Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో కొత్త అధ్యాయం.. Mutual Fund Reclassification – A New Era of Transparency

Posted on 27/02/2026 By admin No Comments on మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో కొత్త అధ్యాయం.. Mutual Fund Reclassification – A New Era of Transparency

భారత మ్యూచువల్‌ ఫండ్ (Mutual Fund) పరిశ్రమ రంగం కీలక మలుపు తిరిగింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడం, పథకాల పేర్లలో గందరగోళాన్ని తొలగించడం, రిస్క్‌–రిటర్న్‌ అంశాల్లో స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ Securities and Exchange Board of India (సెబీ) మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల వర్గీకరణను పూర్తిగా పునఃసమీక్షించింది. ఈ మార్పుల్లో భాగంగా ఇప్పటివరకు కొనసాగిన సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ పథకాల విభాగానికి చరమగీతం పాడుతూ, లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ పేరుతో పూర్తిగా కొత్త విభాగాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయం మ్యూచువల్‌ ఫండ్‌ రంగాన్ని మరింత పారదర్శకంగా, పెట్టుబడిదారులకు అర్థమయ్యేలా మార్చనుంది.

ఎందుకు ఈ మార్పులు అవసరమయ్యాయి? Why SEBI Revisited Mutual Fund Rules
గత దశాబ్దంలో మ్యూచువల్‌ ఫండ్ (Mutual Fund) పరిశ్రమ వేగంగా విస్తరించింది. వందల సంఖ్యలో కొత్త పథకాలు, ఆకర్షణీయమైన పేర్లు, అధిక రాబడుల హామీలు… ఇవన్నీ కలిసి సాధారణ పెట్టుబడిదారుడికి గందరగోళాన్ని సృష్టించాయి. ఒకే రకమైన రిస్క్‌ ఉన్న పథకాలు వేర్వేరు పేర్లతో ఉండటం, పేర్లు చూస్తే భద్రతగా అనిపించే పథకాలు వాస్తవంలో ఎక్కువ ముప్పు కలిగి ఉండటం వంటి పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే సెబీ జోక్యం చేసుకుంది. పథకం పేరు వింటేనే దాని స్వభావం అర్థమయ్యేలా ఉండాలి, పెట్టుబడిదారుడు తప్పుదోవ పట్టే అవకాశమే ఉండకూడదు అన్నదే సెబీ ప్రధాన ఉద్దేశ్యం.

ఐదు విభాగాలుగా మ్యూచువల్‌ ఫండ్లు .. Five Broad Categories Explained
– తాజా మార్పులతో మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund)పథకాలను సెబీ ఐదు ప్రధాన విభాగాలుగా విభజించింది. ఈ వర్గీకరణ ద్వారా పథకాలు ఏ రకానికి చెందినవో పెట్టుబడిదారుడు సులువుగా గుర్తించగలుగుతాడు. ఈక్విటీ పథకాలు ప్రధానంగా షేర్లలో పెట్టుబడులు పెడతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టి లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఇవి అనుకూలం. అయితే, మార్కెట్‌ ఒడిదుడుకుల కారణంగా తాత్కాలికంగా విలువ తగ్గే అవకాశం ఉంటుంది.
– డెట్‌ పథకాలు ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. భద్రత, స్థిరత్వం కోరే పెట్టుబడిదారులకు ఇవి ఉపయోగపడతాయి.
– హైబ్రిడ్‌ పథకాలు ఈక్విటీ, డెట్‌ రెండింటి మిశ్రమంగా ఉంటాయి. రిస్క్‌ను నియంత్రిస్తూ వృద్ధి అవకాశాలు పొందాలనుకునే వారికి ఇవి సరైన మార్గం.
– కొత్తగా ప్రవేశపెట్టిన లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదారుల జీవిత దశలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి.
– ఇతర పథకాల విభాగంలో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్స్‌, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ వంటి పాసివ్‌ పథకాలను చేర్చారు.

పథకాల పేర్లలో ఏకరీతి.. Uniform Naming to Avoid Confusion
ఇప్పటివరకు మ్యూచువల్‌ ఫండ్‌(Mutual Fund) పథకాల పేర్లు చాలాసార్లు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మాత్రమే ఉండేవి. “సూపర్‌ రిటర్న్‌”, “గ్యారంటీ గ్రోత్‌” వంటి పదాలు వాస్తవానికి ఆ పథకం చేసే పెట్టుబడులను స్పష్టంగా తెలియజేయవు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు సెబీ కఠిన నిర్ణయం తీసుకుంది. పథకం పేరు తప్పనిసరిగా అది చెందిన విభాగాన్ని ప్రతిబింబించాలి. రాబడులు లేదా లాభాలను సూచించే పదాలు ఇకపై పథకాల పేర్లలో ఉండకూడదు. ఆఫర్‌ పత్రాలు, ప్రకటనల్లో పథకం స్వభావం, రిస్క్‌ స్థాయి, పెట్టుబడి విధానం సెబీ నిర్దేశించిన విధంగానే వెల్లడించాలి.

సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ పథకాల ముగింపు.. Curtain Call for Solution Oriented Schemes
పదవీ విరమణ, పిల్లల చదువులు, పెళ్లి వంటి జీవిత అవసరాలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ పథకాలు ఇప్పటివరకు ప్రత్యేక విభాగంగా కొనసాగాయి. అయితే, వీటి నిర్మాణం చాలా వరకు హైబ్రిడ్‌ లేదా డెట్‌ పథకాలతో సమానంగా ఉండటంతో పెట్టుబడిదారులకు స్పష్టత లేకుండా పోయింది. ఈ కారణంగా సెబీ ఈ విభాగాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ విభాగంలోని ప్రస్తుత పథకాల్లోకి కొత్త పెట్టుబడిదారులను చేర్చుకోవడం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పథకాలను సమానమైన రిస్క్‌ ప్రొఫైల్‌ ఉన్న ఇతర విభాగాల పథకాలలో విలీనం చేయాలని సూచించింది. ఇందుకు ముందుగా సెబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ అంటే ఏమిటి? What Are Life Cycle Funds?
లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ అనేవి లక్షిత కాలపరిమితితో కూడిన ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund)పథకాలు. ఇవి పెట్టుబడిదారుడి వయస్సు, ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఆటోమేటిక్‌గా పెట్టుబడి కేటాయింపులను మార్చుకుంటాయి. ఈ పథకాలను కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ముప్పై ఏళ్ల కాలపరిమితితో తీసుకురావచ్చని సెబీ స్పష్టం చేసింది. ఐదేళ్ల గుణకంతో ఈ కాలపరిమితులు నిర్ణయించవచ్చు.

కాలంతో మారే పెట్టుబడి వ్యూహం.. Automatic Asset Allocation Over Time
లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌లో ప్రారంభ దశలో ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. కాలం గడిచే కొద్దీ, మెచ్యూరిటీ సమీపించే కొద్దీ, ఈక్విటీ కేటాయింపులు ఆటోమేటిక్‌గా తగ్గించి డెట్‌, తక్కువ రిస్క్‌ ఉన్న ఇతర అసెట్‌ క్లాసుల్లో పెట్టుబడులు పెంచుతారు. ఇది పెట్టుబడిదారుడికి ఎలాంటి యాక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ అవసరం లేకుండా, జీవిత దశలకు అనుగుణంగా పెట్టుబడిని నిర్వహించే సౌలభ్యం ఇస్తుంది.

విస్తృత అసెట్‌ కేటాయింపులు.. Diversification Beyond Equity and Debt
లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను కేవలం ఈక్విటీ, డెట్‌కే పరిమితం చేయలేదు. ఇన్విట్‌లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ కమొడిటీ డెరివేటివ్స్‌, బంగారం, వెండి ఈటీఎఫ్‌లు వంటి విభిన్న అసెట్‌ క్లాసులను కూడా అనుమతించారు. దీంతో రిస్క్‌ విభజన మెరుగుపడుతుంది. మార్కెట్‌ ఒడిదుడుకుల ప్రభావం తగ్గుతుంది.

పసిడి, వెండి ఈటీఎఫ్‌ల విలువ లెక్కింపు మార్పులు.. New Valuation Norms for Gold and Silver ETFs
మ్యూచువల్‌ ఫండ్ (Mutual Fund) సంస్థల వద్ద ఉన్న భౌతిక బంగారం, వెండి విలువ లెక్కింపు విధానంలో కూడా సెబీ కీలక మార్పులు చేసింది. ఇకపై దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రకటించే స్పాట్‌ ధరలను ఆధారంగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ కొత్త విధానం 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న లండన్‌ బులియన్‌ మార్కెట్‌ ధరల ఆధారిత విధానానికి ఇది ముగింపు.

సోషల్‌ మీడియా పోస్టులకు కఠిన నిబంధనలు.. Mandatory Disclosures on Social Media
సామాజిక మాధ్యమాల్లో పెట్టుబడులపై సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, అదే సమయంలో తప్పుదోవ పట్టించే సమాచారం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెబీ కఠిన ఆదేశాలు జారీ చేసింది. తన నియంత్రణలోని సంస్థలు లేదా వాటి ఏజెంట్లు సోషల్‌ మీడియాలో సెక్యూరిటీస్‌ మార్కెట్‌కు సంబంధించిన పోస్టులు చేస్తే, తమ రిజిస్ట్రేషన్‌ పేరు, రిజిస్ట్రేషన్‌ సంఖ్య తప్పనిసరిగా వెల్లడించాలి. ఈ నిబంధనలు స్టాక్‌ బ్రోకర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, పెట్టుబడి సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు, ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు వర్తిస్తాయి.

పెట్టుబడిదారులకు లాభమే లక్ష్యం.. Investor Protection at the Core
సెబీ తీసుకొచ్చిన ఈ మార్పులన్నింటి వెనుక ఒకే లక్ష్యం ఉంది—పెట్టుబడిదారుడు సరైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. పథకం పేరు వింటేనే దాని స్వభావం అర్థమయ్యేలా చేయడం, రిస్క్‌ను దాచిపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవడం, దీర్ఘకాల పెట్టుబడులకు క్రమబద్ధమైన మార్గదర్శకాన్ని అందించడం ఈ మార్పుల సారాంశం. లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ ద్వారా యువత నుంచి పదవీ విరమణ దశ వరకు ఒకే పెట్టుబడి ప్రయాణం సుస్పష్టంగా సాగుతుంది. మరోవైపు, సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ పథకాల రద్దుతో మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో ఉన్న గందరగోళం చాలా వరకు తొలగనుంది. మొత్తంగా చూస్తే, ఈ మార్పులు మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund)పరిశ్రమను మరింత పరిపక్వత దిశగా తీసుకెళ్తూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా నిలుస్తాయి.

191
FEATURE NEWS Tags:Automatic Asset Allocation Over Time, Curtain Call for Solution Oriented Schemes, Diversification Beyond Equity and Debt, Five Broad Categories Explained, Investor Protection at the Core, Mandatory Disclosures on Social Media, New Valuation Norms for Gold and Silver ETFs, Uniform Naming to Avoid Confusion, What Are Life Cycle Funds?, Why SEBI Revisited Mutual Fund Rules

Post navigation

Previous Post: బంగారం వద్దు.. వెండి ముద్దు! Changing Trends in the Indian Jewellery Market
Next Post: బంగారం, వెండిలో మీ సంపదను ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..? How Should You Invest Your Wealth in Gold and Silver?

Related Posts

  • 5 సెకన్లలో డబ్బు ట్రాన్స్‌ఫర్… యూపీఐ వెనక సాంకేతిక రహస్యం! Money Transfer in 5 Seconds: The Technology Behind UPI FEATURE NEWS
  • యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds! FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit FEATURE NEWS
  • ఉద్యోగులకు వేగంగా ల‌భ్య‌మ‌య్యే రుణాలేంటో తెలుసా? Do You Know Which Loans Salaried Employees Can Get Quickly? FEATURE NEWS
  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హెచ్చరిక: కేవైసీ పేరుతో కొత్త మోసాల ముప్పు .. Alert for Mutual Fund Investors: New KYC Scams on the Rise FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options MARKET
  • బీమా పాలసీల్లో ఉండే కొన్ని కీలక మినహాయింపులు తెలుసుకున్నారా! లేకుంటే న‌ష్ట‌మే! Do You Know the Key Exclusions in Insurance Policies? Ignore Them and You Could Pay a Heavy Price! INSURANCE
  • రెండు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? క్లెయిమ్‌లో చిన్న తప్పు చేస్తే భారీ నష్టమే!  Have Two Health Insurance Policies? One Mistake Can Cost You Big!  INSURANCE
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed! FEATURE NEWS
  • ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మార్పులివే.. అన్ని రంగాల‌పై ప్రభావం! New Financial Year Brings Major Changes Across Sectors FEATURE NEWS
  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేయక్కర్లేదు.. కెమెరా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. No Need to Scan QR: Easy UPI Payments Without Camera FEATURE NEWS
  • difference between Rich mindset And Poor mindset ధ‌నికుల‌కు పేద‌ల‌కు ఆలోచ‌న‌ల్లో ఉండే తేడా ఏమిటి FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme