కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సరికి… ప్రతి ఉద్యోగి ముందుకొచ్చే ముఖ్యమైన ప్రశ్న ఇదే—“ఏ పన్ను విధానం ( Old vs New Tax Regime) ఎంచుకోవాలి?” గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ… పాత విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా మార్పులతో… ఈ చర్చ మరింత వేడెక్కింది. చాలామంది ఇప్పటికీ పాత పన్ను విధానానికే అలవాటు పడి… అదే కొనసాగించాలనుకుంటున్నారు. ముఖ్యంగా హెచ్ఆర్ఏ, ఇతర మినహాయింపులు కోల్పోతామనే భయంతో కొత్త విధానాన్ని దూరంగా ఉంచుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో “ఎక్కువ మందికి కొత్త పన్ను విధానం లాభదాయకం.” అని పన్ను నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
పన్ను విధానాల్లో మార్పులు… ఎందుకు తీసుకొచ్చారు? Why Tax Reforms Were Introduced?
భారతదేశంలో పన్ను వ్యవస్థ ( Old vs New Tax Regime)చాలా కాలంగా క్లిష్టంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అనేక మినహాయింపులు, డిడక్షన్లు, నిబంధనలన్నీ కలిపి సాధారణ పన్ను చెల్లింపుదారులకు గందరగోళం సృష్టించాయి. ఈ నేపథ్యంలో… సరళమైన, పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ఫలితమే కొత్త పన్ను విధానం. తక్కువ శ్లాబులు, ఎక్కువ స్పష్టత… ఇవే దీని ప్రధాన లక్షణాలు.
కొత్త పన్ను విధానం… సింపుల్ అండ్ స్ట్రైట్ .. New Tax Regime – Simple and Straightforward
కొత్త పన్ను విధానం ( Old vs New Tax Regime)ప్రధానంగా “తక్కువ రేట్లు – తక్కువ మినహాయింపులు” అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే… మీరు ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. లెక్కలు కూడా సులభంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం… ఏటా రూ.12 లక్షల వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారికి రిబేట్ కారణంగా పన్ను భారం ఉండదు. అంతేకాదు… రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ అందరికీ వర్తిస్తుంది. అంటే ఒక ఉద్యోగి వార్షిక వేతనం రూ.12.75 లక్షలు ఉన్నా… స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత పన్ను లెక్కింపు ఆదాయం రూ.12 లక్షలకు తగ్గిపోతుంది. దీంతో అతనికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు.
కొత్త విధానంలో అదనపు ప్రయోజనాలు.. Additional Benefits in New Regime
కొత్త పన్ను విధానంలో ( Old vs New Tax Regime) కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే పండగ గిఫ్ట్ వోచర్లు, ఇతర బహుమతులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.15,000కు పెంచారు. ఇది గతంలో రూ.5,000 మాత్రమే ఉండేది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా ఉద్యోగులకు ఉపయోగపడేలా రూపొందించారు. మొత్తంగా చూస్తే… పన్ను లెక్కలు సులభం కావడం, రిబేట్ ప్రయోజనం ఎక్కువగా ఉండడం కొత్త విధానానికి ప్రధాన బలం.
పాత పన్ను విధానం… మినహాయింపుల మాయలో.. Old Tax Regime – The World of Deductions
పాత పన్ను విధానం ( Old vs New Tax Regime) ప్రధానంగా మినహాయింపులు, డిడక్షన్లపై ఆధారపడి ఉంటుంది. హెచ్ఆర్ఏ, సెక్షన్ 80C కింద పెట్టుబడులు, మెడికల్ ఇన్సూరెన్స్, విద్యా రుణ వడ్డీ—ఇవన్నీ కలిపి పన్ను భారం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అద్దె ఇంట్లో ఉండే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ మినహాయింపు ఒక పెద్ద ప్రయోజనం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇది మరింత లాభదాయకం. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలను కూడా మెట్రో జాబితాలో చేర్చడంతో ఈ ప్రయోజనం మరింత పెరిగింది. అలాగే EPF, PPF, LIC ప్రీమియం, ELSS వంటి పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య బీమా ప్రీమియంపై కూడా పన్ను ప్రయోజనం ఉంటుంది.
పాత విధానం ఎప్పుడు ఉపయోగకరం? When Old Regime Works Better?
పాత పన్ను విధానం ( Old vs New Tax Regime) పూర్తిగా పనికిరాదని చెప్పలేం. మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టే వారు అయితే… ఇంకా పాత విధానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు… మీరు గృహ రుణం తీసుకుని ఉంటే, బీమా ప్రీమియాలు చెల్లిస్తే, పిల్లల విద్య ఖర్చులు ఉంటే—ఈ మినహాయింపులన్నీ కలిపి పన్ను భారం తగ్గించుకోవచ్చు. అయితే ఈ లెక్కలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అన్ని రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది.
ఎందుకు కొత్త విధానం వైపు మళ్లాలి? Why Experts Suggest Moving to New Regime?
పన్ను నిపుణులు ఇప్పుడు ఎక్కువగా కొత్త విధానాన్ని ( Old vs New Tax Regime)సూచిస్తున్నారు. కారణం సింపుల్—ఇది సులభం, పారదర్శకం, భవిష్యత్తుకు అనుకూలం. ఇంకా ముఖ్యంగా… రాబోయే సంవత్సరాల్లో పాత పన్ను విధానం పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటినుంచే కొత్త విధానానికి అలవాటు పడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మీకు ఏది సరిపోతుంది? Which Tax Regime is Right for You?
ఇది పూర్తిగా మీ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎక్కువ మినహాయింపులు ఉంటే… పాత విధానం లాభదాయకంగా ఉండవచ్చు. కానీ సాధారణంగా ఎక్కువ మంది ఉద్యోగులకు కొత్త విధానం సరళంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగి తన వార్షిక ఆదాయం ఎంత ఉంటుందో ముందుగానే అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా రెండు విధానాల్లో పన్ను లెక్కలు వేసి పోల్చుకోవాలి.
ఒక ముఖ్యమైన విషయం… చెప్పకపోతే కొత్త విధానమే! Important Note – Default is New Regime
చాలామంది గమనించని విషయం ఏమిటంటే… మీరు మీ కంపెనీకి ఏ పన్ను విధానం ఎంచుకున్నారో చెప్పకపోతే… యాజమాన్యం ఆటోమేటిక్గా కొత్త పన్ను విధానంలోనే టీడీఎస్ కట్ చేస్తుంది. కాబట్టి ముందుగానే మీ HR విభాగానికి మీ ఎంపికను తెలియజేయడం చాలా ముఖ్యం. మొత్తానికి… పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ( Old vs New Tax Regime) రెండింటికీ తమ తమ ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో… సింప్లిసిటీ, రిబేట్ ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా కొత్త పన్ను విధానం ఎక్కువ మందికి అనుకూలంగా మారుతోంది. అయితే ఏదో ఒకటి ఎంచుకోవడం కంటే… మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. గుర్తుంచుకోండి… సరైన పన్ను విధానం ఎంచుకోవడం అంటే కేవలం పన్ను ఆదా మాత్రమే కాదు… మీ ఆర్థిక ప్రణాళికలో ఒక కీలక భాగం.
