Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses FEATURE NEWS
  • మీకు రూ.ల‌క్ష వేత‌నమా? నెలకు రూ.40 వేల పెట్టుబడితో.. 13 ఏళ్లలో రూ.కోటి సాధ్య‌మే! ₹1 Lakh Salary? Invest ₹40,000 Monthly and Build ₹1 Crore in Just 13 Years! FEATURE NEWS
  • 45-50 ఏళ్లలో పదవీ విరమణ ప్రణాళిక.. ఆలస్యమైనా ఆర్థిక భద్రత సాధ్యమే.. Retirement Planning at 45-50.. It’s Never Too Late to Build Financial Security FEATURE NEWS
  • ఇ-ప్రాప్తి పోర్టల్‌తో పాత పీఎఫ్ ఖాతాలకు మళ్లీ జీవం.. EPFO’s e-Prapti Portal to Revive Forgotten PF Accounts FEATURE NEWS
  • రుణ బ‌కాయిలున్నా.. జప్తు చేయ‌ని ఆస్తులివే.. ఆర్థిక భద్రతకు చట్టాల రక్షణ.. Assets Cannot Seize Despite Loan Defaults: Legal Protection for Financial Security FEATURE NEWS
  • రోడ్ల అభివృద్ధి – భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శక విప్లవం.. Road Development – A Transformational Force Behind India’s Economic Growth FEATURE NEWS
  • డబ్బు, కుటుంబం, జీవన ప్రణాళిక – సినిమా చెప్పిన ఆర్థిక సత్యాలు.. Money, Family and Life Planning – The Financial Truths Told by a Film FEATURE NEWS
  • EPF ఖాతాలో వడ్డీ ఇంకా పడలేదా? అసలు నిజం ఇదే.. నో టెన్ష‌న్‌ ! EPF Interest Not Credited Yet? Here’s the Real Reason – No Need to Worry! FEATURE NEWS

స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail

Posted on 25/11/202525/11/2025 By admin No Comments on స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail

ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, యువతలో వ్యాపారాభిలాష.. ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతున్నాయి. ప్రత్యేకంగా స్టార్టప్‌ రంగం ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో భారత్ నుంచి మిలియన్ల స్టార్టప్‌లు వెలుగులోకి వచ్చాయి. అందులో యూనికార్న్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ప్రారంభించిన స్టార్టప్‌లలో 80–90% వరకు మొదటి 3 ఏళ్లలోనే మూతబడుతున్నాయ‌న్నది మరో వాస్తవం. స్టార్టప్‌లు ఎలా విజయం సాధిస్తాయి? ఎందుకు విఫలమవుతాయి? విజయవంతమైన స్టార్టప్‌ను ఎలా మొదలుపెట్టాలి? అనేది తెలుసుకోవడం ప్రతి యువ పారిశ్రామిక‌వేత్త‌కు ఎంతో ముఖ్యం.

స్టార్టప్ అంటే ఏమిటి? What Is a Startup?

కొత్త ఆలోచనను ఆధారంగా తీసుకుని చిన్న పెట్టుబడితో మొదలయ్యే వ్యాపార సంస్థనే స్టార్టప్ అంటారు. వివిధ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు ఇవ్వడం, సేవలను వేగంగా అందించడం, వినియోగదారుల అవసరాలను తీర్చడం. వీటన్నింటికీ స్టార్టప్‌లు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్నాయి. భారత్‌లో స్టార్టప్‌ ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు యువతలో వ్యాపార ఆలోచనలకు నూతన ఊపిరి పోశాయి.

స్టార్టప్‌ను ఎలా ప్రారంభించాలి? How to Start a Startup?
మొదటిగా “సమస్య”ని గుర్తించాలి. ప్రతి విజయవంతమైన వ్యాపారం ఒక సమస్యను పరిష్కరించడం ద్వారానే ఎదిగింది.
ఉదాహరణకు Zomato, Swiggyలు ఫుడ్ డెలివరీ సమస్యను పరిష్కరించాయి. Ola క్యాబ్ సేవలను సులభం చేసింది. Paytm డిజిటల్ పేమెంట్స్‌కి పరిష్కారం చూపింది. స్టార్టప్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు ఏమిటంటే.. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యను నేను పరిష్కరించగలను?” అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలి.

క్లీన్ బిజినెస్ మోడల్ తయారు చేయాలి..A Clean Business Model Must Be Prepared

స్టార్టప్‌కి బిజినెస్‌ మోడల్ చాలా ముఖ్యమైనది. మీరు ఏమి అందించబోతున్నారు? ఎవరికి అందించబోతున్నారు? డబ్బు ఎలా సంపాదించబోతున్నారు? మీ సేవ/ఉత్పత్తి ఎందుకు ప్రత్యేకం? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉంటేనే వ్యాపారం నిలకడగా సాగుతుంది.

మార్కెట్ రీసెర్చ్ తప్పనిసరి..Market Research Is Essential

విజయం పొందే స్టార్టప్‌ అవ్వాలంటే.. ఆ రంగంలో ఇప్పటికే ఉన్న కంపెనీలు ఏమి చేస్తున్నాయి? వారి లోపాలు ఏమిటి? ప్రజలు ఏ విధమైన సేవను ఎక్కువగా కోరుకుంటున్నారు? ఇవన్నీ అధ్యయనం చేయాలి. సరైన మార్కెట్ రీసెర్చ్‌తో స్టార్టప్‌కి బలమైన దిశ లభిస్తుంది.

కనీస ఖర్చుతో “MVP” ప్రొడక్ట్ తయారు చేయాలి.. Build an MVP Product with Minimum Cost
MVP అంటే Minimum Viable Product. అంటే పూర్తి ప్రొడక్ట్ కాకపోయినా, వినియోగదారులు ఉపయోగించేలా ఉండే మొదటి వెర్షన్. ఇది రెండు ప్రయోజనాలు ఇస్తుంది. పెట్టుబడి తక్కువ అవుతుంది. వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అసలు ఉత్పత్తిని మెరుగుపరచవచ్చు

బలమైన టీమ్..A Strong Team
ఒక్క వ్యక్తి స్టార్టప్‌ను పెద్దది చేయలేడు. టెక్నికల్ వ్యక్తి ఉండాలి. మార్కెటింగ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. ఫైనాన్స్, అకౌంట్స్ చూసుకునే వ్యక్తి ఉండాలి. కలిసికట్టుగా పనిచేసే టీమ్ ఉన్న స్టార్టప్‌లు వేగంగా ఎదుగుతాయి.

పెట్టుబడి (ఫండింగ్) Funding (Investment)

భారతదేశంలో ఇప్పుడే పెట్టుబడులు పొందడం అంత కష్టమేమీ కాదు. అయితే పెట్టుబడి తీసుకునే ముందు ..బిజినెస్ ప్లాన్ 100% క్లియర్ గా ఉండాలి. సాధారణంగా స్టార్టప్‌లు తీసుకునే ఫండింగ్ రకాలివి..
• ఏంజెల్ ఇన్వెస్టర్లు
• వెంచర్ క్యాపిటల్ సంస్థలు
• స్టార్టప్ ఇండియా నిధులు
• ప్రభుత్వ గ్రాంట్లు
• బ్యాంకు రుణాలు
• క్రౌడ్ ఫండింగ్

రిజిస్ట్రేషన్ & లీగల్ ఫార్మాలిటీలు.. Registration & Legal Formalities

• కంపెనీ రిజిస్ట్రేషన్ (Private Limited / LLP)
• GST
• ట్రేడ్‌మార్క్
• పేటెంట్స్ (సాంకేతిక ఉత్పత్తులకు)
• వ్యాపారం చట్టపరంగా బలంగా ఉండాలి.

మార్కెటింగ్ – వినియోగదారులకు చేరే మార్గం.. Marketing – The Path to Reach Consumers
ఇప్పటి కాలంలో మార్కెటింగ్ లేకుండా ఏ స్టార్టప్‌ కూడా నిలబడదు.
• సోషల్ మీడియా ప్రచారం
• డిజిటల్ అడ్స్
• ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్
• రిఫరల్ ఆఫర్లు
• డిస్కౌంట్లు
• సర్వీసులో ప్రత్యేకత
• అత్యల్ప ఖర్చుతో గరిష్ట ప్రచారం చేసే వ్యూహం అవసరం.

దేశంలో స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతున్నాయి? Why Are Startups Failing in the Country?

దేశంలో అత్య‌ధిక స్టార్టప్‌లు విఫ‌ల‌మవ‌డానికి ప్రధాన కారణాలు ఇవే—

1) సరైన ప్లానింగ్ లేకపోవడం: ఎంతో మంది ఒక ఆలోచనతో మొదలు పెడతారు. కానీ ఆలోచనను వ్యాపారంగా మార్చే స్పష్టమైన వ్యూహం ఉండదు. ఖర్చు ఎక్కడ పెరుగుతుంది? లాభం ఎప్పటి నుంచి మొదలవుతుంది? మార్కెట్లో పోటీ ఎంత ఉంది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు లేని స్టార్టప్‌లు తొందరగానే మూతపడతాయి.

2) మార్కెట్ డిమాండ్ తప్పుగా అంచనా వేయడం: చాలా స్టార్టప్‌లు తమ ఉత్పత్తి అవసరం ప్రజలకు ఎంత ఉందో ముందుగా తెలుసుకోరు. ఫలితంగా పెద్ద పెట్టుబడి పెట్టి సర్వీసులు అందిస్తే సరిపడా వినియోగదారులు దొరకరు.

3) డబ్బు వ్యయం నియంత్రించకపోవడం: ఫండింగ్ వచ్చిన వెంటనే ఆఫీస్‌ను ఫ్యాన్సీగా మార్చడం, అవసరం లేని ఉద్యోగులను నియమించడం, మార్కెటింగ్‌పై అధిక ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. డబ్బు తగ్గడంతో ఆపరేషన్లు నిలిచిపోతాయి.

4) బలహీనమైన నాయకత్వం: ఒక స్టార్టప్‌ను ముందుకు నడిపేది వ్యవస్థాపకుడి దిశ, ధైర్యం. తప్పు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అనుభవం లేకపోవడం స్టార్టప్‌లను దారితప్పిస్తాయి.

5) సరైన టీమ్ లేకపోవడం: టెక్నాలజీ తెలిసిన వ్యక్తి లేకపోవడం, మార్కెటింగ్ బలహీనంగా ఉండడం, ఫైనాన్స్ నిర్వహణలో పొరపాట్లు స్టార్టప్ విఫలమవ‌డానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

6) పోటీని తక్కువగా అంచనా వేయడం: మార్కెట్లో ఇప్పటికే ఉన్న కంపెనీలను చిన్నచూపు చూడడం కూడా పెద్ద ప్రమాదం. కొత్త స్టార్టప్‌లు ప్రత్యేకతను చూపకపోతే వినియోగదారులు మారరు.

7) వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకోకపోవడం: సేవలో లోపాలు ఉన్నా… వాటిని సరిచేయకపోవడం వల్ల స్టార్టప్‌పై నమ్మకం తగ్గుతుంది.

8) లీగల్ సమస్యలు & లైసెన్సులు: అనధికారిక సేవలు, రిజిస్ట్రేషన్ లేకపోవడం, పన్ను సమస్యలు ,చట్టపరమైన సమస్యలు కూడా చాలా స్టార్టప్‌లను ఆపేస్తాయి.

విజయం సాధించే స్టార్టప్‌లు ఎలా పనిచేస్తాయంటే? How Successful Startups Operate?
– మార్కెట్ అవసరాలను స్పష్టంగా అర్థం చేసుకుంటాయి
– ఖర్చులను నియంత్రిస్తాయి
– నాణ్యమైన సేవ/ఉత్పత్తి అందిస్తాయి
– నిరంతరం ఇన్నోవేషన్ చేస్తాయి
-కస్టమర్ల సంతృప్తిని మొదటి స్థానంలో పెట్టుకుంటాయి
– బలమైన నాయకత్వం ఉంటుంది
-డేటాను ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయి

భారత యువతకు భారీ అవకాశాలు ..Huge Opportunities for Indian Youth
• ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టం భారత్‌ది
• 75,000 పైగా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు
• డిజిటల్ పేమెంట్స్‌లో ప్రపంచంలో నంబర్-1
• యువత జనాభా అధికం
• AI, EV, గ్రీన్ ఎనర్జీ, అగ్రిటెక్‌లో విపరీత అవకాశాలు.

సరైన దిశలో పయనిస్తే విజయం ఖాయం.. Success Is Certain If You Move in the Right Direction
భారతదేశంలో స్టార్టప్ ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం అని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్ ప్రారంభించడం కష్టం కాదు… సరైన దిశలో పయనిస్తే విజయం ఖాయం. స్టార్టప్‌ అంటే కేవలం ఒక వ్యాపారం కాదు. సమస్యకు పరిష్కారం, సమాజానికి సేవ, భవిష్యత్తుకు మార్గదర్శి. స్టార్టప్‌ను విజయవంతం చేయాలంటే .. స్పష్టమైన ప్లాన్, అద్భుతమైన టీమ్‌, ఖర్చుపై నియంత్రణ, మార్కెట్ అవగాహన తప్పనిసరి. ఎటువంటి స్టార్టప్ అయినా సరైన వ్యూహంతో ప్రారంభిస్తే, భారతదేశం ప్రపంచ స్టార్టప్ హబ్‌గా అవతరించేదాకా ఇదే వేగం కొనసాగుతుంది.

332
FEATURE NEWS Tags:A Clean Business Model Must Be Prepared, A Strong Team, Build an MVP Product with Minimum Cost, Funding (Investment), How Successful Startups Operate?, How to Start a Startup?, Huge Opportunities for Indian Youth, Market Research Is Essential, Marketing – The Path to Reach Consumers, Registration & Legal Formalities, Success Is Certain If You Move in the Right Direction, What Is a Startup?, Why Are Startups Failing in the Country?

Post navigation

Previous Post: రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast!
Next Post: పసిడి రుణాలకు కొత్త శాఖలు.. ! నూత‌న దశలోకి గోల్డ్ లోన్ మార్కెట్ ! ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఊతం New Branches for Gold Loans… The Gold Loan Market Enters a New Phase! A Boost to the Economy

Related Posts

  • గృహ రుణం ఎప్పుడు మార్చుకోవాలి When to change home loan FEATURE NEWS
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years? FEATURE NEWS
  • బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account FEATURE NEWS
  • ఒక్క సంతకం… జీవితాంతం భారం? గ్యారెంటర్‌గా మారే ముందు వాస్త‌వాలు తెలుసుకోండి! One Signature… A Lifetime Burden? The Hard Truths Before Becoming a Guarantor FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS
  • ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుండగా కరెంటు పోయిందా? నగదు తిరిగొస్తుందా? Power Cut During ATM Withdrawal: Will Your Money Come Back? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher!
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years!
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses
  • మీకు రూ.ల‌క్ష వేత‌నమా? నెలకు రూ.40 వేల పెట్టుబడితో.. 13 ఏళ్లలో రూ.కోటి సాధ్య‌మే! ₹1 Lakh Salary? Invest ₹40,000 Monthly and Build ₹1 Crore in Just 13 Years!
  • 45-50 ఏళ్లలో పదవీ విరమణ ప్రణాళిక.. ఆలస్యమైనా ఆర్థిక భద్రత సాధ్యమే.. Retirement Planning at 45-50.. It’s Never Too Late to Build Financial Security
  • ఇ-ప్రాప్తి పోర్టల్‌తో పాత పీఎఫ్ ఖాతాలకు మళ్లీ జీవం.. EPFO’s e-Prapti Portal to Revive Forgotten PF Accounts
  • రుణ బ‌కాయిలున్నా.. జప్తు చేయ‌ని ఆస్తులివే.. ఆర్థిక భద్రతకు చట్టాల రక్షణ.. Assets Cannot Seize Despite Loan Defaults: Legal Protection for Financial Security
  • రోడ్ల అభివృద్ధి – భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శక విప్లవం.. Road Development – A Transformational Force Behind India’s Economic Growth
  • డబ్బు, కుటుంబం, జీవన ప్రణాళిక – సినిమా చెప్పిన ఆర్థిక సత్యాలు.. Money, Family and Life Planning – The Financial Truths Told by a Film
  • EPF ఖాతాలో వడ్డీ ఇంకా పడలేదా? అసలు నిజం ఇదే.. నో టెన్ష‌న్‌ ! EPF Interest Not Credited Yet? Here’s the Real Reason – No Need to Worry!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • అసెట్ అలకేషన్ మంత్రం.. ఇన్వెస్ట్‌మెంట్‌లో స్మార్ట్ మార్గం.. Asset Allocation Strategy.. The Smart Way to Invest FINICAL PLANNING
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • తక్కువ ప్రీమియంతో పూర్తి రక్షణ… హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికలో జాగ్రత్తలు .. Low Premium, Full Protection… Smart Ways to Choose Health Insurance INSURANCE
  • షార్ట్ టెర్మ్ హోల్డింగ్, లాంగ్ టెర్మ్‌ హోల్డింగ్ లో ఏది లాభ‌దాయ‌కం Which is profitable in short term holding and long term holding INVESTMENTS
  • అదానీ కంపెనీల్లో టాప్ 7 స్టాక్స్ ఇవి.. MARKET
  • అర్బన్‌ సహకార బ్యాంకుల రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు.. RBI Introduces New Lending Norms for Urban Co-operative Banks FEATURE NEWS
  • ఎయిరిండియా పేరు ఇలా what is the story behind the name of  air india FEATURE NEWS
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme