Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

 యూపీఐ పిన్ మర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌..! నిమిషాల్లో కొత్తది ఇలా సెట్ చేసుకోండి! Forgot Your UPI PIN? No Tension! Set a New One in Just Minutes

Posted on 27/02/2026 By admin No Comments on  యూపీఐ పిన్ మర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌..! నిమిషాల్లో కొత్తది ఇలా సెట్ చేసుకోండి! Forgot Your UPI PIN? No Tension! Set a New One in Just Minutes

ఒకప్పుడు జేబులో నగదు లేకపోతే పనులు ఆగిపోయేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్‌ వరకు, కూరగాయల బండిపై నుంచి కార్పొరేట్‌ ఆఫీస్‌ వరకు… ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపులే రాజ్యమేలు తున్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా, చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు. క్షణాల్లో పేమెంట్‌ పూర్తయిపోతోంది. ఈ డిజిటల్‌ విప్లవానికి కేంద్రబిందువుగా నిలిచింది యూపీఐ. బ్యాంక్‌ ఖాతా నుంచి నేరుగా డబ్బులు పంపించే ఈ సులభమైన వ్యవస్థ కోట్ల మందిని నగదు లేని లావాదేవీల వైపు నడిపించింది. అయితే, యూపీఐ వాడకం పెరిగే కొద్దీ చాలామందిలో చిన్న చిన్న సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ పిన్ (UPI PIN) మర్చిపోతే ఏం చేయాలి? మొదటిసారి యూపీఐని ఎలా సెట్‌ చేయాలి? మొబైల్‌ నంబర్‌ మారితే పరిస్థితి ఏంటి? పిన్‌ మార్చుకోవడం ఎందుకు అవసరం? వంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీఐకి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను సులభమైన భాషలో, స్పష్టంగా ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిటల్‌ చెల్లింపుల యుగం.. Rise of Digital Payments in India
భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఒక అలవాటుగా మారాయి. ఉదయం పాలు కొనేందుకు, మధ్యాహ్నం భోజనం కోసం, సాయంత్రం ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం… ప్రతిదీ యూపీఐ ద్వారానే జరుగుతోంది. నగదు వెంట మోసుకెళ్లే అవసరం లేకుండా, చిల్లర సమస్యలు లేకుండా, క్యూల్లో నిలబడకుండా చెల్లింపులు చేయడం సాధ్యమవుతోంది. ప్రభుత్వం కూడా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంతో, బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు యూపీఐ ఆధారిత సేవలను మరింత సులభతరం చేశాయి. ఫలితంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ యూపీఐని ఉపయోగించడం ప్రారంభించారు.

యూపీఐ అంటే ఏమిటి? What Exactly Is UPI
యూపీఐ (UPI PIN)అంటే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌. ఇది మీ బ్యాంక్‌ ఖాతాను నేరుగా మొబైల్‌ యాప్‌తో అనుసంధానించి, తక్షణమే డబ్బులు పంపించే, స్వీకరించే సదుపాయం. బ్యాంక్‌ ఖాతా సంఖ్యలు గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు. యూపీఐ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు. ఈ మొత్తం వ్యవస్థ వెనుక దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ ఉంటుంది. అందుకే యూపీఐ లావాదేవీలు వేగంగా, భద్రంగా జరుగుతాయి.

మొదటిసారి యూపీఐని ఎలా సెట్‌ చేయాలి? How to Set Up UPI for the First Time
మీరు తొలిసారి యూపీఐ (UPI PIN)ఉపయోగించాలనుకుంటే, ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా మీ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయి ఉండాలి. అదే యూపీఐకి ప్రాణం. ఇప్పటి కాలంలో చాలామంది ఉపయోగిస్తున్న యూపీఐ యాప్‌లలో Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లు ప్రముఖంగా ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత, మీ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి. ఈ సమయంలో యాప్‌ మీ నంబర్‌ను వెరిఫై చేయడానికి ఒక ఎస్ఎంఎస్‌ పంపిస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత, యాప్‌లో కనిపించే ‘Add Bank Account’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ బ్యాంక్‌ పేరును సెలెక్ట్‌ చేస్తే, యాప్‌ మీ ఖాతా వివరాలను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఆ తర్వాత మీ డెబిట్‌ కార్డ్‌ వివరాలు అడుగుతారు. సాధారణంగా కార్డ్‌ చివరి ఆరు అంకెలు, ఎక్స్‌పైరీ డేట్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఖాతా యజమానేనని నిర్ధారించుకునే భద్రతా చర్య. ఇవన్నీ పూర్తయిన తర్వాత, మీరు మీకు నచ్చిన నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్‌ను సెట్‌ చేసుకోవాలి. ఈ పిన్‌ మీ డిజిటల్‌ తాళం లాంటిది. దీన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. పిన్‌ సెట్‌ చేసిన క్షణం నుంచే మీ యూపీఐ యాక్టివ్‌ అయిపోతుంది.

కొత్త మొబైల్‌ నంబర్‌పై యూపీఐ సెట్‌ చేయడం .. Setting Up UPI After Changing Mobile Number
కాలక్రమంలో చాలామంది మొబైల్‌ నంబర్‌ మార్చుకుంటారు. అయితే, యూపీఐ విషయంలో ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మీ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయిన నంబర్‌ మారితే, పాత నంబర్‌తో ఉన్న యూపీఐ ఇక పనిచేయదు. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే, కొత్త మొబైల్‌ నంబర్‌ను మీ బ్యాంక్‌ ఖాతాలో అప్‌డేట్‌ చేయించుకోవడం. ఇందుకోసం బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలి. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌లోనూ ఈ సదుపాయం ఇస్తున్నాయి. నంబర్‌ అప్‌డేట్‌ అయిన తర్వాత, పాత యూపీఐ(UPI PIN) యాప్‌లో లాగౌట్‌ కావాలి. ఆపై కొత్త నంబర్‌తో మళ్లీ యాప్‌లో రిజిస్టర్‌ కావాలి. తర్వాత, మొదటిసారి యూపీఐ సెట్‌ చేసినప్పుడు చేసిన విధంగానే బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేసి, డెబిట్‌ కార్డ్‌ వివరాలతో కొత్త యూపీఐ పిన్‌ను సెట్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితే, మీ కొత్త నంబర్‌పై యూపీఐ మళ్లీ యాక్టివ్‌ అవుతుంది.

యూపీఐ పిన్‌ ఎందుకు అంత ముఖ్యమైంది? Why UPI PIN Is Crucial
యూపీఐ పిన్‌ (UPI PIN)అనేది మీ డిజిటల్‌ ఖాతాకు రక్షణ కవచం. ఇది లేకుండా ఎవరూ మీ ఖాతా నుంచి డబ్బులు పంపలేరు. అందుకే పిన్‌ ఎంపికలో చాలా జాగ్రత్త అవసరం. సాధారణంగా వరుస అంకెలు, పుట్టిన తేదీలు, మొబైల్‌ నంబర్‌ లాంటి సులభంగా ఊహించగలిగే సంఖ్యలను పిన్‌గా పెట్టకూడదు. మీకు మాత్రమే గుర్తుండేలా, ఇతరులు ఊహించలేని సంఖ్యలను ఎంచుకోవడం భద్రతకు మంచిది.

యూపీఐ పిన్‌ మార్చుకోవడం ఎలా? How to Change or Reset UPI PIN
భద్రతా కారణాల దృష్ట్యా, తరచూ యూపీఐ పిన్‌(UPI PIN)ను మార్చుకోవడం మంచిదే. ముఖ్యంగా మీ పిన్‌ ఎవరికైనా తెలిసిందని అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా మార్చేయాలి. యూపీఐ పిన్‌ మార్చుకోవడం చాలా సులభమైన ప్రక్రియ. మీరు ఉపయోగిస్తున్న యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌ సెక్షన్‌కు వెళ్లాలి. అక్కడ మీరు లింక్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా వివరాలు కనిపిస్తాయి. అక్కడ ‘Change PIN’ లేదా ‘Reset PIN’ అనే ఆప్షన్‌ ఉంటుంది. మీకు పాత పిన్‌ గుర్తుంటే, ‘Change PIN’ ఎంచుకుని పాత పిన్‌ ఎంటర్‌ చేసి కొత్త పిన్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ పాత పిన్‌ పూర్తిగా మర్చిపోయినట్లయితే, ‘Reset PIN’ ఆప్షన్‌ ఉపయోగించాలి. ఈ సమయంలో యాప్‌ మీ డెబిట్‌ కార్డ్‌ వివరాలను అడుగుతుంది. అవి సరైనవని నిర్ధారించిన తర్వాత, కొత్త యూపీఐ పిన్‌ను సెట్‌ చేసుకునే అవకాశం ఇస్తుంది.

డిజిటల్‌ చెల్లింపుల్లో జాగ్రత్తలు తప్పనిసరి.. Safety Tips While Using UPI
యూపీఐ (UPI PIN)ఎంత సౌకర్యవంతమైనదో, అంతే బాధ్యతతో వాడాల్సిన వ్యవస్థ కూడా. డిజిటల్‌ చెల్లింపులు పెరిగే కొద్దీ, మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే కొన్ని మౌలిక జాగ్రత్తలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. డబ్బులు పంపేటప్పుడే యూపీఐ పిన్‌ అవసరం. డబ్బులు స్వీకరించడానికి ఎప్పటికీ పిన్‌ అవసరం లేదు. ఎవరైనా ‘మీకు డబ్బులు పంపుతాను, పిన్‌ చెప్పండి’ అని అడిగితే, అది ఖచ్చితంగా మోసమే. బ్యాంక్‌ అధికారులు అని చెప్పుకునే వారు కూడా మీ యూపీఐ పిన్‌, ఓటీపీ లేదా డెబిట్‌ కార్డ్‌ వివరాలను అడగరు. అలాంటి కాల్స్‌ వస్తే వెంటనే కట్‌ చేయాలి. అలాగే, అనవసరమైన థర్డ్‌ పార్టీ యాప్‌లు, స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయకుండా ఉండటం మంచిది. ఇవి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంటుంది.

భవిష్యత్తు డిజిటల్‌… బాధ్యత మనదే.. Digital Future, Shared Responsibility
యూపీఐ (UPI PIN)మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. ఇది మన సమయాన్ని ఆదా చేస్తోంది, లావాదేవీలను సులభతరం చేస్తోంది. కానీ, అదే సమయంలో భద్రతపై మనమే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సరైన అవగాహన, చిన్న జాగ్రత్తలు పాటిస్తే యూపీఐ ద్వారా లావాదేవీలు సురక్షితంగా, సాఫీగా సాగుతాయి. మీ యూపీఐ పిన్‌ మీ రహస్యం. దాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. డిజిటల్‌ యుగంలో ముందుకు సాగాలంటే, సాంకేతికతను మాత్రమే కాదు… దానితో వచ్చే బాధ్యతను కూడా మనం అర్థం చేసుకోవాలి.

188
FEATURE NEWS Tags:Digital Future, How to Change or Reset UPI PIN, How to Set Up UPI for the First Time, Rise of Digital Payments in India, Safety Tips While Using UPI, Setting Up UPI After Changing Mobile Number, Shared Responsibility, What Exactly Is UPI, Why UPI PIN Is Crucial

Post navigation

Previous Post: టోల్ ప్లాజా దాటుతున్నారా? ఈ పత్రాలు లేకపోతే క‌ష్ట‌మే! No Valid Documents? Digital System Issues eChallan Instantly
Next Post: ఉమ్మడి రుణం ఇలా చెల్లిస్తే మేలు.. Smart Ways for Couples to Manage Joint Loans

Related Posts

  • 1947 నుండి 2025 వరకు రూపాయి కథ.. Rupee’s Journey: From 1947 to 2025 FEATURE NEWS
  • ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • అపర కుబేరులు.. దాతృత్వంలోనూ గొప్పోళ్లు! రోజుకీ రూ.7.4 కోట్ల విరాళం Modern Tycoons Shine in Charity Too: ₹7.4 Crore Donations Every Day! FEATURE NEWS
  • మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు తెలుసుకుందామా! Mobile vs Internet Banking: Know the Key Services FEATURE NEWS
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొన‌చ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card? FEATURE NEWS
  • డీ మ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి FEATURE NEWS
  • ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ‌ చరిత్రాత్మక నిర్ణయం.. బోన‌స్ షేర్ల జారీకి ఆమోదం..! Historic Decision by State-Owned Life Insurance Giant… Bonus Share Issue Approved! FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హెచ్చరిక: కేవైసీ పేరుతో కొత్త మోసాల ముప్పు .. Alert for Mutual Fund Investors: New KYC Scams on the Rise FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • ChatGPT ఉపయోగించి మంచి Mutual Funds ఎలా కనుగొనాలి? How to find Mutual Funds using ChatGPT? MUTUAL FUNDS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme