గృహరుణంతో.. ట్యాక్స్ మినహాయింపు
how to get tax benifit with home loan
మానవ కనీస అవసరాల్లో ఇళ్లు ఒకటి. జీవిత కాలంలో సొంతంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలని అందరూ తాపత్రయ పడుతుంటారు. అయితే దీనికి కావాల్సినంత డబ్బు అందరి దగ్గర ఉండదు. అందుకు బ్యాంకులను ఆశ్రయించాల్సిందే. ఇప్పడు అన్ని బ్యాంకులు, ప్రవేటు ఫైనాన్స్ కంపెనీలు హోం లోన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ లోన్ తీసుకుని మన జీవిత కాల లక్ష్యమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇలా తీసుకునే రుణంతో మరి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది మినహాయింపు. దీని గురించి తెలుసుకోవాల్సిందే.
uses of home loan
మనలో టాక్స్ కట్టేవారిలో ఉద్యోగులే ప్రధానంగా ఉండేది. అయితే ఇంటి కల నెరవేర్చుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి హోమ్ లోన్ ఒక గొప్ప అవకాశం. చాలా మంది ఆర్థిక నిపుణులు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నారు. ఇల్లు కట్టుకునేందుకు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్న సొంత డబ్బును మాత్రం ఉపయోగించ వద్దని, బ్యాంకు లోను తీసుకునే ఇంటి కోసం ముందుకు వెళ్లాలని చెప్తున్నారు. గృహ రుణాలకు బ్యాంకు లో తీసుకునే వడ్డీ చాలా తక్కువ కావడం, అంతే కాకుండా ఈ రుణాన్ని దీర్ఘ కాలం పాటు చిన్న చిన్న వాయిదాలుగా తీర్చుకునే అవకాశం ఉండటంతో గృహ ఋణం చాలా గొప్ప అవకాశం. దీనితో పాటు టాక్స్ చెల్లింపులో కూడా మినహాయింపు రావడంతో అదనపు లాభం చేకూరినట్టే.
ఇంటి ఋణం తీసుకునేటప్పుడే ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే ఇంటి యజమానికి ఏదైన జరగకూడనిది జరిగి కట్టలేని పరిస్థితి వచ్చినా సదరు బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిపి అక్కడినుంచి వాయిదాలను చెల్లించుకుంటాయి. ఇక రుణ గ్రహీత కుటుంబం ఎటువంటి వాయిదాలు చెల్లించాల్సిన పని లేదు.
how much amount we get as tax benifit on hoam loan
ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. వీటిని మన అనుకూలతను బట్టి ఎంత కాలమైనా వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చు. లోన్ తీసుకోవడం వల్ల ప్రధానంగా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మొత్తంగా రూ.5లక్షల వరకు బెనిఫిట్ ఉంటుంది. మనం ట్యాక్స్ ఫైల్ చేసేటప్పడు ఈ రుణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
tax benifit under section 80c
ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ల కింద మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. సెక్షన్ 80C కింద చెల్లించిన డబ్బు మొత్తంపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. సెక్షన్ 24Bకింద లోన్ పై చెల్లించిన వడ్డీ మొత్తంపై రూ.2 లక్షలు, సెక్షన్ 80EEAకింద రుణంలోని వడ్డీపై మరో రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
Leave a Reply