Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? Does Taking a Car Loan Reduce Your Credit Score?

Posted on 14/12/2025 By admin No Comments on కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? Does Taking a Car Loan Reduce Your Credit Score?

దేశవ్యాప్తంగా కార్లు, బైక్‌ల అమ్మకాలు ఊపందుకున్నాయి. జీఎస్టీ రేట్లలో మార్పులు, ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్లు కలిసి ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. షోరూమ్‌లకు వెళ్లితే ‘డెలివరీ వెయిటింగ్’ అన్న మాట వినిపిస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసే ముందు చాలా మందిలో ఒక సందేహం వెంటాడుతోంది. లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా ముందడుగు వేయలేకపోతున్నారు. కొత్త కారు కొనాలంటే చాలా మంది బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తారు. కానీ కార్ లోన్ (Car Loan) తీసుకునే ముందు చాలామందిని వెంటాడే ప్రశ్న ఒక్కటే .. “కార్ లోన్ (Car Loan) తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా?” అని . ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోకపోతే అనవసరమైన భయాలతో మంచి ఆర్థిక నిర్ణయాలు వాయిదా వేసుకునే పరిస్థితి వస్తుంది. నిజానికి కార్ లోన్(Car Loan) క్రెడిట్ స్కోర్‌ను తగ్గించడమా? లేక సరిగ్గా వాడితే పెంచుతుందా? అన్నదానిపై స్పష్టత అవసరం.

క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? What Is a Credit Score?

క్రెడిట్ స్కోర్ అంటే ఒక వ్యక్తి రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యానికి సూచిక. ఇది సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా స్కోర్ ఉంటే మంచి స్కోర్ గా భావిస్తారు. 650–749 మ‌ధ్య ఉంటే సగటు స్కోర్‌గా నిర్ణ‌యిస్తారు. 650 కంటే తక్కువ గా స్కోర్ ఉంటే బలహీనమైన స్కోర్ గా గుర్తిస్తారు. బ్యాంకులు, NBFCలు ఈ స్కోర్ ఆధారంగానే లోన్ ఇవ్వాలా? ఎంత వడ్డీకి ఇవ్వాలా? అన్నది నిర్ణయిస్తాయి.

కార్ లోన్ కూడా క్రెడిట్ స్కోర్‌లో భాగమే.. Car Loan Is Part of Your Credit History

కార్ లోన్ (Car Loan) అనేది ఒక సెక్యూర్డ్ లోన్. అంటే మీరు తీసుకునే రుణానికి కారు గ్యారంటీగా ఉంటుంది. లోన్ మొత్తం, EMIలు చెల్లింపు చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల (CIBIL, Experian, Equifax) వద్ద నమోదువుతాయి. కాబట్టి కార్ లోన్ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపడం సహజం.

కార్ లోన్ తీసుకున్న వెంటనే స్కోర్ ఎందుకు పడిపోతుంది? Why Credit Score May Dip Initially

కార్ లోన్ (Car Loan) అప్రూవ్ అయిన వెంటనే క్రెడిట్ స్కోర్ కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. దీనికి కారణాలు ఉన్నాయి. లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంక్ మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తుంది. దీనిని హార్డ్ ఇన్‌క్వైరీ (Hard Inquiry Effect) అంటారు. ఒక్క హార్డ్ ఇన్‌క్వైరీ తో స్వల్ప ప్రభావం ఉంటుంది. చాలా ఇన్‌క్వైరీలు చేస్తే స్కోర్ తగ్గే అవకాశం ఉంది. మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కొత్త లోన్ చేరినప్పుడు, మీ మొత్తం అప్పులు పెరిగినట్టు బ్యూరో భావిస్తుంది. అందుకే తాత్కాలికంగా స్కోర్ తగ్గవచ్చు. ఒక్క బ్యాంక్‌కి అప్లై చేస్తే 5 నుంచి 10 పాయింట్లు. ఎక్కువ బ్యాంకుల్లో అప్లై చేస్తే – 10 నుంచి 20 పాయింట్ల వరకు క్రెడిట్ స్కోరు తాత్కాలికంగా తగ్గుతుంది. ఇది శాశ్వతం కాదు.

ఇది శాశ్వతంగా పడిపోతుందా? Is the Drop Permanent?

ప్ర‌స్తుత‌ రోజుల్లో క్రెడిట్ స్కోరు అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ‘పాస్‌పోర్ట్’ లాంటిది. హోమ్ లోన్ కావాలన్నా, కార్ లోన్ (Car Loan) కావాలన్నా, క్రెడిట్ కార్డ్ కావాలన్నా – క్రెడిట్ స్కోరు కీలకం. అందుకే వాహన రుణం తీసుకుంటే స్కోరు పడిపోతుందేమోనన్న భయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆర్థిక నిపుణులు చెప్పేది ఒక్కటే.. లోన్ కాదు సమస్య… లోన్‌ను ఎలా వాడుతున్నారన్నదే అసలు విషయం. అసలు ముఖ్యమైన విషయం ఇదే. కార్ లోన్ తీసుకున్నందుకే క్రెడిట్ స్కోర్ శాశ్వతంగా పడిపోదు. ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే. మీరు సరిగా EMIలు చెల్లిస్తే స్కోర్ మళ్లీ పెరుగుతుంది. కొద్ది నెలల్లోనే పడిపోయిన స్కోర్ తిరిగి రికవర్ అవుతుంది.

కార్ లోన్ క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచుతుంది? How a Car Loan Can Improve Your Credit Score

సరైన విధంగా వాడితే కార్ లోన్ (Car Loan) మీ క్రెడిట్ స్కోర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. టైమ్‌కు EMI చెల్లింపులు చేయాలి. ప్రతి నెల EMIని సమయానికి చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలపడుతుంది. రీపేమెంట్ డిసిప్లిన్ కనిపిస్తుంది. స్కోర్ క్రమంగా పెరుగుతుంది.

క్రెడిట్ మిక్స్ మెరుగుదల Better Credit Mix

కేవలం క్రెడిట్ కార్డులు మాత్రమే ఉంటే బ్యాంకులు కొంచెం జాగ్రత్తగా చూస్తాయి. కార్ లోన్ (Car Loan)లాంటి సెక్యూర్డ్ లోన్ ఉంటే క్రెడిట్ మిక్స్ మెరుగవుతుంది. స్కోర్‌కు పాజిటివ్ ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక క్రెడిట్ హిస్టరీ (Long-Term Credit History)ని కూడా బ్యాంకులు చూస్తాయి. 3–5 సంవత్సరాల పాటు సక్రమంగా లోన్ చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా తయారవుతుంది. ఇది భవిష్యత్తులో హోమ్ లోన్, బిజినెస్ లోన్ తీసుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది.

EMI మిస్ అయితే ఏమవుతుంది? What If You Miss an EMI?

ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. ఒక్క EMI మిస్ అయితే క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోతుంది. బ్యాంక్ రిపోర్ట్‌లో నెగెటివ్ మార్క్ పడుతుంది. భవిష్యత్తు లోన్లకు అడ్డంకి అవుతుంది. అందుకే EMIలను ఆటో డెబిట్ పెట్టుకోవడం మంచిది.

ముందుగానే కార్ లోన్ క్లోజ్ చేస్తే స్కోర్? Does Foreclosure Affect Credit Score?

కొంతమంది కార్ లోన్‌ (Car Loan)ను ముందే పూర్తిగా చెల్లించేస్తారు. ఇది మంచి ఆర్థిక అలవాటే అయినా.. చాలా తొందరగా లోన్‌ క్లోజ్ చేస్తే లోన్ హిస్టరీ చిన్నదిగా మిగిలిపోతుంది. దీంతో క్రెడిట్ స్కోర్‌కు పెద్దగా లాభం ఉండకపోవచ్చు. అయితే ఇది నెగెటివ్ కూడా కాదు.

ఒకేసారి చాలా లోన్లు తీసుకుంటే? Multiple Loans at the Same Time

కారు కొనేటప్పుడు.. కార్ లోన్ (Car Loan), పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ అన్నీ ఒకేసారి తీసుకుంటే బ్యాంక్‌కు రిస్క్‌గా కనిపిస్తుంది. దీని వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. లోన్ అప్రూవల్ కష్టమవుతుంది.

కార్ లోన్ (Car Loan) తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు .. Precautions Before Taking a Car Loan

మీ క్రెడిట్ స్కోర్ ముందే చెక్ చేసుకోవాలి. అవసరమైనంత మాత్రమే లోన్ తీసుకోవాలి. EMI మీ నెలవారీ ఆదాయంలో 30–40% మించకూడదు. అనవసరంగా అనేక బ్యాంక్‌లకు అప్లై చేయవద్దు. లోన్ అగ్రిమెంట్ జాగ్రత్తగా చదవాలి.

తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లు కార్ లోన్ తీసుకోవచ్చా? Can Low Credit Score Borrowers Get Car Loans?

తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లు కార్ లోన్ (Car Loan) తీసుకోవచ్చు. కానీ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. డౌన్ పేమెంట్ ఎక్కువ అడుగుతారు. కొన్ని బ్యాంకులు అయితే లోన్ ద‌ర‌ఖాస్తును తిరస్కరిస్తాయి. అయితే NBFCలు కొంత సడలింపు ఇస్తాయి.

కార్ లోన్ vs పర్సనల్ లోన్ Car Loan vs Personal Loan Impact
కార్ లోన్ (Car Loan)– సెక్యూర్డ్ లోన్, పర్సనల్ లోన్ – అన్‌సెక్యూర్డ్ లోన్. కార్ లోన్ వల్ల స్కోర్‌పై ప్రభావం తక్కువ రిస్క్. పర్సనల్ లోన్ వల్ల ప్రభావం ఎక్కువ రిస్క్ ఉంటుంది. కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందన్నది పూర్తిగా నిజం కాదు. తాత్కాలికంగా స్వల్పంగా తగ్గినా, సక్రమంగా EMIలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. భవిష్యత్తులో పెద్ద లోన్లు సులభంగా లభిస్తాయి. ఆర్థిక విశ్వసనీయత పెరుగుతుంది. అసలు విషయం లోన్ కాదు… మీ చెల్లింపు క్రమశిక్షణే ఇక్క‌డ కీల‌కం. కార్ లోన్ అనేది భారం కాదు. సరిగా వాడితే అది మీ క్రెడిట్ జీవితానికి బలమైన మెట్టు. కారు కొనాలనే కలను నెరవేర్చుకుంటూనే, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు దారి వేయాలంటే సమయానికి EMIలు చెల్లించాలి.

 

204
FINICAL PLANNING Tags:Better Credit Mix, Can Low Credit Score Borrowers Get Car Loans?, Car Loan Is Part of Your Credit History, Car Loan vs Personal Loan Impact, Does Foreclosure Affect Credit Score?, How a Car Loan Can Improve Your Credit Score, Is the Drop Permanent?, Multiple Loans at the Same Time, Precautions Before Taking a Car Loan, What If You Miss an EMI?, What Is a Credit Score?, Why Credit Score May Dip Initially

Post navigation

Previous Post: వెండి ధర పైపైకి.. కిలో రూ.2ల‌క్ష‌లు .. Silver Prices Soar: One Kilogram Crosses ₹2 Lakh
Next Post: 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector?

Related Posts

  • Tips to Clear your loans early రుణాలు త్వరగా తీర్చేందుకు చిట్కాలు FEATURE NEWS
  • రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి.. FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
  • కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents FEATURE NEWS
  • బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips! FINICAL PLANNING
  • ప్రతీ ఒక్కరికీ 3 Portfolios ఎందుకుండాలి? Stock ఎప్పుడు అమ్మేయాలి? 3 ‘L’s సూత్రమేంటి? Why Should Everyone Have 3 Portfolios? When Should You Sell a Stock? What is the 3 ‘L’s Principle? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth FEATURE NEWS
  • తక్కువ ఈఎంఐ మాయలో పడొద్దు: పర్సనల్ లోన్ తీసుకునే ముందు అసలు నిజాలు తెలుసుకోండి … Don’t Fall for Low EMI Traps.. Know the Real Cost of Personal Loans FEATURE NEWS
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government FEATURE NEWS
  • రాజకీయ విరాళాలపై కొత్త ఐటీఆర్ నిబంధనలు: పారదర్శకత దిశ‌గా అడుగులు … New ITR Rules on Political Donations.. A Push for Transparency FEATURE NEWS
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో కొత్త మలుపు… A New Turn in Gold ETFs FEATURE NEWS
  • సేవింగ్స్ అకౌంట్‌లో దాగి ఉన్న అవకాశాలు… కేవలం డబ్బు దాచుకోవడానికే కాదు! Hidden Benefits of a Savings Account… More Than Just Saving Money! Uncategorized
  • HOW TO BUY A LOAN FREE HOME లోన్ తీసుకోకుండా ఇంటిని కొనుగోలు చేయ‌డం ఎలా FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme