ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే శాశ్వత గుర్తింపు సంఖ్య (PAN)కు సంబంధించి పలు మార్పులు తీసుకొచ్చింది. పెరుగుతున్న నగదు లావాదేవీలు, పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, డిజిటల్ ఎకానమీ వైపు మళ్లించే లక్ష్యాలతో ఈ మార్పులు (Changes in PAN Rules) అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025 అమలులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదాయపు పన్ను నిబంధనలు–2026ను నోటిఫై చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తాల లావాదేవీలలో PAN తప్పనిసరి చేసే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీయనుంది.
₹10 లక్షలు దాటితే తప్పనిసరి.. PAN Mandatory for ₹10 Lakh Cash Transactions
ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో నగదు రూపంలో ₹10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేసినా, ఉపసంహరించుకున్నా PAN వివరాలు (Changes in PAN Rules)ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకేసారి చేసినా, విడతల వారీగా చేసినా వర్తిస్తుంది. ఇంతవరకు ఒక రోజులో ₹50 వేలకుపైగా నగదు లావాదేవీ జరిగితే మాత్రమే PAN అడిగేవారు. కానీ ఇప్పుడు ఈ పరిమితిని భారీగా పెంచి, మొత్తం సంవత్సరానికి వర్తింపజేశారు. ముఖ్యంగా ఒకే బ్యాంకులోనే కాదు, వేర్వేరు బ్యాంకుల్లో చేసిన లావాదేవీలను కూడా కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఒక వ్యక్తి వివిధ ఖాతాల్లో డబ్బులు చలామణి చేసినా, మొత్తం ₹10 లక్షలు దాటితే PAN తప్పనిసరి అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను పర్యవేక్షించడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
స్థిరాస్తి లావాదేవీలలో కొత్త పరిమితి.. Revised Limits for Property Transactions
ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం వంటి స్థిరాస్తి లావాదేవీలలో కూడా కీలక మార్పులు (Changes in PAN Rules)చోటుచేసుకున్నాయి. ఇకపై ₹20 లక్షలకు పైబడిన స్థిరాస్తి లావాదేవీలకు PAN తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి ₹10 లక్షలుగా ఉంది. స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రెట్టింపు చేశారు. ఇది కేవలం కొనుగోలు, అమ్మకాలకు మాత్రమే కాదు. బహుమతిగా ఇచ్చినా, జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతుంది.
వాహనాల కొనుగోళ్లలో మార్పులు.. PAN Rule for Vehicle Purchases
మోటారు వాహనాల కొనుగోళ్లలో కూడా కొత్త నియమాలు (Changes in PAN Rules)అమల్లోకి రానున్నాయి. ఇకపై ద్విచక్ర వాహనం సహా ఏ వాహనమైనా ₹5 లక్షలు దాటితే PAN సమర్పించాలి. ఇంతకుముందు ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన ఉండేది కాదు. కార్లు, ఇతర వాహనాలకు మాత్రం ధరతో సంబంధం లేకుండా PAN ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా ₹5 లక్షల పరిమితిని నిర్ణయించడం ద్వారా నిబంధనలను సులభతరం చేశారు.
హోటళ్లు, ఈవెంట్ల ఖర్చులపై నిబంధనలు.. PAN for High-Value Hospitality Expenses
హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులపై కూడా కొత్త నిబంధనలు (Changes in PAN Rules)తీసుకొచ్చారు. ఇకపై ఒక బిల్లు ₹1 లక్ష దాటితే PAN ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి ₹50 వేలుగా ఉంది. వివాహాలు, పెద్ద కార్యక్రమాలు, కన్వెన్షన్ హాల్స్ వంటి చోట్ల భారీగా నగదు లావాదేవీలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీమా పాలసీల్లో కఠిన నిబంధనలు.. Stricter Rules for Insurance Policies
బీమా రంగంలో కూడా PAN వినియోగాన్ని(Changes in PAN Rules) తప్పనిసరి చేశారు. ఇంతవరకు వార్షిక ప్రీమియం ₹50 వేలకుపైగా ఉంటే మాత్రమే PAN అడిగేవారు. కానీ ఇకపై ప్రతి పాలసీకి PAN సమర్పించాల్సి ఉంటుంది. ఇది చిన్న పాలసీ అయినా, పెద్ద పాలసీ అయినా వర్తిస్తుంది. దీంతో బీమా రంగంలో కూడా లావాదేవీలు ట్రాక్ చేయడం సులభమవుతుంది.
ఎందుకు ఈ మార్పులు? Why These Changes?
కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను (Changes in PAN Rules) తీసుకురావడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. పెరుగుతున్న నగదు లావాదేవీల నియంత్రణ, పన్ను ఎగవేతను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంచడం కోసమే పాన్లో నిబంధనలను మార్చింది. ప్రస్తుతం దేశంలో భారీగా జరిగే నగదు లావాదేవీలు అధికారులకు ట్రాక్ చేయడం కష్టంగా మారుతోంది. PAN తప్పనిసరి చేయడం ద్వారా ప్రతి పెద్ద లావాదేవీని పర్యవేక్షించవచ్చు.
సాధారణ ప్రజలపై ప్రభావం.. Impact on Common People
ఈ మార్పులు(Changes in PAN Rules) సాధారణ ప్రజల జీవితంపై కూడా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు వినియోగం తగ్గుతుంది. బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతాయి . పన్ను చెల్లింపులు పెరగవచ్చు. అయితే పారదర్శక ఆర్థిక వ్యవస్థకు ఇది అవసరమని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి.. Precautions to Be Taken
కొత్త నిబంధనలు (Changes in PAN Rules)అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ముందు PAN వివరాలు సిద్ధంగా ఉంచాలి. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమలు, ఉపసంహరణలను గమనించాలి. పన్ను రిటర్నులు సక్రమంగా ఫైల్ చేయాలి. ఇవి పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త PAN నిబంధనలు కీలకంగా మారనున్నాయి. నగదు లావాదేవీలపై కట్టడి, పన్ను ఎగవేతపై నియంత్రణ, డిజిటల్ ఎకానమీకి ప్రోత్సాహం.. ఇవన్నీ ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. ప్రజలు కూడా ఈ మార్పులకు అనుగుణంగా తమ ఆర్థిక అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. PAN వినియోగాన్ని తప్పనిసరిగా పాటించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించవచ్చు.
