మన ఆర్థిక అవసరాల్ని తీర్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అనుగుణంగా పలు బ్యాంకులు, చిట్‌ఫండ్ కంపెనీలు మనకు లోన్లు అందిస్తుంటాయి. కాగా ఇదే సమయంలో చాలా మంది హోమ్‌లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్ల భారంతో బాధపడుతున్నారు. రుణ భారం వల్ల మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడడమే కాకుండా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీభారం పెరగకుండానే రుణాలను త్వరగా తీర్చడానికి కొన్ని ప్రాథమిక చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉంది.
ఖర్చులను అర్థం చేసుకోండి
Understand the expenses
ఈ రోజుల్లో ఎంత సంపాదించినా పెద్దగా ఏమీ మిగలట్లేదు. అందుకే చాలా మంది ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం పడితే అప్పు చేస్తుంటారు. అయితే తీసుకున్న రుణాన్ని త్వరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. లోన్లు త్వరగా తీర్చాలంటే ముందు ఖర్చుల్ని అర్థం చేసుకోవాలి. వాటిని ఎక్కడ తగ్గించాలో కూడా తెలుసుకోవాలి. నెలవారీ ఖర్చులు సహా ఏడాదికి ఒకసారి చేసే ఖర్చుల్ని కూడా ఇందులో చేర్చాలి. ఇంకా ఎప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డు బిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వచ్చే ఆదాయం సహా అద్దె లేదా హోం లోన్ ఇన్స్టాల్మెంట్స్, వెహికిల్ emi, కిరాణా, కరెంట్ బిల్స్ ఖర్చులతో పాటు ఇతర అత్యవసర ఖర్చుల్ని లెక్కలు రాసుకుంటూ ఉండాలి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్‌ను ముందుగానే తీర్చి ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
పెట్టుబడులు పెట్టడం ముఖ్యం
Investing is Important
ఖర్చులు, లోన్ వాయిదాలు చెల్లించడం మాత్రమే కాదు పెట్టుబడి పెట్టడం కూడా ముఖ్యం. ఆదాయంలో కనీసం 10 నుంచి 15 శాతం అయినా పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి శాతం పెంచుకుంటూ పోవాలి. ఆర్థిక ప్రణాళిక ప్రారంభంలోనే మనం ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ లోన్స్ తీర్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమర్జెన్సీ ఫండ్ ముట్టుకోకపోవడమే ఉత్తమం. ఈ ఫండ్ ని కూడా కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. దీనిని అత్యవసర సమయంలో తిరిగి పొందేలా ఉంచుకోవాలి.
అదనపు చెల్లింపులు చేయండి
Make Additional Payments
ప్రతి నెల EMIతో పాటు చిన్న మొత్తంలో అయినా అదనంగా చెల్లించండి. ఇది మీ మొత్తం లోన్‌పై ప్రధాన మొత్తాన్ని తగ్గించి, వడ్డీభారాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే ప్రత్యేక బోనస్ వంటి వాటితో లోన్స్ చెల్లించేందుకు మొగ్గు చూపాలి.
ఏడాదికి ఒక్కసారైనా పెద్దమొత్తంలో చెల్లించాలి
Make a Lump Sum Payment at Least Once a Year
బోనస్, లాభాలు వచ్చినప్పుడు పెద్ద మొత్తాన్ని రుణం తీర్చడానికి వినియోగించండి. ఇది లోన్ టెన్యూర్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మళ్లీ రుణ నిర్మాణాన్ని పునఃపరిశీలించండి
Re-evaluate Your Loan Structure
వడ్డీరేట్లు తగ్గినప్పుడు బ్యాంక్‌ను సంప్రదించి, రివైజ్ చేయించుకోండి. ఇతర బ్యాంకుకు షిఫ్ట్ అయ్యే అవకాశం పరిశీలించండి(బ్యాంక్‌ల మధ్య బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్).
అనవసర ఖర్చులను తగ్గించండి
Cut Down Unnecessary Expenses
ఖర్చులను కట్‌చేసి ఆ మొత్తాన్ని EMIగా మారిస్తే త్వరగా రుణం తీర్చేయవచ్చు. ఆటో డెబిట్ ఏర్పాటు చేసుకోండి. ఈ విధానం ద్వారా చెల్లింపులు మర్చిపోకుండా ఉండి, పెనాల్టీలు పడకుండా సమయానికి చెల్లించవచ్చు. వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, క్రెడిట్ కార్డు బిల్స్, బయట తీసుకున్న లోన్లు అన్నీ ఒకే చోట లిస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కో లోన్‌కు ఎంత చెల్లిస్తున్నారు.. దేనికి వడ్డీ ఎంత? అన్న దానిపై పూర్తి అవగాహన ఉండాలి. దీని వల్ల సంపాదించే దాంట్లో వడ్డీగా ఎంత కడుతున్నారో తెలుస్తుంది. హోం లోన్ లేదా రెంట్, కిరాణా సరకులకు ఖర్చులు, మొబైల్ బిల్స్, కరెంట్ బిల్స్ వంటి వాటికి డబ్బు కేటాయించాక.. మిగిలిన సంపాదన లోన్ వాయిదాల్ని చెల్లించేందుకు వినియోగించాలి. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న లోన్స్ తీర్చేయడంపై ముందుగా దృష్టి సారించాలి. ముందుగా వీటిల్లో క్రెడిట్ కార్డు లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోం లోన్ ఇలా ప్రాధాన్యాలుగా పెట్టుకోవాలి.
ఎక్కువ మొత్తంలో EMI చెల్లించండి
Opt for Higher EMIs
మీ ఆదాయ స్థాయికి తగ్గట్టు తగినంత ఎక్కువ EMIలు ఎంచుకుంటే టెన్యూర్ తగ్గి, వడ్డీ భారం తక్కువ అవుతుంది. అందుకే లోన్ తీసుకునే సమయంలోనే మనం ఎంత మొత్తంలో చెల్లించగలమో, ఎంత కాలం చెల్లించగలమో అంచనా వేసుకోవాలి. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువ అమౌంట్‌ను EMI గా చెల్లించేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
ద్వితీయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి
Focus on Secondary Income Sources
ఫ్రీలాన్సింగ్, అద్దె ఆదాయం, చిన్నపాటి వ్యాపారాలు మొదలైనవి ఆదాయాన్ని పెంచి, రుణాన్ని త్వరగా చెల్లించేందుకు అవకాశాలను పెంచుతాయి. మన ఉద్యోగంతో పాటే రెండో ఆదాయం వచ్చే చిన్న చిన్న పనులపై దృష్టి పెట్టండి. సెలవు రోజుల్లో, ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించడం సాధ్యమవుతుంది. ఇంటిలోనే ఉండి చేసుకోగలిగే అనేక రకాల పనుల్లో మనకు అనువైనవి, అవగాహన ఉన్నవి మనం ఎంపిక చేసుకోవాలి. నిపుణులతో మాట్లాడాలి. సెమినార్లు, వెబినార్ల కు హాజరుకావడం కొంత వరకు ఉపయోగపడవచ్చు. ఈ రకంగా సరైన మార్గాలను వెతికి అధిక ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
ఆదాయ, వ్యయాలపై అవగాహన
Awareness of Income and Expenses
ఆదాయం, వ్యయాల గురించి అవగాహన వచ్చాక.. లోన్ త్వరగా ఎలా తీర్చాలి అనే దాని గురించి కూడా ఆలోచించాలి. మామూలుగా అయితే ఖర్చులు నెలవారీగా మారుతాయి. కానీ ఆదాయంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అనవసర ఖర్చుల్ని కచ్చితంగా ఆపాలి. వీటిని తగ్గించడం వల్ల రొటీన్ లైఫ్స్టైల్లో పెద్దగా మార్పు ఉండదు. ఈ ఖర్చుల్ని కనీసం 60 శాతం వరకైనా తగ్గించాల్సిందే.
