Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc

Posted on 07/02/202217/01/2025 By admin No Comments on సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc

what is central bank digital currency

బడ్జెట్ నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ మాట మార్కెట్ లో వినిపిస్తోంది. ఆర్బీఐ త్వరలో సెంట్రల్ బ్యాంకు  డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రూపాయి వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

what is the value of cbdc

డిజిటల్ రూపాయి అనేది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మామూలు డబ్బులు మాదిరిగానే పనిచేస్తుంది. దీని విలువ ప్రస్తుతం కరెన్సీ మాదిరిగానే ఉంటుంది.
సీబీడీసీ అంటే డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంకు జారీ చేసే చట్టబద్ధ‌మైన సాధనం.
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతో పాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ రూపాయి తీసుకొస్తోంది.
డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు.
డిజిటల్ రూపాయిని ఆఫ్ లైన్ విధానంలో వాడొచ్చు. కాబట్టి విద్యుత్ , మొబైల్స్ నెట్ వర్క్ లేకపోయినా అది పని చేస్తుంది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న ఫిజిక‌ల్ కరెన్సీకి సమాన విలువతో ఉంటుంది. ఫిజిక‌ల్ కరెన్సీతో దీనిని మార్పిడి చేసుకోవచ్చు. రూపం మాత్రం వేరుగా ఉంటుంది.

* సీబీడీసీ అన్నది డిజిటల్, లేదా వర్చ్యువల్ కరెన్సీ. గత పదేళ్ల‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు వర్చ్యువల్ కరెన్సీలతో దీనిని పోల్చకూడదు. ప్రైవేటు వర్చువల్ కరెన్సీలకు నిజమైన డబ్బులా సరైన విలువ లేదు. ఎందుకంటే అవి కమోడిటీస్ కాదని, ఇంట్రెన్సిక్ విలువ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సీబీడీసీ అంటే ఆర్బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీ కాబట్టి ఆర్బీఐకి దీని బాధ్యత ఉంటుంది.

need of digital currency

కాగితపు కరెన్సీ వినియోగం తగ్గుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ కరెన్సీలను వాడకంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎక్కువ శాతం మంది నిపుణులు చెబుతున్న మాట. ఫిజికల్ కరెన్సీని ఎక్కువ‌గా ఉపయోగించే భారత్ లాంటి దేశాల్లో ఇది ఖచ్చితంగా అవసరమనే అభిప్రాయం ఉంది. క్రిప్టో చట్టం పార్లమెంటులో ఆమోదం పొందక ముందే దీనిని చలామణిలోకి తీసుకురావడం అసాధ్యం. ఇందుకు ఆర్బీఐ చట్టం, నాణేల చట్టం, ఫెమా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలకు సవరణలు అవసరమవుతాయన్నది తెలిసిన మాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలన్నింటినీ పేపర్ కరెన్సీని దృష్టిలో ఉంచుకునే రూపొందించారు. ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా సీబీడీసీని దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రక్రియను రూపొందిస్తోంది.

types of cbdc

సీబీడీసీ ని మన గవర్నమెంట్ 2 విధాలుగా పరిచయం చేసింది.
1.CBDC Wholesale 2. CBDC Retail

CBDC Wholesale అంటే ఏవైతే లార్జ్ ట్రాన్జక్షన్స్ ఉంటాయో దానిలోని ఏవైనా లోపాలను సరిచేయడానికి లాంచ్ చేశారు.
CBDC Retail అంటే సామాన్య ప్రజలు డైలీ చేసే ట్రాన్జాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికోసం లాంచ్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి సీబీడీసీ హోల్ సేల్ ను పైలెట్ ప్రోజెక్ట్ కింద లాంచ్ చేశారు. త్వరలోనే సీబీడీసీ రిటైల్ కూడా కొన్ని స్టేట్స్ లో లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేసిన తర్వాత ప్రజలు దానికి ఎలా రియాక్ట్ అవుతారో దాని ఆధారంగా మార్పులు చేస్తారు. అప్పుడు పూర్తిగా లాంచ్ చేసే అవ‌కాశం ఉంటుంది.

ప్రస్తుతం ప్రవేశపెట్టిన సీబీడీసీ హోల్ సేల్ సిగ్మెంట్ కోసం గవర్నమెంట్ 9 బ్యాంక్స్ ను పార్టిసిపెంట్ గా ఎంచుకుంది.
ఆ బ్యాంకులు ఇవీ..
SBI,
BANK OF BARODA,
UNION BANK,
HDFC BANK,
ICICI BANK,
KOTAK MAHINDRA BANK,
YES BANK,
IDFC FIRST BANK,
HSBC …
అంటే ఈ బ్యాంకుల ద్వారా సీబీడీసీని ఉప‌యోగించి గవర్నమెంట్ బాండ్స్ ప‌ర్చేజ్, సేల్ చేస్తారు. మిగిలిన బ్యాంకులకి కూడా అవకాశం ఉంటుంది. CROSS BORDER PAYMENTS లాంటివి అద‌నంగా యాడ్ చేస్తారు.

CBDC Retail అమ‌ల్లోకి వ‌చ్చాక సామాన్య ప్రజలు బ్యాంక్ బ్యాలన్స్ ని ఎలాగైతే చెక్ చేసుకుంటారో అలాగే మన వేలెట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.

సీబీడీసీ ఉప‌యోగాలేంటి

బ్యాంకు బ్యాలెన్సులకు బదులు సీబీడీసీ లావాదేవీలు జరిగితే బ్యాంకుల మ‌ధ్య సెటిలిమెంట్ ఇక అవసరముండదు. చెల్లింపు వ్యవస్థను మరింత రియల్ టైమ్ లో, తక్కువ ఖర్చులోకి మారుస్తుంది. ప్రపంచీకరణ కూడా వేగవంతమవుతుంది. ఒక దేశం నుంచి మ‌రో దేశానికి మధ్యవర్తి అవసరం లేకుండానే డిజిటల్ డాలర్ల రూపంలో రియల్ టైమ్ లో చెల్లింపులు చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

* బిజినెస్ ట్రాన్జాక్ష‌న్స్‌ని చాలా త్వ‌ర‌గా, ఈజీగా చెయ్యవచ్చు.

* ఫేక్ కరెన్సీ ని అడ్డుకోవచ్చు.

* మన డబ్బుల నోట్ల‌ని ఫ్రింటింగ్ చేసే ఖ‌ర్చు అనేది ప్ర‌భుత్వానికి మిగులుతుంది.

* సీబీడీసీ ని ట్రాప్ చేయడం అసాధ్యమైన పని.

* సీబీడీసీ మన ఇండియా డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేస్తుంది.

*ప్రపంచ మొత్తం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ గా ఇండియన్ ఎకానమీని ఎనలార్జ్ చేస్తుంది.

* మన స్మార్ట్ ఫోన్ నుంచి మనీ ట్రాన్సఫర్ ని తొందరగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు.
ఇన్నీ ఉపయోగాలు ఉండడం వలన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీని ఇంత తొందరగా పరిచయం చేస్తుంది.

* భారత్ లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి, చిన్న మొత్తాల చెల్లింపులకు డిజిటల్ వినియోగం పెరుగుతోంది. సీబీడీసీ వస్తే.. కరెన్సీని ముద్రించడం, రవాణా చేయడం, నిల్వచేయడం, పంపిణీ చేయడం వంటి ప్రక్రియలకు సంబంధించి ఖర్చులు తగ్గుతాయి.

difference between crypto currency and CBDC

క్రిప్టో, సీబీడీసీ చూడ‌డానికి ఒకేలా ఉన్నా చ‌ట్ట‌బ‌ద్ధంగా, విలువ ప‌రంగా చాలా తేడా ఉంది. క్రిప్టోకరెన్సీలు డీసెంట్రలైజ్డ్. అంటే ఎవరూ వీటిని జారీ చేయలేరు, బాధ్యత వహించరు. రిటైల్ ఇన్వెస్టర్లు వీటిపై ఆసక్తి చూపి మోస పోయే అవకాశాలు ఎక్కువ. అందుకే దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సీడీబీసీ వల్ల సెటిల్మెంట్ రిస్క్ కూడా తగ్గుతుంది. రిస్క్-ఉచితం కావడం వల్ల, డిజిటల్ రూపంలో ప్రజలు చలామణీ చేస్తారు.

* బిట్ కాయిన్ లాంటివన్నీ క్రిప్టో కరెన్సీ కి చెందినవే. వీటిని కేవలం  ఆన్లైన్ లో మైనింగ్ ద్వారానే తయారు చేస్తారు. కానీ వీటికి ఎటువంటి ఆధారం, రూపం ఉండదు. నియంత్రణ వ్యవస్థ ఉండదు. దీనిని ఉపయోగించి ఎటువంటి సంఘ విద్రోహక కార్యక్రమాలకైనా పాల్పడవచ్చు.

* క్రిప్టో కరెన్సీ అండ్ సీబీడీసీ రెండూ బ్లాక్ చైన్ మీద నడుస్తాయి. కానీ క్రిప్టో, అదర్ ప్రైవేటు వర్చువల్ కరెన్సీస్ అన్నీ డీసెంట్రలైజ్డ్ నెట్ వర్క్ లో స్టోర్ అయి ఉంటాయి. కానీ సీబీడీసీ డీసెంట్రలైజ్డ్ నెట్ వర్క్ లో స్టోర్ అవ్వదు.

* క్రిప్టో కరెన్సీలు ఇన్ క్రిప్ట్ అయ్యి ఉంటాయి. ఈ క్రిప్టోస్ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ ను ఫాలో అవుతాయి. దీనివలన క్రిప్టో బై చేసిన వ్యక్తికి, సెల్ చేసిన వ్యక్తి డీటైల్స్ తెలియవు. కేవలం వేలిడ్ అడ్రస్ తో మాత్రమే ట్రాన్జాక్షన్స్ అథంటికేట్ అయ్యి రికార్డ్ అవుతాయి. ఈ క్రిప్టో ట్రాన్జక్షన్ లో ఎటువంటి థర్డ్ పార్టీ ఉండదు.

* సీబీడీసీ అనేది క్రిప్టో కాదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న క్యాష్ కి డిజిటల్ రూప‌మే సీబీడీసీ. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీని ఫాలో అయినా కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్ మీద నడుస్తుంది. ఇందులో ప్రతి ట్రాన్జక్షన్ క్లియర్ గా ఉంటుంది. క్రిప్టో కరెన్సీ లాగా ఎనాన‌మ‌స్ అనే కాన్సెప్ట్ ఉండదు. డిజిటల్ రూపంలో ట్రాన్సఫర్ చేసినా, రిసీవ్ చేసుకున్నా విజుబుల్ గా , రికార్డెడ్ గా ఉంటాయి.

* క్రిప్టో కరెన్సీ ని ఎవ్వరూ రెగ్యులేట్ చెయ్యలేరు. కానీ సీబీడీసీ ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది.
ఎలాగైతే ఆర్బీఐ రెగ్యులేటడ్ నోట్లు డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా రిలీజ్ అవుతాయో సేమ్ అలాగే సీబీడీసీ కూడా సెవరల్ బ్యాంక్స్ ద్వారా మనకి రిలీజ్ అవుతుంది.

UPIకి CBDCకి తేడా ఏమిటి

మనం డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తోనూ, మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ యాప్ యూపీఐల‌ను ఉప‌యోగించి ట్రాన్జాక్షన్ చేస్తుంటాం కదా… ఆ ట్రాన్జాక్షన్ కి ఫిజికల్ కరెన్సీ బ్యాంకులో ఉండాలి. ఆ ఫిజికల్ కరెన్సీ మనం ట్రాన్జాక్షన్ చేసిన తర్వాత ఈ బ్యాంకు నుంచి వేరొక బ్యాంకుకి మారుతుంది. బ్యాంకులో మన అకౌంట్లో అమౌంట్ కి సరిపడా ఫిజికల్ కరెన్సీ మెంటైన్ చెయ్యవలిసి ఉంటుంది. లేదా ట్రాన్జాక్ష‌న్ జ‌ర‌గ‌దు. కానీ సీబీడీసీ కి వచ్చేసరికి ఆ ఫిజికల్ కరెన్సీ మెంటైన్ చెయ్యవలిసిన అవసరం లేదు.

* సీబీడీసీ లో సైబర్ సెక్యూరిటీ రిస్క్ లు తప్పనిసరిగా ఉంటాయి. చదువురాని వారు ఈ సీబీడీసీని కొంచెం అర్థం చేసుకుని ట్రాన్జాక్షన్ చేయవలిసి ఉంటుంది.
* సీబీడీసీ ఫిజికల్ క్యాష్ మీద డిపెండెంట్ తగ్గించడం, సెటిల్ మెంట్ రిస్క్ లను తగ్గించగలుగుతుంది. *ట్రాన్జక్షన్ కాస్ట్ ను సబ్ స్టాన్సియల్ గా రెడ్యూస్ చెయ్యగలుగుతుంది.
* ట్రాన్జక్షన్స్ కూడా చాలా తొందరగా రెగ్యులేట్ అవుతాయి. దీనివలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి కూడా చాలా లాభం.

 

237
FEATURE NEWS Tags:difference between crypto currency and CBDC, need of digital currency, types of cbdc, UPIకి CBDCకి తేడా ఏమిటి, what is cbdc, what is central bank digital currency, what is the value of cbdc

Post navigation

Previous Post: ఐడీబీఐ ఇక ప్రైవేటుకే idbi privatisation
Next Post: అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have

Related Posts

  • రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast! FEATURE NEWS
  • రానున్న 2 నెలల్లో రూ.40 వేల కోట్ల ఐపీఓలు.. ₹40,000 Crore IPOs Lined Up in the Next Two Months FEATURE NEWS
  • ఎన్‌బీఎఫ్‌సీల ప‌టిష్ఠానికి ఆర్‌బీఐ కొత్త దిశానిర్దేశం.. RBI’s New Roadmap for NBFC Sector FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • ఏ పన్ను విధానం మంచిది..? పాతదా.. కొత్తదా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! Old vs New Tax Regime – Which One is Better for You? FEATURE NEWS
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలుసా? అమెరికాను దాటేశామా? Do You Know How Much Gold India Holds? Have We Surpassed the US? FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • రోడ్ల అభివృద్ధి – భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శక విప్లవం.. Road Development – A Transformational Force Behind India’s Economic Growth FEATURE NEWS
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS
  • గృహ బీమా అవ‌స‌ర‌మా? Is Home Insurance Necessary? INSURANCE
  • కీల‌క‌ పన్ను ఆదా ఎంపికలేమిటో తెలుసుకోండి..! మిన‌హాయింపు పొందండి! Know the Key Tax-Saving Options… Get Your Deductions! FINICAL PLANNING
  • ప‌న్ను + అధిక రాబ‌డి = ఈఎల్ఎస్ఎస్‌ what is ELSS MONEY TIPS
  • ఆర్థిక ప్రణాళికలో మహిళల కొత్త అడుగులు.. New Steps in Women’s Financial Planning FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme