2024 Income TAX saving TipS 2024 ఆదాయపు పన్ను ఆదా చిట్కాలు

మనం సంపాదించే ఆదాయం ఆధారంగా ప్రభుత్వానికి ఇన్​కం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే సరైన ఆర్థిక వ్యూహాన్ని పాటించడం ద్వారా మనం ఈ ఆదాయ పన్ను భారాన్ని కొంత మేరకు తగ్గించుకోవచ్చు. పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు ఆయా వ్యక్తుల దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. ఈ విషయం ఆలోచించకుండా పన్ను ఆదా పథకాల్లో మదుపు చేస్తే కొద్ది మొత్తంలో పన్ను ఆదా అయినా, రాబడులు పెద్దగా ఉండవు. మార్కెట్‌ అనుకూలించక పోతే ఈఎల్ఎస్ ఎస్‌, యులిప్స్‌ వంటి పన్ను ఆదా పథకాల్లో అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
పన్ను ప్లానింగ్‌ ఇంకా పూర్తి చేయని వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు పన్ను తగ్గించుకునేందుకు చివరి క్షణం చర్యలకు పరుగులు తీస్తారు. ఏ పథకంలో మదుపు చేస్తే అధిక లాభం పొందగలమా అని ఆదుర్దా పడుతుంటారు. ఇది డిస్ట్రిబ్యూటర్లు, బ్రోకర్లకు పండగ. మా పథకం మంచిదంటే మాదంటూ వెంటపడుతుంటారు. పన్ను చెల్లింపుదారులు కూడా పన్ను భారం తగ్గించుకోవడమే ముఖ్యంగా భావించి ఏదో ఒక పథకంలో మదుపు చేస్తుంటారు. తీరా చూస్తే వాటిలో రాబడి అంతంత మాత్రంగానే ఉన్నా, పెట్టుబడి మాత్రం ఖరీదుగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా తమ పన్ను ఆదా పెట్టుబడులు పూర్తి చేయని ఐటీ చెల్లింపుదారులు జాగ్రత్తలు పాటించడం మంచిది.

పరిమితి కంటే తక్కువ పెట్టుబడులు
Investments below limit
పాత ఆదాయ పన్ను పథకాన్ని వినియోగించుకునే ఐటీ చెల్లింపుదారులు పన్ను ఆదా కోసం సెక్షన్‌ 80సీ కింద చేసే పెట్టుబడుల్లో రూ.1.5 లక్షల వరకు, సెక్షన్‌ 80 సీసీడీ (1బీ) కింద ఎన్‌పీఎస్‌లో మదుపు చేస్తే మరో రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ఇవి కాకుండా తన కోసం, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లిం చే ప్రీమియం, గృహ, విద్యా రుణాలపై చెల్లించే వడ్డీకి కూడా ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసే వారిలో చాలా మందికి ఈ విషయాలు తెలియవు. దాంతో తమ ఆదాయ పరిమితి మినహాయింపు పరిమితి కంటే తక్కువ పెట్టుబడులను క్లెయిమ్‌ చేస్తుంటారు. చక్కటి ప్లానింగ్‌తో ఈ పరిమితిని ఉపయోగించుకుంటే పన్ను ఆదాతో పాటు, పెట్టుబడులపై మంచి రాబడులూ పొందే అవకాశం ఉంటుంది. మరి కొంత మంది వివిధ‌ సెక్షన్ల కింద లభించే మినహాయింపులపై అవగాహన లేక తమ పరిమితికి మించి పెట్టుబడులు పెడుతుంటారు. దీని వల్ల పెట్టుబడులు ఆయా పథకాలను బట్టి మూడు నుంచి ఐదేళ్ల పాటు లాక్‌ అయిపోతాయి.

ప్రణాళికా రహిత పెట్టుబడులు
Unplanned investments
ఆర్థిక ప్రణాళికకు మరో పేరే టాక్స్‌ ప్లానింగ్‌. ఐటీ చెల్లింపుదారులు, ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా పథకాల మంచి చెడులను కూలంకషంగా తెలుసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా ఎన్‌పీఎస్‌, సెక్షన్‌ 80 సీ పెట్టుబడి పథకాలు ఎంచుకోవాలి. ఈక్విటీ మార్కెట్‌ ఆటుపోట్లకు సిద్ధమైతే ఈఎల్ ఎస్ ఎస్‌ పథకాలు, రిటైర్మెంట్‌ కోసమైతే ఎన్‌పీఎస్‌ పథకాలు ఎంచుకోవాలి. ఏ మాత్రం నష్ట భయాన్ని తట్టుకోలేకపోతే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను ఎంచుకోవాలి. ఏదేమైనా టాక్స్‌ ప్లానింగ్‌ ఆయా వ్యక్తుల దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి.

హడావిడి వద్దు.. Don’t rush
బ్యాంక్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ లేదా బీమా ఏజెంట్లతో ఎంత పరిచయం ఉన్నా, తొందరపడి పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు కమిట్‌ కావద్దు. దీర్ఘకాలిక ఆలోచనతోనే జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. పాలసీ గడువు కంటే ముందే పాలసీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్దంలో నష్టపోవాల్సి ఉంటుంది. మనకు ఎంత కవరేజీ కావాలి, పాలసీ గడువు ముగిసే వరకు ప్రీమియం చెల్లించగలమా, లేదా పాలసీపై వచ్చే 5-6 శాతం రాబడులపై తృప్తి పడగలమా అనే విషయాలన్నీ ఆలోచించుకున్న తర్వాతే జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. టాక్స్‌ ప్లానింగ్‌ కోసం యులిప్స్‌లో మదుపు చేస్తున్నా, వాటిపై రాబడులు మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు.

నష్ట భయం ఉండే పెట్టుబడులు
Investments with fear of loss
ఈక్విటీ మార్కెట్లు జోరు మీద ఉండడంతో ఈఎల్ ఎస్‌ఎస్‌ పథకాలు గత ఏడాది సగటున 37.4 శాతం, గత మూడేళ్లలో సగటున 18.1 శాతం రాబడులు పంచాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెక్షన్‌ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల ఆదాయ మినహాయింపునకు ఉన్న మొత్తాన్ని ఈఎల్‌ఎ్‌సఎస్‌ పథకాల్లో మదుపు చేయవద్దు. ఎందుకంటే స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే హీటెక్కి ఉంది. స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో సూచీలూ దిద్దుబాటుకు లోనవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈఎల్ ఎస్‌ఎస్‌ పథకాల్లో రూ.50,000 నుంచి రూ.60,000కు మించి పెట్టుబడి పెట్టవద్దు. మిగతా మొత్తా న్ని సురక్షితమైన పీపీఎఫ్‌, ఎన్ ఎస్ సీ లేదా టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేయండి.

అవగాహన.. Awareness
టాక్స్‌ సేవింగ్‌ పెట్టుబడుల రాబడులపై పన్ను పోటు ఉంటుందా, లేదా అనే విషయం కూడా మదుపరులు తెలుసుకుని ఉండాలి. ఎన్ ఎస్ సీ రాబడులపై పన్ను పోటు ఉంటుంది. ఈఎల్ ఎస్‌ఎస్ పథకాలపై వచ్చే రాబడులపై రూ.లక్ష వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతకు మించిన రాబడులపై 10 శాతం చొప్పున పన్నుపోటు తప్పదు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే టాక్స్‌ సేవింగ్‌ పథకాల్లో మదుపు చేయాలి.

ఇవీ పాటించాలి These should be followed
* ప‌న్ను చెల్లింపునకు చివరి నిమిషం వరకు వేచి ఉండటం సరికాదు. దానివల్ల కంగారుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆదా అవకాశాలను కోల్పోతారు. కాబట్టి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ప్రణాళిక ప్రారంభించాలి.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపులు ఉంటాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ ఎస్ సీ) వంటి వాటిలో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకూ పరిమితి ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను పొదుపులను పెంచుకోవాలి.

* పన్ను ఆదా చేసే పెట్టుబడులకు అవసరమైన అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. పెట్టుబడి రసీదులు, ప్రీమియం చెల్లింపులు, రుణ పత్రాలు మొదలైనవి చాలా ముఖ్యం. అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కారణంగా పన్ను మినహాయింపులు కోల్పోయే ప్రమాదం ఉంది.

* పన్నును ఆదా చేయడానికి సెక్షన్ 80 సీతో పాటు మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. 80డీ (ఆరోగ్య బీమా ప్రీమియాలు), 80 ఈ (విద్యా రుణాల వడ్డీ), 80 జి (నిర్దిష్ట నిధులకు విరాళాలు) వంటి వాటిని కూడా పరిశీలించాలి.

* మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పన్ను ఆదా చేసే పెట్టుబడులు ఉండాలి. కేవలం పన్ను ఆదా చేయడం కోసమే పెట్టుబడులు పెట్టకూడదు. ఈ విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాలి.

* పీపీఎఫ్, ఎన్ఎస్ సీ వంటి పన్ను పొదుపు సాధనాలు అందరికీ తెలుసు. వీటితో పాటు అధిక రాబడి, అదనపు ప్రయోజనాల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్ పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్), యూఎల్ఐపీఎస్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు) వంటి వాటిని కూడా ఎంపిక చేసుకోవాలి.

* నిర్ధిష్టంగా జీతం రాని వ్యక్తులకు కొన్ని ఆదా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఫ్రీలాన్సర్లు, వ్యాపార యజమానులకు తమ వ్యాపార ఖర్చులు మొదలైన వాటికి పన్ను తగ్గింపు అవకాశాలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఉపయోగించుకోవాలి.

* పన్ను ఆదా చేయడానికి డబ్బంతా ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. దాన్ని వివిధ మార్గాలకు కేటాయింపులు చేయాలి.

* పన్ను ఆదా లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి.

* మీరు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటే, నిధులను తిరిగి కేటాయించవచ్చు.

* పన్ను సలహాదారుడు లేదా ఆర్థిక ప్రణాళికదారుడిని సంప్రదించడం చాలా అవసరం. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు చేసే పనిని కాపీ చేయవద్దు. ఎందుకుంటే ఎవరి పన్ను ప్రణాళికా విధానం వారి బట్టే ఉంటుంది.

* సంవత్సరానికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపన్ను చెల్లించాల్సిందే. అయితే సరిగ్గా ప్లాన్ చేస్తే, ఈ ఇన్​కం టాక్స్​ను భారీ మొత్తంలో తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని పలు సెక్షన్లు కొన్ని రకాల పొదుపులు,పెట్టుబడులపై పన్ను మినహాయింపులు కల్పిస్తాయి. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులపై కూడా పన్ను తగ్గింపులను అందిస్తాయి. ఈ మార్గాలను సక్రమంగా ఉపయోగించుకుంటే, కచ్చితంగా చాలా వరకు ఆదాయ పన్నును తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో ఇన్​కం టాక్స్​ను తగ్గించే మార్గాల గురించి తెలుసుకుందాం.

ఇంటి రుణం తీసుకోవాలి Take a home loan
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(C), 24(b) ప్రకారం, గృహ రుణం చెల్లింపులకు ప్రత్యేకమైన పన్ను మినహాయింపులు లభిస్తాయి. 80(C) ప్రకారం ప్రిన్సిపల్ మెుత్తం చెల్లింపులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే విధంగా 24(b) ప్రకారం వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ Health Insurance
సెక్షన్ 80(D) ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్​ కోసం చేసే ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపులు ఉంటాయి. బీమా తీసుకున్న వారి వయస్సు ఆధారంగా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెట్టుబడి
Investment in central government schemes
సెక్షన్ 80( C) ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పొదుపు చేయటం ద్వారా రూ.1.5 లక్షల వరకూ ఇన్​కం టాక్స్​ను సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్​ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్​లలో పెట్టిన పెట్టుబడులకు ఈ ఆదాయ పన్ను మినహాయింపులు లభిస్తాయి. పైగా వీటికి పెద్ద మొత్తంలో వడ్డీ కూడా లభిస్తుంది.

ఇన్సూరెన్స్ ప్లాన్స్.. Insurance plans
జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా బీమా వార్షిక ప్రీమియంలో రూ.1.5 లక్షల వరకూ పన్ను సడలింపు ఉంటుంది.
పైన చెప్పిన పద్దతులు ఉపయోగించుకుని, మీ డబ్బును ఆదా చేసుకోండి. ఈ విషయంలో మీకు సరైన అవగాహన లేకపోతే, సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

What Is The Difference Between Old Tax Regime And New Tax Regime

New tax regime.. కొత్త పన్ను విధానం..
గత బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆదాయ పన్ను విధానాన్ని డీఫాల్ట్ విధానంగా నిర్ధారించింది. అంటే ఒక వ్యక్తి పాత ఆదాయ పన్ను కావాలని కోరుకున్నవారికి తప్ప.. మిగతా అందరికీ కొత్త ఆదాయపు పన్ను విధానం వర్తిస్తుంది.

New tax regime to Old tax regime
పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానం
ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఆదాయ పన్ను విధానం డీఫాల్ట్ విధానంగా అమల్లోకి వచ్చింది. కానీ, పాత పన్ను విధానం కూడా కొనసాగుతుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుకుంటే పాత విధానంలో కొనసాగవచ్చు. అయితే, ఈ రెండు విధానాల మధ్య ఒక పన్ను విధానం నుంచి మరో పన్ను విధానంలోకి ఎన్నిసార్లు మారవచ్చు? అన్న ప్రశ్నతో పాటు పలు ప్రశ్నలు టాక్స్ పేయర్స్ లో వస్తున్నాయి.

How many times can it change
ఒక వ్యక్తి ప్రతి ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని (New tax regime) కానీ, లేదా పాత పన్ను విధానాన్ని కానీ ఎంచుకోవచ్చు. ఇలా ఎన్ని సార్లైనా ఎంచుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం కేవలం వేతన ఆదాయం ఉన్న, వ్యాపార ఆదాయం లేని వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారు తమ జీవిత కాలంలో ఒక్క సారి మాత్రమే ఈ మార్పు చేసుకునే సదుపాయం పొందుతారు. వేతనం ద్వారా ఆదాయం పొందుతున్నవారికి తమ పన్ను విధానాన్ని మార్చుకునే అవకాశం ప్రతి సంవత్సరం లభిస్తుంది. అయితే, వీరు గడువులోపు తమ ఐటీఆర్ లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా ఐటీఆర్ (ITR) లను ఫైల్ చేస్తే, ఆటోమేటిక్ గా కొత్త పన్ను విధానంలోకి వెళ్తారు.

ఎవరికి వీలు కాదు..? Who is not allowed
ఆదాయ పన్ను చట్టాల ప్రకారం వ్యాపారం ద్వారా ఆదాయం పొందే ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరం పాత, కొత్త పన్ను విధానాలను మార్చుకోలేరు. వ్యాపారం ద్వారా ఆదాయం పొందే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, అలాగే, HUFలు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత, పాత పన్ను విధానానికి తిరిగి వెళ్లడానికి వారికి ఒకే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. లేదా, వారు ఇప్పటికే పాత విధానాన్ని ఎంచుకుంటే భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో కొత్త ఆదాయపు పన్ను విధానానికి వెళ్లలేరు.

ఏ పన్ను విధానమో చెప్పకపోతే
If you do not say which tax system
వేతనం ద్వారా ఆదాయం పొందే వ్యక్తి తను కొనసాగించదలచుకున్న ఆదాయపు పన్ను విధానాన్ని పేర్కొనకపోతే వారు ఉద్యోగం చేస్తున్న కంపెనీ డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానాన్ని కొనసాగిస్తుంది. ఒకసారి పన్ను విధానాన్ని నిర్ణయించుకున్న తరువాత, ఆ విధానాన్ని, ఆ సంవత్సరంలో మళ్లీ మార్చలేమని గుర్తుంచుకోవాలి.

కంపెనీకి చెప్పిన విధానమే కొనసాగించాలా
Should the company proceed with the policy
ఆదాయ పన్ను చట్టాలు ఒక ఉద్యోగి తన కంపెనీకి తెలియజేసిన పన్ను విధానానికి భిన్నమైన పన్ను విధానంతో తన ఐటీఆర్ ను ఫైల్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఒకవేళ, మీరు మీ కంపెనీకి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు చెప్పి కూడా, ఐటీఆర్ (ITR) ను పూర్తి చేస్తున్నప్పుడు పాత పన్ను విధానాన్ని కొనసాగించవచ్చు. అయితే, మీ ఐటీఆర్ ను జూలై 31న లేదా అంతకు ముందు ఫైల్ చేసి ఉండాలి.

ఏదీ సెలక్ట్ చేసుకోకపోతే.. If none is selected..
మ‌నం ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకున్నప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఏదో ఒక‌దానిని సెల‌క్ట్ చేసుకోవాలి. లేకుంటే న్యూ ట్యాక్స్ రెజిమ్ వ‌ర్తిస్తుంది. అదే మనం ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ సెలక్ట్ చేసుకుంటే రూ. 2లక్షల 50వేల వరకు ఇన్ కమ్‌ ట్యాక్స్ పరిధిలోకి రాదు. అప్పుడు మనం ఎటువంటి ట్యాక్స్ ను ఫైల్ చేయాల్సిన‌ అవసరం లేదు. మనం రూ.5లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిబేటు రూ.12,500 ఇస్తారు కాబట్టి.
– OLD TAX REGIME లో రూ. 5లక్షలు పైబడి ఇన్ కమ్ వస్తే మ‌నం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
– NEW TAX REGIME లో రూ. 7లక్షలు పైబడి ఇన్ కమ్ వస్తే మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

ఒక వ్యక్తికి శాలరీ ద్వారా ఇన్ కమ్ వస్తే ఎలా ట్యాక్స్ ను సేవ్ చేసుకోవచ్చు
Let’s know how a person can save tax if he gets income through his salary
ఆదాయం అన్నది వివిధ రకాలుగా ఉండొచ్చు. జీతం, పింఛను లేదా పొదుపు ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై వచ్చే రెంట్, ఫండ్లు, షేర్లు, ఇల్లు మొదలైన వాటిని విక్రయించినప్పుడు చేతికి అందే మొత్తం, వ్యాపారం.. వృత్తిరీత్యా వచ్చే డబ్బు.. ఇలాంటివన్నీ కూడా ఆదాయం కిందకే వస్తాయి. ఆఖరికి కౌన్ బనేగా కరోడ్‌పతి లాంటి కార్యక్రమాల్లో గెలిచే విజేతలు కూడా బహుమతి మొత్తంపై ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుంది. కాగా ఒక‌ వ్యక్తికి తన శాలరీ ద్వారా ఇన్ కమ్ వస్తే Exemption, Deductionను ఉపయోగించుకుని ట్యాక్స్ ను సేవ్ చేసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు.. For example
– ఒక వ్యక్తికి రూ.14లక్షలు శాలరీ వస్తుంద‌నుకుందాం. ఇటువంటి వారు Standard deduction ద్వారా రూ. 50వేలు వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.

* Section 80c... చాలా వరకు సెక్షన్ 80సి లో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందుతారు. సుకన్య సమృద్ది యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పీపీఎఫ్, ఎన్ పీ ఎస్ ఇవన్నీ కూడా సెక్షన్ 80సి కింద‌కు వస్తాయి. మనం దేనిలోనైనా ఇన్వెస్ట్ చేసిన సెక్షన్ 80సి లో లక్షయాబైవేలు వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.

– టర్మ్ ఇన్సురెన్స్… ఇది ఉద్యోగుల‌కు మాత్రమే ఇస్తారు. బిజినెస్ లు చేసినవారికి, సెల్ఫ్ ఎంప్లాయిస్ కి ఇవ్వరు. టర్మ్ ఇన్సురెన్స్ తప్పకుండా తీసుకోవాలి.

* Section 24… హోమ్ లోన్ పై మనం కడుతున్న వడ్డీకి రూ. 2లక్షల వరకు మనం మినహాయింపు పొందవచ్చు.
* Section 80CCD(1b) దీని కింద రూ.50వేలువరకు అడిషనల్ బెనిఫిట్ పొందవచ్చు.
* Section 80CCD(2)… ఈ కేటగిరిలో ఎంప్లాయిస్ కి రూ. 70వేలు వరకు అడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది.

* Section 80D… ఇందులో మనం హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుని రూ. 30వేలు వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

* Section 80E…. ఇందులో ఎడ్యుకేషన్ లోన్ మీద కడుతున్న వడ్డీకి లిమిట్ ఉండదు. మనం ఎంతైనా కట్టవచ్చు.

* Section 80EEB … ఇందులో మనం ఎలక్ట్రికల్ వెహికల్ ముందుగా కొని ఉంటే మనం రూ. 1లక్ష యాబైవేలు వరకు ట్యాక్స్ బెనిఫిట్ ను పొందవచ్చు.

Exemption… మినహాయింపులు
Children ‘S Education… ఇందులో కూడా మనం ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒక్కొక్కరికీ మంత్లీ రూ.100 చొప్పున ఇద్దరు పిల్లలకి అవకాశం ఇస్తారు.

Children ‘S Hostel.. పిల్లలు హాస్టల్ లో ఉంటే.. ఒక్కొక్కరికీ మంత్లీ రూ.300 చొప్పున ఇద్దరు పిల్లలకి అవకాశం ఇస్తారు. ఇద్దరు పిల్లలకి సంవత్సరానికి రూ.7200 వరకు బెనిఫిట్ వ‌స్తుంది.

Leave Travel Allowance… ఇందులో మనం 4సంవత్సరాలకి రెండు సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్స్ ఇందులో రావు. కేవలం మన ట్రావెలింగ్ మాత్రమే ఇందులో కవర్ అవుతుంది.

EPF… ఇందులో మన శాలరీలో మన బేసిక్ పై వేస్తున్న 12శాతం అమౌంట్ కి కూడా మనం ట్యాక్స్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

HRA … ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. HRA తీసుకుంటే సెక్షన్ 24 కింద హోమ్ లోన్ కి మనం రూ. 2లక్షల వ‌ర‌కు వడ్డీ బెనిఫిట్ పొందవచ్చు. కానీ షరతు ఏమిటంటే మనం ఒక ఊరిలో ఉండి, ఇల్లుకొని దానికి హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఇంకో ఊరిలో మనం జాబ్ చేస్తూ అక్కడ రెంట్ హౌస్ లో ఉండాలి. అక్కడ రెంట్ లో ఉన్నదానికి HRA బెనిఫిట్ తీసుకుంటూ ఇక్కడ ఉన్న ఇంటికి వడ్డీ బెనిఫిట్ పొందవచ్చు. మన ఇంట్లో మనం ఉంటే రెంటల్ బెనిఫిట్ తీసుకోలేం.

మనం మాత్రమే హోమ్ లోన్ తీసుకుంటే అసలు పై సెక్షన్ 80సీలో రూ.లక్ష యాభై వేలు,సెక్షన్ 24లో వడ్డీపై రూ.2లక్షలు మొత్తంగా రూ. 3లక్షల యాభైవేల వరకు మాగ్జిమమ్ బెనిఫిట్ పొందవచ్చు.

అదే మనం joint home loan తీసుకుంటే భార్యపేరుమీద రూ.3లక్షల యాభైవేలు, భర్తపేరు మీద రూ. 3లక్షల యాభైవేల వరకు బెనిఫిట్ ని పొందవచ్చు.

మన పేరెంట్స్ ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ల‌కి రెంట్ మనం పే చేస్తే దీనిద్వారా HRA ను క్లెయిమ్ చేసుకోవచ్చు. మన పేరంట్స్ కి చెల్లించే రెంట్‌పై కూడా ట్యాక్స్ ఉండదు.

Section 80TTA… ఇందులో రూ. పదివేల వరకు బ్యాంక్ అకౌంట్ ద్వారా వస్తున్న వడ్డీకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మనకి గిఫ్ట్ ద్వారా వస్తున్న డబ్బులకి రూ. 50వేల వరకు ట్యాక్స్ చెల్లించ‌ర్లేదు.

ఉద్యోగ విర‌మ‌ణ స‌మ‌యంలో రూ.25లక్షలు వరకు ట్యాక్స్ కట్టాల్సిన‌ అవసరం లేదు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు రూ. 5లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన‌ అవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *