అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం వచ్చినప్పుడు చాలా మంది ముందుగా గుర్తుకు తెచ్చుకునేది గోల్డ్ లోన్. కారణం ఏమిటంటే… బంగారం భారతీయ కుటుంబాల్లో తరతరాలుగా నిల్వ ఉండే విలువైన ఆస్తి. అవసరమైతే తక్షణమే నగదుగా మార్చుకునే లిక్విడ్ అసెట్ ఇది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా బంగారాన్ని భద్రతగా భావించి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తాయి. అయితే, గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని కీలక నియమాలు, పరిమితులు, హక్కులు–బాధ్యతలను తప్పక తెలుసుకోవాలి.
గోల్డ్ లోన్ అంటే ఏమిటి? What Is a Gold Loan?
గోల్డ్ లోన్ అంటే—మీరు మీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లేదా నాణేలను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకి తనఖాగా ఉంచి, వాటి విలువ ఆధారంగా రుణం పొందడం. రుణ కాలవ్యవధి పూర్తయ్యాక లేదా ముందే లోన్ మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లిస్తే, మీ బంగారం తిరిగి మీకు అప్పగిస్తారు.
గోల్డ్ లోన్ ఎందుకు బెస్ట్ ఆప్షన్? Why Gold Loan Is a Preferred Option
తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రాసెసింగ్ వేగంగా పూర్తవుతుంది. ఆదాయ రుజువులు ఎక్కువగా అవసరం ఉండదు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నా అవకాశం. చిన్న కాలానికి కూడా లోన్ లభ్యమవుతుంది. ఈ కారణాల వల్లే వ్యక్తిగత రుణాల కంటే గోల్డ్ లోన్లు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.
ఏ బంగారానికి లోన్ వస్తుంది? Eligible Gold for Loan
గోల్డ్ లోన్ పొందాలంటే, బ్యాంకులు కొన్ని స్పష్టమైన నియమాలు పాటిస్తాయి. Reserve Bank of India (RBI) గైడ్‌లైన్స్ ప్రకారం.. బంగారు ఆభరణాలు (Gold Jewellery), బంగారు నాణేలు (Gold Coins) లోన్‌కు అర్హమైనవి. గోల్డ్ బార్లు, గోల్డ్ బిస్కట్లు, గోల్డ్ ETFలు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి RBI రూల్స్ ప్రకారం ప్రైమరీ గోల్డ్ (24 క్యారట్ బార్లు, బిస్కట్లు) తనఖాగా తీసుకోరాదు. అయితే, ఆభరణాలు, నాణేలు మాత్రం అర్హమే.
ఎంత బంగారం పెట్టవచ్చు? Maximum Gold You Can Pledge
ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో (125 సవర్లు) బంగారు ఆభరణాలు తనఖా పెట్టవచ్చు. బంగారు నాణేల విషయంలో గరిష్ట పరిమితి 50 గ్రాములు మాత్రమే.
బంగారం ధర ఎలా లెక్కిస్తారు? How Gold Value Is Calculated
బంగారం విలువ నిర్ణయించడంలో బ్యాంకులు చాలా కఠినమైన ప్రమాణాలు పాటిస్తాయి. ప్యూరిటీ (క్యారట్) ఆధారంగా విలువ గత 30 రోజుల సగటు క్లోజింగ్ ధర లేదా ముందురోజు క్లోజింగ్ ధర . వీటిలో తక్కువదాన్ని తీసుకుంటారు. ఆభరణాల్లో ఉన్న స్టోన్స్, జెమ్స్ విలువ లెక్కలోకి రాదు. అంటే, కేవలం బంగారం బరువు, ప్యూరిటీ మాత్రమే పరిగణనలోకి వస్తాయి.
లోన్ టు వాల్యూ (LTV) అంటే ఏమిటి? What Is Loan-to-Value (LTV)?
LTV అంటే—బంగారం విలువలో ఎంత శాతం వరకు లోన్ ఇస్తారన్నది. ఉదాహరణకు, బంగారం విలువ రూ. 10 లక్షలు అయితే, LTV 75% అంటే రూ. 7.5 లక్షల వరకు లోన్ వస్తుంది.
ప్రస్తుత LTV రేట్లు.. Current LTV Limits
RBI మార్గదర్శకాల ప్రకారం.. రూ. 2.5 లక్షల వరకు – 85% LTV. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు – 80% LTV. రూ. 5 లక్షల పైన – 75% LTV. చిన్న లోన్లకు ఎక్కువ శాతం రుణం అందించడం ద్వారా సాధారణ ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారు.
గరిష్ట లోన్ మొత్తం ఎంత? Maximum Loan Amount
బంగారం విలువ ఎక్కువగా ఉన్నా, చాలా బ్యాంకులు మాక్సిమం లోన్ అమౌంట్ క్యాప్ పెడతాయి. ఉదాహరణకు—State Bank of Indiaలో గోల్డ్ లోన్ గరిష్ట పరిమితి రూ. 50 లక్షలు. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర గ్రాముకు సుమారు రూ. 16,100–రూ. 16,178 మధ్య ఉంది. 75% LTVతో గ్రాముకు సుమారు రూ. 12,000 వరకు లోన్ రావచ్చు. అంటే 1 కిలో బంగారంతో గరిష్టంగా రూ. 1.2–1.3 కోట్లు విలువ ఉన్నా, బ్యాంక్ పరిమితి వరకే లోన్ లభిస్తుంది.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? Interest Rates on Gold Loans
బ్యాంక్‌ను బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులు – 7% నుంచి 10%, ప్రైవేట్ బ్యాంకులు – 9% నుంచి 14% చొప్పున వడ్డీ రేట్లు ఉంటాయి. NBFCలు వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. లోన్ కాలవ్యవధి, మొత్తాన్ని బట్టి వడ్డీ మారుతుంది.
రీపేమెంట్ ఆప్షన్లు.. Repayment Options
బ్యాంకులు పలు రీపేమెంట్ మార్గాలు అందిస్తాయి. EMI పద్ధతి. వడ్డీ మాత్రమే చెల్లించి చివర్లో ఒకేసారి మొత్తం చెల్లింపు (Bullet Payment). మీ ఆదాయ స్థితిని బట్టి సరైన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
బంగారం డ్యామేజ్ అయితే ఎవరి బాధ్యత? Who Is Responsible for Damage?
లోన్ కాలంలో బంగారం బ్యాంక్ కస్టడీలో ఉంటుంది. డ్యామేజ్ అయితే రిపేర్ ఖర్చు బ్యాంకే భరిస్తుంది. బరువు లేదా ప్యూరిటీ తేడా వస్తే సరైన పరిహారం ఇవ్వాలి. లాస్ జరిగితే బాధితుడికి లేదా వారసులకు నష్టపరిహారం తప్పనిసరి
లోన్ తీర్చాక బంగారం ఆలస్యంగా ఇస్తే? Penalty for Delay in Releasing Gold
లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా బంగారం విడుదల చేయకపోతే.. బ్యాంక్ ఆలస్యం చేస్తే రోజుకు రూ. 5,000 పరిహారం. ఆలస్యం కారణాలు రాతపూర్వకంగా తెలియజేయాలి. రీపేమెంట్ తర్వాత బంగారం తీసుకోని వారికి లెటర్, ఈమెయిల్, SMS ద్వారా రిమైండర్లు ఇవ్వాలి.
గుర్తుంచుకోవాల్సిన సూచనలు .. Key Tips Before Taking a Gold Loan
వడ్డీ రేట్లు పోల్చండి. ప్రాసెసింగ్ ఫీజులు తెలుసుకోండి. రీపేమెంట్ షరతులు చదవండి. బ్యాంక్ లేదా నమ్మకమైన సంస్థను ఎంచుకోండి. అవసరానికి మించి లోన్ తీసుకోకండి ఏదేమైనా గోల్డ్ లోన్ అత్యవసర సమయాల్లో నిజంగా బంగారు భరోసా. అయితే, నియమాలు, పరిమితులు, మీ హక్కులు–బాధ్యతలు పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే అది ప్రయోజనకరం. అవగాహనతో అడుగు వేస్తే, గోల్డ్ లోన్ మీ ఆర్థిక అవసరాలకు భద్రమైన పరిష్కారం అవుతుంది.
10 గ్రాముల బంగారంపై లభించేదిదే.. Gold Loan on 10 Grams: How Much Can You Get?
ముఖ్యంగా 10 గ్రాములు లేదా తులం బంగారంపై ఎంత లోన్ వస్తుందన్నది అందరిలోనూ ఉన్న సాధారణ సందేహం. అయితే మీరు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను బ్యాంకుకు తీసుకెళ్తే, ముందుగా అవి పూర్తిగా పరీక్షించబడతాయి. ఆభరణాల్లో ఉన్న రాళ్లు, పూసలు, ఇతర లోహాల బరువును తీసేస్తారు మిగిలిన స్వచ్ఛమైన పసిడి బరువు మాత్రమే లెక్కలోకి వస్తుంది. దాని ఆధారంగానే లోన్ మొత్తం నిర్ణయిస్తారు. అంటే, ఆభరణం మొత్తం బరువు కాదు… ప్యూర్ గోల్డ్ వెయిట్ మాత్రమే ముఖ్యం.
22 క్యారెట్ల తులం బంగారంపై లోన్ ఎంత? Loan Amount on 22 Carat Gold
ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (సుమారు 10 గ్రాములు) బంగారం ధర రూ. 1.4 లక్షలు అనుకుంటే.. 85% LTV (గరిష్ట పరిమితి) ప్రకారం
దాదాపు రూ. 1,19,000 వరకు లోన్ లభిస్తుంది . సాధారణంగా బ్యాంకులు ఇచ్చే 75% – 80% LTV ప్రకారం రూ. 1,05,000 నుంచి రూ. 1,12,000 వరకు రుణం పొందవచ్చు. నేటి మార్కెట్ ధరల హెచ్చుతగ్గులను బట్టి, తులం బంగారంపై రూ. 90,000 నుంచి రూ. 1,20,000 మధ్య లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్‌పై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 8.5% నుంచి 12% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు 9.5% నుంచి 18% వరకు వడ్డీ ఉండొచ్చు. ఒకవేళ మీరు రూ. 1 లక్ష గోల్డ్ లోన్ తీసుకుంటే 10% వడ్డీ రేటుతో ఒక సంవత్సరం కాలపరిమితికి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 8,792గా ఉంటుంది.
