smart Lifetime Saver) ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది.
2. గ్యారెంటీడ్ రాబడి ప్రారంభం (7వ ఏట నుండి):
పాలసీ తీసుకున్న 7వ సంవత్సరం నుండి 14వ సంవత్సరం వరకు.. సదరు వ్యక్తికి ప్రతి ఏటా ₹59,000 చొప్పున ‘సర్వైవల్ బెనిఫిట్’ రూపంలో వెనక్కి వస్తుంది. అంటే ఒకపక్క ప్రీమియం కడుతూనే, మరోపక్క గ్యారెంటీ ఆదాయాన్ని పొందవచ్చు.
3. రెట్టింపు ఆదాయం (15వ ఏట నుండి):
15వ సంవత్సరం ప్రీమియం కట్టడం పూర్తయిన తర్వాత.. ఆ ఏడాది నుండి పేఅవుట్ మొత్తం భారీగా పెరిగి ₹99,000 అవుతుంది. ఇక అక్కడి నుండి ఎలాంటి ప్రీమియం కట్టక్కర్లేదు. కేవలం ప్రతి ఏటా ₹99,000 ల గ్యారెంటీ ఆదాయాన్ని 100వ సంవత్సరం వచ్చే వరకు (అంటే దాదాపు 85 ఏళ్ల పాటు) పొందుతూనే ఉండవచ్చు. ఇది వృద్ధాప్యంలో పెన్షన్ లాగా అండగా నిలుస్తుంది.
4. పెరుగుతూ పోయే కొండంత రక్షణ (Insurance Cover):
ఈ పాలసీలోని అత్యంత అద్భుతమైన ఫీచర్ ఇది. కాలం గడుస్తున్న కొద్దీ ఇన్సూరెన్స్ కవర్ పెరుగుతుంది.
15వ ఏట ఇన్సూరెన్స్ కవర్: ₹15,75,000
50వ ఏట ఇన్సూరెన్స్ కవర్: ₹28,50,000
75వ ఏట ఇన్సూరెన్స్ కవర్: ₹1,05,60,000 (ఒక కోటి రూపాయల పైమాటే!)
99వ ఏట ఇన్సూరెన్స్ కవర్: ₹7,44,00,000 (7.44 కోట్లు)
పాలసీదారుడి వయస్సు పెరిగే కొద్దీ కుటుంబానికి ఉండే ఆర్థిక రక్షణ కోట్లలోకి చేరడం విశేషం.
5. వందేళ్ల మెచ్యూరిటీ ధనలాభం Hundred-year maturity capital gain
పాలసీదారుడికి 100 ఏళ్లు నిండిన తర్వాత పాలసీ మెచ్యూర్ అవుతుంది. ఆ సమయంలో చివరి ఇన్సూరెన్స్ కవర్ మొత్తంతో పాటు లంప్సమ్గా ఏకంగా ₹9,22,30,000 (SBI Life – Smart Lifetime Saver) చేతికి అందుతాయి.
ఒకవేళ ఈ లోపే పాలసీదారుడు మరణిస్తే, ఆయా సంవత్సరానికి వర్తించే భారీ ఇన్సూరెన్స్ కవర్ మొత్తాన్ని నామినీకి అందిస్తారు.
ఈ పాలసీని ఎందుకు తీసుకోవాలంటే?
షేర్ మార్కెట్ పడిపోయినా, ఆర్థిక మాంద్యం వచ్చినా ఎస్బీఐ గ్యారెంటీ ఇచ్చిన ఈ టేబుల్ అమౌంట్స్ మారవు.
మీరు కట్టే ప్రీమియంపై మరియు మీకు వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మినహాయింపులు లభిస్తాయి.
0 నుండి 55 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు ఎవరైనా ఇందులో చేరవచ్చు. మీ పిల్లల పేరు మీద తీస్తే వారి ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు లేదా మీ రిటైర్మెంట్ లైఫ్‌కు ఇది తిరుగులేని ఆర్థిక నిధిగా మారుతుంది.
తక్కువ కాలం ప్రీమియం కట్టి.. జీవితాంతం గ్యారెంటీ ఆదాయాన్ని పొందుతూ, కోట్లాది రూపాయల లైఫ్ కవర్‌ను సొంతం చేసుకునే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.
ప్రభుత్వ రక్షణ, నమ్మకమైన ఎస్బీఐ బ్రాండ్ విలువ కలిగిన “ఎస్బీఐ లైఫ్ – స్మార్ట్ లైఫ్‌టైమ్ సేవర్” (SBI Life – Smart Lifetime Saver) పాలసీని ఈరోజే ఎంచుకోండి, మీ కుటుంబ భవిష్యత్తుకు వందేళ్ల ధీమాను బహుమతిగా ఇవ్వండి!
-స్రవంతి అతికం
ఇన్సూరెన్స్ అడ్వైజర్
9440012834
