Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates

Posted on 05/12/2025 By admin No Comments on ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates

ఈ ఏడాది ఇప్పటికే మూడు దఫాలుగా వడ్డీ రేట్లను తగ్గించి రుణగ్రహీతలకు ఉపశమనం అందించిన ఆర్‌బీఐ… మరోసారి శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు కోత విధిస్తూ, రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం… వృద్ధి రేటు ఊపందుకోవడంతో ఈ కోత చేపట్టినట్లు ఆయన వివరించారు.

రేట్ల కోతతో ఉపశమనం..Relief Through Rate Cuts

రెపో రేటు తగ్గడంతో గృహ రుణాలు, వాహన రుణాలు, బంగారు రుణాలు తదితర వాటి EMIలు మరింత తగ్గనున్నాయి. రుణగ్రహీతలకు ఇది మరో పెద్ద రిలీఫ్‌ కావొచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గించగా… జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. తాజా తగ్గింపుతో 2025లో మాత్రమే మొత్తం 1.25 శాతం వరకు రెపో రేటు దిగివచ్చింది.

ఆర్‌బీఐ గవర్నర్ ఏమ‌న్నారంటే.. What the RBI Governor Said…

ఆర్థిక వృద్ధికి ఊతం (Boost to Economic Growth): జీఎస్‌టీ హేతుబద్ధీకరణతో కొనుగోళ్లు పెరగడం, దేశీయ డిమాండ్‌ బలపడడంతో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2% వృద్ధి నమోదు అయింది. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 6.8% నుంచి 7.3% కి పెంచుతున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

ద్రవ్యోల్బణం మరింత క్షీణత (Further Decline in Inflation): ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని పేర్కొంటూ,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి CPI ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను 2.6% నుంచి 2% కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్ (Open Market Operations): ప్రభుత్వ ఆర్థిక అవసరాల దృష్ట్యా, రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయానికిఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (OMO) చేపట్టనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

బలమైన విదేశీ మారక నిల్వలు (Strong Foreign Exchange Reserves): ప్రస్తుతం దేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని, ఇవి రాబోయే 11 నెలల దిగుమతుల అవసరాలను తీరుస్తాయని గవర్నర్‌ పేర్కొన్నారు.

రేట్ల కోతతో మార్కెట్లలో సంబరమే.. Markets Cheer the Rate Cut..

వృద్ధి సంకేతాలు బలపడడం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం, రుణ వ్యయం తగ్గడం… ఇవన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థకు ధనిక సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న గృహ నిర్మాణం, వాహన విక్రయాలు, చిన్న వ్యాపారాలు .. ఈ కోతతో మరింత ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

EMIలు ఎంతవరకు తగ్గనున్నాయంటే? How Much Will EMIs Come Down?

ఆర్‌బీఐ ప్రకటించిన 0.25% వడ్డీ రేట్ల కోత రుణదారులకు ఊర‌ట క‌లిగించ‌నుంది. గృహ రుణాలు, వాహన రుణాలు, బంగారు రుణాలు వంటి అన్ని ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేటు లోన్లపై EMIలు స్వల్పంగా తగ్గనున్నాయి. బ్యాంకుల నుంచి లెక్కలు తీసుకుంటే… ఈ కోత రుణ కాలం, వడ్డీ రకం, మిగిలిన బాకీ ఆధారంగా కాస్త మారుతుందనే విషయం స్పష్టం అవుతోంది.

– ఉదాహ‌ర‌ణ‌కు మీ గృహ రుణం (Home Loan) మొత్తం ₹30 లక్షలు అనుకుందాం. దీనిపై పాత వడ్డీ రేటు 8.50% ఉండ‌గా.. కొత్త రేటు (కోత తర్వాత): 8.25%గా మార‌నుంది. దీని లోన్ కాలం లోన్ కాలం 20 ఏళ్లు అనుకుందాం. పాత EMI ₹25,937గా ఉంటే కొత్త EMI ₹25,398 చెల్లిస్తే స‌రిపోతుంది. అంటే నెల‌కు ₹539 / భారం త‌గ్గ‌నుంది. ఏడాదికి ₹6,468 సేవ్ అవుతుంది. 20 ఏళ్లలో మొత్తంగా సుమారు ₹1.3 లక్షలు సేవ్ అవుతుంది.

– మ‌రో ఉదాహరణగా కార్‌లోన్ ( car Loan) తీసుకుంటే.. మీ లోన్ ₹12 లక్షలు అనుకుందాం. పాత వడ్డీ 10% ఉంటే ఇప్పుడు అది 9.75% గా మార‌నుంది. లోన్ కాలం 7 ఏళ్లు అనుకుంటే.. పాత EMI ₹19,122గా ఉండ‌గా..కొత్త EMI ₹18,839 చెల్లిస్తే స‌రిపోతుంది. ఇకపై ప్ర‌తినెలా మీకు ₹283 సేవ్ అవుతుంది.

– బంగారు రుణాల (Gold Loans)విష‌యానికొస్తే.. మీ లోన్ మొత్తం ₹3 లక్షలు అనుకుందాం. రుణ కాలం రెండేళ్ళుగా పెట్టుకుంటే.. వడ్డీ 9.5% నుంచి 9.25% త‌గ్గుతంది. పాత EMI ₹13,829గా ఉంటే కొత్త EMI ₹13,773 చెల్లించాల్సి ఉంది. ఇక‌పై ప్ర‌తినెలా మీకు ₹56 సేవ్ అవుతుంది. బంగారు రుణాలు స్వ‌ల్ప కాలానికి ఉంటాయి కాబ‌ట్టి EMIలు ఎక్కువగా తగ్గకపోవొచ్చు. కానీ వడ్డీ మొత్తం మాత్రం తగ్గుతుంది.

ఈ తగ్గుదల ఎందుకు తక్కువగా కనిపిస్తుంది? Why the Reduction Appears Small?

0.25% కోత ఒక చిన్న మార్పు మాత్రమే. EMIలు లోన్ కాలం అంతా విస్తరించుకోవడం వల్ల తగ్గుదల ఒక్క నెలకు ఎక్కువగా కనిపించదు. అయితే మొత్తం రుణకాలమంతా కలిపితే సేవింగ్ గణనీయంగా ఉంటుంది. ప్రత్యేకంగా గృహ రుణాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన రుణ నిల్వ ఎక్కువగా ఉన్నవారికి EMI తగ్గుదల ఎక్కువ. కొత్తగా రుణం తీసుకునేవారికి ఇది మంచి అవకాశం. రీఫైనాన్స్ (బ్యాంకు మార్చడం) పైనా ఆసక్తి చూపొచ్చు. ఏదేమైనా తాజా ఆర్‌బీఐ నిర్ణ‌యంతో ప్రతి EMIలో వచ్చే చిన్న తగ్గుదల, దీర్ఘ‌కాలంలో పెద్ద మొత్తాన్ని సేవ్ చేయిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఊరట.

బ్యాంకుల స్పందన …Banks’ Response

– RBI వడ్డీ రేట్ల కోత తర్వాత Canara Bank, Union Bank of India, Indian Overseas Bank లు తమ రెపో‑లింక్డ్ రుణ రేట్లు (RLLR) తగ్గిస్తూ హోం లోన్ తీసుకున్న వారికి ఉపశమనం పలికాయి. దీంతో గృహ రుణాలు, వాహన రుణాలు వంటి లోన్ EMI త‌గ్గింపులు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా.. బ్యాంకుల డిపాజిట్ రేట్లపై కూడా ప్రభావం కనిపిస్తోంది. డిపాజిటర్లు (పెట్టుబడిదారులు / భద్రత‑పూర్తి ఖాతాదారులు) తమ వడ్డీ ఆదాయంలో తగిన తగ్గుదల ఎదుర్కొంటున్నారు.

– RBI వడ్డీ కోతతో బ్యాంకులు తక్కువ వ్యయంతో ఫండింగ్ పొందగలిగాయి. ఈ కారణంగా కొంత డబ్బు ప్రవాహం (liquidity) లో ఉంచేందుకు వీలు కనిపిస్తోంది.ఇది రుణాల ఆఫర్ పెరిగే దిశగా ఉంటుంది. కానీ, అందులో పార్ట్‌గా వడ్డీ మార్జిన్ (Net Interest Margin = NIM) మీద ఒత్తిడి ఉండే అవకాశాలను కూడా బ్యాంకులు గుర్తించాయి. అంటే డిపాజిట్ రేట్ల తగ్గింపు + రుణ రేట్ల తగ్గింపు = మార్జిన్ చిన్నగా ఉండొచ్చు. రేటు తగ్గించినా, డిపాజిట్ వడ్డీలు కూడా తగ్గినందున బ్యాంకుల లాభం పై ప్ర‌భావం ప‌డే అవకాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

– రుణాలు, EMIలు సునాయాసం అయ్యే అవకాశం ఉండ‌డంతో ఇంటి కొనుగోలు ఆలోచనలు, హౌసింగ్‑లోన్‑గ్రహీతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ మార్పు రియల్‑ఎస్టేట్ రంగానికి ఊత‌మిస్తుందిన బ్యాంక్ వర్గాలు ఆశిస్తున్నాయి. వ్యాపార రుణాలు, వాహన రుణాలు, ఇతర లోన్లు పెర‌గ‌నున్న‌ట్లు బ్యాంకులు భావిస్తున్నాయి. మొత్తంగా ఆర్‌బీఐ వడ్డీ కోత వ‌ల్ల‌ సాధారణ వడ్డీలు, రుణాలు, EMIలు తీసుకునే వారికి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కానీ బ్యాంకులు ఇప్పుడు కొత్త స్మార్ట్‑మెనేజ్‌మెంట్ అవసరంతో ఉండాలి. డిపాజిట్‑వడ్డీలు తగ్గడం, మార్జిన్ ఒత్తిడి వంటివి గమనించడంతో బ్యాంకుల ఆర్థిక స్థితిపై కూడా బ్యాలెన్స్‌ కావాలి.

 

278
FEATURE NEWS Tags:Banks’ Response, Further Decline in Inflation, How Much Will EMIs Come Down?, Markets Cheer the Rate Cut.., Open Market Operations, Relief Through Rate Cuts, Strong Foreign Exchange Reserves, What the RBI Governor Said…, Why the Reduction Appears Small?

Post navigation

Previous Post: గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్… ₹1 లక్ష పెట్టుబడికి ₹4.41 లక్షలు! Bumper Returns on Gold Bonds… ₹1 Lakh Investment Grows to ₹4.41 Lakh!
Next Post: ₹2 కోట్లు బీమా..! LIC నుంచి కొత్త ప్లాన్స్‌! ₹2 Crore Insurance! New LIC Plans Launched

Related Posts

  • మార‌నున్న పాన్‌ నిబంధనలు… Relief for Taxpayers under New PAN Rules FEATURE NEWS
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో కొత్త మలుపు… A New Turn in Gold ETFs FEATURE NEWS
  • How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..? FEATURE NEWS
  • రిస్క్ ఉన్నా మంచి రాబ‌డి అందించే పెట్టుబ‌డులు ఏమిటో తెలుసా? High-Risk, High-Return Investment Options FEATURE NEWS
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు..! బ్యాంకింగ్ సేవ‌ల‌పై ప్ర‌భావం! Consecutive Bank Holidays in April..! Impact on Banking Services FEATURE NEWS
  • 1947 నుండి 2025 వరకు రూపాయి కథ.. Rupee’s Journey: From 1947 to 2025 FEATURE NEWS
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • పోస్టాఫీస్ డెలివరీ సేవలలో కీలక మార్పులు.. ఇక నెక్ట్స్ డే డెలివరీ ! Key Changes in Post Office Delivery Services: Next-Day Delivery Now! FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • ఆస్తి కొనుగోలులో జాగ్రత్తలు – ఒక్క పొరపాటు జీవితాంతం భారం.. Precautions in Property Buying – One Mistake Can Cost a Lifetime FEATURE NEWS
  • అక్టోబరులో 102 ఒప్పందాలు … రూ.47,000 కోట్ల పెట్టుబడులు! 102 Deals, ₹47,000 Crore Investments FEATURE NEWS
  • ప్రీ-అప్రూవ్డ్ లోన్లు… లాభ‌మా? లేక నష్ట‌మా? Pre-Approved Loans: Benefit or Burden? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme