మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారికి బాగా తెలిసిన పదం ఇది. మనం తీసుకున్న ఆర్డర్‌ని అమ్మేయడం, లేదా ముగించడం. స్క్వేర్ ఆఫ్ చేస్తే మనం తీసుకున్న ట్రేడ్ అప్పటితో క్లోజ్ అయినట్టు అర్థం.
ఇంట్రాడే చేసే వారు సాయంత్రం 3.30 నిముషాల లోపలే ఆ రోజు తీసుకున్న ట్రేడ్‌ని స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. లేదంటే సిస్టం దనంతట అదే ఆ పొజిషన్ ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తుంది.
స్క్వేర్ ఆఫ్ అంటే మన దగ్గర ఉన్న పొజిషన్స్ ని క్లోజ్ చేయడం.
ట్రేడింగ్ చేసేటప్పుడు మనం షేర్లను కొనడం లేదా అమ్మడం చేస్తాం. ఒకవేళ ముందు కొన్నట్లయితే చివరిలో అమ్మడం అవుతుంది. అదే మొదటిలో షేర్లను అమ్మితే చివరిలో కొనడం అవుతుంది.
మనం మొదట్లో ప్రైస్ చేసిన ఆర్డర్ అది అమ్మడం కాని లేదా కొనడం గాని ఏదైనా సరే తర్వాత దానికి రివర్స్ ట్రాన్జక్షన్ చేయడం ద్వారా అప్పటివరకు మీ దగ్గర ఉన్న ఓపెన్ పొజిషన్ క్లోజ్ చేయడాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు.