కొత్త ఫండ్స్‌పై ఓ లుక్కేయండి
what are new funds in banking sector
దేశంలో బ్యాకింగ్ రంగం రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు బ్యాంకింగ్ అవసరాలు పెరగడంతో వ్యాపారం విస్తరించడం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువవుతుండడంతో బ్యాకింగ్ షేర్లు పరుగులు పెడుతూ మదుపరులకు లాభాలను పంచుతున్నాయి. ఈ లాభాలను పంచుకోవాలనుకునే సాధారణ ప్రజలకోసం బ్యాంక్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ముందుకు వస్తున్నాయి.
what is ICICI prudential nifty bank index fund
* ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనే కొత్త పథకాన్ని ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఈ ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఫిబ్రవరి 24. కనీస పెట్టుబడి రూ.5,000. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్, ఇండస్ఇండ్ వంటి ప్రైవేటు బ్యాంకులూ, ఎస్ బీఐ మరి కొన్ని ఇతర ప్రధాన బ్యాంకుల్లో ఈ ఫండ్ పట్టుబడి పెడుతుంది. ఇప్పుడున్న దాదాపు 3 ట్రిలియన్ల డాలర్ల నుంచి త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మన దేశం సమీప భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో బ్యాంకులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అనుసరించే పెట్టుబడుదారులు బ్యాంకింగ్ రంగంలో మదుపు పెట్టవచ్చు.
* దేశంలో మదుపరుల నుంచి వచ్చిన పెట్టుబడులను `వ్యాన్గార్డ్ టోటల్ స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్`లలో పెట్టుబడిగా పెడతారు. ఈ ఫండ్ యూఎస్ లోని అతిపెద్ద ప్యాసివ్ లీ మేనేజ్డ్ ఈటీఎఫ్ పథకం. ఇది స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ను అనుసరిస్తుంది. యూఎస్ స్టాక్ మార్కెట్లో నమోదైన షేర్లరో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందన్నమాట. యాపిల్, మైక్రోసాప్ట్, ఆల్ఫాబెట్, అమేజాన్, ఫేస్బుక్, టెస్లా… తదితర పెద్దకంపెనీల్లో అధిక భాగం పెట్టుబడులున్నాయి.
what is IDFC nifty 100 index fund
* ఐడీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ 100 ఇండెక్స్ ఆధారిత కొత్త పథకం వచ్చింది. ఐడీఎఫ్ సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్- అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ చివరి తేదీ ఫిబ్రవరి 18. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకానికి కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. దీనికి నిమేష్ సేథ్ మేనేజర్ గా వ్యవహరిస్తారు.ఈ పథకంలో పెట్టుబడి పెడితే నిఫ్టీ 100 సూచిలోని షేర్లను పరోక్షంగా కొనుగోలు చేసినట్లు. ఆర్థిక సేవలు, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, వినియోగ రంగాలకు చెందిన కంపెనీలకు ఈ సూచీలో స్థానం కల్పించారు.
Leave a Reply