దసరా, దీపావళి పండగల సీజన్ వచ్చిందంటే కొత్త టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి గృహోపకరణాలు కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. పండగల సందర్భంగా కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తాయని, ఉద్యోగులకు లభించే బోనస్‌లను ఉపయోగించి కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చని వినియోగదారులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పండగల సమయంలో సాధారణంగా లభించే ధరల తగ్గింపులకు బదులుగా కొన్ని గృహోపకరణాల ధరలు (ACs, TVs Price Hike) పెరగనున్నాయి. ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) వంటి ఉత్పత్తుల ధరలను అక్టోబరు 1 నుంచి దాదాపు 5-7 శాతం వరకు పెంచేందుకు పలు ప్రముఖ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. 2026లో పరిశ్రమలో ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తయారీ వ్యయాలు పెరగడం, ముడి పదార్థాల ధరలు ఎగబాకడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.
ముడి పదార్థాల మంట.. Rising Raw Material Costs
గృహోపకరణాల తయారీలో(ACs, TVs Price Hike) ఉపయోగించే ప్రధాన ముడి పదార్థాల ధరలు పెరగడం కంపెనీలపై ఒత్తిడిని పెంచుతోంది. రాగి, ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్, ముడిచమురు ఆధారిత ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో తయారీ వ్యయం అధికమవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏసీల తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కో ఏసీ తయారీలో సుమారు 3-4 కిలోల వరకు రాగిని ఉపయోగించాల్సి ఉంటుంది. గత ఏడాది టన్ను రాగి ధర 8,000-9,000 డాలర్ల పరిధిలో ఉండగా.. ప్రస్తుతం అది సుమారు 14,500 డాలర్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాగి ధరలో ఈ భారీ పెరుగుదల నేరుగా ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపుతోంది. ఉక్కు, అల్యూమినియం ధరలు పెరగడం కూడా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల తయారీ వ్యయాన్ని పెంచుతోంది. మరోవైపు ప్లాస్టిక్ ఆధారిత భాగాలు, చిప్సెట్లు, మెమొరీ కార్డులు వంటి ఎలక్ట్రానిక్ భాగాల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో టీవీలు సహా అనేక ఉత్పత్తుల తయారీ ఖర్చు పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి.
రవాణా.. దిగుమతుల భారం.. Higher Logistics and Import Costs
ముడి పదార్థాల ధరలతో (ACs, TVs Price Hike) పాటు రవాణా వ్యయాలు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయ నౌకా రవాణా ఛార్జీలు పెరగడం వల్ల దిగుమతి చేసుకునే భాగాల ధరలు పెరుగుతున్నాయి. రూపాయితో పోలిస్తే డాలర్ బలపడటం కూడా దిగుమతులపై అదనపు భారాన్ని మోపుతోంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అనేక కీలక భాగాలు విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. డాలర్ మారక విలువ పెరిగితే అదే ఉత్పత్తిని దిగుమతి చేసుకోవడానికి కంపెనీలు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ వ్యయాన్ని పూర్తిగా కంపెనీలే భరించడం కష్టమవడంతో కొంత భాగాన్ని ఉత్పత్తుల ధరల ద్వారా వినియోగదారులపైకి మళ్లిస్తున్నాయి.
పండగ కొనుగోళ్లపై ప్రభావం? Impact on Festive Shopping
పండగల సమయంలో(ACs, TVs Price Hike) వినియోగదారులకు సాధారణంగా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి కంపెనీలు ప్రకటించే డిస్కౌంట్లు, రెండోది బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు అందించే క్యాష్‌బ్యాక్‌లు, తక్షణ తగ్గింపులు. అయితే ఈసారి ఉత్పత్తుల మూల ధరలే పెరగడంతో డిస్కౌంట్లు ఉన్నప్పటికీ గతేడాది స్థాయిలో ధరలు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పండగ సీజన్లో డిమాండ్‌ను పెంచుకోవడానికి కంపెనీలు, డీలర్లు వివిధ రకాల ఆఫర్లను కొనసాగించే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్‌బ్యాక్, ఉచిత ఇన్స్టాలేషన్, అదనపు వారంటీ వంటి ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అందువల్ల వినియోగదారులు కేవలం ఉత్పత్తి ధరనే కాకుండా మొత్తం ఆఫర్ విలువను పరిశీలించడం అవసరం.
చిన్న డీలర్లపై ఎక్కువ భారం.. Small Dealers Face Greater Pressure
ధరల పెంపు ప్రభావం (ACs, TVs Price Hike) తయారీ సంస్థలు, వినియోగదారులతో పాటు రిటైల్ డీలర్లపైనా ఉంటుంది. సాధారణంగా కంపెనీలు ధరల పెంపు గురించి ముందుగానే డీలర్లకు సమాచారం ఇస్తాయి. డీలర్లు పాత ధరలకు కొనుగోలు చేసిన నిల్వలను ఉన్నంత వరకు పాత ధరలకే విక్రయించే అవకాశం ఉంటుంది. పెద్ద డీలర్లు తమ ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించి ధరలు పెరగడానికి ముందే ఎక్కువ మొత్తంలో సరకు కొనుగోలు చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. పండగల సమయంలో వాటిని పాత ధరలకు విక్రయించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించవచ్చు. చిన్న డీలర్లకు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో ముందస్తుగా సరకు కొనుగోలు చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. దీంతో కొత్త ధరల ప్రభావం వారిపై త్వరగా పడే అవకాశం ఉంటుంది.
వోల్టాస్ నుంచి డైకిన్ వరకు.. Companies Announce Price Hikes
గృహోపకరణాల రంగంలో (ACs, TVs Price Hike) ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలను పెంచాయి. వోల్టాస్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలను 5-7 శాతం వరకు పెంచినట్లు సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి ఏసీల ధరలను కూడా ఇదే స్థాయిలో పెంచనున్నట్లు తెలిపారు. బ్లూస్టార్ ఇప్పటికే ఏసీలు, డీప్ ఫ్రీజర్ల ధరలను 5-8 శాతం వరకు పెంచింది. గతేడాదితో పోలిస్తే ఉత్పత్తి వ్యయాలు సుమారు 15 శాతం పెరిగినప్పటికీ, జీఎస్టీకి సంబంధించిన ప్రయోజనాల కారణంగా వినియోగదారులపై నికర ప్రభావం సుమారు 5 శాతం వరకు ఉంటుందని సంస్థ వెల్లడించింది. డైకిన్ ఉత్పత్తుల ధరలను సెప్టెంబరు 16 నుంచే 8-10 శాతం వరకు పెంచినట్లు కంపెనీ తెలిపింది. హైయర్ అక్టోబరు 1 నుంచి ఏసీల ధరలను 5 శాతం, టీవీలు, వాషింగ్ మెషీన్ల ధరలను 2-3 శాతం మేర పెంచనుంది. జనవరి నాటికి విడతలవారీగా మొత్తం 15 శాతం వరకు ధరలు పెంచే ప్రణాళిక ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. గోద్రేజ్ అప్లయన్సెస్ కూడా పరిశ్రమ వ్యాప్తంగా 5-7 శాతం ధరల పెంపు తప్పదని పేర్కొంది. అయితే డీలర్ల వద్ద ఉన్న పాత ధరల నిల్వల కారణంగా కొన్ని ఉత్పత్తులు దీపావళి వరకు పాత ధరలకే అందుబాటులో ఉండే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. థామ్సన్, కొడాక్, బ్లాపంక్ట్ వంటి బ్రాండ్లను తయారు చేసే ఎస్పీపీఎల్ టీవీల ధరలను సుమారు 7 శాతం పెంచాలని యోచిస్తోంది. వీడియోటెక్స్ ప్రకారం దీపావళి తర్వాత చిన్న తెరల టీవీల ధరలు 20 శాతం వరకు, పెద్ద తెరల టీవీల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
కార్లకూ ధరల సెగ.. Automobile Prices May Also Rise
ముడి పదార్థాల ధరల పెరుగుదల (ACs, TVs Price Hike) ప్రభావం గృహోపకరణాలకే పరిమితం కావడం లేదు. ఆటోమొబైల్ రంగంపైనా పడుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) ధరలను మరోసారి పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. లోహాలు సహా ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మరో ధరల పెంపుపై రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు, సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట తెలిపారు. 2026లో జనవరి, ఏప్రిల్, జులైలో కంపెనీ ఇప్పటికే మూడు విడతల్లో ధరలను పెంచింది. జులైలో ఎస్‌యూవీల ధరలు 2.7 శాతం పెరిగాయి. అయినప్పటికీ ధరల పెంపు వల్ల ఇప్పటివరకు బుకింగ్‌లు, విచారణలపై గణనీయమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని కంపెనీ తెలిపింది. రాబోయే రెండు త్రైమాసికాల్లో ఐదు నవీకరించిన మోడళ్లతో పాటు పెట్రోల్, విద్యుత్ విభాగాల్లో ఒక్కో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.
కొనుగోలుదారులు ఏం చూడాలి? What Consumers Should Check
పండగల సమయంలో (ACs, TVs Price Hike) కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునేవారు ధరల పెంపు వార్తలను మాత్రమే చూసి తొందరపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆఫర్ ఉందని భావించి వెంటనే కొనుగోలు చేయడం కూడా సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఒకే మోడల్ ధరను వివిధ విక్రయశాలలు, ఆన్లైన్ వేదికల్లో పరిశీలించడం ఉపయోగకరం. ఉత్పత్తి ధరతో పాటు వారంటీ, ఇన్స్టాలేషన్ ఛార్జీలు, డెలివరీ ఖర్చులు, బ్యాంకు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి అంశాలను కలిపి తుది ధరను పోల్చాలి. ముఖ్యంగా పాత మోడల్, కొత్త మోడల్ మధ్య ఫీచర్లు, విద్యుత్ వినియోగం, వారంటీ వంటి అంశాలను పరిశీలించడం మంచిది. పండగ సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని మోడళ్లపై స్టాక్ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు కంపెనీలు ధరలను దశలవారీగా పెంచుతున్నందున ప్రతి ఉత్పత్తికీ ఒకే శాతం పెంపు ఉండకపోవచ్చు. అందువల్ల కొనుగోలుదారులు తమ అవసరానికి సరిపోయే మోడల్‌ను ఎంపిక చేసుకుని, మొత్తం ధరను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం ప్రయోజనకరం. మొత్తంగా చూస్తే.. దసరా, దీపావళి పండగలు వస్తున్న వేళ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల మార్కెట్లో ఈసారి సాధారణంగా కనిపించే డిస్కౌంట్ వాతావరణానికి ముడి పదార్థాల ధరల పెరుగుదల సవాలుగా మారింది. రాగి నుంచి ఉక్కు వరకు, ప్లాస్టిక్ నుంచి చిప్సెట్ల వరకు పెరుగుతున్న వ్యయాలు కంపెనీల ధరల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. పండగల కొనుగోళ్లలో వినియోగదారులకు లభించే అసలు ప్రయోజనం డిస్కౌంట్ శాతంలో కాకుండా.. తుది చెల్లింపు ధరలో ఎంత ఆదా అవుతుందన్నదే కీలకం.
