ఫండ్‌లలో మరింత పారదర్శకత..మరిన్ని సంస్కరణలకు సెబీ ఆమోదం.. Greater Transparency in Funds… SEBI Approves More Reforms

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, మ్యూచువల్‌ ఫండ్‌ల వ్యవస్థలో పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం, పారదర్శకత కల్పించే దిశగా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డు (SEBI) కొన్ని కొత్త సంస్కరణలను ఆమోదించింది. మ్యూచువల్‌ ఫండ్‌లలో విస్తృత స్థాయి సంస్కరణలకు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాల ద్వారా ఫండ్‌ల నిర్వహణలో పారదర్శకత పెరగడం, పెట్టుబడిదారులకు స్పష్టత ఉండడం లక్ష్యం.ఇవి పెట్టుబడిదారులకు తమ ఫండ్స్‌పై పూర్తి సమాచారం, ఖాతాల వివరాలు త్వరగా తెలుసుకోవడం, సులభంగా ట్రాన్సాక్షన్లు చేయడం వంటి అవకాశాలను ఇస్తాయి. ఈ సంస్కరణలు అమలు కాబోయే రోజుల్లో మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్ని అందిస్తాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై పూర్తి నియంత్రణ, సమాచారం పొందగలుగుతారు. ఫండ్స్ నిర్వహణలో నిష్పక్షపాత, పారదర్శక విధానం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

పాత నిబంధ‌న‌ల‌కు చెల్లుచీటి..Exemption for Old Regulations
సెబీ (SEBI) బోర్డు ఇటీవల ఆమోదించిన మరో ప్రతిపాదన ప్రకారం స్టాక్‌ బ్రోకర్లకు ఇప్పటివరకు వర్తిస్తున్న 30 ఏళ్ల నాటి పాత నిబంధనలను రద్దు చేసి, సులభమైన, స్పష్టమైన కొత్త నిబంధనలను తీసుకురానున్నారు. పాత నిబంధనల్లో ఏర్పడిన సమస్యలను తొలగించడానికి, వాటికి చెల్లుచీటీని కూడా ఇచ్చారు. ఈ కొత్త మార్పుల వల్ల బ్రోకర్లు తమ పనితీరు, రిపోర్టింగ్‌, లావాదేవీలలో సరళత పొందుతారు. నిపుణుల ప్రకారం, ఈ నిర్ణయం మార్కెట్‌లో పారదర్శకతను పెంచి, పెట్టుబడిదారులకు నమ్మకాన్ని బలపరుస్తుంది.

సంస్క‌ర‌ణ‌లు ఇలా.. Here’s How the Reforms Look…

– ఫండ్ మేనేజ్‌మెంట్‌ వివరాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం.
– నిధుల వాడకంపై పారదర్శక నివేదికలు, రిపోర్టింగ్ బలపరచడం.
– పెట్టుబడిదారుల అనుమతులు, ఆమోద ప్రక్రియలను సులభతరం చేయడం.
– వ్యయాల నిష్పత్తి విధానం, బ్రోకరేజీ ఛార్జీలపై పరిమితులు కుదిరించటం.
– ఫండ్‌ల నిర్వహణలో వ్యయాల, లావాదేవీల విషయాల్లో పూర్తి సమాచారం అందించడం.
– నియంత్రణ పరంగా స్పష్టత తీసుకురావడం, సులభతర నియమాల అమలుకు ప్రతిపాదనలు

మ్యూచువల్‌ ఫండ్‌ల వ్యయాలపై కొత్త మార్పులు… టీఈఆర్‌ లెక్కింపులో స్పష్టత
New Changes in Mutual Fund Expenses… Clarity in TER Calculation

మ్యూచువల్‌ ఫండ్‌లకు సంబంధించిన టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌)లో కొత్త మార్పులకు సెబీ(SEBI) ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఎస్‌టీటీ, స్టాంప్‌ డ్యూటీ, జీఎస్‌టీ, సీటీటీ వంటి అన్ని సెక్యూరిటీస్‌ లావాదేవీ ఛార్జీలు టీఈఆర్‌ లెక్కింపులో భాగంగా కాకుండా వేరేగా లెక్కిస్తారు. టీఈఆర్‌ పరిమితిని లెక్కించేటప్పుడు ఇప్పుడు ఫండ్‌ పనితీరును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. స్థిరాస్తి మ్యూచువల్‌ ఫండ్‌లు, ఇన్‌ఫ్రా డెట్‌ ఫండ్‌ స్కీమ్‌లలో కొన్ని చాప్టర్లను తొలగించారు. ఫండ్‌ స్పాన్సర్ల అర్హతలను మరింత సరళీకరించనున్నారు. తద్వారా కొత్త పెట్టుబడిదారులు, ఫండ్ నిర్వాహకులు తక్షణమే నిబంధనలను పాటించగలుగుతారు. ఈ మార్పుల వల్ల ఫండ్‌ల వ్యయాల లెక్కింపు మరింత స్పష్టంగా మారి, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి సమాచారం అందుతుంది. ఫండ్ నిర్వహణలో పారదర్శకత పెరుగుతూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని బలపరుస్తుంది.

నిధుల సమీకరణకు వచ్చే ఆఫర్‌ పత్రాల  సరళీకరణ… పెట్టుబడిదారులకు సౌలభ్యం
Simplifying Offer Documents for Fund Consolidation… Easier for Investors

సెబీ (SEBI) తాజా ప్రతిపాదన ప్రకారం.. నిధుల సమీకరణ (Fund Consolidation) కోసం వచ్చే కంపెనీల ఆఫర్‌ పత్రాలను మరింత సరళమైన రూపంలో అందించనున్నారు. దీనివల్ల పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల విషయంలో సులభంగా, తక్షణ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ మార్పు పెట్టుబడిదారులకు సమాచారం సులభంగా చేరేందుకు, అర్ధం చేసుకోవడంలో స్పష్టత కోసం తీసుకురాబడుతోంది. ఫండ్‌లు , కంపెనీల మధ్య వ్యూహాత్మక నిర్ణయాలు త్వరగా, సమర్థవంతంగా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

కొన్ని విభాగాల మదుపర్లకు ప్రోత్సాహకాలు… డెట్‌ ఇష్యూవర్లకు సెబీ అనుమతి
Incentives for Certain Investor Segments… SEBI Allows Debt Issuers

సెబీ (SEBI) కొత్త నిర్ణయం ప్రకారం. కొన్ని ప్రత్యేక విభాగాల మదుపర్లకు పబ్లిక్‌ ఇష్యూల్లో ప్రోత్సాహకాలు (Incentives) ఇవ్వడానికి డెట్‌ ఇష్యూవర్లకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా పెట్టుబడిదారులు డెట్‌ ఇష్యూస్‌లో పాల్గొనడానికి మరింత ఆసక్తి చూపగలరు. , ఇది మార్కెట్‌లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచి, ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.

త‌గ్గ‌నున్న నియంత్రణల భారం.. Reduced Regulatory Burden

సెబీ(SEBI) తాజాగా హై వేల్యూ డెట్‌ లిస్టెడ్‌ కంపెనీలు (HVDEs) గుర్తించే పరిమితిని రూ.1,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. దీని ద్వారా ఈ కంపెనీలపై విధించబడిన నియంత్రణల భారాన్ని తక్కువ చేస్తుంది. అదేవిధంగా అత్యున్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలపై ఉన్న అనుమానాలపై చర్చించనుంది. ముఖ్యంగా, అధికారులు, వారి భార్యలు తమ సొంత డబ్బుతో పెట్టే పెట్టుబడుల విషయంలో స్పష్టత, సమాచారం ఇవ్వనున్నారు. ఈ మార్పులు HVDEల పెట్టుబడులను ప్రోత్సహిస్తూ, మార్కెట్‌లో పారదర్శకతను పెంచుతాయి.

పెట్టుబ‌డిదారుల‌కు ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌నం? How Beneficial Are the Reforms for Investors?

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డు (SEBI) మ్యూచువల్‌ ఫండ్‌లకు సంబంధించి ఆమోదించిన విస్తృత సంస్కరణలతో ఫండ్‌ల ఖర్చుల లెక్కింపు (టీఈఆర్‌) ఇప్పుడు స్పష్టంగా ఉంటుంది. ఫండ్‌ నిర్వహణలో ఎంత ఖర్చు వస్తుందో పెట్టుబడిదారులు తక్షణమే తెలుసుకోవచ్చు. నిధుల సమీకరణ, ఆఫర్‌ పత్రాలను సరళీకరించడం ద్వారా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక విభాగాల మదుపర్లకు డెట్‌ ఇష్యూస్‌లో ప్రోత్సాహకాలు లభించడం, పెట్టుబడిలో ఆసక్తి పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫండ్ స్పాన్సర్ల అర్హతలను సరళీకరించడం వల్ల ఫండ్‌లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. కొత్త నిబంధనలను అర్ధం చేసుకోవడం, అమలు చేయడం ప్రారంభంలో కొంత సవాలు ఎదురుకావచ్చు. పాత పెట్టుబడిదారులు, మార్కెట్‌లో అనుభవం లేని కొందరు కొత్త పెట్టుబడిదారులు మొదటగా మార్పులను అర్థం చేసుకోవడం కష్టం. అయితే కొత్త మార్పులకు అలవాటు పడడానికి కొంత సమయం కావచ్చు.

ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. Precautions Investors Should Take

ఫండ్ ఖర్చులు, టీఈఆర్‌ను పరిశీలించాలి. నూతన విధానంలో టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈఆర్‌) ఖర్చుల లెక్కింపు స్పష్టంగా మారింది. ఎస్‌టీటీ, స్టాంప్‌ డ్యూటీ, జీఎస్‌టి వంటి అదనపు ఛార్జీలు వేరు చేయబడ్డాయి. పెట్టుబడిదారులు ఫండ్‌ ఖర్చులను ముందే అర్థం చేసుకుని పెట్టుబడులు నిర్ణయించాలి. నిధుల సమీకరణ కోసం వచ్చే ఆఫర్ పత్రాలు సరళీకరించిన నేప‌థ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల పరిమాణం, రిస్క్, రిటర్న్‌ లక్ష్యాలను బట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కొన్ని విభాగాల మదుపర్లకు డెట్‌ ఇష్యూస్లో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అనుమతులు వచ్చాయి. దీన్ని ఉపయోగించాలా లేదా, పెట్టుబడి చేసే ముందు పూర్తి సమాచారం సేకరించాలి. హై వేల్యూ డెట్ కంపెనీల గుర్తింపు పరిమితులు పెరిగిన క్ర‌మంలో HVDEల్లో పెట్టుబడులు చేసేముందు కంపెనీ ప్రొఫైల్, ఫైనాన్షియల్ హెల్త్ ను బాగా పరిశీలించాలి. సంస్కరణలు ఫండ్ పారదర్శకతను పెంచుతాయి. కానీ మార్కెట్‌ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. పెట్టుబడులు విభజన (Diversification) ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *