what is face value of stock
ఫేస్ వాల్యూ అంటే ఒరిజనల్ వాల్యూ అని అర్థం.
ఒక కంపెనీ మొదటిసారిగా స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఒక షేర్ ఒరిజనల్ ప్రైస్ ఎంత అని నిర్ణయిస్తుంది. దానిని ఫేస్ వాల్యూ అంటారు. అలాగే ఇష్యూ ప్రైస్ ని కూడా తెలుపుతుంది. అంటే ఫేస్ వాల్యూకి కొంత ప్రీనియం కలిపి ఇష్యూ ప్రైస్ ని నిర్ణయిస్తుంది.
స్టాక్ మార్కెట్లో షేర్ వాల్యూ అనేది ఆ కంపెనీ పెర్ఫామెన్స్ బట్టి సప్లై, డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది. కాని ఫేస్ వాల్యూ మాత్రం మారదు. కాకపోతే కంపెనీ అనేది ఎప్పుడైనా షేర్ ని స్ప్లిట్ చేస్తే అప్పుడు ఫేస్ వాల్యూ మారుతుంది. ఒక కంపెనీ ఈ ఫేస్ వాల్యూ ఆధారంగా చేసుకుని స్టాక్ స్ప్లిట్ , డివిడెండ్ ని ప్రకటిస్తుంది.