Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • WHAT IS UPI CIRCLE  యూపీఐ సర్కిల్ గురించి తెలుసా FEATURE NEWS
  • ఇందుకే అనీల్ అంబానీ ఫెయిల‌య్యింది..! FEATURE NEWS
  • రాకేష్ ఝున్ ఝున్ వాలాకు లాభాలిచ్చిన స్టాక్స్ ఇవే.. FEATURE NEWS
  • Why are People spending less ప్రజలు ఎందుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS
  • భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26 FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS

స్టెప్‌-అప్ సిప్‌తో ప్ర‌యోజ‌నాలెన్నో..! Multiple Benefits of Step-Up SIP!

Posted on 15/12/2025 By admin No Comments on స్టెప్‌-అప్ సిప్‌తో ప్ర‌యోజ‌నాలెన్నో..! Multiple Benefits of Step-Up SIP!

మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) ద్వారా చిన్న చిన్న మొత్తాలను మదుపు చేయడం వల్ల కాలక్రమంలో డబ్బు కూడబెట్టవచ్చు. ఇది చాలామందికి తెలిసిందే. కానీ, కేవలం సాధారణ సిప్‌ ద్వారా పెట్టుబడి చేస్తూ వెళ్తే, మీరు ఆశించిన వేగంగా ధనవంతులు కావడం సులభం కాదు. భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాల సాధనకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) మంచి మార్గంగా మారింది. అయితే సాధారణ సిప్‌తో పాటు ‘స్టెప్‌-అప్‌ సిప్‌’ను ఎంచుకుంటే మరింత లాభం పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

స్టెప్‌-అప్‌ సిప్‌ అంటే ఏమిటి? What Is a Step-Up SIP?
సాధారణ సిప్‌లో నెలనెలా ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెడతాం. కానీ స్టెప్‌-అప్‌ సిప్ (Step-Up SIP)లో ప్రతి ఏడాది లేదా నిర్దిష్ట కాలానికి పెట్టుబడి మొత్తాన్ని కొంత శాతం పెంచుకుంటూ వెళ్తాం. ఉదాహరణకు నెలకు రూ.5,000తో సిప్‌ ప్రారంభించి, ప్రతి ఏడాది 10 శాతం చొప్పున పెంచితే రెండో ఏడాది రూ.5,500, మూడో ఏడాది రూ.6,050గా పెట్టుబడి అవుతుంది.

ఎందుకు స్టెప్‌-అప్‌ అవసరం? Why Is Step-Up SIP Necessary?
Step-Up SIP తో కాలక్రమంలో ఆదాయం పెరుగుతుంది. కానీ పెట్టుబడి మొత్తం అదే స్థాయిలో ఉంటే భవిష్యత్‌ అవసరాలకు సరిపోకపోవచ్చు. స్టెప్‌-అప్‌ సిప్‌ ద్వారా ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెట్టుబడిని కూడా పెంచుకోవచ్చు. దీంతో దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది.

లాభాలు ఇవే.. Here Are the Benefits…
స్టెప్‌-అప్‌ సిప్ (Step-Up SIP)తో పెట్టుబడి క్రమశిక్షణతో కొనసాగుతుంది. రూపాయి ఖర్చు సగటు (రూపీ కాస్ట్‌ అవరేజింగ్‌) ప్రయోజనం లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్‌ వంటి దీర్ఘకాల లక్ష్యాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ సిప్‌తో పోలిస్తే స్టెప్‌-అప్‌ సిప్‌లో చివరికి వచ్చే మొత్తం గణనీయంగా పెరుగుతుంది.

ఎంత పెంచాలి? How Much Should You Increase?
ప్రతి ఏడాది 5 నుంచి 10 శాతం వరకు స్టెప్‌-అప్ (Step-Up SIP)ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం స్థిరంగా పెరుగుతున్నవారు ఎక్కువ శాతం కూడా ఎంచుకోవచ్చు. అయితే నెలవారీ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.

ఎవరికి సరైనది? Who Is Step-Up SIP Suitable For?
ఉద్యోగులు, వ్యాపారులు, యువత.. ఇలా అందరికీ స్టెప్‌-అప్‌ సిప్‌ (Step-Up SIP)అనుకూలమే. ముఖ్యంగా కెరీర్‌ ప్రారంభ దశలో ఉన్నవారు తక్కువ మొత్తంతో మొదలుపెట్టి, ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచుకోవచ్చు. మొత్తానికి, సిప్‌ చేస్తూనే స్టెప్‌-అప్‌ విధానాన్ని అనుసరిస్తే భవిష్యత్‌కు బలమైన ఆర్థిక భద్రతను నిర్మించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న అడుగులతో ప్రారంభించి, క్రమంగా పెట్టుబడిని పెంచడమే విజయానికి మార్గమని సూచిస్తున్నారు.

స్టెప్‌-అప్‌ సిప్‌ ముఖ్య ప్రయోజనాలు.. Key Benefits of Step-Up SIP

ఆదాయం పెరుగుతున్న కొద్దీ Step-Up SIP లో పెట్టుబడిని పెంచి, దీర్ఘకాల లక్ష్యాలకు త్వరగా చేరుకోవచ్చు. రూపాయి ఖర్చు సగటు (Rupee Cost Averaging) ప్రయోజనం లభిస్తుంది. పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్‌ వంటి పెద్ద లక్ష్యాలను సాధించడానికి ఇది ఉపయోగకరం. చిన్న మొత్తంతో ప్రారంభించి, క్రమంగా పెంచడం వల్ల చివరికి కోట్లు కూడబెట్టవచ్చు. ప్రతి ఏడాది 5–10 శాతం వరకు స్టెప్‌-అప్‌ సిప్‌ చేయడం సరైనది. ఆదాయం ఎక్కువగా పెరుగుతున్నవారు ఎక్కువ శాతం పెంచుకోవచ్చు, కానీ నెలవారీ ఖర్చులు దృష్టిలో ఉంచుకోవాలి. మొత్తానికి, సిప్‌ చేస్తూ స్టెప్‌-అప్‌ అనుసరిస్తే భవిష్యత్‌ ఆర్థిక భద్రతను నిర్మించుకోవచ్చు. చిన్న అడుగులతో మొదలు పెట్టి, క్రమంగా పెట్టుబడిని పెంచుతూ, కోట్లు సంపాదించే అవకాశం ఇది అందిస్తుంది.

సిప్‌.. స్టెప్‌-అప్‌ తో భవిష్యత్ నిర్మాణం.. SIP… Building Your Future with Step-Up!

సంప్రదాయ సిప్‌ విధానంలో ఒక స్థిరమైన మొత్తాన్ని నిర్ణయించి, కొన్నేళ్లపాటు ప్రతి నెలా అదే మొత్తాన్ని మదుపు చేయొచ్చు. ఇది సంప‌ద సృష్టించేందుకు సరళ మార్గం. నిజానికి ప్రతి ఏడాదీ మన ఆదాయం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో స్టెప్‌-అప్‌ సిప్ (Step-Up SIP) బలమైన పరిష్కారం. ఈ విధానంలో మొదట మీరు నిర్ణయించిన నెలవారీ సిప్‌ మొత్తాన్ని ప్రతి ఏడాది ఒక నిర్ణీత శాతంలో (ఉదాహరణకు 10 శాతం) పెంచుకుంటూ వెళ్లాలి. దీని ద్వారా మీరు ఆదాయ పెరుగుదలకి అనుగుణంగా మదుపు పెంచవచ్చు. స్టెప్‌-అప్‌ సిప్‌ వల్ల భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్‌ వంటి దీర్ఘకాలిక అవసరాలకు సరిపడేలా డబ్బును ముందే సమకూర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్న పొదుపు, స్థిరమైన పెంపుతో భవిష్యత్తులో కోట్లు కూడబెట్టడం సులభం అవుతుంది.

సాధారణ సిప్ vs స్టెప్‌-అప్‌ సిప్‌..Regular SIP vs Step-Up SIP

– Step-Up SIPలో మీరు నెలకు రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తున్నారని అనుకుందాం. ఈ మొత్తం మీరు ఏడాదికి 12 శాతం సగటు రాబడితో పెట్టుబడిగా పెట్టినట్లయితే.. 15 ఏళ్ల తర్వాత మీ చేతికి సుమారు రూ.24 లక్షలు వస్తాయి. ఈ సమయంలో మీరు చెల్లించిన మొత్తం రూ.9 లక్షలు మాత్రమే.
– ఇక స్టెప్‌-అప్‌ సిప్ (Step-Up SIP)ను తీసుకుంటే, మొదటి ఏడాది రూ.5,000తో ప్రారంభించి, రెండో ఏడాదికి రూ.5,500, మూడో ఏడాదికి కొంత ఎక్కువ ఇలా ప్రతీ ఏడాది కొంత శాతం పెంచుతూ వెళ్తారు. ఇలాంటి విధానంలో 15 ఏళ్లలో మీరు మొత్తం రూ.19 లక్షల వరకు చెల్లిస్తారు, కానీ చివరగా మీ చేతికి సుమారు రూ.41.37 లక్షల వరకు వస్తుంది. స్టెప్‌-అప్‌ సిప్‌ ద్వారా మీరు ఎక్కువ మొత్తాన్ని కూడబెట్టగలుగుతారు. చిన్నదైన పెంపు, క్రమశిక్షణతో పెట్టుబడి చేయడం భవిష్యత్తులో గణనీయమైన ధనాన్ని సమకూర్చుతుంది. మొత్తానికి, స్టెప్‌-అప్‌ సిప్‌ ద్వారా సాధారణ సిప్‌కి పోలిస్తే, భవిష్యత్‌ అవసరాలకు సరిపడే, ఎక్కువ లాభం వచ్చే విధంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించవచ్చు.

స్టెప్‌-అప్‌ సిప్ తో కోట్లు సంపాదించ‌డం సాధ్యమే..! With Step-Up SIP, Earning Crores Is Possible!

– స్టెప్‌-అప్‌ సిప్‌ (Step-Up SIP)ద్వారా రూ.10 కోట్లకు మించి సంపదను కూడబెట్టడం కూడా సాధ్యమే. ఉదాహరణకు.. మీరు నెలకు రూ.10,000 చొప్పున క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ ఫండ్లలో మదుపు చేశార‌నుకుందాం. వార్షిక సగటు రాబడి 13 శాతం అనుకుందాం. ప్రతి ఏడాది 10 శాతం చొప్పున సిప్‌ మొత్తాన్ని పెంచుకుంటున్నారని భావిద్దాం. ఇలాంటి విధానంలో, క్రమశిక్షణ, దీర్ఘకాల పెట్టుబడి ద్వారా20–25 సంవత్సరాల్లో మీ చేతికి సుమారు 10 కోట్ల రూపాయలకు మించిన మొత్తాన్ని చేరుకోవడం సాధ్యమే.

– 16 ఏళ్లలో: మొత్తం పెట్టుబడి రూ.43,13,968. దీనిపై రూ.62,58,822 రాబడి కలిపి, మొత్తం రూ.1,05,72,790 వస్తుంది.
21 ఏళ్లలో: మొత్తం పెట్టుబడి రూ.76,80,300. దీనిపై రాబడి రూ.1,63,56,706 కలిపి, చేతికి రూ.2,40,37,006 అందుతుంది.
30 ఏళ్లలో: మొత్తం పెట్టుబడి రూ.1,97,39,283 అవుతుంది. దీని పై రాబడి రూ.7,29,15,507 వరకు ఉంటుందని అంచనా వేస్తే, మొత్తం రూ.9,26,54,790 మీ చేతికి వస్తుంది. ఇంకా ఒక సంవత్సరం పొడిగిస్తే, రూ.10.69 కోట్ల సంపదను సృష్టించుకోవచ్చు. ఇది చక్రవడ్డీ (Compound Interest) మహిమ వల్ల సాధ్యమవుతుందనడం మర్చిపోకండి. నెలలన్నీ, సంవత్సరాలన్నీ క్రమంగా మదుపు చేయడం, కొద్దిగా పెంపు చేసుకోవడం వల్ల, చిన్న మొత్తాల పెట్టుబడులు కూడా భవిష్యత్తులో పెద్ద సంపత్తిగా మారుతాయి.

– Step-Up SIP ప్రారంభంలో తక్కువతో మొదలుపెట్టి, ఆదాయ వృద్ధికి అనుగుణంగా ప్రతీ ఏడాది కొంతశాతం పెంపు చేసుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడి, ఎక్విటీ ఫండ్లలో పెట్టుబడి వల్ల పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. చిన్నదైన క్రమబద్ధతే భవిష్యత్ ఆర్థిక స్వాతంత్ర్యానికి కుదిరిన మార్గం. మొత్తంగా, స్టెప్‌-అప్‌ సిప్‌ అనుసరిస్తే, ప్రతి ఒక్కరికీ కోట్లు సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి.. Precautions to Take with Step-Up SIP

– స్టెప్‌-అప్‌ సిప్‌ (Step-Up SIP)చాలా శక్తిమంతమైన పెట్టుబడి సాధనం. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం.
– పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయాలనే ఉత్సాహంలో, 20–30 శాతం పెంపు లక్ష్యంగా పెట్టుకోకూడ‌దు. మధ్యలో ఖర్చులు పెరిగితే, సిప్‌ ఆపేయాల్సి రావచ్చు.
– ఒక ఏడాదికి ఆదాయం పెరగకపోవడం లేదా ఉద్యోగ సమస్యలు వస్తే, అధిక సిప్‌ భారం కావచ్చు. కాబట్టి మీ స్తోమత (Income & Expenses) ను బట్టి మాత్రమే పెంపు శాతాన్ని ఎంచుకోవాలి.
– మార్కెట్‌ హెచ్చుతగ్గులను ఎక్కువగా పట్టించుకోవద్దు. దీర్ఘకాలంలో చక్రవడ్డీ (Compound Interest) అద్భుతాలు చేస్తుంది.
– ఇప్పుడే ఉద్యోగంలో చేరినా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్నా.. సంపద సృష్టించడానికి స్టెప్‌-అప్‌ సిప్‌ ఒక మంచి మార్గం. చిన్న మొత్తంతో ప్రారంభించండి, క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కొంత పెంచుతూ వెళ్లండి.
– గణాంకాలు అంచనాలు మాత్రమే. పెట్టుబడులను ప్రారంభించే ముందు మీ సొంత అవగాహన, నిర్ణయంతోనే నిర్ణయం తీసుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లలో నష్ట భయం ఉంటుందని మర్చిపోవ‌ద్దు.

స్టెప్‌-అప్‌ సిప్‌ ఎవరికి అనుకూలమంటే? Who Is Step-Up SIP Suitable For?

– కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి స్టెప్‌-అప్‌ సిప్‌(Step-Up SIP) చాలా ఉపయోగకరం. వేతనం తక్కువగా ఉన్నప్పటికీ, చిన్న మొత్తంతో ముందుగా పెట్టుబడిని ప్రారంభించటం ముఖ్యం. ఆ తర్వాత ప్రతి ఏడాది ఆదాయం పెరిగిన కొద్దీ, సిప్‌ మొత్తాన్ని కొంత పెంచుతూ వెళ్ళవచ్చు.
– ఆలస్యంగా మదుపు ప్రారంభించినవారికి (40 ఏళ్ల తర్వాత) సమయం తక్కువగా ఉంటుంది. ఇలాంటివారికి సాధారణ సిప్‌ సరిపోవకపోవచ్చు. ఉదాహరణకి, 45 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.10,000 సిప్‌ చేశారని అనుకుందాం. 15 ఏళ్లలో 13 శాతం రాబడి అంచనాతో, మొత్తం రూ.88,82,196 మాత్రమే జమ చేయగలరు. కానీ అదే వ్యక్తి ప్రతీ ఏడాది 15 శాతం పెంపు చేస్తూ సిప్‌ కొనసాగిస్తే, 15 ఏళ్లలో రూ.1,20,77,377 వరకు సంపదను సృష్టించగలరు.
– ప్రారంభం ఆలస్యమైనా, ప్రతి ఏడాది కొద్దిగా పెంపు చేయడం ద్వారా పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. కొత్తగా ఉద్యోగం ప్రారంభించినవారికి, వయసు ఎక్కువైన వారికి స్టెప్‌-అప్‌ సిప్‌ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

 

131
MUTUAL FUNDS Tags:Earning Crores Is Possible!, Here Are the Benefits…, How Much Should You Increase?, Key Benefits of Step-Up SIP, Precautions to Take with Step-Up SIP, Regular SIP vs Step-Up SIP, SIP… Building Your Future with Step-Up!, What Is a Step-Up SIP?, Who Is Step-Up SIP Suitable For?, Why Is Step-Up SIP Necessary?, With Step-Up SIP

Post navigation

Previous Post: రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts!
Next Post: ఖ‌ర్చుల‌కు ఏ మాత్రం త‌గ్గేదేలే..! భవిష్యత్తుపై భారతీయుల్లో అధిక విశ్వాసం No Let-Up in Spending..! Indians Show Strong Confidence in the Future

Related Posts

  • మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే.. MUTUAL FUNDS
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option FINICAL PLANNING
  • ఇలా చేస్తే సిప్ మ‌రింత లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఇలా.. MUTUAL FUNDS
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • ఫండ్‌లలో మరింత పారదర్శకత..మరిన్ని సంస్కరణలకు సెబీ ఆమోదం.. Greater Transparency in Funds… SEBI Approves More Reforms MUTUAL FUNDS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • IPO అంటే ??? MARKET
  • థింక్‌ అండ్ గ్రో రిచ్ బుక్ స‌మ‌రీ Think and grow rich book summery telugu BOOKS
  • మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now? FEATURE NEWS
  • మ‌నీ మాస్ట‌ర్ ది గేమ్ బుక్ స‌మ‌రీ money master the game book summary telugu BOOKS
  • టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ఇవే … మూడేళ్ల‌లో 25% పైగా రాబడి! Top 5 Mid-Cap Mutual Funds… Over 25% Returns in 3 Years! MUTUAL FUNDS
  • వారెన్ బఫెట్.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సూచనలు | దీర్ఘకాలిక సంపద రహస్యాలు Mutual Funds Investing Tips from Warren Buffett | Long-Term Wealth Secrets | Mutual Funds 2025 MUTUAL FUNDS
  • ఈ వెబ్‌సైట్లను మిస్ అవ్వొద్దు what are the important websites for stock market news FEATURE NEWS
  • బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips! FINICAL PLANNING

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme