మీ ఆర్థిక సర్వే సిద్ధమేనా? బడ్జెట్‌కు ముందే పరిశీలించండి! Is Your Financial Survey Ready? Review It Before the Budget!
ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. దానికి ఒక రోజు ముందే ప్రభుత్వం ఆర్థిక సమీక్ష (ఎకనామిక్ సర్వే)ను విడుదల చేయడం ఆనవాయితీ. గత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచింది? ఏ రంగాలు వృద్ధి సాధించాయి? ఎక్కడ లోపాలు కనిపించాయి? అనే అంశాలను సమీక్షించుకున్న తర్వాతే… కొత్త ఏడాది ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దేశానికే ఇంత విస్తృతమైన ఆర్థిక సర్వే అవసరమైతే… మన ఇంటికీ అవసరం లేదా?…
