ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది.. ఇవి చూసుకోండి..!
how to plan for tax in financial year
ఆర్థిక సంవత్సరం మార్చి 31 తో ముగుస్తుంది. ఆ నాటికి మనకు ఆర్థికంగా ఉన్న అన్ని లావాదేవీలను సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లెక్కలు, పన్ను చెల్లింపులు వీటన్నింటినీ పూర్తిచేయాల్సిన ఆఖరు తేదీ మార్చి 31. ఆ తర్వాత నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం, కొత్త ప్రణాళికలు, కొత్త లెక్కలు ఇలా ఉంటాయి. వీటన్నింటి లోకీ ముఖ్యమైనది పన్ను చెల్లింపు.
how to choose tax benefit schemes
ఆర్థిక సంవత్సరం మొదలుకాగానే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటాం. చివరి వరకు ఉండడం వలన కొన్నిసార్లు ఇబ్బందులు పడవచ్చు. ముఖ్యంగా పన్ను ఆదా కోసం చేసే పెట్టబడుల్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం ఎంత ? దానికి మనం ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందని లెక్కలు వేసుకోవాలి. సెక్షన్ 80సీ కింద వర్తించే మినహాయింపులన్నీ వాడుకున్నామా ? లేదా సరి చూసుకోవాలి. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, జాతీయ ఫించను పథకం, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా పన్ను మినహాయింపుల కోసం అనేక పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. మనకు అనుకూలమైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవాలి. వీటిలో అవకాశం ఉంటే మరి కొంత పెట్టుకోవచ్చు.
what is the last date to tax filing
* వివాద్ సే విశ్వాస్ పథకంలో భాగంగా ఏదైనా పన్ను బాకీ ఉంటే దానిని చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. ఇలా చెల్లించకపోతే వడ్డీతోపాటు, అపరాధ రుసుములనూ రద్దు చేస్తామని పెర్కొంది. ఈ వెసులుబాటు ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు.
ఏటా ఆర్థిక సంవత్సరంలో రిటర్ను లు రుసుముతో చెల్లించడానికి మార్చి 31 చివరి తేది. ఆ తర్వాత రిటర్ను లను చెల్లించడానికి సాధ్యం కాదు. ఆడిట్ పరిధిలోకి వచ్చేవారు మార్చి 15 లోగా రిటర్ను లు దాఖలు చేయాలి.
* ఆధార్ తో పాన్ అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకూ సమయం ఉంది. ఈ ప్రకియ వెంటనే పూర్తిచేయకపోతే లేదా గడువుతేది దాటితే పాన్ చెల్లకుండా పోతుంది.
* మన బ్యాంకు ఖాతాలో కేవైసీ కి పాన్, ఆధార్, చిరునామా ధ్రువీకరణలాంటి వాటితో పాటు బ్యాంకుకు సంబంధించిన వివరాలనూ ఈ నెల 31 లోగా అందించాలి.
Leave a Reply