how to create day trading plan
ఇంట్రాడే ట్రేడింగ్ లో ప్రణాళిక కలిగి ఉండాలి. మార్కెట్ తర్వాత స్టాక్ ను ఎంచుకోవడం పద్ధతి కాదు. ట్రేడింగుకి కావాల్సిన కనీస అవసరాలన్నిటిని ముందుగానే సమకూర్చుకుని దగ్గర పెట్టుకోవాలి. మానసికంగా ట్రేడింగుకి సిద్ధం కావాలి. మార్కెట్ కండిషన్ బట్టి సరైన స్ట్రాటజీని ముందుగానే మనం ఎంచుకోవాలి.
select 2 or more liquid stocks
ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందే కొనాల్సిన ధర, అమ్మాల్సిన ధర నిర్ణయించడం చాలాముఖ్యం. పొజిషన్ నష్టాన్ని తగ్గించడానికి స్టాప్ లాస్ పెట్టుకోవడం చాలా అవసరం. స్టాక్ లక్ష్య ధరను సాధించిన తర్వాత పొజిషన్ మూసివేస్తేనే మంచిది.
* ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వందలాది స్టాక్స్ ఉన్నాయి. కాని ట్రేడర్స్ రెండు లేదా మూడు లిక్విడ్ స్టాక్‌ల ను మాత్రమే ఎంచుకోవాలి. ఇంట్రాడేలో ఎక్కువ పరిమాణం కలిగి ఉన్న షేర్లు లిక్విడ్ స్టాక్స్. వీటిలో ట్రేడింగ్ అత్యధిక మంది కొనుగోలు, విక్రయదారులు ఉండడం వల్ల సులభంగా మనం పొజిషన్ అమ్మడం వీలవుతుంది.
how to select stop loss
- మార్కెట్లో ఇంట్రాడే చేసేటప్పుడు ఫాలో కావాల్సిన ప్రాథమిక సూత్రం స్టాప్ లాస్. లాభనష్టాలని ముందుగానే అంచనా వేస్తూ, ఎంతవరకు మనం రిస్క్‌ని భరించగలమో అంత వరకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పడు పొజిషన్‌ను వదిలేయాలి. కొంచెం లాభం వచ్చినా అమ్మేసి బయటపడాలి. స్టాప్- లాస్ ట్రిగ్గర్ కావడానికి వేచి ఉండకూడదు. ఇది ట్రేడర్స్, వారి నష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది. స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడింగుకి వెళ్ళకూడదు.
* రోజువారి ట్రేడింగ్ లో కొంచెం లాభాలు వస్తే చాలా ఉత్సాహం వస్తుంది. దాంతో మరిన్ని ట్రేడ్లు తీసుకుంటారు. డబ్బులు అప్పు తెచ్చిమరీ షేర్లు కొంటారు. కానీ మార్కెట్ ఎప్పుడు ఒకే లా ఉండదు. అందువల్ల చిన్న చిన్న మొత్తాలతోనే ట్రేడింగ్ చేయాలి. పెద్దమొత్తాలతో ట్రేడింగ్ చేస్తే అవి రిస్క్ తో కూడుకున్నదే.
* కొంతమంది ట్రేడర్స్ తమ లక్ష్యాలను సాధించలేకపోతే వారి పొజిషన్ల ను డెలివరీ చేయాలని ప్రయత్నిస్తారు. ఇది అతి పెద్ద పొరపాటు. ట్రేడర్స్ నష్టాన్ని బుక్ చేసుకోవలిసి వచ్చినప్పటికీ అన్ని ఓపెన్ పొజిషన్లు మూసివేస్తేనే నయం.
* డే ట్రేడర్స్ మార్కెట్ సెషన్ (ఓపెనింగ్ బెల్ నుంచి క్లోజింగ్ వరకు) మొత్తం మార్కెట్ ను పర్యవేక్షించగలగాలి. అప్పడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. ట్రేడింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఓపిగ్గా మార్కెట్‌ని గమనించి అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. స్టాప్ లాస్ ను ట్రిగ్గర్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి.