భర్త నుంచి భార్యకు ఇచ్చే గిఫ్ట్‌పై ఆదాయపు పన్ను ఉండదు. భార్యకు డబ్బు గిఫ్ట్‌గా ఇవ్వడం సాధారణమే. అయితే, ఆ మొత్తం ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను (ITR) దాఖలు చేసే సమయంలో కొన్ని కీలక నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే అనవసరంగా పన్ను నోటీసులు రావొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(vii) ప్రకారం, భర్త–భార్య మధ్య జరిగే గిఫ్టులు పూర్తిగా పన్ను మినహాయింపులో ఉంటాయి. కాబట్టి రూ.10 లక్షలు గిఫ్ట్ ఇచ్చినా, భార్యకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ నగదును ఆమె తన ఐటీఆర్‌లో ‘పన్ను మినహాయింపు ఆదాయం’ (Exempt Income)గా చూపించుకోవచ్చు. కానీ ఆ డబ్బుతో వచ్చే ఆదాయంపై మాత్రం భర్తే పన్ను చెల్లించాలి. కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ నిబంధనలను తప్పక గుర్తుంచుకోవాలి.
క్లబ్బింగ్ నిబంధన గుర్తుంచుకోండి..Remember the Clubbing of Income Rule
భర్త ఇచ్చిన నగదు గిఫ్ట్ (Gifting a Large Amount )ను భార్య బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, ఆపై వచ్చే వడ్డీ లేదా ఆ డబ్బుతో చేసిన పెట్టుబడుల లాభం మాత్రం భార్య ఆదాయంగా కాకుండా భర్త ఆదాయంగా పరిగణిస్తారు. దీనినే ‘క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్’ అంటారు. అందువల్ల ఆ వడ్డీ లేదా లాభాన్ని భర్త తన ఐటీఆర్‌లో చూపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ భార్యకు రూ.10 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చారని అనుకుందాం. ఆమె ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టింది. ఆ ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం ఆమె బ్యాంక్ ఖాతాలోకే జమ అవుతుంది. అయితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64(1)(iv) ప్రకారం, ఆ వడ్డీ ఆదాయాన్ని భార్య ఆదాయంగా పరిగణించరు.
ఆస్తి కొంటే ఎవరి ఖాతాలో ఆదాయం? Whose Account Will the Income Be Taxed In If You Buy Property?
భర్త ఇచ్చిన గిఫ్ట్ డబ్బుతో (Gifting a Large Amount ) భార్య ఆస్తి కొనుగోలు చేసినా, దానిపై వచ్చే అద్దె లేదా అమ్మకం లాభం నిధులు సమకూర్చిన భర్త ఆదాయంగానే పరిగణిస్తారు. దీంతో ఆ ఆదాయంపై పన్ను భారం భర్తపైనే ఉంటుంది. భార్యకు పెద్ద మొత్తంలో నగదును బహుమతిగా ఇవ్వడం లేదా ఆమె పేరు మీద ఆస్తులు కొనుగోలు చేయడం చాలామందిలో సాధారణమే. అయితే, ఇవన్నీ ఆదాయపు పన్ను నిబంధనలకు లోబడి ఉంటాయి. సరైన అవగాహన లేకుంటే ఐటీఆర్ దాఖలు సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఆస్తి రిజిస్ట్రేషన్ భార్య పేరు మీద ఉందని మాత్రమే పన్ను బాధ్యత ఆమెపైకి మారదు. నిధులు సమకూర్చిన వ్యక్తే ఆ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అద్దె ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్‌ను భర్త ఐటీఆర్‌లో చూపడం తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64(1) ప్రకారం ఈ ఆదాయాన్ని భర్త తన ఐటీఆర్‌లోనే రిపోర్ట్ చేయాలి. భార్య పేరు మీద ఆస్తి కొనుగోలు చేయడం తప్పుకాదు. కానీ పన్ను నిబంధనలను దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికతో ఐటీఆర్ ఫైల్ చేస్తేనే అనవసర నోటీసులు, పన్ను చిక్కులు దూరమవుతాయి.
ఐటీఆర్‌లో ఎలా చూపాలి? How Should It Be Reported in the ITR?
– గిఫ్ట్ మొత్తాన్ని భార్య తన ఐటీఆర్‌లో ఆదాయంగా చూపాల్సిన అవసరం లేదు.
– అయితే ‘ఎగ్జెంప్ట్ ఇన్‌కమ్’ కాలమ్‌లో గిఫ్ట్‌గా పొందిన మొత్తం వివరాలు ఇవ్వడం మంచిది.
– భర్త తన ఐటీఆర్‌లో గిఫ్ట్ వల్ల వచ్చిన వడ్డీ లేదా లాభాన్ని చూపాలి.
డాక్యుమెంట్లు భద్రపరుచుకోండి..Keep the Documents Safely
భవిష్యత్తులో పన్ను శాఖ ప్రశ్నిస్తే ఉపయోగపడేందుకు, గిఫ్ట్ డీడ్ లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలను భద్రంగా ఉంచుకోవాలి. చెక్, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ వంటి మార్గాల్లో గిఫ్ట్ ఇవ్వడం ఉత్తమం. నగదు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ మార్గాన్ని ఉపయోగించడం ఉత్తమం. గిఫ్ట్ డీడ్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు భద్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ పన్ను శాఖ ప్రశ్నిస్తే ఆధారాలుగా ఉపయోగపడతాయి.
పత్రాలు ఎందుకు అవసరం? Why Are These Documents Necessary?
భారీ మొత్తాల్లో లావాదేవీలు జరిగినప్పుడు నిధుల మూలాన్ని నిరూపించాల్సి ఉంటుంది. అందుకే గిఫ్ట్ డీడ్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాత ఐటీఆర్ కాపీలు వంటి పత్రాలను భద్రపరుచుకోవాలి. ఇవన్నీ ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చినప్పుడు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయి.
ఒకే ఆదాయంపై రెండు ట్యాక్స్‌లు పడకూడదంటే.. To Avoid Paying Tax Twice on the Same Income…
భార్య పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఇతర పెట్టుబడులు ఉంటే, వాటిపై వచ్చే వడ్డీ విషయంలో చాలామందికి ట్యాక్స్ గందరగోళం ఏర్పడుతోంది. కారణం బ్యాంకుల రిపోర్టింగ్ విధానమే. సాధారణంగా బ్యాంకులు వడ్డీ ఆదాయాన్ని డిపాజిట్ ఎవరి పేరు మీద ఉందో వారి పాన్ (PAN) కార్డుకు అనుసంధానించి రిపోర్ట్ చేస్తాయి. దీంతో ఆ వడ్డీ వివరాలు భార్య ఏఐఎస్ (AIS) లేదా ఫ్రీ-ఫిల్డ్ ఐటీఆర్‌లో కనిపిస్తాయి. ఈ వడ్డీ ఆదాయం ‘క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్’ నిబంధనల ప్రకారం భర్త ఆదాయానికి కలవాల్సినదే. కానీ దీన్ని సరిగా చూపకపోతే, భార్య ఖాతాలో కనిపించినందుకే ఆమెపై పన్ను, అదే ఆదాయాన్ని భర్త ఐటీఆర్‌లో చూపితే ఆయనపై మరోసారి పన్ను పడే ప్రమాదం ఉంది. అంటే ఒకే ఆదాయంపై రెండు ట్యాక్స్‌లు! బ్యాంక్ రికార్డులు, ఏఐఎస్ డేటా కారణంగా ఒకే ఆదాయంపై రెండు సార్లు పన్ను పడే అవకాశముంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో సమన్వయంతో సరైన వివరాలు నమోదు చేస్తేనే ట్యాక్స్ చిక్కులు దూరమవుతాయి.
దీనిని ఎలా నివారించాలి? How to Prevent This?
– భార్య ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు, ఏఐఎస్‌లో కనిపించే ఆ వడ్డీ ఆదాయాన్ని తన మొత్తం ఆదాయంలో నుంచి మినహాయించాలి.
– అదే సమయంలో, ఆ వడ్డీ ఆదాయాన్ని తన భర్త ఆదాయానికి క్లబ్ చేశానని ‘రిమార్క్స్’ (Remarks) కాలమ్‌లో స్పష్టంగా పేర్కొనాలి.
– ఏఐఎస్ ఫీడ్‌బ్యాక్‌లో కూడా సంబంధిత భర్త పాన్ వివరాలను జత చేయాలి.
– భర్త తన ఐటీఆర్‌లో ‘ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ కింద ఆ వడ్డీ ఆదాయాన్ని తప్పనిసరిగా చూపాలి.
భార్యకు రూ.10 లక్షలకు మించి నగదు గిఫ్ట్ ఇస్తే… If You Gift More Than ₹10 Lakh in Cash to Your Wife…
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భర్త నుంచి భార్యకు ఇచ్చే నగదు గిఫ్ట్‌పై ఎలాంటి పన్ను ఉండదు. గిఫ్ట్ మొత్తం ఎంతైనా – రూ.10 లక్షలు, రూ.20 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ అయినా .. భార్యకు పన్ను చెల్లించే బాధ్యత లేదు. ఇది సెక్షన్ 56 ప్రకారం పూర్తిగా పన్ను మినహాయింపులోకి వస్తుంది. భార్య తన ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు, ఈ నగదు గిఫ్ట్‌ను ఆదాయంగా చూపాల్సిన అవసరం లేదు. అయితే ‘ఎగ్జెంప్ట్ ఇన్‌కమ్’ (Exempt Income)గా పేర్కొనడం మంచిది. దీంతో భవిష్యత్తులో పన్ను శాఖ నుంచి ప్రశ్నలు రావు. అయితే గిఫ్ట్‌తో వచ్చిన ఆదాయంపై పన్నును భర్తే చెల్లించాలి. పన్ను శాతం భర్త వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ఉంటుంది
భార్యకు విలువైన గోల్డ్ ఆభరణాలు ఇస్తే పన్ను ఉంటుందా? Is There Any Tax If You Gift Valuable Gold Jewellery to Your Wife?
భార్యకు బంగారం బహుమతిగా ఇవ్వడం భారతీయ కుటుంబాల్లో సాధారణమే. నగదు మాత్రమే కాదు, గోల్డ్ ఆభరణాలు, గోల్డ్ బాండ్ల రూపంలో కూడా పెట్టుబడులు చేస్తున్నారు. అయితే వీటిపై ఆదాయపు పన్ను నిబంధనలు ఎలా ఉంటాయో చాలామందికి స్పష్టత లేదు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, భర్త నుంచి భార్యకు ఇచ్చే గోల్డ్ ఆభరణాలు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తాయి. గోల్డ్ విలువ ఎంతైనా సరే – లక్షలు, కోట్లు అయినా – భార్యకు వెంటనే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే, గోల్డ్ గిఫ్ట్‌పై 0% ట్యాక్స్. భార్య తన ఐటీఆర్‌లో ఈ గోల్డ్ గిఫ్ట్‌ను ఆదాయంగా చూపాల్సిన అవసరం లేదు. కావాలంటే ‘ఎగ్జెంప్ట్ ఇన్‌కమ్’గా మాత్రమే పేర్కొనవచ్చు. బంగారంతో వచ్చే వడ్డీ లేదా అమ్మక లాభం మాత్రం భర్త ఆదాయానికే కలుస్తుంది. కాబట్టి పన్ను చిక్కులు రాకుండా ఉండాలంటే ముందుగానే నిబంధనలపై అవగాహనతో ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి.
అయితే గోల్డ్ అమ్మితే పరిస్థితి ఏంటి? What Happens If the Gold Is Sold Later?
భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారాన్ని ఆమె భవిష్యత్తులో అమ్మితే, అప్పుడు అది పన్ను పరిధిలోకి వస్తుంది. గోల్డ్ అమ్మకం ద్వారా వచ్చే లాభం (Capital Gains) క్లబ్బింగ్ ఆఫ్ ఇన్‌కమ్ నిబంధనల ప్రకారం భర్త ఆదాయానికే కలుస్తుంది. 3 సంవత్సరాల లోపు అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ . అందుకే భర్త స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. 3 సంవత్సరాల తర్వాత అమ్మితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ . ఇండెక్సేషన్‌తో 20% పన్ను చెల్లించాలి.
భార్య పేరు మీద గోల్డ్ బాండ్లు (SGBs) కొంటే? What If You Buy Gold Bonds (SGBs) in Your Wife’s Name?
భర్త తన డబ్బుతో భార్య పేరు మీద సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసినా, మొదట ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఆదాయంపై నిబంధనలు వర్తిస్తాయి. SGBలపై వచ్చే వార్షిక వడ్డీ భార్య ఖాతాలో జమ అయినా, సెక్షన్ 64 ప్రకారం అది భర్త ఆదాయానికే క్లబ్ అవుతుంది. ఆ వడ్డీపై పన్ను భర్తే తన స్లాబ్ రేటు ప్రకారం చెల్లించాలి. గోల్డ్ బాండ్‌ను మెచ్యూరిటీ వరకు (8 ఏళ్లు) ఉంచితే, వచ్చే లాభంపై పన్ను పూర్తిగా మినహాయింపు ఉంటుంది. మధ్యలో అమ్మితే వచ్చే లాభం కూడా క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం భర్త ఆదాయంగా పరిగణిస్తారు. దీర్ఘకాల లాభంపై సాధారణంగా 20% పన్ను (ఇండెక్సేషన్‌తో) వర్తిస్తుంది.

