what are the new banking charges from june 1st..? జూన్ 1 నుంచి పెరగనున్న చార్జీలు ఏవి..?
what are the new charges on financial transactions
జూన్ 1 వతేదీ నుంచి కొన్ని సేవలపై రుసుముల ధరను పెంచుతూ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు నూతన ఆదేశాలు తీసుకువచ్చాయి. వడ్డీరేట్ల పెంపు అనివార్యమని చెప్తూ ఎస్‌బీఐ జూన్ 1 నుంచి వాటిని అమల్లోకి తీసుకువచ్చింది. ఇలా మరికొన్ని సేవల ధరలు పెరగనున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా గృహ రుణం వడ్డీ రేట్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం వరకు జూన్ 1 నుంచి ప్రజలపై ఆర్థిక భారం పెరగనుంది.
* ఎస్బీఐ గృహ రుణ లెండింగ్ రేటుని 40 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. దీంతో గృహ రుణ వడ్డీ రేటు 7.05 శాతానికి చేరింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.65 శాతానికి పెరగనుంది. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ప్రకారం, పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి రానున్నాయి.
* యాక్సిస్ బ్యాంక్ పొదుపు, శాలరీ ఖాతా సేవా రుసుమలను పెంచనుంది. సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు నెలవారీగా నిర్వహించవలిసిన సగటు బ్యాలెన్స్ ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. లేదా 1 లక్ష టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ పాటించని వారికి విధించే పెనాల్టీ ఛార్జీలను కూడా 7.50 శాతం వరకు పెంచనుంది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.
* ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీసు ఛార్జీలను ప్రవేశపెట్టింది. లావాదేవీలు చేసేవారు ఈ ఛార్జీలను చెల్లించాలి. ఈ కొత్త ఛార్జీలు జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. నగదు ఉపసంహరణ, డిపాజిట్, మినీ స్టేట్ మెంట్ వంటి వాటికి ఈ చార్జీలు వర్తిస్తాయి. ప్రతి నెలా మొదటి మూడు వారాలు లావాదేవీలు ఉచితంగానే లభిస్తాయి. ఆ తర్వాత క్యాష్ డిపాజిట్, విత్ డ్రాలకు రూ.20+జీఎస్టీ, మినీ స్టేట్ మెంట్ కి రూ.5+జీఎస్టీ వర్తిస్తుంది.
hike on insurance premium
ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు..
* వాహనాల థర్డ్ పార్టీ మోటారు బీమా ప్రీమియంను పెంచుతూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
* ఇంజిన్ సామర్థ్యం 150 సీసీ పైన 350 సీసీ మించని వాటికి రూ. 1366 గానూ, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్ లకు ప్రీమియం రూ. 2,804 గానూ ఉండనుంది.
* 1000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల ప్రీమియంను రూ.2094 గానూ, 1000 సీసీ పైనా 1500 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం రూ.3,416 గానూ, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియం రూ. 7,890 గానూ ఉండనుంది.
Leave a Reply