ఈ సారి ధ‌ర‌లు త‌గ్గేవీ.. పెరిగేవీ..

what will increase in 2022 union bidget

బడ్జెట్ సందర్భంగా చేసిన ప్ర‌క‌ట‌న‌లో కొన్ని అంశాలపై ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌డం, మ‌రికొన్నింటి ధ‌ర‌లు పెర‌గ‌డం ప్ర‌తి బ‌డ్జెట్‌లోనూ మ‌మూలే. అయితే ఈ సారి బ‌డ్జెట్‌లో కొన్ని వ‌స్తువులపై ప‌న్నులు పెంచ‌డం వ‌ల్ల వాటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. పన్ను మినహాయింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. వ్యక్తిగత ఆదాయపన్నులోనూ ఎటువంటి మార్పులేదు.

* నేషనల్ పెన్సన్ స్కీంకు సంబంధించిన ఉద్యోగులకు 14 శాతం వరకు మినహాయింపును ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్ అనంతరం పలు ఉత్పత్తుల ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయి.
* కస్టమ్స్ డ్యూటీలో కొన్నిమార్పులు చేశారు. FY23 లో కొన్ని రసాయన దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు.

tax relief on agri products

* దేశంలో తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలమ్మ ప్రకటించారు. స్టీల్ స్క్రాప్ కు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పొడిగించారు.
గత రెండు బడ్జెట్లలో అనేక కస్టమ్స్ మినహాయింపులు ఇచ్చామ‌ని, మరోసారి క్రౌడ్ సోర్సింగ్ తో సహా విస్తృతమైన సంప్రదింపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్యపరికరాలు, తగినంత దేశీయ సామర్థ్యం ఉన్న మందులు, ఔషధాలపై మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

taxes on electric goods, gold will increase

ప్రస్తుత బడ్జెట్ నేపథ్యంలో సెల్ ఫోన్లు, సెల్ ఫోన్ ఛార్జర్లు, లెధర్ ఉత్పత్తులు, దుస్తులు, ఇమిటేషన్ జ్యువెల్లరీ, ఫామింగ్ గూడ్స్, జెమ్ స్టోన్స్ అండ్ డైమండ్స్ ధరలు తగ్గే అవకాశముంది. అదే సమయంలో గొడుగు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం పెంచిన తరుణంలో వీటి రేట్లు పెరగవచ్చు. ఎగుమతులను ప్రోత్సహించడానికి హస్తకళలు, వస్త్రాలు, తోలు వస్రాలు, లెదర్ పాదరక్షలపై అవసరమైన ఎగుమతుదారులకు మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపారు.

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *