Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations!

Posted on 24/12/2025 By admin No Comments on ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations!

డిజిటల్ విప్లవంలో భాగంగా, ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే ఇంటరోపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (ICCW) సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇది సౌకర్యాన్ని పెంచడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేస్తోంది. కానీ, ఈ సాంకేతిక ప్రక్రియలో అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఏటీఎంలో యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేస్తున్న స‌మ‌యంలో చాలామంది ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. కానీ ఏటీఎం నుండి డబ్బులు బయటకు రాలేదు. ఇటువంటి సంద‌ర్భాల‌లో ఖాతారులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయి. ఖాతాలో మీ డబ్బు కట్ అయినా, ఏటీఎం నుంచి నగదు రాలేదు అంటే ఖాతాదారులు వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. వెంటనే సంబంధిత‌ బ్యాంక్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. బ్యాంకు వెబ్‌సైట్‌లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అయితే అన్ని రసీదులు, స్టేట్‌మెంట్‌లు భద్రంగా ఉంచడం చాలా ముఖ్యం. దీని ద్వారా డబ్బు తిరిగి వచ్చేలా చూసుకోవచ్చు. సమస్యలు ఎదురుకాకుండా నివారించవచ్చు.

ఎలా ఫిర్యాదు  చేయాలంటే ..? How to Lodge a Complaint…?

– “డెబిట్ సక్సెస్, క్యాష్ నాట్ డిస్పెన్స్‌డ్” సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఎస్బీఐ కొన్ని కీలక సూచనలను చేసింది. తొలుత ఎస్బీఐ ఫిర్యాదుల నిర్వహణ వెబ్‌సైట్ crh.sbi.bank.in ను ఓపెన్ చేయాలి . మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. Raise Request/Complaint ఆప్షన్ ఎంచుకోవాలి. సమస్య ఎదురైన ఖాతా నంబర్ను సెలక్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ హిస్టరీలో సంబంధిత లావాదేవీని ఎంచుకుని, డ్రాప్‌డౌన్ మెనూలో UPI Merchant Transaction ఆప్షన్‌ను గుర్తించాలి. ఘటన జరిగిన తేదీ, సమయం, ఏటీఎం ఐడీ వంటి వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలి. ఈ విధంగా ఫిర్యాదు చేయడం ద్వారా బ్యాంక్ సమస్యను వెరిఫై చేసి, డబ్బు రికవరీ కోసం చర్యలు తీసుకుంటుంది.
– ఏటీఎం లేదా డిజిటల్ లావాదేవీలలో సమస్యలు ఎదురైనప్పుడు, ఎస్బీఐ తప్ప మరే ఇతర బ్యాంక్ ఖాతాదారులైనా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా బ్యాంక్ కస్టమర్ కేర్ సంప్రదించాలి. మొట్టమొదట మీరు లావాదేవీ జరిగిన బ్యాంక్ కస్టమర్ సర్వీస్ నంబర్ లేదా ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించాలి. చాలాబ్యాంకులు ఆన్‌లైన్ ఫిర్యాదు సదుపాయం ఇస్తాయి. “Raise Complaint” లేదా “Customer Support” ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత సంబంధిత వివరాలు అందించాలి. ఖాతా నంబర్, ట్రాన్సాక్షన్ ఐడి, తేదీ, సమయం, ఏటీఎం లేదా యూపీఐ వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్, రసీదులు, లావాదేవీ స్క్రీన్‌షాట్లు వంటివి ఫిర్యాదుతో జత చేయడం మేలు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత బ్యాంక్ ఇచ్చే ట్రాకింగ్ నంబర్ భద్రంగా ఉంచండి. తద్వారా పరిష్కారం చెక్ చేయవచ్చు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంక్‌తో సమన్వయం కొనసాగించాలి. ఏటీఎం, యూపీఐ లేదా ఇతర డిజిటల్ లావాదేవీ సమస్యలలో, ముందుగా బ్యాంక్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేయడం, అన్ని వివరాలను స‌రైన‌న విధంగా ఇవ్వడం, ట్రాకింగ్ నంబర్ భద్రపరచడం అత్యంత ముఖ్యము. ఈ పద్ధతిలో మాత్రమే డబ్బు రికవరీ త్వరగా సాధ్యమవుతుంది.

గ‌డువు లోగా బ్యాంకులు చెల్లించ‌కుంటే.. If Banks Don’t Credit Within the Prescribed Time…

ఏటీఎం లేదా యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయిన సందర్భాల్లో కస్టమర్లు అనవసర కష్టాల్లో పడవద్దు. ఫిర్యాదు రిజిస్టర్ అయిన తర్వాత, బ్యాంక్ ప్రత్యేక ఫిర్యాదు నంబర్‌ను ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అందిస్తుంది. RBI నిబంధనల ప్రకారం, ఫెయిల్ అయిన ఏటీఎం లావాదేవీలు సాధారణంగా 5 పనిదినాల్లోపు ఖాతాలో తిరిగి జమ చేయాలి. బ్యాంక్ ఈ గడువు లోపు నగదు జమ చేయకపోతే, ఆ రోజు నుండి రోజుకు ₹100 చొప్పున వినియోగదారుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖాతాదారులు సాక్ష్యాలు భద్రపరుచుకోవడం ఎందుకు ముఖ్యం. “Transaction Failed” స్క్రీన్‌ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి. డెబిట్ అయినట్లు వచ్చిన SMS లేదా నోటిఫికేషన్‌ను భద్రపరచాలి. ఈ పత్రాలు భవిష్యత్తులో సమస్యలను నిరూపించడానికి, అలాగే పరిహారం పొందడానికి ఉపయోగపడతాయి.

అప్రమత్తంగా ఉండాలి… Stay Alert

డిజిటల్ విప్లవం వల్ల బ్యాంకింగ్ సేవ‌లు సులభతరం అయినప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కస్టమర్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఖాతాదారులు నిరంత‌రం అప్ర‌మత్తంగా ఉండాలి. ప్ర‌ధానంగా ఏటీఎం నుంచి న‌గ‌దు డ్రా చేసేట‌ప్పుడు ఖాతాదారులు త‌మ‌ ట్రాన్సాక్షన్ పూర్తయినట్లు ధృవీకరించుకోవాలి. ఏటీఎం స్క్రీన్ లేదా రసీదు చూసి, “Transaction Successful” అని కన్పిస్తోందో లేదో చూడాలి. స్క్రీన్‌షాట్ తీసుకోవడం, SMS/మెసేజ్ భద్రపరచడం మేలు. ఆ త‌ర్వాత‌ ఏటీఎం కస్టమర్ కేర్ లేదా టోల్-ఫ్రీ నంబర్‌కు వెంటనే కాల్ చేయాలి. బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. “Raise Complaint” లేదా “Customer Support” ఆప్షన్ ద్వారా లావాదేవీ వివరాలు ఇవ్వాలి. ట్రాకింగ్ నంబర్ సేఫ్‌గా ఉంచాలి. ఫిర్యాదు నమోదైన తర్వాత బ్యాంక్ ఇస్తున్న ట్రాకింగ్ నంబర్ భద్రంగా ఉంచడం వల్ల సమస్య పరిష్కారం వేగంగా ట్రాక్ చేయవచ్చు.సమస్య పరిష్కారం కోసం ఫాలో-అప్ చేయాలి. బ్యాంక్ నుండి డబ్బు రికవరీ అయ్యే వరకు సమన్వయం పాటించాలి. బ్యాంక్ టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేకపోతే, బ్యాంక్ సిబ్బందికి సమస్యను తెలియజేయాలి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం హక్కులు వినియోగించుకోవాలి. కస్టమర్లు తమ హక్కులను ఉపయోగించుకుని, డబ్బు రికవరీ కోసం చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేస్తే, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం సులభం అవుతుంది.

ఏటీఎం నుంచి నెలలో ఎన్నిసార్లు ఉచితంగా నగదు డ్రా చేయొచ్చు?

How Many Times Can You Withdraw Cash from an ATM for Free in a Month?

ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయడం ఇప్పుడు చాలా సాధారణం. అయితే, నెలలో ఎన్ని సార్లు ఉచితంగా డబ్బు తీసుకోవచ్చు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంలో ఆర్బీఐ స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు ఉచితంగా నగదు డ్రా చేయవచ్చు. ఇందులో నగదు విత్‌డ్రాలు మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి లావాదేవీలూ లెక్కలోకి వస్తాయి.ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి అయితే మెట్రో నగరాల్లో (దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌) నెలకు 3 ఉచిత లావాదేవీలు, నాన్‌-మెట్రో ప్రాంతాల్లో అయితే నెలకు 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఈ ఉచిత లావాదేవీల్లో నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ వంటి అన్ని రకాల ట్రాన్సాక్షన్లు చేరతాయి.ఉచిత లావాదేవీల సంఖ్య దాటిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు బ్యాంకులు గరిష్టంగా రూ.21 వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. దీనికి జీఎస్టీ అదనంగా వర్తించవచ్చు.

ఖాతాదారులు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే? What Should Account Holders Keep in Mind?

నెల ప్రారంభంలోనే ఎన్ని ఉచిత ట్రాన్సాక్షన్లు మిగిలాయో తెలుసుకోవాలి. అవసరం లేని బ్యాలెన్స్ ఎంక్వైరీలను తగ్గించుకోవాలి. ఒకేసారి అవసరమైన మొత్తం తీసుకుంటే చార్జీలు తగ్గుతాయి. ఏటీఎం నుంచి నెలలో పరిమిత సంఖ్యలోనే ఉచితంగా నగదు డ్రా చేయొచ్చు. ఆర్బీఐ నిబంధనలను తెలుసుకొని ప్లాన్ చేసుకుంటే.. అనవసర ఏటీఎం చార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

 

225
FEATURE NEWS Tags:How Many Times Can You Withdraw Cash from an ATM for Free in a Month?, How to Lodge a Complaint…?, If Banks Don’t Credit Within the Prescribed Time…, Stay Alert, What Should Account Holders Keep in Mind?

Post navigation

Previous Post: భార్యకు భారీగా న‌గదు గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ నిబంధనలు తప్పనిసరి! Are You Gifting a Large Amount of Cash to Your Wife? These ITR Filing Rules Are Mandatory!
Next Post: ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies

Related Posts

  • దీర్ఘకాల కన్‌సాలిడేషన్ తర్వాత బ్రేకౌట్ ఇచ్చిన స్టాక్స్ ఇవే.. FEATURE NEWS
  • చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge FEATURE NEWS
  • మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు తెలుసుకుందామా! Mobile vs Internet Banking: Know the Key Services FEATURE NEWS
  • అక్టోబరులో 102 ఒప్పందాలు … రూ.47,000 కోట్ల పెట్టుబడులు! 102 Deals, ₹47,000 Crore Investments FEATURE NEWS
  • క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించండి.. ఆర్థిక సమస్యలను ముందుగానే గుర్తించండి.. Check Your Credit Report… Identify Financial Problems Early FEATURE NEWS
  • ‘వార్‌’ నష్టాలకు బ్రేక్‌.. ఊపందుకున్న‌సూచీలు.. War Shock Slows, Markets Find Footing FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • కొత్త ఆర్థిక సంవత్సరం.. మధ్యతరగతి ముందున్న కొత్త సవాళ్లు.. New Financial Year.. New Challenges for the Middle Class FEATURE NEWS
  • ఒక్క‌సారిగా పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు ..భార‌త్‌పై భార‌మెంతో తెలుసా? How Much Will the Sudden Spike in Crude Oil Prices Cost India? FEATURE NEWS
  • ఏ స్టాక్ అయినా వంద రూపాయ‌లే how to get any stock at hundred rupees NEWS
  • ట్రంప్‌ సుంకాల వేళ … భారత్‌ వైపు చూస్తున్న ఐటీ దిగ్గ‌జ‌ కంపెనీలు.. IT Giants Turn to India Amid Trump’s Tariff Pressure FEATURE NEWS
  • రెండు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? క్లెయిమ్‌లో చిన్న తప్పు చేస్తే భారీ నష్టమే!  Have Two Health Insurance Policies? One Mistake Can Cost You Big!  INSURANCE
  • UPI చెల్లింపుల సౌలభ్యం – తెలియకుండానే పెరుగుతున్న ఖర్చులు.. UPI Payments and Hidden Spending.. How Convenience Is Changing Personal Finance FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme