ఎల్ఐసీలో 31.6 కోట్ల షేర్ల విక్రయం!
lic ipo
పబ్లిక్ ఇష్యూకు రానున్న ఎల్ ఐ సీ అందుకు సంబంధించిన అన్ని పత్రాలను సెబీకి సమర్పించింది. మార్చిలో ఐపీవోకు రానున్న ఎల్ ఐ సీ 5 శాతం వాటాను విక్రయించి అందుకు సమానమైన 31.6 కోట్లపైగా షేర్లను విక్రయించనుంది. ఇందులో షేరు ముఖ విలువ రూ.10 గా నిర్ణయించింది. ఇందువల్ల రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరుతాయని అంచనా. దేశంలో అతి పెద్ద ఇష్యూ గా ఎల్ ఐ సీ నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ( ఓఎఫ్ఎస్) రూపంలో జరగనుంది.
how many shares are issued by lic in ipo
ఈ సంవత్సరంలో వాటాల విక్రయం ద్వారా సమీకరించాలనుకున్న మొత్తం అంచనాలను రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.78,000 కోట్లకు ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం సమీకరణ ఎల్ఐసీ ఐపీవో ద్వారా సాధ్యం కానుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. ఎల్ఐసీ విలువ రూ.16 లక్షలకు పైగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ఇష్యూలో 10 శాతం పాలసీదార్లకు, 5 శాతాన్ని సంస్థ ఉద్యోగులకు కేటాయిస్తారు. వీటికి షేరు ధరలో ఎంత రాయితీ ఇస్తారో నిర్ణయించలేదు.
what is the net worth of lic
ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనకు కంపెనీ బోర్డు అంతకు ముందే ఆమోదం తెలిపింది.
ఐపీవో తరువాత ఎల్ఐసీ మార్కెట్ విలువ 293 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22.1 లక్షల కోట్లు) అవుతుందనే అంచనాలున్నాయి. దీనిద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన నమోదిత జీవిత బీమా సంస్థగా ఎల్ఐసీ నిలవనుంది.
Leave a Reply