Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

This is how to check for losses in the stock market స్టాక్ మార్కెట్‌లో న‌ష్టాల‌కు ఇలా చెక్ పెట్టండి

Posted on 04/06/202504/06/2025 By admin No Comments on This is how to check for losses in the stock market స్టాక్ మార్కెట్‌లో న‌ష్టాల‌కు ఇలా చెక్ పెట్టండి

అధిక ఆదాయం పొందాలనే దురాశతో కొంతమంది యువత భారీగా నష్టపోతున్నారు. అవగాహన లేక.. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు. సరైన మార్గం ఎంచుకోక దాచుకున్న డబ్బులను పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ లోనూ సరైన విధానంలో డబ్బులు మదుపు చేయకుండా నష్టాల పాలవుతున్నారు. స్టాక్ మార్కెట్ ను కూడా ఒక వ్యాపారంగా భావించి ముందుకు వెళ్తే కొంత వ‌ర‌కు న‌ష్టాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అవ‌గాహ‌న త‌ప్ప‌నిస‌రి
Awareness is Essential

స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆదాయ మార్గం. ఇందులో మదుపు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నిమిషాల్లో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైన‌ సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఏమాత్రం అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ లో మదుపు చేస్తున్న యువత భారీగా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన‌ప్పుడు అత్యాశ‌కు పోకూడ‌దు. కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఎటువంటి ఎమోషన్స్‌కు గురికాకూడ‌దు. అటు అత్యాశ కానీ అతి భయం కానీ లేకుండా మధ్యలో ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్లు స్టాక్ మార్కెట్‌లో సంప‌ద సృష్టించగ‌ల‌ర‌ని నిపుణులు చెబుతున్నారు.

డిసిప్లిన్, నాలెడ్జ్ ముఖ్యం
Discipline and Knowledge are Important

మ‌న‌కి మంచి రిటర్న్స్ ని జనరేట్ చేయగలిగే వాటిల్లో ఒక‌టి రియల్ ఎస్టేట్.. రెండోది స్టాక్ మార్కెట్. రియల్ ఎస్టేట్ విషయంలోకి వచ్చేసరికి సమస్య ఏమిటంటే ఇక్క‌డ‌ అధిక మొత్తంలో డబ్బులు కావాలి. కొన్ని లక్షల రూపాయలు ఉంటేనే ఒక భూమిని కొనగలుగుతాం. దాంతో కొంత వెల్త్ ని క్రియేట్ చేయగలుగుతాం. కానీ స్టాక్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే మీ దగ్గర ₹10 ఉన్నా గాని పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగ‌ని చెప్పి దాన్ని దుర్వినియోగం చేస్తే పనిష్మెంట్ త‌ప్ప‌దు. ఎక్కడైతే డిసిప్లిన్ ఉండదో.. ఎక్కడైతే నాలెడ్జ్ ఉండదో.. అక్కడ క‌చ్చితంగా డబ్బులు పోవటం ఖాయం.

According to SEBI Data..

గ‌త‌ సంవత్సరం సెబీ విడుద‌ల చేసిన ఒక డేటా ప్ర‌కారం దాదాపుగా 80 నుంచి 90 లక్షల మంది ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అందులో దాదాపుగా 93% మంది ట్రేడర్స్ డబ్బుల్ని కోల్పోయారు. వారు కోల్పోయిన డబ్బుల విలువ ఎంతంటే దాదాపుగా రూ. ల‌క్షా 80వేల కోట్లు. రిటైలర్స్ అంటే మిగతా 7% మంది ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా సంపాదించారా? అంటే అది కూడా లేదు. ఆ 7% మంది మొత్తం సంపాదించి ఉంటే గట్టిగా 20, 30 వేల కోట్ల రూపాయలు మాత్ర‌మే. మిగతా డబ్బులన్నీ ఎక్కడికి పోయాయ‌టే ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో ఒక పాతిక వేల కోట్లు వెళ్లిపోయింది. మిగతాదంతా ఎవరు తీసుకొని వెళ్ళిపోయారంటే బిగ్ ప్లేయర్స్. పెద్ద పెద్ద కంపెనీలు, ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకా దయనీయమైన పరిస్థితి ఏమిటంటే.. అత్యధికంగా డబ్బులు పోగొట్టుకున్న రాష్ట్రా ల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. అస‌లు సౌత్ ఇండియా లోనే స్టాక్ మార్కెట్ కల్చర్ తక్కువ. ఇక్క‌డ‌ తక్కువ మంది ట్రేడర్స్ ఉంటారు, నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఉంటారు. కానీ అధిక మొత్తంలో కోల్పోయింది ఎవరంటే సౌత్ ఇండియా వాళ్లే.. అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో అత్యాశకు పోకూడ‌దు.

మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి
Understand the Market

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే సంపద‌ సృష్టించొచ్చు అనే ఆలోచన తో చాలా మంది దానిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కొంత టైం ట్రావెల్ చేసిన తర్వాత ఈ youtubeలు, వీటిల్లో చాలా వీడియోలు చూసి ట్రేడింగ్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతుంటారు. ఆప్షన్స్ ట్రేడింగ్, ఆప్షన్ బయింగ్ , ఆప్షన్ సెల్లింగ్ లోకి అడుగు పెడతారు. మొత్తం డబ్బులు పోయిన తర్వాత అప్పుడు త‌ప్పు చేశామ‌ని బాధ‌ప‌డుతుంటారు. మార్కెట్ వెనకాల చాలా సైన్స్, మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాన్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి మనలో ఒక ఆర్ట్ ఉండాలి. దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. మార్కెట్ లో ఉండే టెన్షన్ ను ఎవరు దాటుతారో వారు మాత్రమే డబ్బులు సంపాదించ‌గ‌ల‌రు. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేయడం తెలియ‌క‌పోతే ఆర్థిక నిపుణుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది. లేకుంటే తీవ్రంగా న‌ష్ట‌పోక త‌ప్ప‌దు. పీఎంఎస్ సర్వీసెస్, పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని మ‌న‌ల్ని గైడ్ చేయడానికి ఆర్ఐఎస్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైసర్స్ ఎన్నో ఉన్నాయి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్‌లోకి దిగ‌కూడ‌దు. ఎప్పుడైనా సరే వ్యక్తి కంటే సంస్థ గొప్పది. సంస్థ కంటే వ్యవస్థ గొప్పది. అయితే వ్యక్తి తప్పు చేస్తాడు కానీ సంస్థ. వ్యవస్థ తప్పు చేయదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన లోపం వల్ల మిస్ హ్యాండిల్ చేసి లక్షల రూపాయలను పోగొట్టుకోవ‌ద్దు. అప్పులు చేసి ట్రేడింగ్ లో పెట్ట‌బ‌డులు పెట్ట‌డం అస్స‌లు మంచిది కాదు.

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Take These Precautions in stock markets

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నప్పటికీ, సరైన వ్యూహాలతో ముందుకెళ్తే దీర్ఘకాలికంగా మంచి లాభాలను అందించగలదు. మార్కెట్లో పెట్టుబడులకు ముందు సమగ్ర పరిశోధన, మదుపరుల అవగాహన, సరైన వ్యూహాలు అనుసరించడం చాలా ముఖ్యం. మార్కెట్‌లో స్థిరమైన .. (ఉత్తమ ప్రదర్శన కలిగిన) కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయ‌డం ఉత్త‌మం. వాటివ‌ల్ల రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది. దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డులు వ‌స్తాయి. స్టాక్ మార్కెట్ ను నేరుగా అర్థం చేసుకోలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. SIP ద్వారా ప్రతి నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మార్కెట్ పతనమైనా, మళ్లీ పెరగ గల అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి లాభాలు సాధించవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు, అన్ని పెట్టుబడులను ఒకే రంగానికి పరిమితం చేయకూడదు. IT, బ్యాంకింగ్, ఆరోగ్యరంగం, FMCG, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. త‌ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ఒక్క రంగం నష్టపోతే, మరొక రంగం లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో స్టాక్స్ ఎప్పుడైనా పెరుగుతాయి.. ఎప్పుడైనా తగ్గుతాయి. వీటిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫండమెంటల్ & టెక్నికల్ అనాలిసిస్ ప్ర‌కారం స్టాక్స్ ఎంపిక చేయడం ఉత్తమం. మార్కెట్ ట్రెండ్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్ విశ్లేషణ చేసుకుని పెట్టుబడి పెట్టడం వ‌ల్ల నష్టాలను తగ్గించుకోవ‌చ్చు. కొంతమంది మదుపర్లు తక్కువ రిస్క్‌తో నియమితంగా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, మార్కెట్ మార్పులను అధిగమించేందుకు సహాయపడతాయి. స్టాక్ మార్కెట్‌లో అతిగా ఆశపడి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. స్టాప్ లాస్ (Stop Loss) సెట్ చేసుకోవడం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు రిస్క్‌కు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు.. పెట్టుబడి లక్ష్యాలను బట్టి సరైన మార్గాలను ఎంచుకోవాలి.

 

299
FINICAL PLANNING, INVESTMENTS, MARKET Tags:Discipline and Knowledge are Important, losses in the stock market, Take These Precautions in stock markets, What Are Best ways to Invest in Stock Market

Post navigation

Previous Post: బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account
Next Post: Tips to Clear your loans early రుణాలు త్వరగా తీర్చేందుకు చిట్కాలు

Related Posts

  • SIP పెట్టుబడిని ఏడాది ఆలస్యం చేస్తున్నారా?.. రూ. కోటి నష్టం రావచ్చు! Delaying SIP investments by a year? You could lose ₹1 crore! FINICAL PLANNING
  • బ్యాంకు లోన్ v/s ఈక్విటీ MARKET
  • పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden? FINICAL PLANNING
  • మీ జీతాన్ని 4 రెట్లు పెంచే రహస్యం! The Secret to Quadrupling Your Salary! FINICAL PLANNING
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • ఐపీఓలకు ఊరట.. గడువు పొడిగించిన సెబీ FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • కమొడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి? కమొడిటీలో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి ? What is Commodity Trading FEATURE NEWS
  • Daily stock marketలో trading analysis ఎలా చేస్తారు How to do trading analysis in daily stock market FEATURE NEWS
  • పెట్టుబడుల్లో నిలకడే అసలైన సంపద.. Consistency Is the Real Wealth in Investments FEATURE NEWS
  • ఈ క్రెడిట్ కార్డుల‌పై రాయితీలే.. NEWS
  • ChatGPT ఉపయోగించి మంచి Mutual Funds ఎలా కనుగొనాలి? How to find Mutual Funds using ChatGPT? MUTUAL FUNDS
  • లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్ తో ఎంతవ‌ర‌కు లాభమంటే? How Beneficial Are Life Cycle Funds? MUTUAL FUNDS
  • కుమార్తె భవిష్యత్తు కోసం బలమైన ఆర్థిక ప్రణాళిక..! Smart Financial Planning for Your Daughter’s Future… INVESTMENTS
  • పాల‌సీదారుల్లో విశ్వాసం పెంచండి.. ! బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ స్పష్టమైన ఆదేశాలు! Boost Policyholder Confidence: IRDAI Issues Clear Directives to Insurance Companies INSURANCE

Copyright © 2026.

Powered by PressBook News Dark theme