పెట్టుబ‌డికి వెళ్లే ముందు..

when will we start investment

కొత్త‌గా ఉద్యోగంలో చేరేవారు, సంపాద‌న మొద‌లుపెట్టే వారు సేవింగ్ చేయాల‌నుకుంటారు. అయితే అలా సేవింగ్ కి వెళ్లే ముందు కొన్ని ప‌నుల‌ను త‌ప్ప‌నిస‌రిగా పూర్తిచేయాలి. మ‌న పెట్టుబ‌డుల ల‌క్ష్యం నెర‌వేరాలంటే ఇవి పూర్తి చేసుకోవాల్సిందే. ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసేముందు ఒక ప్రణాళికను సిధ్ధం చేసుకోవాలి. సరైన ప్రణాళిక ఉంటేనే పెట్టుబడులు సక్రమంగా ఉంటాయి. అందుకు ముందే మనం ప్లానింగ్ వేసుకుని ర‌డీగా ఉండాలి.

లక్ష్యాలను గుర్తించుకోవాలి
మనం పెట్టుబడులు ప్రారంభించేముందు మ‌రో ముఖ్యమైన పని చేయాలి. ముందుగా మన లక్ష్యాలను గుర్తించి, ఆ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు భవిష్యత్తులో ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కవేసుకోవాలి. ఆ మొత్తాన్ని లెక్కవేసుకున్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత అందుకు ఉన్న సమయం, కావాల్సిన మొత్తాన్ని అనుసరించి సరైన పెట్టుబడి మార్గాలు, పథకాలను ఎంచుకోవాలి.

plan for emergency fund

అత్య‌వ‌స‌ర నిధి..
మన పెట్టుబడి ప్రయాణం సరైన పద్దతిలో వెళ్ళాలంటే మన ఆర్థిక ప్రణాళికలో కొంత డబ్బును అత్యవసర పరిస్థితుల కోసం ఉంచాలి. మనకి అనుకోని కారణాల వల్ల సంపాదన ఆగిపోతే ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ ఒక్కోసారి ఆలస్యం కావచ్చు. అలాంటి సమయాల్లోనూ ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఇందుకోసం సుమారు ఆరు నెల‌ల పాటు మ‌న జీవ‌నానికి స‌రిప‌డే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఎప్పుడైనా తీసుకోగ‌లిగేలా దాచి పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవ‌డం కొంచెం లాభ‌దాయ‌కం.

లెక్క ఉండాల్సిందే..
ఖ‌ర్చులు ఎప్పుడూ ఆదాయానికి లోబ‌డి స్థాయి మేర‌కు ఉండాలి. ఈ విష‌యంలో చాలా స్ప‌ష్టంగా ఉండాలి. ముందుగా మనకి వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి. అయితే ఆదాయం ఖర్చులపై పూర్తి అవగాహన ఉండాలి. మనకొచ్చిన ఆదాయాన్ని ఒక పేపర్ మీద రాసుకుని ఖ‌ర్చుల‌ను కూడా నోట్ చేసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఖర్చు చేసే విధానం పై మనకి అవగాహన వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. అనవసరపు ఖర్చులను తగ్గించి పొదుపు చేయడానికి వీలుంటుంది. ప్రతి ఒక్కరూ నెలవారి ఆదాయం వచ్చిన వెంటనే కొంత పొదుపు చేసి మిగిలినది ఖర్చులకు ఉపయోగించాలి.

never go for loan

అప్పులు ఎప్ప‌డు చెయ్యాలో..
మనం అనవసర ఖర్చుల కోసం అప్పులు చేయకూడదు. విలాసాల కోసం, ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ కోసం లోన్‌లు తీసుకోకూడ‌దు. ఆస్తి కొనడానికి అప్పు చేసినా పర్వాలేదు. అది కూడా మన దగ్గర మినిమమ్ అమౌంట్ ఉంటేనే.. లేకపోతే డెబిట్ ఎక్కువౌతుంది. మన సొంత ఇంటి కల కోసం గృహ రుణం తీసుకోవచ్చు. పైగా చాలా వరకు ఇతర రుణాలతో పోల్చితే వడ్డీ రేటు తక్కువ‌గా ఉంటుంది. అలాగే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి . మనం కారు కొనాలనుకున్నపుడు మనం వీలైనంత డౌన్ పేమెంట్ చెల్లించి, తక్కువ కాలంలోనే రుణం క్లియర్ చేసుకోగలగాలి. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలు ఎక్కువ వడ్డీ విధిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండడం మంచిది.

ఇన్సూరెన్స్ మ‌ర‌వొద్దు..
సంపాదించే ప్రతి ఒక్కరూ పెట్టుబడుల కంటే తగిన జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవాలి. మనతో పాటు మన కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా రక్షణ లేకపోతే దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం చేసిన పొదుపు, పెట్టుబడులు వైద్య ఖర్చులకు సరిపోతుంది. మంచి క‌వ‌రేజీ ఉన్న పాల‌సీలు తీసుకోవాలి. ఎంత ముందుగా తీసుకుంటే అంత త‌క్కువ ప్రీమియం ఉంటుంది. అందువల్ల బీమాతో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలి.

 

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *