భారతదేశంలో పెట్టుబడుల ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు బ్యాంకు బ్రాంచ్ లేకుండా ఎఫ్‌డీ చేయడం అసాధ్యం అనిపించేది. ఖాతా తెరవడం, పత్రాలు సమర్పించడం, క్యూలో నిలబడడం .. ఇవన్నీ తప్పనిసరి. కానీ ఇప్పుడు డిజిటల్ విప్లవం పెట్టుబడుల ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ఈ మార్పులకు నాంది పలుకుతూ ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ అమెజాన్ పే (Amazon Pay) మరో కీలక అడుగు వేసింది. బ్యాంకు ఖాతా లేకుండానే, కేవలం మొబైల్ యాప్ ద్వారానే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పెట్టే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకూ అందరికీ ఇది కొత్త అవకాశంగా మారుతోంది.
డిజిటల్ ఎకానమీ దిశగా మరో అడుగు.. Another Step Towards the Digital Economy
గత పదేళ్లలో భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే ముందంజలో నిలిచింది. యూపీఐ, మొబైల్ వాలెట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు సాధారణ ప్రజల జీవితాల్లో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే అమెజాన్ పే(Amazon Pay), గూగుల్ పే, ఫోన్‌పే వంటి సంస్థలు చెల్లింపులకే పరిమితం కాకుండా, పెట్టుబడుల రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్స్, బీమా ఉత్పత్తులు అందించిన అమెజాన్ పే… ఇప్పుడు ఎఫ్‌డీలను కూడా తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చింది. ఇది భారత డిజిటల్ ఫైనాన్స్‌లో మరో మైలురాయిగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.
బ్యాంకు ఖాతా లేకుండానే ఎలా సాధ్యం? How Is FD Possible Without a Bank Account?
సాధారణంగా ఎఫ్‌డీ చేయాలంటే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి. కానీ అమెజాన్ పే (Amazon Pay) తీసుకొచ్చిన మోడల్ కొంచెం భిన్నం. ఇక్కడ అమెజాన్ పే ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది. వినియోగదారుడు యాప్‌లో ఎంపిక చేసుకున్న బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వద్దే డిపాజిట్ నమోదవుతుంది. మీరు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరవాల్సిన అవసరం లేదు. కానీ మీ డిపాజిట్ పై మాత్రం నియంత్రిత ఈ ఆర్థిక సంస్థ వద్దే ఉంటుంది.
రూ.1,000 నుంచే పెట్టుబడి అవకాశం.. Investment Opportunity Starting from ₹1,000
చాలామంది పెట్టుబడులకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం – పెద్ద మొత్తంలో నిధులు అవసరమని. ఈ సమస్యను తొలగిస్తూ అమెజాన్ పే (Amazon Pay) రూ.1,000 నుంచే ఎఫ్‌డీ పెట్టే అవకాశాన్ని కల్పించింది. ఇది ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, మొదటిసారి పెట్టుబడి చేసే యువతను లక్ష్యంగా చేసుకుంది.
వడ్డీ రేట్లు ఎంత? Interest Rates ?
అమెజాన్ పే (Amazon Pay) ప్రకారం, డిపాజిట్ చేసే సంస్థ, కాలపరిమితిని బట్టి గరిష్ఠంగా 8% వరకు వార్షిక వడ్డీ లభించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం చాలా బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లతో పోలిస్తే కొంత ఎక్కువే. అయితే అన్ని సంస్థలు ఒకే వడ్డీ ఇవ్వవు. టెన్యూర్ పెరిగే కొద్దీ వడ్డీ మారుతుంది. ఎన్‌బీఎఫ్‌సీలు సాధారణంగా ఎక్కువ వడ్డీ ఇస్తాయని గుర్తుంచుకోవాలి.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక లాభం.. Senior Citizens Get Extra Edge
స్థిర ఆదాయం కోసం ఎఫ్‌డీలపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు ఇది మంచి అవకాశం. అమెజాన్ పే (Amazon Pay) ద్వారా చేసే ఎఫ్‌డీలపై సాధారణ వడ్డీకి అదనంగా 0.5% వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు సాధారణ వడ్డీ 7.5% అయితే, సీనియర్ సిటిజన్లకు 8% వరకు లభించే అవకాశం ఉంది.
మహిళా మదుపరులకు ప్రత్యేక ప్రోత్సాహం.. Special Incentives for Women Investors
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ఇది మరో అడుగు. శ్రీరామ్ ఫైనాన్స్‌లో డిపాజిట్ చేసే మహిళలకు అదనంగా 0.5% వడ్డీ అందించనున్నట్లు అమెజాన్ పే (Amazon Pay) ప్రకటించింది. ఇది మహిళలను పొదుపు, పెట్టుబడుల వైపు ప్రోత్సహించే చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
7 ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం.. Tie-ups with Banks and NBFCs
ఈ డిజిటల్ ఎఫ్‌డీ సేవల కోసం అమెజాన్ పే మొత్తం 7 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, స్లైస్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లు భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి. ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రెండూ ఉండటం గమనార్హం.
బ్యాంక్ ఎఫ్‌డీ vs ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీ.. Bank FD vs NBFC FD
ఇక్కడే పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఉంది. బ్యాంక్ ఎఫ్‌డీలు అనేవి తక్కువ రిస్క్ తో కూడుకున్నవి. డీఐసీజీసీ బీమా వర్తిస్తుంది. వడ్డీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీలలోవడ్డీ ఎక్కువ కానీ బీమా రక్షణ లేదు. రిస్క్ కొంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ వడ్డీ ఆశతోనే ఎన్‌బీఎఫ్‌సీల వైపు వెళ్లే ముందు ఆలోచన అవసరం.
పెట్టుబడిదారులకు బీమా భరోసా ఎంతవరకు? Deposit Insurance – How Safe Is Your Money?
పెట్టుబడిదారుల భద్రతపై ఉన్న సందేహాలకు అమెజాన్ పే (Amazon Pay) స్పష్టత ఇచ్చింది. భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లకు డీఐసీజీసీ (DICGC) ద్వారా ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. కాగా ఈ బీమా బ్యాంకులకే వర్తిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తించదు. అంటే మీరు బ్యాంక్ ఎఫ్‌డీ చేస్తేనే పూర్తి రక్షణ ఉంటుంది.
అమెజాన్ పే పాత్ర ఏమిటి? What Is the Role of Amazon Pay?
అమెజాన్ పేనే బ్యాంక్ అనుకోవడం పొరపాటు. కానీ నిజం ఏమిటంటే, అమెజాన్ పే (Amazon Pay) కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్ మాత్రమే. డిపాజిట్ అమెజాన్ పే వద్ద ఉండదు. మీ డబ్బు నేరుగా బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీ వద్దే ఉంటుంది. అమెజాన్ పే మధ్యవర్తిగా సౌకర్యం కల్పిస్తుంది
డిజిటల్ ఎఫ్‌డీ చేసే విధానం.. How to Open a Digital Fixed Deposit
అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి. Amazon Pay సెక్షన్‌లోకి వెళ్లాలి. Fixed Deposit ఎంపికపై క్లిక్ చేయాలి. సంస్థ, టెన్యూర్, మొత్తం ఎంపిక చేయాలి. డిజిటల్ కేవైసీ పూర్తి చేయాలి. యూపీఐ / నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తే.. ఎఫ్‌డీ సర్టిఫికేట్ డిజిటల్‌గా లభిస్తుంది.
పన్నుల అంశం (టాక్స్) Tax Implications on FD
ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ ఆదాయం పన్నుకు లోబడి ఉంటుంది. మీ ఆదాయ శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి వడ్డీ ఆదాయం రూ.40,000 (సీనియర్ సిటిజన్లకు రూ.50,000) మించితే టీడీఎస్ వర్తిస్తుంది. ఫారం 15G / 15H సమర్పించడం ద్వారా టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..Precautions to Be Taken
(Amazon Pay) పెట్టుబడిదారులు సంస్థ ఆర్థిక స్థితి తెలుసుకోవాలి. బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ అని నిర్ధారించుకోవాలి. బీమా రక్షణ ఉందా లేదా చెక్ చేయాలి. అన్ని డబ్బులు ఒకే చోట పెట్టకూడదు. టెన్యూర్, పెనాల్టీలు పూర్తిగా చదవాలి
ఎవరికీ ఈ పథకం సరిపోతుంది? Who Should Invest?
(Amazon Pay) చిన్న మొత్తాలతో పొదుపు చేయాలనుకునేవారు, డిజిటల్ సేవలకు అలవాటైనవారు, బ్యాంకు ఖాతా లేకపోయినా పెట్టుబడి చేయాలనుకునేవారు, సీనియర్ సిటిజన్లు (బ్యాంక్ ఎఫ్‌డీల్లో) అమెజాన్ పే ప్లాట్‌ఫాం ఉపయుక్తంగా ఉంటుంది.
ఎవరు దూరంగా ఉండాలి? Who Should Stay Away?
(Amazon Pay) అధిక రిస్క్ భరించలేని వారు, బీమా లేకుండా పెట్టుబడి చేయడానికి ఇష్టపడని వారు, ఎన్‌బీఎఫ్‌సీల గురించి అవగాహన లేని వారు అమెజాన్ పే ప్లాట్‌ఫాంకు దూరంగా ఉండడం మంచిది.
భారత పెట్టుబడి రంగంపై ప్రభావం.. Impact on India’s Investment Landscape
ఈ డిజిటల్ (Amazon Pay) ఎఫ్‌డీ పథకం భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను మరింత విస్తరించనుంది.బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న కోట్లాది మందిని పెట్టుబడుల వైపు తీసుకువచ్చే శక్తి దీనికి ఉంది. “డిజిటల్ ఎఫ్‌డీలు భవిష్యత్తు పెట్టుబడులకు మార్గం. కానీ వడ్డీకి మించి భద్రత ముఖ్యం.” అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా బ్యాంకు ఖాతా లేకుండానే ఎఫ్‌డీ చేసే అవకాశాన్ని అందించడం ద్వారా అమెజాన్ పే డిజిటల్ ఫైనాన్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సరైన అవగాహనతో, జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఈ పథకం చిన్న పెట్టుబడిదారులకు భరోసానిచ్చే సాధనంగా మారుతుంది.

