Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years? FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth? FEATURE NEWS
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation FEATURE NEWS
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS

ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ త‌ప్ప‌నిస‌రి. డిసెంబర్ 31 వరకే అవకాశం.. Linking PAN with Aadhaar Made Mandatory: Deadline Extended Till December 31

Posted on 07/11/2025 By admin No Comments on ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ త‌ప్ప‌నిస‌రి. డిసెంబర్ 31 వరకే అవకాశం.. Linking PAN with Aadhaar Made Mandatory: Deadline Extended Till December 31

ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. లేకుండా డీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. 2025 డిసెంబర్ 31 తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ కార్డులు ప‌నిచేయ‌వ‌ని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంగా తెలిపింది . అంటే లింక్‌ చేయని పాన్‌ కార్డ్‌తో లావాదేవీలు చేయలేరు, బ్యాంకింగ్‌, ఐటీ ఫైలింగ్‌ వంటి సేవలు నిలిచిపోతాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే లింక్ చేయాలి. లేకపోతే మీ పాన్‌ చెల్లదు. అని ఆదాయపు పన్ను శాఖ ప్ర‌క‌టించింది. గడువు దాటినవారు లింక్‌ చేసేటప్పుడు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొత్త గడువును కూడా నిర్లక్ష్యం చేస్తే, పాన్‌ నంబర్‌ రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఇప్పటికీ లక్షల పాన్‌లు లింక్‌ కాలేదు.. Lakhs of PAN Cards Still Remain Unlinked

ఆదాయపు పన్ను శాఖ అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఇంకా లక్షలాది పాన్‌లు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ఇంతకు ముందు పలు మార్లు గడువులు పొడిగించినా.. ఇంకా చాలామంది లింక్‌ చేయలేదు. ఈసారి మాత్రం ఇక మినహాయింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

లింక్‌ చేయకుంటే ఎదురయ్యే ఇబ్బందులు.. Consequences of Not Linking PAN with Aadhaar

బ్యాంక్‌ ఖాతాల్లో లావాదేవీలు నిలిచే అవకాశం

క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వినియోగంలో ఆటంకం

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయలేకపోవడం

క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ సేవల్లో ఆటంకం

పన్ను రీఫండ్‌లు జమ కాకపోవడం

ఆధార్‌ లేకుండా పాన్‌ చెల్లనందున, ఇన్వెస్ట్‌మెంట్‌ లేదా ప్రాపర్టీ కొనుగోలు లావాదేవీల్లో సమస్యలు ఎదురవుతాయి

ఎవరెవరు లింక్‌ చేయాలి? Who Needs to Link Their PAN with Aadhaar?

పాన్‌–ఆధార్‌ లింక్‌ చేయాలా, వద్దా అనే సందేహం చాలా మందికి ఉంది. ఎవరికీ ఇది తప్పనిసరి? ఎవరికీ మినహాయింపు? అన్న విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ తాజాగా స్పష్టంచేసింది.

తప్పనిసరిగా లింక్‌ చేయాల్సిన వారు.. Individuals Required to Link PAN with Aadhaar

భారత పౌరులుగా పాన్‌ కలిగి ఉన్న వారందరూ..
2017 జూలై 1కి ముందు పాన్‌ తీసుకున్న వ్యక్తులు
పన్ను చెల్లించే, ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే వ్యక్తులు
బ్యాంకులు, ఫైనాన్షియల్‌ లావాదేవీలు చేసే వ్యక్తులు
డీమాట్‌ అకౌంట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్లు ఉన్నవారు

మినహాయింపు ఉన్న వారు .. Exempted Categories

అస్సాం, మేఘాలయ, జమ్మూ & కాశ్మీర్‌ రాష్ట్ర నివాసితులు
విదేశీ పౌరులు (NRIలు, OCIలు)
80 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు
భారతీయేతర వ్యక్తులు లేదా సంస్థలు

ఎలా లింక్‌ చేయాలి? How to Link PAN with Aadhaar?

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ www.incometax.gov.inలోకి వెళ్లాలి.
హోమ్‌పేజీపై కనిపించే ‘Link Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
పాన్‌ నంబర్, ఆధార్‌ నంబర్ నమోదు చేయాలి.
మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ చేయాలి.
గడువు తేదీకి ముందు అవసరమైతే రూ.1,000 ఫీజు చెల్లించాలి.
వివరాలు సరైగా ఉంటే లింకింగ్‌ విజయవంతమవుతుంది.

ఎలా పేమెంట్‌ చేయాలంటే.. How to Make the Payment

అదే పోర్టల్‌లో ‘e-Pay Tax’ ఆప్షన్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
చెల్లింపు పూర్తి అయిన తర్వాత మళ్లీ లింక్‌ ప్రక్రియ ప్రారంభించాలి.

మొబైల్‌ ద్వారా లింక్‌ చేసే మార్గం.. How to Link PAN with Aadhaar via Mobile

మీ మొబైల్‌ ఫోన్‌ నుంచి ఈ మెసేజ్‌ పంపండి
UIDPAN<SPACE><ఆధార్‌ నంబర్><SPACE><పాన్‌ నంబర్>
దీన్ని 567678 లేదా 56161 నంబర్‌కు పంపండి.

లింక్‌ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. How to Check If Your PAN is Linked with Aadhaar

అదే వెబ్‌సైట్‌లో ‘Link Aadhaar Status’ ఆప్షన్‌ ద్వారా చెక్‌ చేయొచ్చు.
లింక్‌ అయి ఉంటే “Your PAN is linked with Aadhaar” అని సందేశం వస్తుంది.

తప్పు వివరాలుంటే సరిచేయండి.. Correct Any Errors in Your Details

ఆధార్‌, పాన్‌లో పేర్లు లేదా జన్మతేదీ భిన్నంగా ఉంటే లింకింగ్‌ విఫలమవుతుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఒకేలా ఉండాలి. ఆధార్‌ వివరాలను uidai.gov.in ద్వారా సరిచేయాలి. పాన్‌ వివరాల సవరణకు NSDL లేదా UTIITSL వెబ్‌సైట్లలో అప్డేట్‌ చేయాలి. చివరి రోజుల్లో వెబ్‌సైట్ క్రాష్ అవ్వొచ్చు. కాబట్టి గ‌డువు లోప‌ల ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసుకోవ‌డం మేలు. లింక్ అయిన తర్వాత స్క్రీన్‌షాట్ సేవ్ చేసుకోవాలి.

ఆధార్‌తో పాన్‌ కార్డ్‌ లింక్‌ ఎందుకంటే? Why Linking PAN with Aadhaar is Important

“పాన్‌–ఆధార్‌ లింక్‌ ఎందుకు ?” అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. పన్ను ఎగవేతలను అరికట్టడం, ఒకే వ్యక్తి పేరుతో ఉన్న బహుళ పాన్‌లను గుర్తించడం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడం వంటి ముఖ్య ఉద్దేశ్యాలతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

డూప్లికేట్‌ పాన్‌లపై చెక్ ..Check on Duplicate PAN Cards

కొంతమంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉపయోగించి పన్ను మినహాయింపులు పొందుతున్నారని గతంలో పన్ను శాఖ గుర్తించింది. ఆధార్‌తో లింక్‌ చేసిన తర్వాత ఒక్క వ్యక్తికి ఒకే పాన్‌ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీంతో డూప్లికేట్‌ పాన్‌లపై చెక్‌ పడుతుంది.

పన్ను ఎగవేతలపై నియంత్రణ .. Control on Tax Evasion

ఆధార్‌ లింక్‌ ద్వారా ప్రతి లావాదేవీ పాన్‌తో ముడిపడి ఉంటుంది. ఎవరు ఎంత ఆదాయం పొందుతున్నారు, ఎంత పన్ను చెల్లిస్తున్నారు అన్నది సులభంగా ట్రాక్‌ చేయగలుగుతోంది. దీనివల్ల పన్ను ఎగవేతలు తగ్గి ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశముంది.

ఫ్రాడ్‌ అకౌంట్లపై అడ్డుకట్ట ..Curb on Fraudulent Accounts

బ్యాంకు, ఇన్వెస్ట్‌మెంట్‌, డీమాట్‌ వంటి లావాదేవీల్లో ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి కావడంతో నకిలీ అకౌంట్లు తెరవడం కష్టమైంది. ఇది ఆర్థిక భద్రతకు మేలని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ పథకాల్లో ఉపయోగం ..Use in Government Schemes

ఆధార్‌ ద్వారా పాన్‌ లింక్‌ చేయడం వలన పన్ను రిటర్న్స్‌, సబ్సిడీలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు నేరుగా వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ లింకింగ్‌ ప్రక్రియతో పథకాల దుర్వినియోగం తగ్గింది.

ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ..Transparency in the Financial System

ఈ లింక్‌ వల్ల బ్లాక్‌ మనీ లావాదేవీలను గుర్తించడం సులభమవుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయడం పన్ను చెల్లింపుదారులకు సులభత, భద్రత, పారదర్శకత కలిగించడమే లక్ష్యం. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, దేశ ఆర్థిక ఆరోగ్యం కోసం అవసరం.

పన్ను వ్యవస్థలో సాంకేతిక మార్పులు .. Technological Reforms in the Tax System

 ప్రభుత్వ డిజిటల్‌ రిఫార్మ్స్‌లో భాగంగా ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ ఒక కీలక దశగా నిలిచింది. వ్యక్తిగత లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు అన్నీ ఇప్పుడు ఒకే సిస్టమ్‌ ద్వారా పన్ను శాఖకు అందుబాటులోకి వస్తున్నాయి.

పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం ..Ease for Taxpayers

రిటర్నులు దాఖలు చేయడం, రిఫండ్‌లు పొందడం, రికార్డులు అప్‌డేట్‌ చేయడం వంటి ప్రక్రియలు ఇప్పుడు మరింత వేగవంతంగా, సులభంగా మారాయి. ఆధార్‌ ధృవీకరణతో పన్ను శాఖకు వ్యక్తి గుర్తింపు సులభమవడంతో సమయ, పత్రాల వృథా తగ్గింది. ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ వల్ల చెల్లించాల్సిన పన్ను తప్పించుకోవడం అసాధ్యం అవుతోంది. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

 

259
FEATURE NEWS Tags:Check on Duplicate PAN Cards, Consequences of Not Linking PAN with Aadhaar, Control on Tax Evasion, Correct Any Errors in Your Details, Curb on Fraudulent Accounts, Ease for Taxpayers, Exempted Categories, How to Check If Your PAN is Linked with Aadhaar, How to Link PAN with Aadhaar via Mobile, How to Link PAN with Aadhaar?, How to Make the Payment, Individuals Required to Link PAN with Aadhaar, Lakhs of PAN Cards Still Remain Unlinked, Technological Reforms in the Tax System, Transparency in the Financial System, Use in Government Schemes, Who Needs to Link Their PAN with Aadhaar?, Why Linking PAN with Aadhaar is Important

Post navigation

Previous Post: అపర కుబేరులు.. దాతృత్వంలోనూ గొప్పోళ్లు! రోజుకీ రూ.7.4 కోట్ల విరాళం Modern Tycoons Shine in Charity Too: ₹7.4 Crore Donations Every Day!
Next Post: ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth

Related Posts

  • నెమ్మ‌దిగా ధ‌న‌వంతుల‌వండి: వారెన్ బ‌ఫెట్‌ FEATURE NEWS
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS
  • సావరిన్ గోల్డ్ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడితో రూ.3.78 లక్షల లాభం..! Sovereign Gold Bonds Turn ₹1 Lakh Investment into ₹3.78 Lakh FEATURE NEWS
  • చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge FEATURE NEWS
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years?
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible?
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns?
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth?
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation
  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations! FEATURE NEWS
  • డిజిట‌ల్ రూపంలో నోట్లు.. మార‌నున్న భారత కరెన్సీ భవిష్యత్.. Digital Rupee – India’s Official Digital Cash Revolution FEATURE NEWS
  • అంబానీ చెప్పిన గ్రేట్ బుక్స్‌ great books by mukesh ambani  BOOKS
  • ట్యాక్స్ టెన్షన్‌కు చెక్… డిపాజిటర్లకు కొత్త సౌలభ్యం ‘ఫారం 121’ .. No More Tax Tension.. ‘Form 121’ Brings Relief to Depositors FEATURE NEWS
  • ఐటీసీ – ది గ్రేట్ హిస్ట‌రీ the great story of ITC FEATURE NEWS
  • అర్బన్‌ సహకార బ్యాంకుల రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు.. RBI Introduces New Lending Norms for Urban Co-operative Banks FEATURE NEWS
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme