Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

ఒక్క రోజు యుద్ధం ఖ‌ర్చెంత తెలుసా.. అమెరికా ఎంత వెచ్చిస్తుందంటే..? Do You Know the Cost of One Day of War? Here’s How Much the U.S. Spends

Posted on 04/03/2026 By admin No Comments on ఒక్క రోజు యుద్ధం ఖ‌ర్చెంత తెలుసా.. అమెరికా ఎంత వెచ్చిస్తుందంటే..? Do You Know the Cost of One Day of War? Here’s How Much the U.S. Spends

ప్రపంచంలో యుద్ధం ఎక్కడైనా మొదలైతే… దాని ధర చివరకు లెక్కల రూపంలో బయటపడుతుంది. కానీ ఆ లెక్కలు కేవలం డాలర్లలోనే కాదు. రాజకీయ స్థిరత్వంలో, ఆయుధ నిల్వల్లో, ప్రపంచ శక్తిసంతులనంలో కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న ప్రశ్న అదే. ఒక్క రోజు యుద్ధానికి వేల కోట్ల రూపాయలు (Cost of One Day of War) ఖర్చవుతుంటే… నాలుగు, ఐదు వారాల యుద్ధ‌మంటే ఆ భారమెంత? అన్న‌ది సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

పాత శత్రుత్వం… కొత్త మంటలు (An Old Rivalry, A New Flashpoint)
అమెరికా–ఇరాన్‌ శత్రుత్వం కొత్తది కాదు. దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య అనుమానం, ఉద్రిక్తత, ఆంక్షలు, ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ గత వారం నుంచి ఈ శత్రుత్వం ప్రమాదకర మలుపు తిరిగింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధ మంటల్లో కూరుకుపోయింది. ఈ ఘర్షణలు నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగవచ్చని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఇది తక్షణ ప్రతీకార దాడి మాత్రమే కాదు… దీర్ఘకాలిక యుద్ధానికి వాషింగ్టన్‌ సిద్ధమవుతోందన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ (Operation Epic Fury)
ఫిబ్రవరి 28న ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు ప్రారంభమయ్యాయి. గగనతల దాడులు, సముద్రం నుంచి క్షిపణి ప్రయోగాలు, భూతల ఆపరేషన్లు… ఇలా అన్ని స్థాయిల్లో దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్‌కు చెందిన నౌకలు, సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వలు లక్ష్యంగా వందల సంఖ్యలో దాడులు జరిగాయని అమెరికా సైన్యం ప్రకటించింది. కేవలం దాడులే కాదు… ఈ ఆపరేషన్‌ కోసం అమెరికా 20కి పైగా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రంగంలోకి దించింది. యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధ నౌకలు, డ్రోన్లు… అన్నీ ఒకేసారి పనిచేస్తున్నాయి.

తొలి 24 గంటల ఖర్చే షాక్‌ (The First-Day Shock)
యుద్ధం ఎంత ఖర్చవుతుందో (Cost of One Day of War)ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి క్షణం పరిస్థితులు మారుతుంటాయి. కానీ ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే అమెరికా సుమారు 779 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసిందన్న అంచనాలు వెలువడ్డాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.7వేల కోట్లకు పైమాటే. ఇది కేవలం ప్రత్యక్ష దాడుల ఖర్చు మాత్రమే. దాడులకు ముందే పశ్చిమాసియాలో అమెరికా భారీగా సైనిక బలగాలను మోహరించింది. యుద్ధ విమానాలు, నౌకలు, అదనపు సైనిక దళాల తరలింపుకు మరో 630 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చయ్యి ఉండొచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒక్క నౌకే రోజుకు రూ.59 కోట్లు (The Price of Power Projection)
యుద్ధ ఖర్చు (Cost of One Day of War)ఎంత భారమో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ వంటి యుద్ధ విమాన వాహక నౌకను నిర్వహించాలంటే రోజుకు సుమారు 6.5 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయని సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ గణాంకాలు చెబుతున్నాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.59 కోట్లు… ఒక్క రోజుకు. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఒకటి కాదు, రెండు కాదు… పలువురు యుద్ధ నౌకలు, సబ్‌మెరిన్లు, విమాన వాహక నౌకలు మోహరించబడ్డాయి. వీటి నిర్వహణ ఖర్చులే అమెరికా ఖజానాపై భారీ భారం.

ఆయుధాలు నాశనం… (Losing Weapons, Not Just Money)
డబ్బు పరంగా(Cost of One Day of War) చూస్తే ఇది అమెరికాకు పెద్ద సమస్య కాదని కొందరు అంటారు. ఎందుకంటే అగ్రరాజ్య రక్షణ బడ్జెట్‌ ఇప్పటికే ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. దానిని 1.5 ట్రిలియన్‌ డాలర్ల వరకూ పెంచే ఆలోచన కూడా ఉంది. కానీ అసలు ఆందోళన వేరే. ఈ యుద్ధంలో అమెరికా ఆయుధాలను కోల్పోతోంది. కువైట్‌లో మూడు యుద్ధ విమానాలు కూలిపోయాయి. ‘ఫ్రెండ్లీ ఫైర్‌’ కారణంగా జరిగిందని చెబుతున్నా… సాంకేతికంగా ఇది ఆందోళనకర పరిణామమే. అంతేకాదు… క్షిపణులను అడ్డుకునే ఆధునిక వ్యవస్థలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే ఉక్రెయిన్‌కు పంపించబడ్డాయి. మరికొన్ని ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మోహరించబడ్డాయి. ఇప్పుడు ఇరాన్‌ ఘర్షణలు మరింత కాలం సాగితే… ఈ వ్యవస్థల లభ్యతే ప్రశ్నార్థకంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇజ్రాయెల్‌కు మద్దతు… బిలియన్లలో (Backing Israel at a Price)
2023 అక్టోబరు 7న హమాస్‌ దాడి తర్వాత నుంచి ఇజ్రాయెల్‌కు అమెరికా అందించిన సైనిక సాయం భారీగానే ఉంది. బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం… ఈ సాయం విలువ 21.7 బిలియన్‌ డాలర్లు. ఇది కాకుండా యెమెన్‌, ఇరాన్‌, పశ్చిమాసియాలో(Cost of One Day of War) ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా సాగిస్తున్న ఆపరేషన్ల ఖర్చు వేరుగా ఉంది. ఈ రెండేళ్ల ఉద్రిక్తతలన్నింటిని కలిపితే… ఇప్పటివరకు అమెరికా ఖర్చు 31 నుంచి 34 బిలియన్‌ డాలర్ల మధ్యే ఉందని అంచనా.

డబ్బు కాదు… రాజకీయ ధర (The Political Cost)
యుద్ధం ఖర్చు(Cost of One Day of War) కేవలం ఖజానాపైనే పడదు. దేశీయంగా రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతాయి. పన్నుల రూపంలో ప్రజలపై భారం పడే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇరాన్‌ ఘర్షణలు కొనసాగితే చమురు ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది. ఎన్నికల వాతావరణంలో ఇది ట్రంప్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకురావచ్చు.

ఎంతకాలం సాగుతుంది? (How Long Can This Last?)
నాలుగు నుంచి ఐదు వారాలు… ఇది అధికారికంగా చెప్పిన మాట. కానీ యుద్ధాలు ఎప్పుడూ షెడ్యూల్‌ ప్రకారం ముగియవు. ఇరాన్‌ ప్రత్యక్షంగా కాకపోయినా… తన మిత్ర బలగాల ద్వారా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. అలా జరిగితే ఘర్షణల పరిధి మరింత విస్తరిస్తుంది. అప్పుడు ఖర్చు లెక్కలు కూడా మారిపోతాయి. రోజుకు రూ.7వేల కోట్లు (Cost of One Day of War)అనేది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చు.

యుద్ధానికి నిజమైన ధర (The Real Cost of War)
యుద్ధం మొదలుపెట్టడం సులువు. ముగించడం కష్టం. అమెరికా–ఇరాన్‌ ఘర్షణలో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది… ఒక్క రోజు యుద్ధం ఖర్చే(Cost of One Day of War) వేల కోట్లలో ఉంటే, దీర్ఘకాల యుద్ధం దేశాలను ఎలా ముంచేస్తుందో.డబ్బు, ఆయుధాలు, రాజకీయ స్థిరత్వం… అన్నింటినీ కలిపి చెల్లించాల్సిన ఈ ధరే అసలు యుద్ధం. చివరికి గెలిచేది ఎవరు అన్నదానికంటే… ఎంత కోల్పోయామన్నదే చరిత్ర లెక్క వేస్తుంది.

161
FEATURE NEWS Tags:A New Flashpoint, An Old Rivalry, Backing Israel at a Price, How Long Can This Last?, Losing Weapons, Not Just Money, Operation Epic Fury, The First-Day Shock, The Political Cost, The Price of Power Projection, The Real Cost of War

Post navigation

Previous Post: చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge
Next Post: ‘వార్‌’ నష్టాలకు బ్రేక్‌.. ఊపందుకున్న‌సూచీలు.. War Shock Slows, Markets Find Footing

Related Posts

  • మోడల్ టెనెన్సీ చట్టంతో అద్దె ఇంటికి కొత్త రూల్స్.. New Rental House Rules ..Under the Model Tenancy Act FEATURE NEWS
  • స్వ‌ల్పంగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌… పెట్టుబడిదారుల్లో టెన్షన్.. Gold Prices Ease Amid Global Uncertainty FEATURE NEWS
  • WHAT IS UPI CIRCLE  యూపీఐ సర్కిల్ గురించి తెలుసా FEATURE NEWS
  • కొత్త ఆదాయపు పన్ను నియమాలు ఇవే..! Here Are the New Income Tax Rules! FEATURE NEWS
  • ఫోన్‌ నుంచే KYC అప్‌డేట్ చేయండి! పీఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్లకు చెక్ చెప్పండి! PF Claim Rejections to Reduce.. Update KYC from Your Phone FEATURE NEWS
  • ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026 FEATURE NEWS
  • ఆస్తులు సంపాదించడం కాదు… కాపాడుకోవడమే అసలు విజయం.. Wealth Creation is Not Enough… Preservation is the Real Success FEATURE NEWS
  • ఇ-మ్యాండేట్‌ విధానం.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సురక్షితం ! E-Mandate System.. Making Digital Payments More Secure! FEATURE NEWS
  • ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance! INSURANCE
  • ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions? FEATURE NEWS
  • should know these words in stock market MARKET
  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. నెలకు రూ. 9,250 గ్యారెంటీ ఆదాయం.. Post Office Monthly Income Scheme.. Get Guaranteed Monthly Income of ₹9,250 FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme