Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks

Posted on 26/02/2026 By admin No Comments on అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks

భారత సోలార్‌ కంపెనీల మాడ్యూళ్లు, సెల్స్‌పై అమెరికా 126 శాతం కౌంటర్ వెయిలింగ్‌ సుంకం విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్‌ సెంటిమెంట్‌ ఒక్కసారిగా కుంగిపోయింది ( Shock on Indian Solar Stocks ). మొదట లాభాల దిశగా సాగిన సూచీలు, మధ్యాహ్నానికి వచ్చేసరికి అమ్మకాల తాకిడికి తట్టుకోలేకపోయాయి. చివరకు BSE Sensex 50.15 పాయింట్ల లాభంతో 82,276.07 వద్ద, Nifty 50 57.85 పాయింట్ల లాభంతో 25,482.5 వద్ద ముగిసినా, డే హై నుంచి సెన్సెక్స్‌ దాదాపు 674 పాయింట్లు వెనక్కి వచ్చేసింది. ఈ సంఖ్యల వెనుక దాగి ఉన్న అసలు కథ మాత్రం చాలా లోతైనది. సోలార్‌ షేర్లపై పడిన ఈ పిడుగుపాటు తాత్కాలికమా, దీర్ఘకాలికమా అన్నది కాలమే తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం … గ్లోబల్‌ ఆర్థిక యుద్ధాల్లో, టారిఫ్‌ల తూటాలు ఎప్పుడూ మదుపరుల గుండెలనే ముందుగా తాకుతాయి.

మార్కెట్ ఎందుకు కుదేలైంది? Why the Market Trembled ?
భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే సౌర విద్యుత్‌ ఉత్పత్తులపై 125.87 శాతం ప్రాథమిక కౌంటర్‌వెయిలింగ్‌ డ్యూటీ (CVD) విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. భారత ప్రభుత్వం ఈ రంగానికి “సహేతుకం కాని” సబ్సిడీలు ఇస్తోందని, దాంతో భారత కంపెనీలు తక్కువ ధరలకే ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాయన్నది అమెరికా వాదన. ఈ సుంకాలు 2026 జులై 6 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇది విన్న వెంటనే సోలార్‌ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. ఐదు నుంచి 14 శాతం వరకు పలు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఉదయం వరకూ లాభాల్ని ఆస్వాదించిన మదుపరులు, మధ్యాహ్నానికి రిస్క్‌ తగ్గించుకునే ప్రయత్నంలో షేర్లు విక్రయించడంతో మార్కెట్‌ ఊపిరాడకుండా మారింది.

సీవీడీ అంటే ఏమిటి? Countervailing Duty Explained ?
ఏ దేశంలో అయితే ప్రభుత్వ సబ్సిడీలు లభిస్తే, ఆ దేశ కంపెనీలు ఉత్పత్తులను తక్కువ ధరలకు ఎగుమతి చేయగలుగుతాయి. ఫలితంగా దిగుమతి చేసుకునే దేశంలోని స్థానిక కంపెనీల ఉత్పత్తులు పోటీలో నిలవలేక నష్టపోతాయి. అటువంటి పరిస్థితుల్లో తమ పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి దేశాలు కౌంటర్‌వెయిలింగ్‌ సుంకాలను విధిస్తుంటాయి. ఇప్పుడు భారత సౌర ఉత్పత్తుల ( Shock on Indian Solar Stocks )విషయంలో అమెరికా అదే మార్గాన్ని ఎంచుకుంది.

సౌర బూమ్‌ నుంచి షాక్‌ వరకు.. Solar Boom to Solar Shock
ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌ సౌర రంగంలో భారీ పురోగతి సాధించింది. దేశీయ తయారీకి ప్రోత్సాహం, దిగుమతులపై నియంత్రణ, పీఎల్‌ఐ పథకం వంటి చర్యలతో భారత కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలోనూ పట్టు సాధించాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో భారత మాడ్యూళ్లు, సెల్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. 2022లో కేవలం 83.86 మిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత సౌర ఎగుమతులు, 2024 నాటికి 792.6 మిలియన్‌ డాలర్లకు ఎగబాకాయి. ఈ వేగవంతమైన వృద్ధే ఇప్పుడు అమెరికా నిర్ణయానికి ( Shock on Indian Solar Stocks ) నేపథ్యంగా మారింది.

ఏఐ భయం, ఐటీ షేర్ల పతనం.. IT Stocks Under AI Shadow
సోలార్‌ షేర్ల షాక్‌తో( Shock on Indian Solar Stocks ) పాటు మరో భయం మార్కెట్‌ను వెంటాడుతోంది. ఏఐ ప్రభావంతో ఐటీ కంపెనీల భవిష్యత్‌పై అనిశ్చితి పెరుగుతోంది. ఈ నెలలోనే నిఫ్టీ ఐటీ సూచీ 21 శాతం వరకు క్షీణించడం గత 23 ఏళ్లలో లేనిది. దీనివల్ల ఐటీ షేర్లలో పెట్టుబడి పెట్టిన పెద్ద సంస్థలకూ భారీ దెబ్బ తగిలింది. Life Insurance Corporation of India సుమారు రూ.38,000 కోట్ల నష్టాన్ని, మ్యూచువల్‌ ఫండ్స్‌ దాదాపు రూ.63,000 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ పతనానికి మరో కారణంగా ఏఐ స్టార్టప్‌ల వేగవంతమైన ఎదుగుదల నిలుస్తోంది. ముఖ్యంగా Anthropic వంటి సంస్థల మార్కెట్‌ క్యాప్‌ 38,000 కోట్ల డాలర్లకు చేరడం, భారత ఐటీ దిగ్గజాల విలువను మించి ఉండడం మదుపరుల్లో భయాన్ని రెచ్చగొడుతోంది. గత 15 రోజుల కరెక్షన్‌లో భారత ఐటీ దిగ్గజాలైన Tata Consultancy Services, Infosys, HCL Technologies, Wipro, Tech Mahindra షేర్లు 17 నుంచి 27 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం ఈ ఐదు కంపెనీల కలిపి మార్కెట్‌ క్యాప్‌ సుమారు 24,100 కోట్ల డాలర్లకే పరిమితమైంది. ఒకప్పుడు గ్లోబల్‌ ఐటీ రంగంలో భారత ఆధిపత్యానికి చిహ్నాలైన ఈ సంస్థలు, ఇప్పుడు ఏఐ కంపెనీల ఎదుట చిన్నబోతున్నాయన్న భావన మార్కెట్‌లో బలపడుతోంది.

ప్రభావం పరిమితమే అంటున్న కంపెనీలు.. Companies Say “Limited Impact”
సుంకాల ప్రభావం అంత తీవ్రంగా ఉండదని కొన్ని సోలార్‌ కంపెనీలు( Shock on Indian Solar Stocks ) చెబుతున్నాయి. విక్రమ్‌ సోలార్‌ మాటల్లో, భారత్‌లో తయారైన సెల్స్‌పై అమెరికా సుంకాలు వర్తించినా, అమెరికాకు పంపే ఆర్డర్లలో భారత సెల్స్‌ను ఉపయోగించడం లేదని, తక్కువ టారిఫ్‌లున్న ఇతర దేశాల నుంచి వాటిని సమకూర్చుకుంటున్నామని అంటోంది. వారీ ఎనర్జీస్‌ కూడా గతంలో 50 శాతం సుంకాలున్నప్పటికీ డెలివరీలు కొనసాగించామని, తాజా నిర్ణయంతో పెద్దగా ఇబ్బంది ఉండబోదని చెబుతోంది. ప్రీమియర్‌ ఎనర్జీస్‌ అయితే తాము అమెరికాకు ఎగుమతులు చేయడం లేదని, అందువల్ల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

95 శాతం అమెరికాకే.. 95% Exports Head to the US
2023 ఏప్రిల్‌ నుంచి 2025 నవంబరు మధ్య భారత్‌ నుంచి అమెరికాకు రూ.34,000 కోట్ల విలువైన సోలార్‌ సెల్స్‌, మాడ్యూళ్లు ఎగుమతి అయ్యాయి. గత మూడు త్రైమాసికాల్లో భారత సౌర ఎగుమతుల్లో 95 శాతానికి పైగా అమెరికాకే వెళ్లాయి. తాజా సుంకాల వల్ల అమెరికాలో తయారయ్యే మాడ్యూళ్లతో పోలిస్తే, భారత ఉత్పత్తులు కనీసం 30 శాతం ఖరీదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్న భారత కంపెనీలకు ఇది పెద్ద సవాలుగా( Shock on Indian Solar Stocks ) మారనుంది.

చైనాను కట్టడి చేసే ప్రయత్నమా? Is This an Attempt to Curb China?
( Shock on Indian Solar Stocks )ఈ పరిణామానికి మరో కోణమూ ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం చూస్తున్నాయి. భారత్‌ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని వేగంగా ఎదిగింది. రూఫ్‌టాప్‌ సోలార్‌, పీఎం-కుసుమ్‌, సీపీఎస్‌యూ స్కీమ్‌ ఫేజ్‌-2 వంటి పథకాలతో దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇచ్చింది. ఫలితంగా చైనా నుంచి దిగుమతులు తగ్గాయి. అయితే ఇప్పుడు అమెరికా సుంకాలు, ఈ గ్లోబల్‌ సరఫరా గొలుసులో కొత్త అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.

ముందున్న దారి.. The Road Ahead
ఈ మొత్తం కథనం ( Shock on Indian Solar Stocks )ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. గ్లోబల్‌ మార్కెట్లలో అవకాశాలు ఎంత వేగంగా వస్తాయో, అంతే వేగంగా సవాళ్లుగా మారుతాయి. సోలార్‌ రంగంలో భారత పురోగతి ప్రశంసనీయం. కానీ అమెరికా వంటి పెద్ద మార్కెట్లపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం. ఇక ఐటీ రంగంలో ఏఐ విప్లవం కొత్త అవకాశాలు తెచ్చిపెట్టినా, పాత బిజినెస్‌ మోడళ్లను ప్రశ్నిస్తోంది. ఈ రెండు రంగాల్లోనూ రాబోయే రోజులు “అనుకూలతకు అనుగుణంగా మారే సామర్థ్యం”నే విజయానికి కీలకంగా మారనుంది.

 

146
FEATURE NEWS Tags:95% Exports Head to the US, Companies Say “Limited Impact”, Countervailing Duty Explained ?, Is This an Attempt to Curb China?, IT Stocks Under AI Shadow, Solar Boom to Solar Shock, The Road Ahead, Why the Market Trembled ?

Post navigation

Previous Post: సోలార్ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై126 శాతం డ్యూటీ..! ట్రంప్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం! 126% Duty on Solar Imports! Trump Administration Takes a Key Decision
Next Post: ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India

Related Posts

  • గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్‌.. ఏప్రిల్‌ నుంచి రూల్స్‌ మార్పు.. New Rules to Impact Gold Bond Investors from April FEATURE NEWS
  • కార్పొరేట్ ఎఫ్‌డీల్లో వ‌డ్డీలు ఎంత‌..? FEATURE NEWS
  • బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers FEATURE NEWS
  • How to become a millionaire మిలీయనీర్ అవ్వడం ఎలా FEATURE NEWS
  • అవ‌గాహ‌న లేకుండా ట్రేడింగ్‌లో దిగితే న‌ష్ట‌మే without understanding it will be a loss FEATURE NEWS
  • లోన్‌ను ముందుగానే క్లోజ్ చేస్తే సిబిల్‌ స్కోర్‌కు నష్టం ఉంటుందా? Does Foreclosing a Loan Affect Your CIBIL Score? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో మార్కెట్లలో కలకలం… లాభాల జోరు ఒక్క రోజుకే పరిమితం.. Trump Remarks Rattle Markets… Rally Short-Lived FEATURE NEWS
  • ఒంటికి స‌రే.. ఇంటికో..? * హోం ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే FINICAL PLANNING
  • మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ చేస్తున్నారా what is sip in mutual funds MUTUAL FUNDS
  • పదవీ విరమణ ప్రణాళికలో మారుతున్న దృక్పథం.. FEATURE NEWS
  • అమ‌లులోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం .. New Income Tax Law Comes Into Effect from Today FEATURE NEWS
  • అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు.. EPFO New Guidelines for International Workers FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme