Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

What is Personal loan and how to get personal loan ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే ఏమిటి దానిని పొంద‌డం ఎలా

Posted on 28/01/202431/01/2025 By admin No Comments on What is Personal loan and how to get personal loan ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే ఏమిటి దానిని పొంద‌డం ఎలా

ఇటీవ‌ల ప‌ర్స‌న‌ల్ లోన్స్‌ విరివిగా ల‌భిస్తున్నాయి. బ్యాంకులే స్వ‌యంగా ఫోన్ చేసి లోన్ తీసుకోండి అంటూ అడుగుతున్నాయి. ఇత‌ర ఆన్‌లైన్ లోన్ యాప్స్ సంగ‌తి స‌రేస‌రి. ఇక ఈ బ్యాంకులు ఇచ్చే ప‌ర్స‌న‌ల్‌లోన్ ప్రాసెస్ ఏమిటి..? వ‌డ్డీ ఎంత‌, ఈఎంఐ ఎంత అనే విష‌యాలు ఓ సారి చూద్దాం.

మనం అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. బ్యాంకులు ఈ లోన్స్ ని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనకి ఇస్తాయి. కేవ‌లం మ‌న‌ల్ని న‌మ్మి ఇస్తాయి కాబ‌ట్టి ఇవి అంత సురక్షితం కాద‌ని బ్యాంకుల భావ‌న‌. అందుకే వీటిపై అధిక వడ్డీ రేటు వ‌సూలు చేస్తాయి. అయినా మనం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రుణం తీసుకుంటాం. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో నెలవారీ చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే మనం పర్సనల్ లోన్ తీసుకునేముందు బ్యాంకు వడ్డీ రేట్లు, కాలపరిమితి, ఆలస్య రుసుము వంటివి తెలుసుకోవాలి.

* ఏ బ్యాంకు వెబ్‌సైట్‌లోకి వెళ్లినా మ‌న‌కు ప‌ర్స‌న‌ల్ లోన్ వివ‌రాలు దొరుకుతాయి. మ‌నం మెసేజ్ చేయ‌గానే మ‌న ఎలిజిబిలిటీ వివ‌రాలు అడుగుతుంది. న‌మోదు చేయ‌గానే ఎంత వ‌స్తుంది.. ఎంత వ‌డ్డీ అని తెలుస్తుంది. వాటిని బ‌ట్టి మ‌నం బ్యాంకు సిబ్బందితో మాట్లాడ‌వ‌చ్చు. ఇక్క‌డ రుణం మ‌న జీతాన్ని బ‌ట్టి ఉంటుంది.
* మనకి లోన్స్ ఇవ్వాలంటే బ్యాంకు మన క్రెడిట్ స్కోర్ ని పరిశీలిస్తుంది. మనం లోన్ తిరిగి చెల్లించగల స్థోమత ఉంటేనే లోన్ ఇస్తారు. లేకపోతే మన అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. అందువల్ల లోన్ కోసం దాఖలు చేసుకునే ముందుగా క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకోవడం చాలా అవ‌స‌రం.

అధిక వ‌డ్డీ..
పర్సనల్ లోన్స్ కి వడ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఎందుకంటే చాలావరకు వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ ఉండదు. భద్రత తక్కువగా ఉంటుంది. బ్యాంకులు మినిమమ్ 11 శాతం నుంచి 16 శాతం వ‌ర‌కూ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. ఇతర ఆర్థిక‌ సంస్థల్లో దీనికంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. వడ్డీ రేట్లు మనం రుణం తీర్చే వ్యవధి బట్టి ఉంటుంది. నెలవారీ వాయిదా ఉంటుంది. కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఈఎంఐ తక్కువ‌గా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంటుంది.

what is processing fees in personal loan

మనం పర్సనల్ లోన్ తీసుకున్నపుడు ప్రోసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇవి మనకిచ్చే లోన్స్ బట్టి ఉంటుంది. బ్యాంకులన్నింటికీ ప్రాసెసింగ్ ఫీజు ఒకేలా ఉండదు. బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
మనం ఏదైనా కారణం చేత ఈఎమ్ఐ చెల్లించడం ఆలస్యం అయితే బ్యాంకులు ఎక్కువ వడ్డీలు విధిస్తాయి. మన అకౌంట్ లో సరిపోయినంత డబ్బులు లేకపోతే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ తిరస్కరించినా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు చాలా అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది ఒక్కోసారి ఈఎమ్ఐలో 5 శాతం నుంచి 10 శాతం వరకు కూడా ఉండే అవకాశముంది.

ముందే తీర్చినా..
మనం అత్యవసర పరిస్థితుల్లో లోన్స్ తీసుకుంటాం. నగదు అందిన వెంటనే కొంతమంది తిరిగి చెల్లిస్తారు. అందుకే గడువు ముగింపుకంటే ముందే ఖాతాను మూసివేస్తే ఛార్జస్ పడతాయా అనే సందేహం అంద‌రికీ ఉంటుంది. ఇలా ముందే తీర్చేస్తే బ్యాంకులు చార్జీలు వ‌సూలు చేస్తాయి. వీటినే ప్రీ క్లోజింగ్ చార్జీలు అంటారు. కొన్ని బ్యాంకులు మాత్రం వీటిని వ‌సూలు చేయ‌వు.

ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న అవ‌స‌రాల‌కు కూడా లోన్ తీసుకోవ‌డానికి వెనుక‌డుగు వేయ‌డం లేదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మొబైల్ యాప్‌ల‌లో కూడా విరివిగా లోన్లు ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు మ‌రింత ఉత్సాహంగా వీటి కోసం ఎగ‌బ‌డుతున్నారు. అయితే ప‌ర్స‌న‌ల్ లోన్ కి వెళ్లే ముందు మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు చాలానే ఉన్నాయి.

ప‌ర్స‌న‌ల్ లోన్ అంటే ఏమిటి.. దానిని ఎలా పొందాలి అనే విష‌యంలో ఇప్ప‌టికీ చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. పర్సనల్ లోన్ అనేది ఉపాధి చరిత్ర, తిరిగి చెల్లించే సామర్థ్యం, ​​ఆదాయ స్థాయి, చేసే ప‌ని, క్రెడిట్ హిస్ట‌రీ వంటి ప్రమాణాల ఆధారంగా ఆర్థిక సంస్థలు అందించే రుణం. వినియోగదారు రుణంగా పిలువబడుతూ బహుళ ప్రయోజనాల కోసం ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం, కుటుంబ అవ‌స‌రాల కోసం తక్షణమే పొంద‌వ‌చ్చు.

What are the benefits of personal loan

హోమ్ లోన్ లేదా గోల్డ్ లోన్ వంటి ఇతర రకాల లోన్ల‌కు మనం తప్పనిసరిగా అనేక డాక్యుమెంట్‌లను అందించాలి. అంతే కాకుండా ఇక్క‌డ ప్రాసెసింగ్ టైం కూడా చాలా ఎక్కువ ప‌డుతుంది. పర్సనల్ లోన్‌లకు కనీస పత్రాలు ఇస్తే స‌రిపోతుంది. ఇందులో ఆమోద ప్రక్రియ కూడా చాలా త్వరగా జరుగుతుంది.

* వివిధ ఆర్థిక సంస్థలు పర్సనల్ లోన్ ను ఆన్‌లైన్ లో అందిస్తున్నాయి. ఇక్క‌డ మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని ఒప్పించినట్లయితే లోన్ మొత్తం కొన్ని గంటల్లోనే పంపిణీ చేయబడుతుంది.
పర్సనల్ లోన్ లో మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, రుణదాతలు మీ లోన్ కాలపరిమితిని ఎంచుకోవడానికి మీకు సౌలభ్యాన్ని అందిస్తారు.
సాధారణంగా, పర్సనల్ లోన్ కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి, మీరు మీ రీపేమెంట్ కెపాసిటీ ఆధారంగా లోన్ టర్మ్‌ని ఎంచుకోవచ్చు. మనం తక్కువ కాలాన్నిఎంచుకుంటే చెల్లించే వడ్డీని ఆదా చేసుకోవచ్చు. రుణ మొత్తాన్ని కూడా వేగంగా తిరిగి చెల్లించవచ్చు.

* మ‌నం పొంద‌గ‌లిగే లోన్ అనేది ఆదాయ స్థాయి, వృత్తి పై ఆధారపడి ఉంటుంది.
* రుణదాతలు లోన్ ఇచ్చే ట‌ప్ప‌డు కొన్ని కాలిక్యులేష‌న్స్ ఆధారంగా మంజూరు చేస్తారు. సాధార‌ణంగా రుణం అనేది నెల జీతాన్ని 12 తో గుణించి ఇస్తారు. అంటే ఇక్క‌డ మ‌నం చెల్లించాల్సిన EMI అనేది మన నెలవారీ ఆదాయంలో 40% – 50% కంటే ఎక్కువగా ఉండకూడ‌ద‌నేది ప్రాథ‌మిక‌ నియ‌మం.
* రుణ మొత్తాన్ని లెక్కించేటప్పుడు ఏవైనా బకాయిలు ఉంటే రుణదాతలు పరిశీలిస్తారు.
* వ్యాపార యజమాని లేదా స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే లాభం నష్ట ప్రకటనలో నమోదు చేయబడిన లాభాల ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. మీరు జీతం తీసుకునే ప్రొఫెషనల్ అయితే, రుణదాత మీ జీతం, ఇతర బాధ్యతల ఆధారంగా మొత్తాన్ని నిర్ణయిస్తారు.

How to apply for personal loan
ప‌ర్స‌న‌ల్ లోన్‌కి ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ఈ రోజుల్లో ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవ‌డం చాలా సుల‌భంగా మారింది. ఇప్ప‌డన్ని సంస్థ‌లు ఆన్‌లైన్లో రుణం ఇస్తుండడంతో చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే చాలు రుణం పొంద‌డం క‌ష్ట‌మేమీ కాదు.
ఇందుకోసం మ‌నకు సంబంధించిన బేసిక్ డీటైల్స్‌ను ముందుగా సిద్ధం చేసుకోవాలి.

ఆదాయపు రుజువు (పే స్లిప్, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, ఐటీఆర్ ఫారమ్‌లు)ను సిద్ధం చేసుకోవాలి.
నివాస ధ్రువ ప‌త్రం
గుర్తింపు కార్డు ( ఆధార్ కార్డ్, ఓట‌ర్ కార్డ్‌)
మీ విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌లు.
డిగ్రీలు, లైసెన్స్ సర్టిఫైడ్ కాపీ (ఇది స్వయం ఉపాధి పొందుతున్న‌ దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది).

డాక్యుమెంటేషన్ అనేది రుణదాత నుంచి రుణదాతకు మారుతూ ఉంటుంది. కానీ ప్రాథ‌మికంగా పైన తెలిపినవి మాత్రం మ‌న ద‌గ్గ‌ర ఉంచుకుంటే స‌రిపోతుంది. ఇవ‌న్నీ దరఖాస్తు ఫారమ్‌తో పాటు మనం తప్పనిసరిగా అందించాల్సిన పత్రాలు.
వీటిని సిద్ధంగా ఉంచుకుని వీటికి ఫోటో కాపీలు తీసుకుని సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌లో గానీ, ఫైనాన్స్ కంపెనీ మొబైల్ యాప్‌లో కానీ ద‌ర‌ఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇవ‌న్నీ పూర్తి చేశాక బ్యాంకు ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి మీతో మాట్లాడి వివ‌రాల‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేసుకుని మీ రుణ ప‌రిమితిని తెలియ‌జేస్తాడు. అప్ప‌డు మీరు క‌న‌ఫ‌ర్మేష‌న్ తెలియ‌జేస్తే వెంట‌నే మీ బ్యాంకు ఖాతాలోకి రుణ మొత్తాన్ని జ‌మ చేస్తారు. ఇదంతా సుమారుగా గంట‌ల వ్య‌వ‌ధిలోనే పూర్త‌వుతుంది.

మన జీవిత భాగస్వామితో లేదా తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల వంటి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంయుక్తంగా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సహ-రుణగ్రహీతతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, రుణదాతలు లోన్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు దరఖాస్తుదారుల ఇద్దరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇలా మనం అధిక రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సహ-రుణగ్రహీత పేలవమైన క్రెడిట్ చరిత్రను కలిగి ఉన్నట్లయితే, రుణదాత మీ లోన్ దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉందని మనం తప్పక తెలుసుకోవాలి.

వ‌డ్డీ రేటు గురించి తెలుసుకోవాల్సిందే
have to know about the interest rate

మీరు లోన్ తీసుకునేట‌ప్పుడే మీరు చెల్లించాల్సిన వ‌డ్డీ రేటు ఎంత‌? కాల ప‌రిమితి ఎంత‌? అనే విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడి ధ్రువీక‌రించుకోవాలి. ఏ నెలైనా చెల్లించ‌డంలో ఆల‌స్య‌మైనా, లేదా మ‌ర్చిపోయినా ప‌డే ఫైన్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అంతే కాకుండా లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు తీసుకునే ప్రాసెసింగ్ చార్జీలు ఎంతో త‌ప్ప‌కుండా అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి.

అసలు గడువు ముగిసేలోపు లోన్‌ను ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించుకుంటే జప్తు రుసుము అని పిలువబడే పెనాల్టీ ఛార్జీలను విధించవచ్చు. ఈ పెనాల్టీ సాధారణంగా బకాయి మొత్తంలో ఒకటి నుండి రెండు శాతం వరకు ఉంటుంది.

ఇప్పుడు మీకు పర్సనల్ లోన్‌ల గురించి తెలిసింది కాబ‌ట్టి వివిధ రుణదాతల నుండి లోన్ ఆఫర్‌లను సరిపోల్చుకుని ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఖర్చులను తీర్చడానికి అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు.

వివిధ ఆర్థిక అవసరాల కోసం చాలా మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. చాలా వరకు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు అందరికీ రావు. మ‌న సిబిల్ స్కోర్ అనేది ఇక్క‌డ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉంటే తక్కువ వడ్డీకే బ్యాంకులు వ్యక్తిగత రుణాల్ని అందిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువైతే వ‌డ్డీ రేటు పెరుగుతుంది. మ‌రీ త‌క్కువ స్కోర్ ఉంటే పూర్తిగా రుణాల‌నివ్వ‌వు. పర్సనల్ లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి.
* గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థ‌లు నిర్దిష్ట కాలపరిమితికి సంబంధించి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంటాయి.
* పండగ సీజన్ లో బ్యాంకులు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఆఫర్లు ఉన్న సమయంలోనే బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తే.. చాలా తక్కువ వడ్డీకే లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది.
* లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు ఏయే బ్యాంకుల్లో లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉందో చూసుకోవాలి.

207
FEATURE NEWS Tags:have to know about the interest rate, How to apply for personal loan, how to get personal loan, What are the benefits of personal loan, What is Personal loan, What is Personal loan and how to get personal loan, what is processing fees in personal loan

Post navigation

Previous Post: ఎన్ ఆర్ ఐలు బ్యాంక్ అకౌంట్ స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలి How NRIs should resolve bank account issues
Next Post: WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి

Related Posts

  • సిబిల్‌ స్కోరుపై క్రెడిట్‌ కార్డుల ప్రభావం ఎంత ? జాగ్రత్తగా వాడితే లాభం, లేకపోతే నష్టమే! Credit Cards & CIBIL Score: A Boon if Used Wisely, a Risk if Misused FEATURE NEWS
  • రానున్న 2 నెలల్లో రూ.40 వేల కోట్ల ఐపీఓలు.. ₹40,000 Crore IPOs Lined Up in the Next Two Months FEATURE NEWS
  • ఎన్ ఆర్ ఐలు బ్యాంక్ అకౌంట్ స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలి How NRIs should resolve bank account issues FEATURE NEWS
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • ఉద్యోగం మారారా? నో టెన్ష‌న్‌.. ! పాత PF అకౌంట్లను ఇలా మెర్జ్ చేసుకోవ‌చ్చు! Changed Your Job? No Tension! Here’s How to Merge Your Old PF Accounts FEATURE NEWS
  • స‌రికొత్త‌గా.. యూపీఐ చెల్లింపులు new changes in UPI payments FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble! INSURANCE
  • స్టాక్ మార్కెట్ అంటే గేంబ్లింగ్ కాదు stock market is not a gambling MARKET
  • పెళ్లి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్‌లో భాగస్వామి చేర్చుకోవ‌డం వీల‌వుతుందా? Can You Add Your Spouse to Health Insurance After Marriage? INSURANCE
  • ఉద్యోగం మారారా? నో టెన్ష‌న్‌.. ! పాత PF అకౌంట్లను ఇలా మెర్జ్ చేసుకోవ‌చ్చు! Changed Your Job? No Tension! Here’s How to Merge Your Old PF Accounts FEATURE NEWS
  • ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ అంటే ఏమిటి what is share pledge FEATURE NEWS
  • పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option INSURANCE
  • క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit FEATURE NEWS
  • బ్యాంకు లాకర్‌లో మీ బంగారం భద్రమేనా ? Is Your Gold Really Safe in a Bank Locker? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme