Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People!

Posted on 25/11/2025 By admin No Comments on డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People!

పండుగలు, సంవత్సరాంతపు కొనుగోళ్లతో డిసెంబర్ నెల సాధారణంగా సందడిగా ఉంటుంది. కానీ ఈసారి ఆర్థిక రంగంలోనూ మరో ప్రత్యేక సందడి కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. సంవత్సరమంతా పెరుగుతూ, కొన్నిసార్లు స్థిరంగా ఉన్న EMI భారం… ఇప్పుడు తగ్గే దిశగా పయనిస్తోంది. రుణాలు తీసుకున్న చిన్న కుటుంబాల నుంచి, వ్యాపారాలకు అప్పు తీసుకున్న చిన్న, మధ్యతరహా కంపెనీల వరకూ అందరికీ ఈ మార్పుల వల్ల ఉపశమనం దొరకొచ్చు. ముఖ్యంగా రాబోయే డిసెంబర్ నెలలో బ్యాంకింగ్ రంగం తీసుకునే నిర్ణయాలు ప్రజల ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన ప్రభావం చూపనున్నాయి. అయితే ఈ భారం తగ్గడానికి కారణం ఏమిటి? బ్యాంకింగ్ రంగంలో ఏ మార్పులు జరిగాయి? ఆర్థిక వ్యవస్థ దిశ ఏవైపు వెళ్తోంది? ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు? అనేవి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ‌నీయాంశాలుగా మారాయి.

ఆర్థిక రంగానికి పెద్ద ఊరట ..Major Relief for the Financial Sector

2025 ప్రథమార్ధంలో ద్రవ్య పరపతి కమిటీ (MPC) కీలక రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఆర్థిక రంగానికి పెద్ద ఊరట ఇచ్చింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి RBI ఆ రేటును స్థిరంగానే కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి కనిష్టానికి కేవలం 0.25 శాతానికి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఆహార ధరలు క్రమంగా తగ్గిపోవడం, FMCG & వినియోగ వస్తువులపై పన్నులు తగ్గించడం వంటి అంశాలు ఈ తగ్గుదలకు దోహదం చేశాయి.దీంతో రాబోయే ద్రవ్య పరపతి సమావేశంలో మరోసారి రేట్ల కోత వచ్చి తీరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

రేట్లు తగ్గే సూచనలు… Signs of Rate Cuts Ahead…

గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం క్రమంగా నియంత్రణలోకి వస్తున్న నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక సంకేతాలను ఇస్తోంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉందనే కారణంతో గత రెండేళ్లుగా రెపో రేటును పెంచుతూ వచ్చిన RBI ఇప్పుడు ఆ విధానాన్ని మార్చే అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేటు తగ్గితే నేరుగా బ్యాంకుల రుణ వడ్డీలు తగ్గుతాయి. హోమ్ లోన్‌, ఆటో లోన్‌, ఎడ్యుకేషన్ లోన్‌, పర్సనల్ లోన్ వంటి అన్ని రకాల రుణాలపై వడ్డీ తగ్గుతుంది. EMIలు తగ్గుతాయి. ప్ర‌జ‌ల‌పై నెలసరి భారం కొంత మేర తగ్గుతుంది. గత కొన్నేళ్లలో హోమ్ లోన్ EMIలు భారీగా పెరిగి కుటుంబాలపై భారంగా మారాయి. ఇప్పుడు ఆ భారం తగ్గే అవకాశం ఉండ‌డంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

డిసెంబర్ పాలసీ సమావేశమే కీలకం..December Policy Meeting Will Be Crucial

RBI ప్రతి రెండునెలలకు ఒకసారి ద్రవ్య పరపతి విధానంపై నిర్ణయాలు ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ ప్రారంభంలో జరగనున్న పాలసీ మీటింగ్ పై బ్యాంకులు, ఆర్థిక నిపుణులు, రుణగ్రహీతలు దృష్టి సారించారు. బ్యాంకులు ఇటీవల డిపాజిట్ రేట్లలో పెద్దగా మార్పులు చేయడం లేదు. ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల ఖర్చు మళ్లీ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో RBI కొద్దిగా సడలింపు ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇదే సరైన సమయం! This Is the Right Time!

స్థిరమైన ఆదాయంతో జీవిస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు హోమ్ లోన్ EMIలు పెద్ద భారంగా మారాయి. గత రెండు మూడు సంవత్సరాల్లో దాదాపుగా అన్ని బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీలను 6.5% నుంచి 9% దాకా పెంచాయి. దీంతో ఒక సగటు కుటుంబం తీసుకున్న 40 లక్షల లోన్‌పై దాదాపు నెలకు 6–8 వేల రూపాయల అదనపు EMI చెల్లించాల్సి వచ్చింది. అయితే డిసెంబ‌ర్ త‌ర్వాత ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణ‌యంతో వారికి ఊర‌ట క‌లుగుతుంద‌ని చెప్పొచ్చు.

వడ్డీలు తగ్గితే.. If Interest Rates Come Down…
– నెలసరి EMIలు తగ్గే అవకాశం ఉంది.
– ఎక్కువ కాలం ఉన్న లోన్ పరిమితి తగ్గే వీలుంది.
– కొత్త హోమ్ లోన్లు మరింత త‌గ్గే అవకాశం ఉంది.
– రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపు రానుంది. ఇవి అన్నీ కలిపి ప్రజలకు స్పష్టమైన ఆర్థిక ఉపశమనాన్ని ఇచ్చే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంలో కదలికలు… Movements in the Banking Sector…
డిసెంబర్ దగ్గరపడుతున్న కొద్దీ కొన్ని బ్యాంకులు ఇప్పటికే చిన్న చిన్న రేటు తగ్గింపులను ఆఫర్ల రూపంలో ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ ఆఫర్లు, సంవత్సరాంతపు స్కీములు, కార్పొరేట్ రుణాలకు ప్రత్యేక వడ్డీలు వంటి ఆఫర్లు వెల్ల‌డిస్తున్నాయి. దీంతో బ్యాంకుల మధ్య పోటీ మళ్లీ పెరుగుతోంది. సాధారణంగా ఒక బ్యాంకు రుణ వడ్డీలు తగ్గిస్తే మిగతావాళ్లు కూడా వెంటనే తగ్గించే పరిస్థితి ఉంటుంది. పోటీ వల్ల వినియోగదారులు లాభం పొందుతారు. ఈసారి కూడా అదే జరుగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణం తగ్గుదల ..Decline in Inflation

ద్రవ్యోల్బణం గత సంవత్సరం ఉన్నంత ప్రమాదకర స్థాయిలో లేకపోవడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం. ఇక ఆహార ధరలు నియంత్రణలోకి రావడం, ఇంధన ధరలపై అంతర్జాతీయ ఒత్తడి తగ్గడం, ప్రభుత్వ వ్యయాలు స్థిరంగా ఉండడం , పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుదల.. ఇవన్నీ కలిసి RBI పై ఒత్తడిని తగ్గిస్తున్నాయి. అందుకే డిసెంబర్‌లో రేట్లు తగ్గే అవకాశాన్ని విశ్లేషకులు చెబుతున్నారు.

వ్యాపార రంగానికి ఇది బూస్టర్ డోస్‌..A Booster Dose for the Business Sector

చిన్న, మధ్యతరహా వ్యాపారాలు గత కొన్నేళ్లుగా రుణ వడ్డీలు అధికంగా ఉండటంతో బాగా ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా MSME రంగం. యంత్రాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార విస్తరణలాంటివన్నీ అధిక వడ్డీ రేట్లతో కష్టంగా మారాయి. డిసెంబరులో EMI భార తగ్గితే వ్యాపారాలు పుంజుకుంటాయి. తిరిగి పెట్టుబడులు పెట్టే అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగావ‌కాశాలు పెరుగుతాయి. ఉత్పత్తి పెరిగి మార్కెట్‌కి సరఫరా సులభమవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలనం పెరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద సానుకూల ప్రభావం కనిపిస్తుంది.

ప్రజల్లో కొత్త ఆశలు… కానీ జాగ్రత్తలు మాత్రం అవసరం! New Hopes Among the Public… But Caution Is Still Needed!

వడ్డీలు తగ్గుతాయని అంచనా వేస్తూ కొందరు అదనంగా ఖర్చు చేయడం, కొత్త రుణాలు తీసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వడ్డీలు తగ్గే వరకూ పెద్ద రుణాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోకూడ‌దు. పాత రుణాలకు రేట్లు తగ్గినప్పుడు రీ-స్ట్రక్చరింగ్‌పై బ్యాంకుతో మాట్లాడాలి. క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవడం కీల‌కం. లేకుంటే రుణ వడ్డీపై కీలక ప్రభావం ప‌డుతుంది. అవసరంలేని ఖర్చులు తగ్గించుకోవాలి. EMI ఉపశమనం వచ్చినా ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డిసెంబర్… ఆర్థిక మార్పులకు మలుపు? December… A Turning Point for Economic Changes?

ఈ సంవత్సరాంతంలో ఆర్థిక రంగంలో జరుగనున్న మార్పులు దేశ ఆర్థిక దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వడ్డీలు తగ్గితే
గృహ నిర్మాణ రంగం, పరిశ్రమలు, వాహన మార్కెట్, వినియోగ ఉత్పత్తుల రంగం మంచి వేగం అందుకునే అవకాశముంది. వడ్డీలు తగ్గేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, RBI ఎంతవరకూ సడలింపు ఇస్తుందన్నది మాత్రం డిసెంబర్ పాలసీ ప్రకటించే వరకూ స్పష్టంగా తెలియదు. అయినా ప్రజల్లో ఆశలు మాత్రం గట్టిగానే ఉన్నాయి.

నిజమైన ఉపశమనం ద‌క్కుతుందా? Will True Relief Be Achieved?

ప్రతి సాధారణ కుటుంబం EMIలతో ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో “డిసెంబర్‌లో మరో రిలీఫ్ వస్తుందా?”
అనే ప్రశ్న అందరి మనసులో తిరుగుతుంది. ప్ర‌స్తుత ఆర్థిక పరిస్థితుల ప్రకారం చూస్తే తగ్గుతాయని సూచనలు ఉన్నప్పటికీ, RBI తీసుకునే నిర్ణయం మాత్రమే తుది మాట. ఏదేమైనా డిసెంబర్ నెలలో బ్యాంకింగ్ రంగంలో మార్పులు, ప్రజల్లో పునరాశలు, ఆర్థిక వ్యవస్థలో కదలికలు అన్నీ కలిసి ఆర్థిక రంగానికి కొత్త దిశ చూపే అవకాశం ఉంది.

 

228
FEATURE NEWS Tags:A Booster Dose for the Business Sector, December Policy Meeting Will Be Crucial, December… A Turning Point for Economic Changes?, Decline in Inflation, If Interest Rates Come Down…, Major Relief for the Financial Sector, Movements in the Banking Sector…, New Hopes Among the Public… But Caution Is Still Needed!, Signs of Rate Cuts Ahead…, This Is the Right Time!, Will True Relief Be Achieved?

Post navigation

Previous Post: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1
Next Post: రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast!

Related Posts

  • పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future FEATURE NEWS
  • బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసా! Do You Know How the Stock Market Behaves on Budget Day? FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవ‌డ ఎలా? How to Increase Your Credit Card Limit FEATURE NEWS
  • విమానం రద్దయిందా? టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా? ప్రయాణికుడిగా మీకు ఉన్న హక్కులివే! Flight Cancelled? Will You Get a Refund? Here Are Your Rights as a Passenger! FEATURE NEWS
  • క్రెడిట్ కార్డును స‌ద్వినియోగం చేసుకోండి how to get profits from credit card FEATURE NEWS
  • త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • మీ ఆర్థిక సర్వే సిద్ధమేనా? బ‌డ్జెట్‌కు ముందే ప‌రిశీలించండి! Is Your Financial Survey Ready? Review It Before the Budget! FINICAL PLANNING
  • వ్యక్తిగత రుణాలపై సాధారణ అపోహలు.. Common Myths About Personal Loans FEATURE NEWS
  • టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ఇవే … మూడేళ్ల‌లో 25% పైగా రాబడి! Top 5 Mid-Cap Mutual Funds… Over 25% Returns in 3 Years! MUTUAL FUNDS
  • మార్కెట్‌లో వీటిని తెలుసుకోవాల్సిందే.. MARKET
  • స్వ‌ల్పంగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌… పెట్టుబడిదారుల్లో టెన్షన్.. Gold Prices Ease Amid Global Uncertainty FEATURE NEWS
  • ప్ర‌పంచంలోని అగ్రగామి కేంద్ర బ్యాంకులను మించి.. ఇళ్లలో బంగారం! Gold in Households Surpasses Top Central Banks Worldwide! FEATURE NEWS
  • ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలుసా? అమెరికాను దాటేశామా? Do You Know How Much Gold India Holds? Have We Surpassed the US? FEATURE NEWS
  • ఏప్రిల్‌ 1 నుంచి ఏటీఎం రూల్స్‌లో మార్పులు… బ్యాంకు ఖాతాదారుల‌పై అదనపు భారం? ATM Rule Changes from April 1… Extra Burden on Customers? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme