సింపుల్‌గా.. ఇదీ బడ్జెట్
indian budget 2022
2022 ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా సాధారణంగా ఉంది. ప్రత్యేకంగా ఏ వర్గానికి ప్రయోజనం కలిగేలా లేదనే చెప్పాలి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ పై దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి ప్రసంగం జరిగింది. ఈ బడ్జెట్లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు నిరాశే ఎదురైంది. ఆదాయపుపన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రకటన రాలేదు. 5జీ సేవలు, ఈ-పాస్ పోర్ట్, క్రిప్టో కరెన్సీ పై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ మొదలైనవి ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలుగా నిలిచాయి.
highlights 2022 union budget
* క్రిఫ్టో కరెన్సీ లావాదేవీలపై 30శాతం పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వర్చువల్, డిజిటల్ ఆస్తులన్నింటీకి ఈ 30 శాతం పన్ను వర్తిస్తుంది.
* డిజిటల్ రూపీతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్లాక్ చెయిన్ సాంకేతికతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు.
to whom union budget is helpfull
* ఐటీ రిటర్న్ ల దాఖలుకు ఈ బడ్జెట్ లో వెసులుబాటు లభించింది. ఆదాయపుపన్ను చెల్లింపుల్లో సవరణలకు అప్ డేట్ చేసుకునే అవకాశం రెండేళ్ళలో సవరణలు చేసుకోవచ్చు. పన్ను స్లాబ్ లో మాత్రం మార్పు లేదు.
* దేశ వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5జీ మొబైల్ సర్వీస్ లు అందుబాటులోకి రానున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
* విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్ పోర్ట్ ను తీసుకువస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.
* ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
* ఎలక్ట్రిక్ వాహన రంగానికి కేంద్రం మద్దతు ప్రకటించింది. బ్యాటరీల అభివృద్ధికి, మార్పులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నట్టు మంత్రి తెలిపారు.
* అధునాతన సౌకర్యాలతో 400 వందే భారత రైళ్ళను వచ్చే మూడేళ్ళలో ప్రవేశపెట్టనున్నట్టు నిర్మలా వెల్లడించారు. వచ్చే మూడేళ్ళలో 100 గతిశక్తి టెర్మినల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
* 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం 35.4 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు చేరింది.
ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్) సెక్టార్ కు ఊతం ఇచ్చే విధంగా మరిన్ని చర్యలు తీసుకున్నట్టు నిర్మలా తెలిపారు.
* 2022-23 ద్రవ్యలోటు 6.9శాతమని, దానిని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే ప్రస్తుత సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.2శాతంగా ఉండొచ్చని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్దిరేటు8-8.5 ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
Leave a Reply