ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
పొదుపుతో పాటు భద్రత, స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పథకాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘జీవన్ ఉత్సవ్’ (LIC Jeevan Utsav) పేరుతో ప్రవేశపెట్టిన ఈ బీమా పాలసీ ప్రత్యేకత ఏమిటంటే – ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం (గరిష్ఠంగా 100 ఏళ్ల వరకు) ఆదాయం వచ్చే అవకాశం కల్పించడమే.
12 నుంచి అందుబాటులోకి.. Available from 12th January
సేవింగ్స్‌తో పాటు బీమా ప్రయోజనం కలిగిన ఈ పాలసీ (LIC Jeevan Utsav) ని సింగిల్ ప్రీమియం ఆప్షన్‌తో లాంచ్ చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిర ఆదాయం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా ఎల్‌ఐసీ చెబుతోంది. జనవరి 12 నుంచి ఈ పాలసీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో జీవన్ ఉత్సవ్ పాలసీ ప్రత్యేకతలు, అర్హతలు, లాభనష్టాలు, ఎవరికీ సరిపోతుందనేది ఉదాహరణతో సహా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జీవన్ ఉత్సవ్ పాలసీ అంటే ఏమిటి? What is Jeevan Utsav Policy?
జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav)అనేది నాన్-లింక్డ్ ప్లాన్. నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ఈ పాలసీ స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. మార్కెట్ లాభనష్టాలతో సంబంధం ఉండదు. ఎల్‌ఐసీ లాభాల్లో వాటా (బోనస్) ఇవ్వదు. అయితే ముందుగానే నిర్ణయించిన గ్యారంటీడ్ అడిషన్స్, గ్యారంటీడ్ ఇన్‌కమ్ లభిస్తాయి.
ఎవరు ఈ పాలసీ తీసుకోవచ్చు? Who Can Take This Policy?
ఈ పాలసీకి (LIC Jeevan Utsav)విస్తృత వయసు పరిమితిని ఎల్‌ఐసీ నిర్ణయించింది. కనీస వయసు 30 రోజుల శిశువు నుంచి గరిష్ఠంగా 65 సంవత్సరాల వరకు వయసు పరిమితిని నిర్ణయించింది. అంటే పిల్లల భవిష్యత్ కోసం గానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం గానీ ఈ పాలసీని ఉపయోగించుకోవచ్చు.
బీమా మొత్తం ఎంత? What is the Sum Assured?
(LIC Jeevan Utsav)కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ.5 లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు. అంటే పెట్టుబడిదారుడి ఆర్థిక స్థితి, అవసరాన్ని బట్టి ఎంత మొత్తానికైనా పాలసీ తీసుకోవచ్చు.
గ్యారంటీడ్ అడిషన్స్ (GA) అంటే ఏమిటి? What Are Guaranteed Additions (GA)?
ఈ పాలసీ(LIC Jeevan Utsav) ప్రత్యేకతల్లో గ్యారంటీడ్ అడిషన్స్ (GA) ముఖ్యమైన అంశం. పాలసీ కాలపరిమితిలో ప్రతి రూ.1,000 బీమా మొత్తానికి ఏటా రూ.40 చొప్పున గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఇవి పూర్తిగా గ్యారంటీడ్. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేదు.
రెండు ఆదాయ ఆప్షన్లు..Two Income Options
జీవన్ ఉత్సవ్ పాలసీ(LIC Jeevan Utsav)లో పెట్టుబడిదారులకు రెండు రకాల ఆదాయ ఎంపికలను అందుబాటులో ఉంచారు. ఆప్షన్ – 1 : రెగ్యులర్ ఇన్‌కమ్ బెనిఫిట్. ఈ ఆప్షన్ కింద పాలసీదారు 7 నుంచి 17 సంవత్సరాల మధ్య ఏ కాలాన్ని ఎంచుకోవచ్చు. ఆ కాలం పూర్తైన తర్వాత ఏటా ప్రాథమిక బీమా మొత్తంలో 10% ఆదాయం లభిస్తుంది ఉదాహరణకు రూ.10 లక్షల బీమా ఉంటే .. ఏటా రూ.1 లక్ష చొప్పున జీవితాంతం (100 ఏళ్ల వరకు) చెల్లిస్తారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆదాయం రావాలన్నది పెట్టుబడిదారుడి అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు.
– ఆప్షన్ – 2 : ఫ్లెక్సీ ఇన్‌కమ్ బెనిఫిట్. ఈ ఆప్షన్ మరింత ప్రత్యేకమైనది. వచ్చే 10% ఆదాయాన్ని వెంటనే తీసుకోకుండా ఎల్‌ఐసీ వద్దే దాచుకోవచ్చు. ఈ విధంగా దాచిన మొత్తంపై ఏటా 5.5% వడ్డీతో చెల్లిస్తారు. అవసరమైతే జమ అయిన మొత్తంలో 75% వరకు ఎప్పుడైనా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. రిటైర్మెంట్ తర్వాత అవసరాన్ని బట్టి ఆదాయం తీసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
మరణిస్తే ఏమవుతుంది? What Happens in Case of Death?
పాలసీ (LIC Jeevan Utsav)వ్యవధిలో పాలసీదారు మరణిస్తే ..నామినీకి ప్రాథమిక బీమా మొత్తం అప్పటివరకు జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్ ఇతర అర్హ ప్రయోజనాలు చెల్లిస్తారు. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. మెచ్యూరిటీ ప్రయోజనం పాలసీదారు గడువు వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ప్రాథమిక బీమా మొత్తం లేదా సింగిల్ ప్రీమియానికి 1.25 రెట్లు (ఏది ఎక్కువైతే అది) దీనికి గ్యారంటీడ్ అడిషన్స్ జోడించి చెల్లిస్తారు. రైడర్లు కూడా జోడించుకోవచ్చు.
అదనపు భద్రత కోసం..For Additional Protection
LIC Jeevan Utsavలో … LIC Accident Death & Disability Benefit Rider, LIC New Term Assurance Rider వంటి రైడర్లను జోడించుకోవచ్చు. ఇందుకు కొంత అదనపు ప్రీమియం చెల్లించాలి. రైడర్లకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి. ఉదాహరణకు మీ వయసు 35 ఏళ్లు అనుకుందాం.. బీమా మొత్తం: రూ.10 లక్షలు అయితే గ్యారంటీడ్ అడిషన్ పీరియడ్: 10 ఏళ్లు అనుకుందాం. సింగిల్ ప్రీమియం: రూ.8,08,650 చెల్లించాలి. మీకు 45 ఏళ్లు వచ్చిన తర్వాత ఏటా మీకు రూ.1 లక్ష ఆదాయం వస్తుంది. 100 ఏళ్ల వరకు చెల్లిస్తారు. గ్యారంటీడ్ అడిషన్స్ 10 ఏళ్లకు అనుకుంటే.. ఏటా రూ.40,000 చొప్పున మొత్తం రూ.4 లక్షలు జమ చేస్తారు. పాలసీ మధ్యలో ఏదైనా జరిగితే నామినీకి సుమారు రూ.14.22 లక్షలు చెల్లిస్తారు. ఫ్లెక్సీ ఇన్‌కమ్ ఆప్షన్ ఎంచుకుంటే అవసరానికి అనుగుణంగా 75% వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన మొత్తంపై 5.5% వడ్డీ ఇస్తారు.
ఎవరికీ ఈ పాలసీ సరిపోతుంది? Who Is This Policy Suitable For?
– రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేవారు (Those Planning for Retirement)
– జీవితాంతం స్థిర ఆదాయం కావాలనుకునేవారు (Those Who Want Lifetime Stable Income)
– మార్కెట్ రిస్క్ వద్దనుకునేవారు (Those Who Want to Avoid Market Risk)
– పిల్లల భవిష్యత్ కోసం ముందస్తు పెట్టుబడి పెట్టేవారు (Those Who Want to Invest in Advance for Their Children’s Future)
ఎవరికీ సరిపోదు? Who Is This Policy Not Suitable For?
– అధిక రాబడులు ఆశించే వారు (Those Expecting High Returns)
– స్టాక్ మార్కెట్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్స్ కోరేవారు (Those Looking for Stock Market-Based Investments)
– తక్కువ కాలంలో భారీ లాభాలు ఆశించేవారు (Those Expecting Huge Profits in a Short Period)
నిపుణుల సూచన .. Expert Advice
చివరగా… LIC Jeevan Utsav పాలసీ భద్రత, స్థిర ఆదాయం, జీవితాంతం గ్యారంటీ.. అన్నింటినీ కలిపి అందించే పథకం. అధిక రాబడుల కంటే నిశ్చిత ఆదాయం, భద్రత కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడి పెట్టేముందు మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.










