ఈ ఏడాది ఇప్పటికే మూడు దఫాలుగా వడ్డీ రేట్లను తగ్గించి రుణగ్రహీతలకు ఉపశమనం అందించిన ఆర్‌బీఐ… మరోసారి శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు కోత విధిస్తూ, రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం… వృద్ధి రేటు ఊపందుకోవడంతో ఈ కోత చేపట్టినట్లు ఆయన వివరించారు.
రేట్ల కోతతో ఉపశమనం..Relief Through Rate Cuts
రెపో రేటు తగ్గడంతో గృహ రుణాలు, వాహన రుణాలు, బంగారు రుణాలు తదితర వాటి EMIలు మరింత తగ్గనున్నాయి. రుణగ్రహీతలకు ఇది మరో పెద్ద రిలీఫ్ కావొచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించగా… జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. తాజా తగ్గింపుతో 2025లో మాత్రమే మొత్తం 1.25 శాతం వరకు రెపో రేటు దిగివచ్చింది.
ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారంటే.. What the RBI Governor Said…
ఆర్థిక వృద్ధికి ఊతం (Boost to Economic Growth): జీఎస్‌టీ హేతుబద్ధీకరణతో కొనుగోళ్లు పెరగడం, దేశీయ డిమాండ్ బలపడడంతో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2% వృద్ధి నమోదు అయింది. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 6.8% నుంచి 7.3% కి పెంచుతున్నట్లు గవర్నర్ తెలిపారు.
ద్రవ్యోల్బణం మరింత క్షీణత (Further Decline in Inflation): ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని పేర్కొంటూ,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి CPI ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను 2.6% నుంచి 2% కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (Open Market Operations): ప్రభుత్వ ఆర్థిక అవసరాల దృష్ట్యా, రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయానికిఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) చేపట్టనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
బలమైన విదేశీ మారక నిల్వలు (Strong Foreign Exchange Reserves): ప్రస్తుతం దేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇవి రాబోయే 11 నెలల దిగుమతుల అవసరాలను తీరుస్తాయని గవర్నర్ పేర్కొన్నారు.
రేట్ల కోతతో మార్కెట్లలో సంబరమే.. Markets Cheer the Rate Cut..
వృద్ధి సంకేతాలు బలపడడం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం, రుణ వ్యయం తగ్గడం… ఇవన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థకు ధనిక సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న గృహ నిర్మాణం, వాహన విక్రయాలు, చిన్న వ్యాపారాలు .. ఈ కోతతో మరింత ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
EMIలు ఎంతవరకు తగ్గనున్నాయంటే? How Much Will EMIs Come Down?
ఆర్‌బీఐ ప్రకటించిన 0.25% వడ్డీ రేట్ల కోత రుణదారులకు ఊరట కలిగించనుంది. గృహ రుణాలు, వాహన రుణాలు, బంగారు రుణాలు వంటి అన్ని ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేటు లోన్లపై EMIలు స్వల్పంగా తగ్గనున్నాయి. బ్యాంకుల నుంచి లెక్కలు తీసుకుంటే… ఈ కోత రుణ కాలం, వడ్డీ రకం, మిగిలిన బాకీ ఆధారంగా కాస్త మారుతుందనే విషయం స్పష్టం అవుతోంది.
– ఉదాహరణకు మీ గృహ రుణం (Home Loan) మొత్తం ₹30 లక్షలు అనుకుందాం. దీనిపై పాత వడ్డీ రేటు 8.50% ఉండగా.. కొత్త రేటు (కోత తర్వాత): 8.25%గా మారనుంది. దీని లోన్ కాలం లోన్ కాలం 20 ఏళ్లు అనుకుందాం. పాత EMI ₹25,937గా ఉంటే కొత్త EMI ₹25,398 చెల్లిస్తే సరిపోతుంది. అంటే నెలకు ₹539 / భారం తగ్గనుంది. ఏడాదికి ₹6,468 సేవ్ అవుతుంది. 20 ఏళ్లలో మొత్తంగా సుమారు ₹1.3 లక్షలు సేవ్ అవుతుంది.
– మరో ఉదాహరణగా కార్‌లోన్ ( car Loan) తీసుకుంటే.. మీ లోన్ ₹12 లక్షలు అనుకుందాం. పాత వడ్డీ 10% ఉంటే ఇప్పుడు అది 9.75% గా మారనుంది. లోన్ కాలం 7 ఏళ్లు అనుకుంటే.. పాత EMI ₹19,122గా ఉండగా..కొత్త EMI ₹18,839 చెల్లిస్తే సరిపోతుంది. ఇకపై ప్రతినెలా మీకు ₹283 సేవ్ అవుతుంది.
– బంగారు రుణాల (Gold Loans)విషయానికొస్తే.. మీ లోన్ మొత్తం ₹3 లక్షలు అనుకుందాం. రుణ కాలం రెండేళ్ళుగా పెట్టుకుంటే.. వడ్డీ 9.5% నుంచి 9.25% తగ్గుతంది. పాత EMI ₹13,829గా ఉంటే కొత్త EMI ₹13,773 చెల్లించాల్సి ఉంది. ఇకపై ప్రతినెలా మీకు ₹56 సేవ్ అవుతుంది. బంగారు రుణాలు స్వల్ప కాలానికి ఉంటాయి కాబట్టి EMIలు ఎక్కువగా తగ్గకపోవొచ్చు. కానీ వడ్డీ మొత్తం మాత్రం తగ్గుతుంది.
ఈ తగ్గుదల ఎందుకు తక్కువగా కనిపిస్తుంది? Why the Reduction Appears Small?
0.25% కోత ఒక చిన్న మార్పు మాత్రమే. EMIలు లోన్ కాలం అంతా విస్తరించుకోవడం వల్ల తగ్గుదల ఒక్క నెలకు ఎక్కువగా కనిపించదు. అయితే మొత్తం రుణకాలమంతా కలిపితే సేవింగ్ గణనీయంగా ఉంటుంది. ప్రత్యేకంగా గృహ రుణాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన రుణ నిల్వ ఎక్కువగా ఉన్నవారికి EMI తగ్గుదల ఎక్కువ. కొత్తగా రుణం తీసుకునేవారికి ఇది మంచి అవకాశం. రీఫైనాన్స్ (బ్యాంకు మార్చడం) పైనా ఆసక్తి చూపొచ్చు. ఏదేమైనా తాజా ఆర్‌బీఐ నిర్ణయంతో ప్రతి EMIలో వచ్చే చిన్న తగ్గుదల, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సేవ్ చేయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఊరట.
బ్యాంకుల స్పందన …Banks’ Response
– RBI వడ్డీ రేట్ల కోత తర్వాత Canara Bank, Union Bank of India, Indian Overseas Bank లు తమ రెపో‑లింక్డ్ రుణ రేట్లు (RLLR) తగ్గిస్తూ హోం లోన్ తీసుకున్న వారికి ఉపశమనం పలికాయి. దీంతో గృహ రుణాలు, వాహన రుణాలు వంటి లోన్ EMI తగ్గింపులు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా.. బ్యాంకుల డిపాజిట్ రేట్లపై కూడా ప్రభావం కనిపిస్తోంది. డిపాజిటర్లు (పెట్టుబడిదారులు / భద్రత‑పూర్తి ఖాతాదారులు) తమ వడ్డీ ఆదాయంలో తగిన తగ్గుదల ఎదుర్కొంటున్నారు.
– RBI వడ్డీ కోతతో బ్యాంకులు తక్కువ వ్యయంతో ఫండింగ్ పొందగలిగాయి. ఈ కారణంగా కొంత డబ్బు ప్రవాహం (liquidity) లో ఉంచేందుకు వీలు కనిపిస్తోంది.ఇది రుణాల ఆఫర్ పెరిగే దిశగా ఉంటుంది. కానీ, అందులో పార్ట్‌గా వడ్డీ మార్జిన్ (Net Interest Margin = NIM) మీద ఒత్తిడి ఉండే అవకాశాలను కూడా బ్యాంకులు గుర్తించాయి. అంటే డిపాజిట్ రేట్ల తగ్గింపు + రుణ రేట్ల తగ్గింపు = మార్జిన్ చిన్నగా ఉండొచ్చు. రేటు తగ్గించినా, డిపాజిట్ వడ్డీలు కూడా తగ్గినందున బ్యాంకుల లాభం పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
– రుణాలు, EMIలు సునాయాసం అయ్యే అవకాశం ఉండడంతో ఇంటి కొనుగోలు ఆలోచనలు, హౌసింగ్‑లోన్‑గ్రహీతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ మార్పు రియల్‑ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందిన బ్యాంక్ వర్గాలు ఆశిస్తున్నాయి. వ్యాపార రుణాలు, వాహన రుణాలు, ఇతర లోన్లు పెరగనున్నట్లు బ్యాంకులు భావిస్తున్నాయి. మొత్తంగా ఆర్‌బీఐ వడ్డీ కోత వల్ల సాధారణ వడ్డీలు, రుణాలు, EMIలు తీసుకునే వారికి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కానీ బ్యాంకులు ఇప్పుడు కొత్త స్మార్ట్‑మెనేజ్‌మెంట్ అవసరంతో ఉండాలి. డిపాజిట్‑వడ్డీలు తగ్గడం, మార్జిన్ ఒత్తిడి వంటివి గమనించడంతో బ్యాంకుల ఆర్థిక స్థితిపై కూడా బ్యాలెన్స్ కావాలి.

