ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income

Posted by

విదేశాల్లో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐ (NRIs )లు ఎక్కువగా ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సెటిల్‌ జీవితం గడపాలనే లక్ష్యంతో పెట్టుబడులు పెడతారు. అయితే చాలా మందికి భూమి, బంగారం తప్ప మరే పెట్టుబడులు గుర్తుకు రావడం లేదు. సంప్రదాయంగా ఇవే సురక్షిత పెట్టుబడులన్న భావన చాలామందిలో ఉంది. అందుకే సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్‌, బంగారంలోనే పెట్టుబడి చేస్తున్నారు. కానీ, నిపుణుల మాటల్లో చెప్పాలంటే… సెటిల్‌ అవ్వాలంటే నెలకు నిరంతర ఆదాయం ఇచ్చే పెట్టుబడులే కీలకం. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో భూమి, గోల్డ్ మాత్రమే సరిపోవు. వీటి విలువ కాలక్రమేణా పెరిగే అవకాశం ఉన్నా, నెలనెలా ఆదాయం ఇవ్వవు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐలు ఇతర పెట్టుబడుల మార్గాలపైనా దృష్టి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్‌, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌, కార్పొరేట్ బాండ్స్‌, బ్యాంక్ డిపాజిట్లు వంటి ఎన్నో ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇవి భూమితో పోలిస్తే లిక్విడ్‌గా ఉండడమే కాకుండా, క్రమంగా ఆదాయం కూడా ఇస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఆయా మార్గాల ప్రక్రియలు, రిస్కులు, రాబడులు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరి అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలను బట్టి పెట్టుబడి విధానం ఉండాలి. ఒకే భూమి లేదా గోల్డ్‌కే పరిమితం కాకుండా, వివిధ మార్గాల్లో పెట్టుబడులు పంచితే రిస్క్ తగ్గి ఆర్థిక భద్రత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

భూమి–గోల్డ్‌ సరిపోతాయా? Are Land and Gold Enough?
ఎన్‌ఆర్‌ఐ(NRIs )లు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని రియల్‌ ఎస్టేట్‌లో, మరికొంత గోల్డ్‌లో పెట్టడం సాధారణం. భూమి విలువ పెరగొచ్చు గానీ, అది లిక్విడ్ కాదు. అవసరమైనప్పుడు భూమిని అమ్ముకోవాలంటే సమయం పడుతుంది. నెలవారీ ఆదాయం కూడా ఇవ్వదు. గోల్డ్‌ కూడా ధర పెరిగితే లాభమే కానీ, రోజువారీ ఖర్చులకు ఉపయోగపడే క్యాష్‌ఫ్లో ఇవ్వదు.

సెటిల్‌ అంటే క్యాష్‌ఫ్లో..Settlement Means Cash Flow

(NRIs )ఇండియాకు వచ్చాక కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, మెయింటెనెన్స్ క‌లిపి నెలకు కనీసం రూ.2–3 లక్షల ఆదాయం అవసరం. అందుకే భూమికంటే నెలవారీ ఆదాయం వచ్చే పెట్టుబడులు ఎంచుకోవాలి.

ఎన్‌ఆర్‌ఐలకు ఉపయోగపడే పెట్టుబడులు..Investment Options Suitable for NRIs

కమర్షియల్ ప్రాపర్టీలు: షాపులు, ఆఫీసులు వంటి వాటిపై అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుంది.

డివిడెండ్ ఇచ్చే స్టాక్స్: మంచి కంపెనీల షేర్లు నెలనెలా లేదా త్రైమాసిక ఆదాయం ఇస్తాయి.

మ్యూచువల్ ఫండ్స్: డెట్‌, హైబ్రిడ్‌, ఇన్‌కమ్ ఫండ్స్ ద్వారా క్రమంగా ఆదాయం పొందొచ్చు.

కార్పొరేట్ బాండ్స్: స్థిర వడ్డీతో భద్రమైన ఆదాయం లభిస్తుంది.

ఇన్సూరెన్స్‌పై అతిగా ఆశ వద్దు..Don’t Expect High Returns from Insurance

(NRIs ) ఇన్సూరెన్స్ పాలసీల రిటర్న్స్ సాధారణంగా 6 శాతం దాటవు. ఇవి పెట్టుబడులుగా కాకుండా రిస్క్‌ కవర్‌గా మాత్రమే చూడాలి.

ముందే ఇల్లు కొనాలా? Should You Buy a House in Advance?

(NRIs )ఇండియాకు రాకముందే ఇల్లు కొనడం చాలాసార్లు భారమవుతుంది. ఉద్యోగం, జీవన పరిస్థితులు మారవచ్చు. అందుకే ముందుగా లిక్విడ్ పెట్టుబడులు (మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్) పెట్టి ఆర్థిక బలం పెంచుకోవడం మంచిది.

ముందస్తు ప్రణాళిక తప్పనిసరి..Advance Planning Is Essential

విదేశాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ(NRIs )లు ఎక్కువగా పది సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి రావాలని భావిస్తుంటారు. అందుకే అంతే కాలానికి పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, 10 సంవత్సరాలు పెట్టుబడులు చేయడం మాత్రమే సరిపోదు. భవిష్యత్ ఖర్చులు దృష్టిలో పెట్టుకుంటే కనీసం 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. రూ.5–6 కోట్ల కార్పస్‌ కావాలంటే 10 ఏళ్లు సరిపోవు. కనీసం 15 ఏళ్ల ప్రణాళిక అవసరం. ఇండియాకు రాకముందే మ్యూచువల్ ఫండ్స్‌, బాండ్స్ లాంటి లిక్విడ్ పెట్టుబడులతో పోర్ట్‌ఫోలియో బలోపేతం చేసుకోవాలి. ముందుగానే ఇల్లు కొనడం కన్నా, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.

పన్నుల అంశం కూడా ముఖ్యం..Tax Considerations Are Also Important
(NRIs )విదేశాల్లో టాక్స్ భారం తక్కువగా ఉన్నా, ఇండియాలో పెట్టుబడులపై పన్నులు ఉంటాయి. అయితే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో టాక్స్ భారం తక్కువ. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్‌పై పన్నులు ఉన్నా, డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. భారత్–విదేశాల మధ్య (DTAA) ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దేశాన్ని బట్టి పెట్టుబడి వ్యూహం మారాలి. NRO ఆదాయంపై TDS వర్తిస్తుంది. పెట్టుబడుల నుంచి డబ్బు విదేశాలకు పంపే ముందు రీపాట్రియేషన్ నిబంధనలు పాటించాలి.

నిపుణుల సూచన..Expert Advice
(NRIs )ఒకే ఆస్తి లేదా ఒకే మాధ్యమంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. కమర్షియల్ ప్రాపర్టీలు + మ్యూచువల్ ఫండ్స్ వంటి డైవర్సిఫికేషన్‌తో ఆదాయం, లిక్విడిటీ రెండూ సమతుల్యం అవుతాయి. ఎన్‌ఆర్‌ఐలుగా మీరు ఇండియాకు తిరిగి రావాలనుకుంటే భూమి, గోల్డ్‌కే పరిమితం కాకండి. నెలవారీ ఆదాయం ఇచ్చే పెట్టుబడులతో ముందుగానే ప్రణాళిక వేసుకుంటే భవిష్యత్‌ జీవితం ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది.

పెట్టుబడి మోడల్ మారాలి..Investment Model Should Change
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బును ఎన్ఆర్ఐ(NRIs )లు సాధారణంగా విభిన్న పెట్టుబడుల రూపంలో ఇండియాలో పెట్టుకుంటుంటారు. కొందరు అయితే దుబాయ్ వంటి దేశాల్లో బంగారం కొనుగోలు చేసి, అక్కడే మళ్లీ పెట్టుబడి (రీ–ఇన్వెస్ట్‌మెంట్) చేస్తున్నారు. అయితే అందరికీ ఒకే రకమైన పెట్టుబడి సరిపోదు. సూటబుల్ పెట్టుబడి ఏది అన్నది వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ పరిమాణం, భవిష్యత్ లక్ష్యాలు, పిల్లల చదువు, ఇండియాకు తిరిగి వచ్చే సమయం.. ఇవన్నీ పెట్టుబడి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, ఆరోగ్య పరిస్థితులూ పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. స్థిరమైన ఆదాయం అవసరమా? లిక్విడ్ డబ్బు ఎక్కువగా ఉండాలా? లేక దీర్ఘకాలంలో సంపద పెంచుకోవాలా? అన్న అంశాలను బట్టి పెట్టుబడి మోడల్ మారాలి. అందుకే నిపుణుల సూచన ఏమిటంటే ..ఇతరులను చూసి కాకుండా, మ‌నకు సరిపడే పెట్టుబడి ప్రణాళికను ప్రతి ఎన్ఆర్ఐ ప్రత్యేకంగా రూపొందించుకోవాలి.

ఎన్‌ఆర్‌ఐలకు ఈ ఖాతాలు కీల‌కం..These Accounts Are Crucial for NRIs
(NRIs )భారత్‌లో పెట్టుబడులకు ముందుగా NRE, NRO ఖాతాలు అవసరం. NRE ఖాతా అనేది విదేశీ ఆదాయం జమ చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిపై వ‌చ్చే వ‌డ్డీకి పన్ను ఉండ‌దు. NRO ఖాతా అనేది భారత్‌లో వచ్చే అద్దె, వడ్డీ వంటి ఆదాయం కోసం ఈ ఖాతాను తెర‌వాలి. దీనికి పన్ను వర్తిస్తుంది. ఈ ఖాతాల ద్వారానే పెట్టుబడుల లావాదేవీలు జరుగుతాయి.

ఎన్ఆర్ఐల‌కు నెల‌వారీ ఆదాయం ఇచ్చే మార్గాలు..Ways to Generate Monthly Income

1) (NRIs )బ్యాంక్ ఎఫ్‌డీలు , NRE/NRO ఎఫ్‌డీలపై స్థిర వడ్డీ లభిస్తుంది. నెలవారీ లేదా త్రైమాసిక వడ్డీ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది. రాబడి మితంగా ఉంటుంది.

2) మ్యూచువల్ ఫండ్స్ (డివిడెండ్/ఇన్‌కమ్ ప్లాన్స్), డెబ్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా క్రమానుగత ఆదాయం సాధ్యం. దీర్ఘకాలంలో పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. రిస్క్ మోస్తరుగా ఉంటుంది.

3) రియల్ ఎస్టేట్ (అద్దె ఆదాయం), ఇళ్లకు అద్దె ద్వారా నెలనెలా నగదు పొందొచ్చు. అయితే నిర్వహణ ఖర్చులు, పన్నులు గుర్తుంచుకోవాలి. మూలధనం ఎక్కువగా ఉన్నా.. ఆదాయం స్థిరంగా ఉంటుంది.

4) (NRIs )కొన్ని ప్రభుత్వ పథకాలు ఎన్‌ఆర్‌ఐలకు అనుమతి ఇస్తాయి. వడ్డీ భద్రంగా ఉంటుంది. అయితే నిబంధనలు ముందుగా పరిశీలించాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *