ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా లేని జీవితం ఊహించడమే కష్టం. జీతం జమ కావాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, పొదుపు చేయాలన్నా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయిపోయింది. డిజిటల్ లావాదేవీలు పెరిగినా, నగదు వినియోగం పూర్తిగా తగ్గిపోలేదు. ముఖ్యంగా వ్యాపారులు, చిన్న ఉద్యోగులు, రైతులు, స్వయం ఉపాధి పొందేవారు తరచూ క్యాష్ డిపాజిట్లు చేస్తుంటారు. కానీ ఇక్కడే చాలామంది ఒక కీలక విషయాన్ని పట్టించుకోరు. సేవింగ్స్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్‌కు (Cash Deposits in Savings Account) ఒక పరిమితి ఉంటుంది. అది దాటితే, మీరు ఏ తప్పు చేయకపోయినా, ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. “నా డబ్బే కదా” అని అనుకునేలోపే, వివరణలు, ఆధారాలు, కొన్నిసార్లు పెనాల్టీ వరకు వ్యవహారం వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో మారుతున్న కాలం (Changing Banking Landscape)
ఒకప్పుడు బ్యాంకుల్లో జరిగే లావాదేవీలు ఎక్కువగా వ్యక్తిగతంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిజిస్ట్రార్ కార్యాలయాలు… ఇవన్నీ పెద్ద లావాదేవీల వివరాలను నేరుగా Income Tax Department కు పంపిస్తున్నాయి. దీనికి కారణం మనీ లాండరింగ్‌ను అరికట్టడం, పన్ను ఎగవేతలను గుర్తించడం. ఈ వ్యవస్థలో క్యాష్ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అందుకే సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తున్నామన్నది చాలా కీలకం.
సేవింగ్స్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ లిమిట్ ఎంత? (What Is the Cash Deposit Limit in a Savings Account?)
సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో (Cash Deposits in Savings Account)ఒక ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ నుంచి మార్చి వరకు) రూ.10 లక్షల వరకు మాత్రమే నగదు జమ చేయడానికి అనుమతి ఉంది. ఇది ఒక్క బ్యాంక్ అకౌంట్‌కు మాత్రమే కాదు. మీ పేరు మీద ఎన్ని సేవింగ్స్ అకౌంట్లు ఉన్నా, అన్నింట్లో కలిపి రూ.10 లక్షలే పరిమితి. చాలామంది “ఒక బ్యాంక్‌లో 10 లక్షలు, మరో బ్యాంక్‌లో 10 లక్షలు” అని అనుకుంటారు. కానీ అది తప్పు. పాన్ నంబర్ ఆధారంగా అన్ని అకౌంట్ల డేటా కలిపి చూస్తారు. ఒకవేళ ఈ పరిమితిని దాటితే, బ్యాంక్ తప్పనిసరిగా ఆ వివరాలను ఐటీ శాఖకు తెలియజేస్తుంది. ఆ తర్వాత మీకు నోటీసు రావచ్చు.
కరెంట్ అకౌంట్లకు వేరే నిబంధనలు (Different Rules for Current Accounts)
వ్యాపారుల కోసం ఉండే కరెంట్ అకౌంట్లకు క్యాష్ డిపాజిట్ (Cash Deposits in Savings Account) పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల వరకు నగదు జమ చేయవచ్చు. కానీ ఇది కూడా వ్యాపార ఆదాయానికి అనుగుణంగా ఉండాలి. వ్యాపారం చిన్నదిగా ఉండి, అకౌంట్‌లో భారీగా నగదు కదలికలు ఉంటే, అక్కడ కూడా ప్రశ్నలు రావచ్చు.
రోజుకు ఎంత నగదు జమ చేయవచ్చు? (Daily Cash Deposit Limit)
సాధారణంగా బ్యాంకులు రోజుకు రూ.1 లక్ష వరకు సేవింగ్స్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ (Cash Deposits in Savings Account)కు అనుమతిస్తాయి. కొన్ని సందర్భాల్లో – ఉదాహరణకు చాలా రోజులుగా లావాదేవీలు జరగకపోతే – రూ.2.5 లక్షల వరకు కూడా అనుమతించవచ్చు. కానీ ఇది బ్యాంక్ విధానంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే… రోజువారీ పరిమితి ఎంత ఉన్నా, ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10 లక్షలు దాటకూడదు.
పాన్ కార్డ్ తప్పనిసరి ఎప్పుడు? (When Is PAN Mandatory?)
ఒక్కసారి రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తే (Cash Deposits in Savings Account), పాన్ కార్డ్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. పాన్ ఇవ్వకుండా వరుసగా పెద్ద మొత్తాల్లో నగదు జమ చేస్తే, అది అనుమానాస్పదంగా మారుతుంది. పాన్ ద్వారా అన్ని లావాదేవీలు ట్రాక్ అవుతాయి కాబట్టి, పాన్ లింక్ అయిన అకౌంట్లలో జాగ్రత్త మరింత అవసరం.
పరిమితి దాటితే ఏమవుతుంది? (What Happens If You Cross the Limit?)
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి సేవింగ్స్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ చేస్తే (Cash Deposits in Savings Account), ఐటీ శాఖ మీకు నోటీసు పంపవచ్చు. ఆ నోటీసులో ప్రధానంగా అడిగేది ఒక్కటే .. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు జీతం, వ్యాపార ఆదాయం, పాత పొదుపులు, ఆస్తి అమ్మకం వంటి సరైన ఆధారాలు చూపగలిగితే సమస్య ఉండదు. కానీ ఆధారాలు చూపలేకపోతే పరిస్థితి తీవ్రమవుతుంది.
ఆధారాలు లేకపోతే ఎంత పన్ను? (Tax and Penalty on Unexplained Cash Deposits)
ఆధారాలు లేకుండా నగదు డిపాజిట్ (Cash Deposits in Savings Account)చేసినట్టు తేలితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారీ పన్ను విధించబడుతుంది. 60 శాతం ట్యాక్స్, 25 శాతం సర్‌చార్జ్, 4 శాతం సెస్ ఇవి అన్నీ కలిపితే దాదాపు 89 శాతం వరకు పన్ను–పెనాల్టీగా చెల్లించాల్సి వస్తుంది. అంటే మీరు రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేసిన డబ్బులో పెద్ద భాగం ప్రభుత్వానికి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం – సరైన ఆధారాలు చూపితే ఈ పెనాల్టీ ఉండదు.
సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉండొచ్చు? (Is There a Limit on Account Balance?)
చాలామందికి ఉండే మరో సందేహం – “అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు?” దీనికి సమాధానం చాలా సింపుల్. సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బైనా ఉండవచ్చు. ఎలాంటి పరిమితి లేదు. పరిమితి డిపాజిట్ల (Cash Deposits in Savings Account)కు మాత్రమే ఉంటుంది, బ్యాలెన్స్‌కు కాదు. కానీ ఆ డబ్బు ఎలా వచ్చిందన్నది ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి.
సెక్షన్ 194N – నగదు ఉపసంహరణపై నిఘా (Section 194N and Cash Withdrawals)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం… ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటికి మించి నగదు విత్‌డ్రా చేస్తే 2% టీడీఎస్, ఐటీఆర్ ఫైల్ చేయని వారికి రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్, అదే రూ.1 కోటి దాటితే 5% టీడీఎస్.. అంటే కేవలం డిపాజిట్లే కాదు, భారీగా నగదు ఉపసంహరణలు చేసినా ఐటీ శాఖ దృష్టిలో పడతారు.
పరిమితి దాటితే, వివరణ ఇవ్వాల్సిందే.. Cross the Limit, Explanation Is Mandatory
సేవింగ్స్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ (Cash Deposits in Savings Account)చేయడం తప్పు కాదు. కానీ పరిమితి దాటితే, వివరణ ఇవ్వాల్సిందే. ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి నగదు జమ చేయకూడదు అన్న విషయం ప్రతి అకౌంట్ హోల్డర్ గుర్తుంచుకోవాలి. ఒకవేళ అవసరమైతే, ముందే ఆధారాలు సిద్ధం చేసుకోవాలి. డిజిటల్ యుగంలో “ఎవరికీ తెలియదు” అనుకోవడం పొరపాటు. సిస్టమ్ చూస్తోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే, నోటీసుల భయం ఉండదు.
