హైదరాబాద్ః ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న వైద్య ఖర్చులు (medical expenses), ఊహించని రోగాలు, ప్రమాదాల వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి సమగ్రమైన ఆరోగ్య బీమా (health insurance) ఎంతో అవసరం. దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో (lowest premium) అత్యధిక ప్రయోజనాలను, దాదాపు 600 శాతం వరకు గ్యారంటీడ్ బోనస్ (cumulative bonus) అందించే నంబర్ వన్ పాలసీగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (Care Health Insurance) వారి “కేర్ సుప్రీమ్ ప్లాన్” (Care Supreme Plan) నిలుస్తోంది. అత్యవసర సమయంలో ఆసుపత్రి బిల్లుల భారం పడకుండా కుటుంబానికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించే ఈ పాలసీకి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కేర్ సుప్రీమ్ ప్లాన్ ముఖ్యమైన ప్రత్యేకతలు
ఈ పాలసీలో చేరే పాలసీదారులకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన పని లేకుండా పూర్తిగా నగదు రహిత చికిత్స (100% cashless treatment) లభిస్తుంది. అంతేకాకుండా, చాలా కంపెనీల పాలసీలలో ఉండే కో-పేమెంట్ నిబంధన ఇందులో అస్సలు ఉండదు (no co-payment), అంటే క్లెయిమ్ సమయంలో మీరు మీ జేబు నుంచి ఎలాంటి శాతం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేగాక, ఈ పాలసీ తీసుకోవడానికి ఎటువంటి గరిష్ట వయోపరిమితి కూడా లేదు (no age limit). పాలసీ ప్రీమియం చెల్లింపుల కోసం సులభ వాయిదాల పద్ధతి (EMI facility) అందుబాటులో ఉంది.
ఆసుపత్రి ఖర్చుల పూర్తి కవరేజ్
ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ప్రధాన ఖర్చులైన ఆపరేషన్ థియేటర్ (operation theater – OT), ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU), రూమ్ రెంట్ (room rent), ఇన్-పేషెంట్ ఖర్చులు (inpatient charges), ల్యాబ్ పరీక్షలు (lab investigations), మందుల ఖర్చులు (pharmacy expenses) మొదలైన వాటిపై ఎలాంటి పరిమితులు (no sub-limits) ఉండవు. ఎంచుకున్న బీమా మొత్తం (sum insured) పరిమితి వరకు వీటిని పూర్తిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే రూమ్ రెంట్ విషయంలో కూడా ఎలాంటి పరిమితి లేకుండా ఆసుపత్రిలోని అన్ని సాధారణ గదులతో పాటు సూట్ రూమ్స్ (suite rooms) కూడా పూర్తి మొత్తానికి కవర్ అవుతాయి.
అద్భుతమైన క్యుములేటివ్ బోనస్ సూపర్ (Cumulative Bonus Super)
ఈ ప్లాన్ యొక్క అతిపెద్ద ఆకర్షణ 600 శాతం వరకు లభించే క్యుములేటివ్ బోనస్ సూపర్. క్లెయిమ్ చేసినా, చేయకపోయినా క్లెయిమ్‌తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఈ బోనస్ గ్యారంటీగా లభిస్తుంది.
మొదటి సంవత్సరంలో 150 శాతం బోనస్ లభిస్తుంది. ఉదాహరణకు 5 లక్షల పాలసీ ఉంటే అది 12.50 లక్షలు, 7 లక్షలకు 17.50 లక్షలు, 10 లక్షలకు 25 లక్షలు, 15 లక్షలకు 37.50 లక్షల కవరేజీగా మారుతుంది.
రెండవ సంవత్సరంలో మరో 150 శాతం బోనస్ కలవడంతో 5 లక్షల బీమా ఏకంగా 20 లక్షలకు, 7 లక్షలది 28 లక్షలకు, 10 లక్షలది 40 లక్షలకు, 15 లక్షలది 60 లక్షల రూపాయలకు పెరుగుతుంది.
మూడవ సంవత్సరంలో 100 శాతం బోనస్‌తో 5 లక్షల కవరేజ్ 25 లక్షలకు, 7 లక్షలది 35 లక్షలకు, 10 లక్షలది 50 లక్షలకు, 15 లక్షలది 75 లక్షలకు చేరుతుంది.
నాల్గవ సంవత్సరంలో మరో 100 శాతం బోనస్‌తో 5 లక్షలకు 30 లక్షలు, 7 లక్షలకు 42 లక్షలు, 10 లక్షలకు 60 లక్షలు, 15 లక్షలకు 90 లక్షలు అవుతుంది.
ఐదవ సంవత్సరంలో ఇంకో 100 శాతం బోనస్ రావడంతో మొత్తం 600 శాతం పూర్తయి, 5 లక్షల ప్రాథమిక పాలసీ ఏకంగా 35 లక్షల రూపాయల రక్షణగా మారుతుంది. అలాగే 7 లక్షలకు 49 లక్షలు, 10 లక్షల పాలసీకి 70 లక్షలు, 15 లక్షల పాలసీ తీసుకుంటే రికార్డు స్థాయిలో 1.05 కోట్ల రూపాయల వరకు కవరేజ్ లభిస్తుంది.
దీనికి అదనంగా బోనస్ బూస్టర్ (bonus booster rider) ద్వారా 6వ సంవత్సరం నుంచి పాలసీని రెన్యూవల్ చేసిన ప్రతిసారీ క్లెయిమ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఏటా 100 శాతం గ్యారంటీ బోనస్ జీవితాంతం లభిస్తుంది. అన్లిమిటెడ్ కేర్ రైడర్ (unlimited care rider) తీసుకోవడం ద్వారా పాలసీ కాలంలో ఒక భారీ క్లెయిమ్ (big claim) కోసం బీమా మొత్తం మరియు బోనస్ కంటే ఎక్కువ ఆసుపత్రి ఖర్చు అయినా పూర్తి బిల్లును కంపెనీ భరిస్తుంది.
అపరిమిత ఆటోమేటిక్ రీఛార్జ్ (Unlimited Automatic Recharge)
పాలసీ వ్యవధిలో ఏదైనా అనారోగ్యం కారణంగా బీమా కవరేజ్ మొత్తం లేదా పాక్షికంగా అయిపోయిన వెంటనే, మరో లేఖ లేదా అభ్యర్థన లేకుండానే బీమా మొత్తం స్వయంచాలకంగా రీఛార్జ్ అవుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి లేదా వేర్వేరు వ్యక్తులు, ఒకే సంవత్సరంలో ఎన్నిసార్లు ఆసుపత్రి పాలైనా ఈ పూర్తి రీఛార్జ్ మొత్తాన్ని వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి వేచి ఉండే సమయం (waiting period) ఉండదు.
ఇతర సదుపాయాలు మరియు చికిత్సలు
ఈ పాలసీలో ఎలాంటి అంతర్గత పరిమితులు (no sub limits) లేవు. రోబోటిక్ సర్జరీలు (robotics surgeries), అవయవ దానం ఖర్చులు (organ donor expenses), ఆయుష్ పద్ధతిలోని హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వంటి సంప్రదాయ చికిత్సలు (AYUSH coverage), అలాగే ఇంట్లోనే ఉండి పొందే వైద్య చికిత్సలకు (domiciliary hospitalization) పూర్తి రక్షణ ఉంటుంది.
ఆసుపత్రిలో చేరడానికి ముందు 60 రోజుల ఖర్చులు (pre-hospitalization) మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు అయ్యే మందులు, వైద్య పరీక్షల ఖర్చులు (post-hospitalization) రీయింబర్స్ అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏటా ఉచితంగా వార్షిక ఆరోగ్య పరీక్షలు (annual health check-up) చేయించుకోవచ్చు; ఇది పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాత వర్తిస్తుంది. క్లెయిమ్ షీల్డ్ ప్లస్ రైడర్ (claim shield plus rider) ద్వారా దాదాపు 146 రకాల సాధారణ వినియోగ వస్తువుల (non-medical consumables) బిల్లులు కూడా కవర్ చేయబడతాయి. అత్యవసర పరిస్థితుల్లో రోడ్ అంబులెన్స్ (road ambulance) తో పాటు ఎయిర్ అంబులెన్స్ (air ambulance) సదుపాయం కూడా లభిస్తుంది.
కవరేజ్ నిబంధనలు మరియు కాలపరిమితి
మొదటి రోజు నుంచే కవరేజ్ (Day 1 coverage): రోడ్డు లేదా రైలు ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, పాము కాటు లేదా కుక్క కాటు, ఎత్తు నుండి జారిపడటం, పిడుగుపాటు లేదా సిలిండర్ పేలుళ్ల వల్ల జరిగే అత్యవసర ప్రమాద చికిత్సలు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే కవర్ అవుతాయి.
30 రోజుల తర్వాత కవరేజ్ (After 30 days): వైరల్ ఫీవర్లు (viral fevers), డెంగ్యూ (dengue), చికెన్ గున్యా (chikungunya), మలేరియా, విష జ్వరాలు, అపెండిసైటిస్ (appendicitis), గుండెపోటు (heart attack), స్ట్రోక్ (stroke), 5 రకాల క్యాన్సర్లు, కరోనా లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మొదలైనవి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత వర్తిస్తాయి.
రెండు సంవత్సరాల తర్వాత కవరేజ్ (After 2 years / 24 months): కంటి శుక్లాలు (cataract), కిడ్నీలో రాళ్లు (kidney stones), పైల్స్ (piles), ఫిస్టులా, హెర్నియా (hernia), వెన్నెముక లేదా డిస్క్ సమస్యలు (slip disc), మోకాలి మార్పిడి (knee replacement), కీళ్ల మార్పిడి (joint replacement), గర్భసంచి సమస్యలు (hysterectomy), కడుపులోని గడ్డలు (fibroids), చెవి-ముక్కు-గొంతు (ENT) వ్యాధులు, ఇతర శస్త్రచికిత్సలు మరియు డే కేర్ ప్రొసీజర్స్ (day care procedures) 24 నెలల తర్వాత పూర్తిగా కవర్ అవుతాయి.
గతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైన (pre-existing diseases – PED) బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి వాటికి సాధారణంగా 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అయితే మోడిఫైడ్ రైడర్ (modified PED rider) ద్వారా ఈ సమయాన్ని కేవలం 1 లేదా 2 సంవత్సరాలకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వేరే కంపెనీలలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు కోల్పోకుండా సులభంగా పోర్టబిలిటీ (policy portability) చేసుకోవచ్చు.
