లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే..?
what is large cap and small cap in stock market
ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి కంపెనీలను మూడు కేటగిరీలుగా విభజిస్తాం. మనం ఇన్వెస్ట్ చేసేముందు ఆ కంపెనీ ఏ కేటగిరీకి చెందుతుందో తెలుసుకుని, అప్పుడు మనం పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. వీటిలో మన రిస్క్ స్థాయిని చూసుకుని పెట్టుబడులపై ఆలోచించుకోవాలి.
మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక కంపెనీ షేర్ ప్రైస్ ను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది.
కంపెనీల్లో మూడు రకాలు ఉంటాయి. స్మాల్, మిడ్, లార్జ్ కంపెనీలుగా వాటిని పిలుస్తాం.
స్మాల్ క్యాప్ కంపెనీలు:
ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా అంటే సుమారుగా 5,000 కోట్ల కన్నా తక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీలు ఈ స్మాల్ క్యాప్ కంపెనీలుగా పరిగణిస్తారు. స్టార్ట్ అప్ గా మొదలై డెవలప్మెంట్ స్టేజిలో ఉండే కంపెనీలు ఈ కేటగిరిలో ఉంటాయి.what are mid cap companies
మిడ్ క్యాప్ కంపెనీలు:
ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఉంటుందో వాటిని మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. వీటిలో కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీలుగా మొదలై మిడ్ క్యాప్ స్థాయి వరకు చేరుకుంటాయి. అంతేకాదు ఈ మిడ్ క్యాప్ కంపెనీలకు భవిష్యత్తులో అబివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుంది.what are large cap companies
లార్జ్ క్యాప్ కంపెనీలు:
ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 20,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుందో వాటిని లార్జ్ క్యాప్ కంపెనీలు అంటారు. రిలియన్స్, ఇన్ఫోసిస్, టాటా ఈ కంపెనీలకు ఆయా రంగాలలో మంచి పేరు ఉంటుంది. ఇవి ఏళ్ల తరబడి మార్కెట్ లో స్థిరబడి చాలా అభివృద్ధి చెంది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇచ్చినవే. ఇలాంటి కంపెనీలలో మనం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది.
Leave a Reply