ఇక హాయిగా విహరిద్దాం..
air travel bouncing back from carona pandemic
* కరోనా తగ్గడంతో విలాసాలవైపు భారతీయులు
* 5 స్టార్ హోటళ్ళు, విమాన ప్రయాణాలకు డిమాండ్
గత రెండేళ్లకు పైగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రయాణాలు, విహారాలు, విలాసాలు అన్న స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యాపారాలన్నీ పూర్తిగా నష్టపోయాయి. కొన్ని సంస్థలు దివాలా తీశాయి కూడా. అయితే ఇప్పడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. క్రమంగా ప్రయాణాలు మొదలవడంతో విహారాలు, విలాసాలు కూడా పెరుగుతున్నాయి.
త్వరలోనే మునిపటి దశకు..
ఇప్పడు భారతీయులు సెలవులను మరింత విలాసంగా గడుపుతున్నారు. 5 స్టార్ హోటళ్ళు, బిజినెస్ క్లాస్ టికెట్ల బుకింగ్ ల పై ఖర్చులు పెరిగినట్లు అగ్రగాని ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మైట్రిప్ తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తగ్గడంతో మరింత మంది విహారయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్ గా ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ముందు దశకు త్వరలోనే చేరొచ్చని అంటున్నారు.
flight prices increases
రేట్లు పెరిగినా..
కరోనాకు ముందు మొత్తం రిజర్వేషన్ గణాంకాలతో పోల్చితే 5 స్టార్ హోటళ్ళు, బిజినెస్ క్లాస్ టికెట్ల బుకింగ్ లు ఇప్పటికే అధికమయ్యాయి. భారతీయులు ఇప్పడు గతంలో కంటే ఎక్కవగా విహారానికి సిద్ధమవుతున్నారు. పెరిగిన ఇంధన ధరలతో గత కొన్ని వారాలుగా విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ ఛార్జీలు మరో రెండేళ్ళ పాటు కొనసాగించవచ్చు. ఇది కాస్త అవరోధం అయినప్పటికీ ప్రయాణాలపై మోజు తగ్గకపోవచ్చనే పలువురు అభిప్రాయపడుతున్నారు.
Leave a Reply