Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies

Posted on 30/03/2026 By admin No Comments on ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies

ఐటీ రంగం… ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఈ రంగం ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి దిశను చూపించే శక్తిగా నిలుస్తోంది. ఐటీ పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి… ఉద్యోగాలు వస్తే నగరాలు పెరుగుతాయి… నగరాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ సూత్రం కారణంగానే దేశంలోని ప్రతి రాష్ట్రం ఐటీ రంగాన్ని ఆకర్షించేందుకు పోటీ పడుతోంది. ఒకప్పుడు “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా”గా పేరుగాంచిన బెంగళూరు… ఈ రంగంలో అగ్రగామిగా నిలిచి దేశానికి దిశానిర్దేశం చేసింది. కానీ ఇప్పుడు అదే బెంగళూరు ఐటీ సంస్థలను నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) . ఒకప్పుడు క్యూలో నిలబడి వచ్చే కంపెనీలు… ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ పరిణామం దేశ ఐటీ రంగ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తోంది? అనే అంశాలపై ఈ ప్రత్యేక కథనం.

సిలికాన్ వ్యాలీ కథ… ఎదుగుదల నుంచి సవాళ్ల దిశగా.. The Silicon Valley Story… From Growth to Growing Challenges
( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) బెంగళూరు… మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలకు కేంద్రంగా నిలిచింది. దేశ ఐటీ ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఈ నగరానిదే. వేలాది స్టార్టప్‌లు ఇక్కడే పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఐటీ పార్కులు, టెక్ కారిడార్లు, భారీ ఉద్యోగ అవకాశాలు… ఇవన్నీ కలిపి బెంగళూరును ఐటీ రంగానికి ప్రతీకగా మార్చాయి. అయితే గత ఐదేళ్లుగా పరిస్థితి క్రమంగా మారుతోంది. అభివృద్ధి పరాకాష్టకు చేరిన ఈ నగరం ఇప్పుడు మౌలిక వసతుల కొరతతో కుంగిపోతోంది.

మౌలిక వసతుల సంక్షోభం… అభివృద్ధికి అడ్డంకి.. Infrastructure Crisis… A Roadblock to Growth
బెంగళూరులో ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) ఐటీ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మౌలిక వసతుల లోపం. నగరంలోని రోడ్లు గుంతలతో నిండిపోవడం, వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడం, డ్రైనేజ్ వ్యవస్థ బలహీనంగా ఉండడం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఐటీ కారిడార్లుగా పేరుగాంచిన ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు కూడా గంటకు పైగా సమయం పట్టడం సాధారణంగా మారింది. ఒకప్పుడు “గార్డెన్ సిటీ”గా గుర్తింపు పొందిన బెంగళూరు… ఇప్పుడు “ట్రాఫిక్ సిటీ”గా పేరుపొందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ట్రాఫిక్ భారంతో తగ్గుతున్న ఉత్పాదకత.. Traffic Burden and Declining Productivity
ఐటీ ఉద్యోగుల జీవితంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. సాధారణంగా 15 నుంచి 20 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ప్రయాణం… గంటన్నర నుంచి రెండు గంటల సమయం తీసుకుంటోంది. ఒక ఉద్యోగి రోజుకు ఆఫీస్‌కు వెళ్లి రావడానికి ఐదు గంటలు ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తే… అది వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, సంస్థల ఉత్పాదకతపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగుల సమయాన్ని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించాయి.

జీవన వ్యయం… చిన్న సంస్థలకు పెద్ద భారం.. Rising Cost of Living… A Burden for Startups
బెంగళూరులో ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) జీవన వ్యయం గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగింది. ఒక ఫ్రెషర్ ఉద్యోగి సంపాదించే జీతంలో పెద్ద భాగం హాస్టల్, అద్దె, ఆహారం వంటి ఖర్చులకు వెళ్తోంది. ఐటీ ఆఫీసుల అద్దెలు కూడా భారీగా పెరిగాయి. కో-వర్కింగ్ స్పేస్‌లో ఒక డెస్క్ కోసం నెలకు 30,000 రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. ఐదు సంవత్సరాల్లో అద్దెలు 60 నుంచి 80 శాతం పెరిగినట్టు అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్టప్‌లు, చిన్న , మధ్యతరహా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడం కష్టసాధ్యంగా మారింది.

నీరు, విద్యుత్ సమస్యలు… టెక్ సిటీలో వ్యతిరేక దృశ్యం.. Water and Power Issues… A Paradox in a Tech City
టెక్నాలజీ పరంగా అగ్రగామిగా ఉన్న నగరంలోనే నీటి కొరత, విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంతరాయం వంటి సమస్యలు ఉండటం విస్మయకరం. వేసవి కాలంలో నీటి సమస్య తీవ్రంగా మారుతుంది. చాలా ప్రాంతాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి కొరత… ఈ ద్వంద్వ సమస్యలు ఐటీ కంపెనీలకు అదనపు ఖర్చులు మోపుతున్నాయి.

బెంగళూరుకు గుడ్‌బై… కొత్త గమ్యాల వైపు కంపెనీలు..Goodbye Bengaluru… Companies Move to New Destinations
ఈ అన్ని సమస్యల నేపథ్యంలో అనేక ఐటీ సంస్థలు బెంగళూరులో ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) తమ కార్యకలాపాలను తగ్గిస్తూ… కొత్త నగరాల వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. కొన్ని పూర్తిగా మారిపోతుండగా… మరికొన్ని తమ డెవలప్‌మెంట్ సెంటర్లను ఇతర నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. గత కొన్నేళ్లలో వందల సంఖ్యలో కంపెనీలు బెంగళూరు నుంచి వేరే రాష్ట్రాలకు మారినట్టు నివేదికలు చెబుతున్నాయి.

హైదరాబాద్… ఐటీ రంగానికి కొత్త కేంద్రం.. Hyderabad… The Emerging IT Powerhouse
బెంగళూరుకు ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సదుపాయాలు కనెక్టివిటీని సులభతరం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు కూడా కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. 15 రోజులలోనే కంపెనీ ఏర్పాటు చేసుకునే విధానాలు, తక్కువ అద్దెలు, మెరుగైన టాలెంట్ పూల్ వంటి అంశాలు హైదరాబాద్‌ను ఐటీ రంగానికి ఆకర్షణీయంగా మార్చాయి.

విశాఖపట్నం… కొత్త టెక్ హబ్ వైపు అడుగులు.. Visakhapatnam… Rising as a New Tech Hub
హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం కూడా ఐటీ రంగంలో ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) వేగంగా ఎదుగుతోంది. సముద్రతీర నగరంగా ఉన్న విశాఖ… అంతర్జాతీయ డేటా కనెక్టివిటీకి అనుకూలంగా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, తక్కువ ఖర్చుతో భూమి, మెరుగైన మౌలిక వసతులు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయితే… విశాఖకు మరింత గ్లోబల్ కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది.

ఇతర నగరాల ఎదుగుదల… విస్తరిస్తున్న ఐటీ పటం.. Rise of Other Cities… Expanding IT Landscape
పుణే, చెన్నై, నోయిడా, గుర్గావ్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఇండోర్ వంటి నగరాలు కూడా ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతున్నాయి. ఈ నగరాల్లో తక్కువ ఖర్చుతో పాటు మంచి టాలెంట్ లభించడం కంపెనీలకు అదనపు ప్రయోజనం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

మారుతున్న ఐటీ దిశ.. The Changing Direction of IT Industry
ఐటీ రంగం ( “Silicon Valley of India” Facing Challenges in Retaining IT Companies) ఒక నగరానికి మాత్రమే పరిమితం కాకుండా… దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామం. అయితే ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న బెంగళూరు… మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించుకోకపోతే తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో హైదరాబాద్, విశాఖ వంటి నగరాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మొత్తానికి… ఐటీ రంగం భవిష్యత్తు ఒకే నగరంపై ఆధారపడకుండా… అనేక నగరాల మధ్య విస్తరించడం ద్వారా మరింత బలపడుతోంది. ఇది దేశ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోంది.

93
FEATURE NEWS Tags:Goodbye Bengaluru… Companies Move to New Destinations, Hyderabad… The Emerging IT Powerhouse, Infrastructure Crisis… A Roadblock to Growth, Rise of Other Cities… Expanding IT Landscape, Rising Cost of Living… A Burden for Startups, The Changing Direction of IT Industry, The Silicon Valley Story… From Growth to Growing Challenges, Traffic Burden and Declining Productivity, Visakhapatnam… Rising as a New Tech Hub, Water and Power Issues… A Paradox in a Tech City

Post navigation

Previous Post: స్టాప్‌లాస్ హిట్ అయ్యాక .. టార్గెట్ హిట్ అవుతోందా? అసలు మార్కెట్ గేమ్ ఇదే! Stoploss Hit Before Target? This Is How the Market Really Works!
Next Post: ఇన్వెస్టింగ్ వైపు మహిళ‌ల అడుగులు.. Women Moving Towards Investing

Related Posts

  • అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks FEATURE NEWS
  • క్రెడిట్ కార్డ్ జాగ్రత్తలు… తప్పుగా వాడితే అప్పుల ఊబి ఖాయం! Credit Card Pitfalls.. Misuse Can Lead to Debt Trap! FEATURE NEWS
  • GST అంటే ఏమిటి what is GST FEATURE NEWS
  • ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం.. FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హెచ్చరిక: కేవైసీ పేరుతో కొత్త మోసాల ముప్పు .. Alert for Mutual Fund Investors: New KYC Scams on the Rise FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 40 ఏళ్ల వ‌య‌సులో రూ.8 లక్షల బీమా సరిపోతుందా? Is ₹8 Lakh Health Insurance Enough at 40? The Reality of Medical Costs INSURANCE
  • కొత్త పాన్‌ కార్డ్‌ కోసం కేవలం ఆధార్‌ సరిపోదు! నిబంధనలు కఠినతరం… ఏమేం అవసరమంటే? New PAN Card Rules 2026 – Aadhaar Alone Not Enough Anymore FEATURE NEWS
  • మీ పాన్ కార్డ్‌తో లోన్ తీసుకున్నారా?.. ఇలా ఈజీగా కనిపెట్టండి! Check If Someone Took Loan Using Your PAN FEATURE NEWS
  • ఏప్రిల్‌ నుంచి టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు మ‌రింత ప్రియం .. Term Life Insurance Premiums to Become Costlier from April INSURANCE
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
  • భారత్‌లో దూసుకుపోతున్న కుబేరులు ..! Billionaires on the Rise in India FEATURE NEWS
  • షేర్ల బైబ్యాక్ లాభ‌మా what is share buyback FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme