Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

భారత కుబేరుల ఆస్తులు 62% పెరుగుదల .. Indian Billionaires’ Wealth Rises by 62%

Posted on 05/11/2025 By admin No Comments on భారత కుబేరుల ఆస్తులు 62% పెరుగుదల .. Indian Billionaires’ Wealth Rises by 62%

భారతదేశంలో అత్యంత ధనికులైన 1% మంది కుబేరుల సంపద 62% మేర పెరిగినట్లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. అదే సమయంలో సాధారణ మధ్యతరగతి, దిగువ వర్గాల ఆదాయ వృద్ధి మాత్రం స్థిరంగా లేదని ఆర్థిక నిపుణులు చేబుతున్నారు. నివేదిక వివరాల ప్రకారం చూస్తే.. కరోనా తర్వాత‌ కాలంలో రియల్‌ ఎస్టేట్‌, ఐటీ, స్టాక్‌ మార్కెట్‌, బంగారం, ప్రైవేట్‌ ఈక్విటీ రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో కుబేరుల సంపద గణనీయంగా పెరిగింది. దేశంలో టాప్‌ 100 బిలియనీర్ల ఆస్తుల విలువ గత రెండేళ్లలోనే ₹35 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

ఆర్థిక వ్యవస్థలో అసమానతలు..Inequalities in the Economy

కార్పొరేట్ లాభాలు పెరుగుతున్నా, సాధారణ వేతన వృద్ధి మాత్రం స్థిరంగా ఉండటం సమాజంలో అసమానతను పెంచుతోంది. అదే సమయంలో పన్ను వ్యవస్థలో ఉన్న లోపాలు, అధిక స్థాయి పెట్టుబడులకు ఇచ్చే రాయితీలు కుబేరులకు మరింత లాభదాయకంగా మారుతున్నాయి. ఏదేమైనా దేశ ఆర్థిక వ్యవస్థలో అసమానతలు మరోసారి స్పష్టమయ్యాయి.

మధ్యతరగతి పై భారం..Burden on the Middle Class

ఇక మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి పెద్దగా మారలేదని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, గృహ రుణ వడ్డీలు .. ఇవన్నీ కలిపి కుటుంబాల ఆదాయాన్ని దెబ్బ‌తిస్తున్నాయ‌ని వెల్ల‌డిస్తున్నారు.

పాలనలో సమతుల్యత అవసరం.. Need for Balance in Governance

కుబేరుల సంపద పెరగడం అభివృద్ధి సూచిక కావొచ్చు . కానీ ఆదాయ వ్యత్యాసం పెరగడం ప్రమాదకరం. అందుకే సామాజిక, ఆర్థిక సమతుల్యత కోసం పన్ను విధానాల్లో మార్పులు అవసరమని ఆర్థిక వేత్త‌లు సూచిస్తున్నారు.

కుబేరులే మరింత కుబేరులుగా.. The Rich Are Getting Richer

ప్రతి ఏడాది కుబేరులే మరింత కుబేరులవుతున్నారు. సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మాత్రం అదే స్థితిలో ఉండిపోతున్నారు. మరోవైపు సాధారణ వేతనదారులు ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు బిలియనీర్లకు బంగారు రోజులు… మరోవైపు సాధారణ కుటుంబాలపై ఖర్చుల భారం .. ఈ వ్యత్యాసం తగ్గితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జీ–20 నివేదిక ..G-20 Report

జీ–20 నివేదిక భారత ఆర్థిక వాస్తవాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. తాజాగా విడుదలైన జీ–20 నివేదిక ప్రకారం భారతదేశంలోని అత్యంత ధనికులైన 1% కుబేరుల సంపద గత రెండు దశాబ్దాల్లో 62% మేర పెరిగింది. అదే సమయంలో మధ్యతరగతి, దిగువ వర్గాల ఆదాయం మాత్రం పెద్దగా పెరగలేదని పేర్కొంది. 000 నుంచి 2023 మధ్యకాలంలో సృష్టించబడిన కొత్త సంపదలో టాప్‌ 1% కుబేరులు దేశ సంపదలో సుమారు 40% వాటా కలిగి ఉన్నారని వెల్లడించింది. కాగా 50% మంది సాధారణ ప్రజలు కేవలం 1% మాత్రమే పొందినట్లు నివేదిక పేర్కొంది.

ప్రజాస్వామ్యానికీ ముప్పు..Threat to Democracy

అసమానతలు కేవలం ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదిక హెచ్చరించింది. అధిక అసమానతలున్న దేశాల్లో ప్రజాస్వామ్యం క్షీణించే అవకాశం 7 రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2020 తర్వాత పేదరిక నిర్మూలన ప్రక్రియ నెమ్మదించడంతో, ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది ఆహార భద్రత లేకుండా, 130 కోట్ల మంది ఆరోగ్య ఖర్చులు చేయలేని పరిస్థితిలో ఉన్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది.

పన్ను విధానాలపై దృష్టి అవసరం..Focus Needed on Tax Policies

పన్ను విధానాల్లో మార్పులు అవసరమని జీ-20 నివేదిక‌ సూచించింది. ధనిక వర్గాలపై సరైన పన్ను విధించడం, విద్యా–ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా మాత్రమే ఈ వ్యత్యాసాన్ని తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు.

భారత్‌, చైనా అగ్రస్థానంలో..India and China at the Top

జనాభా అధికంగా ఉన్న భారత్‌, చైనా వంటి దేశాల్లో తలసరి ఆదాయం పెరగడం వల్ల దేశాల మధ్య అసమానత కొంత మేర తగ్గినప్పటికీ, దేశాల అంతర్గతంగా ధనిక–పేద మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. భారతదేశంలో అగ్ర 1% కుబేరుల సంపద 62% మేర పెరిగిందని, చైనాలో ఇది 54% శాతంగా ఉందని నివేదికలో వెల్లడించారు. 2000 నుంచి 2023 మధ్య ప్రపంచంలోని సుమారు 74% దేశాల్లో కుబేరులు తమ ఆస్తులు పెంచుకున్నారని వివరించింది. అదే సమయంలో పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం చాలా తక్కువగా పెరగడంతో ఆర్థిక సమతుల్యత దెబ్బతిన్నదని పేర్కొంది.

దేశాల సమన్వయంతో.. With Coordination Among Nations

తీవ్రమైన అసమానతలు అనివార్యం కావని, రాజకీయ సంకల్పం, అంతర్జాతీయ సమన్వయం ద్వారా వాటిని ఎదుర్కోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం ‘ఇంటర్నేషనల్‌ ప్యానెల్‌ ఆన్‌ ఇన్‌ఈక్వాలిటీ (ఐపీఐ)’ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీని ద్వారా దేశాల ఆర్థిక విధానాలను పర్యవేక్షించి, అసమానతలను తగ్గించే మార్గాలను సూచించాలనేది ఆ సంస్థ ఉద్దేశం. “వృద్ధి ఉన్నా సమానత లేకపోతే అది సుస్థిరాభివృద్ధి కాదు. ఆదాయ వ్యత్యాసం పెరిగితే సామాజిక అసంతృప్తి పెరుగుతుంది” అని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో టాప్ 10 ధనికులు.. Top 10 Richest People in India

ముకేశ్ అంబానీ (Mukesh Ambani) – రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
గౌతమ్‌ అదానీ (Gautam Adani) – అదానీ గ్రూప్‌
శివ్‌ నాదార్‌ (Shiv Nadar) – హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
సవిత్రి జిందాల్‌ & కుటుంబం (Savitri Jindal & family) – ఓపెక్స్‌ జిందాల్‌ గ్రూప్‌
దిలీప్‌ శాంఘ్వీ (Dilip Shanghvi) – సన్‌ ఫార్మా
సైరస్‌ పూనావాలా (Cyrus Poonawalla) – సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా
కుమార మంగలం బిర్లా (Kumar Mangalam Birla) – ఆదిత్య బిర్లా గ్రూప్‌
లక్ష్మీ మిత్తల్‌ (Lakshmi Mittal) – ఆర్సెలర్ మిత్తల్‌ స్టీల్‌
రాధాకిషన్‌ దమానీ (Radhakishan Damani) – డీ-మార్ట్‌
ఉదయ్‌ కోటక్‌ (Uday Kotak) – కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

కుబేరుల సంపద పెరగడానికి కారణాలు.. Reasons Behind the Rise in Billionaires’ Wealth

దేశంలో అగ్రశ్రేణి కుబేరుల సంపద గణనీయంగా పెరగ‌డం వెనుక అనేక ఆర్థిక, రాజకీయ, సాంకేతిక కారణాలు దాగి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మార్కెట్‌ విస్తరణ..Market Expansion

ప్రైవేటు రంగం వేగంగా విస్తరించడం, మార్కెట్‌ లిబరలైజేషన్‌, పన్ను సడలింపులు ధనవంతులకు లాభదాయకంగా మారాయి. పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు కొత్త పెట్టుబడులు పెడుతూ మార్కెట్‌ వాటాలను స్వాధీనం చేసుకున్నాయి. అదే సమయంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు పోటీని తట్టుకోలేక వెనుకబడ్డాయి.

స్టాక్‌ మార్కెట్ ..Stock Market

ఇటీవల‌ దశాబ్దం కాలంలో స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంబానీ, అదానీ, బిర్లా వంటి కార్పొరేట్‌ దిగ్గజాల షేర్లు ఆకాశాన్నంటాయి. కరోనా అనంతరం పెట్టుబడిదారుల దృష్టి పెద్ద కంపెనీలపై కేంద్రీకరించడంతో వాటి నికర సంపద మరింత పెరిగింది.

సాంకేతికత.. Technology

డిజిటలైజేషన్‌, ఐటీ సేవలు, ఆన్‌లైన్‌ వ్యాపారం ఇవన్నీ కొత్త తరహా సంపద సృష్టించే మార్గాలు అయ్యాయి. హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ జియో వంటి సంస్థలు సాంకేతిక వినియోగాన్ని విస్తరించి ఆదాయాలను పెంచాయి.

గ్లోబల్‌ పెట్టుబడులు ..Global Investments

భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో విదేశీ మూలధనం పెద్దఎత్తున ప్రవేశించింది. ఈ పెట్టుబడులు ఎక్కువగా ఇప్పటికే ధనవంతులైన సంస్థల్లోనే కేంద్రీకరించబడ్డాయి. ఫలితంగా సంపద సమీకరణం కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది.

పన్ను సడలింపులు & విధాన మద్దతు..Tax Relaxations & Policy Support

ప్రభుత్వ విధానాలు కార్పొరేట్‌ వర్గాల అనుకూలంగా ఉండటమే మరో ప్రధాన కారణం. పన్ను తగ్గింపులు, ఉత్పత్తి ప్రోత్సాహక పథకాలు (PLI), ప్రైవేటైజేషన్‌ చర్యలు – ఇవన్నీ పెద్ద వ్యాపారాలకు దోహదం చేశాయి.

ఆస్తుల విస్తరణ ..Expansion of Assets

ఎనర్జీ, ఇన్‌ఫ్రా, రియల్‌ఎస్టేట్‌ రంగాల్లో అగ్రగామి వ్యాపారవేత్తలు భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను విస్తరించుకున్నారు. అదానీ, అంబానీ వంటి కుబేరులు గ్రీన్‌ ఎనర్జీ, డేటా సెంటర్‌, రిటెయిల్‌ రంగాల్లోకి విస్తరిస్తూ ఆస్తులను పలు రెట్లు పెంచుకున్నారు.

494
FEATURE NEWS Tags:Burden on the Middle Class, Expansion of Assets, Focus Needed on Tax Policies, G-20 Report, Global Investments, India and China at the Top, Inequalities in the Economy, Market Expansion, Need for Balance in Governance, Reasons Behind the Rise in Billionaires’ Wealth, Stock Market, Tax Relaxations & Policy Support, Technology, The Rich Are Getting Richer, Threat to Democracy, Top 10 Richest People in India, With Coordination Among Nations

Post navigation

Previous Post: జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores!
Next Post: భారతీయుల ఆస్తుల్లో షేర్ల వాటా కేవలం 4.7% మాత్రమే! Indians Hold Only 4.7% of Their Wealth in Stocks!

Related Posts

  • బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయాయా?.. అయితే ఇలా చేయండి..! బ్యాంకే పరిహారం చెల్లిస్తుంది! Money Lost from Your Bank Account?.. Follow This Process and the Bank May Compensate You FEATURE NEWS
  • వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్‌` FEATURE NEWS
  • What is Personal loan and how to get personal loan ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే ఏమిటి దానిని పొంద‌డం ఎలా FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS
  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses? FEATURE NEWS
  • ప‌ది సంవ‌త్స‌రాల‌య్యాక ప్ర‌తి నెలా ప‌దివేలు ఎలా How about ten thousand every month after ten years FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too? FEATURE NEWS
  • what is algo trading..? ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి…? MARKET
  • రైల్వే స్టాక్స్ దూకుడు..13% ఎగబాకిన RVNL షేర్లు.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం! Railway Stocks Surge: RVNL Shares Jump 13%, Investor Optimism Rises! FEATURE NEWS
  • యాడ్‌-ఆన్‌ క్రెడిట్‌ కార్డు… సౌలభ్యమా? లేక భార‌మా? Add-on Credit Card… Convenience or a Burden of Responsibility? FEATURE NEWS
  • what is scuttlebutt investing in stock market SCUTTLEBUTT అనే ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం MARKET
  • బీమా మ‌రింత చేరువ‌వ్వాలి what is the importance of insurance INSURANCE
  • స్టాక్ మార్కెట్ లో స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి What is Small Case Investing in Stock Market INVESTMENTS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme